కర్నూలు జిల్లా నేతలతో లోకేష్ సమావేశం
Published Mon, Mar 13 2017 1:58 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
- నంద్యాల అసెంబ్లీ స్ధానంపై చర్చ
నంద్యాల: కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. నంద్యాలలోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం నేతలతో భేటీ అయినట్టు సమాచారం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందినందున ఆ సీటును ఎవరికి కేటాయించాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శిల్పా బ్రదర్స్, మాజీ మంత్రి ఫరూక్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ‍్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కాగా నంద్యాల సీటును నాగిరెడ్డి మరో కుమార్తె నాగమౌనికకు గానీ, భూమా అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డికి గానీ కేటాయించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిల ప్రియకు మంత్రి వర్గంలో స్థానం కల్సించి, నంద్యాల ఎమ్మెల్యే స్థానాన్ని మాజీ మంత్రి శిల్పా మెహన్ రెడ్డికి గానీ, ఫరూక్ గానీ కేటాయించాలని మరికొందరు కోరుతున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement