ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ (Asian Paints) నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రమోటర్ గ్రూప్ సభ్యుడు, బిలియనీర్ అశ్విన్ డాని (Ashwin Dani) 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతదేశపు అతిపెద్ద పెయింట్ తయారీ కంపెనీ అయిన ఏషియన్ పెయింట్స్ నలుగురు సహ-వ్యవస్థాపకులలో ఒకరైన డాని మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత పొందారు.
ఆసియాలోని అతిపెద్ద పెయింట్ కంపెనీలలో ఒకటిగా ఉన్న ఏషియన్ పెయింట్స్‌లో అశ్విన్ డాని 1968లో చేరారు. ఈ కంపెనీని అతని తండ్రి సూర్యకాంత్ డాని, మరో ముగ్గురు 1942లో స్థాపించారు. డాని కుమారుడు మాలావ్ కూడా కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.
ఫోర్బ్స్ ప్రకారం.. 2023 నాటికి అశ్విన్ డాని నికర విలువ 7.1 బిలియన్ డాలర్లు (రూ. 59 వేల కోట్లు). ఏషియన్ పెయింట్స్ హోమ్ పెయింటింగ్ సేవలతోపాటు ఇంటీరియర్ డిజైన్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. అశ్విన్ డాని కన్నుమూతతో గురువారం (సెప్టెంబర్ 28) ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ షేర్లు ట్రేడింగ్‌లో 4 శాతానికి పైగా పడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment