న్యాయశాఖ మంత్రి ఫరూక్ తీరిది
రూ.58 కోట్లకు పైగా విలువైన భూమిని కొట్టేసేందుకు విశ్వప్రయత్నం
కోర్టు తీర్పులను పట్టించుకోకుండా అడ్డదారిలో దక్కించుకునేందుకు మాస్టర్‌ప్లాన్
సాక్షి, నంద్యాల/నంద్యాల (సిటీ): అధికారమే అండగా న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ రెచి్చపోతున్నారు. కనిపించిన భూమిని హస్తగతం చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. సామాన్యులను వేధిస్తూ మాట వినని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. సుప్రీం కోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తీరు మారడం లేదు. నంద్యాల పద్మావతి నగర్‌లోని సర్వే నంబర్ 706–ఏ9లో 1.16 సెంట్ల భూమి ఉంది.
ఇందులో 58 సెంట్లను రామిశెట్టి వెంకటన్న (28 సెంట్లు), నిమ్మకాయల బాలనారాయణ (30 సెంట్లు) ఖతీఫ్ ఖాజా హుస్సేన్, ఖతీఫ్ నూర్‌అహ్మద్ నుంచి 2010లో కొనుగోలు చేశారు. ఈ స్థలం పక్కనే సర్వే నంబర్ 700–ఏలో మంత్రి ఫరూక్‌కు స్థలం ఉంది. దీంతో పక్కనే ఉన్న స్థలంపై ఆయన కన్ను పడింది. స్థలాన్ని కబ్జా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. డాక్యుమెంట్స్ పక్కాగా ఉండటంతో కోర్టుల్లో దొంగ కేసులు వేసి బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు.
సర్వే రిపోర్టు బయటకు రాకుండా రిట్
మంత్రి వేధింపులు భరించలేక రామిశెట్టి వెంకటన్న, నారాయణ ఇద్దరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు సాగిన తర్వాత 2023లో బాధితులకు అనుకూలంగా తీర్పు వచి్చంది. ఆర్డర్ కాపీని స్థానిక కోర్టులో అందజేశారు. ఆ తర్వాత తమ స్థలాన్ని సర్వే చేయాలని కోరుతూ ఇద్దరు ప్రభుత్వానికి చలానాలు కట్టారు. ఇదే అంశంపై అదే ఏడాది జూలై 10న నంద్యాల కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. తమ స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలని కోరారు.
స్పందించిన అప్పటి కలెక్టర్ సెపె్టంబర్ 5న సిబ్బందితో సర్వే చేయించి నివేదికను సిద్ధం చేశారు. నివేదిక బాధితులకు అనుకూలంగా ఉందన్న విషయం తెలుసుకున్న ఫరూక్ హైకోర్టులో అధికారులపై ఆగమేఘాల మీద రిట్ పిటిషన్ వేశారు. తప్పుల తడకగా సర్వే చేశారని గొలుసుల ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా సర్వే చేయడంతో తప్పులు దొర్లినట్టు రిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం సర్వే అంశం మాత్రమే కోర్టులో నడుస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు.
సుప్రీం తీర్పుతో ఖాళీ స్థలానికి పన్ను
706–ఏ9లో ఉన్న భూమి మంత్రి ఫరూక్, ఆయన బంధువులకు చెందినదిగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చడంతో బాధితులకు కొండంత భరోసా వచి్చంది. సుప్రీం తీర్పు కాపీని స్థానిక మున్సిపల్ కార్యాలయానికి కూడా పంపించారు. దీంతో ఇన్‌చార్జి ఆర్వో వెంకటకృష్ణ, ఆర్‌ఐ గులాం హుస్సేన్ సంబంధిత స్థలానికి రూ.55,980 వీఎల్‌టీ (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) వేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పీఏ అనిల్ మంగళవారం మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి ఇద్దరు అధికారులను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ మీ అంతు చూస్తామని బెదిరించారు. మంత్రి ఒత్తిడి మేరకు అదే రోజు రాత్రి ఎలాంటి విచారణ చేయకుండానే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కౌన్సిల్ ఆమోదానికి చైర్‌పర్సన్‌పై ఒత్తిడి
మునిసిపల్ పరిధిలోని ఆస్తి లేదా స్థలాలపై ఒకసారి పన్ను విధిస్తే దాన్ని రద్దు చేయాలంటే కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. దీంతో 706–9ఏపై విధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను కౌన్సిల్ ముందుంచి రద్దు చేయాలని మంత్రి అనుయాయులు మునిసిపల్ చైర్‌పర్సన్‌పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అధికారం తమ చేతిలోనే ఉందని.. తమకు అనుకూలంగా పని చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఆ స్థలం విలువ రూ.58 కోట్లపైనే..
పట్టణ నడి»ొడ్డున గల ఈ స్థలం విలువ సెంటు రూ.కోటిపైనే పలుకుతోంది. రూ.58 కోట్లకు పైగా విలువ కలిగిన 58 సెంట్లను కొట్టేసేందుకు మంత్రి ఫరూక్ తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. మరోవైపు పట్టణంలో ఆయనకు చెందిన థియేటర్‌ను సెటిల్‌మెంట్లకు అడ్డాగా చేసుకున్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద భూములకు సెటిల్‌మెంట్ చేయడం, అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు, తన అనుచరులకు సంబంధించిన గొడవల సెటిల్‌మెంట్లు అన్నీ థియేటర్ నుంచే సాగుతున్నాయని బాధితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment