Asian Paints
-
రూ.13.83 కోట్ల జీఎస్టీ నోటీసు.. ఆ తేడాలే కారణం..
ఏషియన్ పెయింట్స్ కంపెనీ రూ.13.83 కోట్ల జీఎస్టీ, రూ.1.38 కోట్ల పెనాల్టీ చెల్లించాలని కేంద్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ డిమాండ్ నోటీసు పంపినట్లు సంస్థ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో తేడాలపై 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈ డిమాండ్ నోటీసు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నోటిసుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ చేసిన సరఫరాలపై ఐటీసీని పొందడానికి వర్తించే అన్ని పన్నులను చెల్లించినట్లు కంపెనీ చెప్పింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ నోటీసులు వచ్చినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. ఏషియన్ పెయింట్స్ కంపెనీను 1942లో చంపక్లాల్ చోక్సీ, చిమన్లాల్ చోక్సీ స్థాపించారు. 1965 వరకు ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్ కంపెనీ ఉన్న సంస్థ పేరును ఏషియన్ పెయింట్స్‌గా మార్చారు. ఇండియాలో మొత్తం 10 తయారీ కేంద్రాలున్నాయి. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని పటాన్చెరు, విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. -
ఏషియన్ పెయింట్స్ మిశ్రమ పనితీరు
న్యూఢిల్లీ: ఏషియన్ పెంయింట్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.803 కోట్లతో పోల్చిచూసినప్పుడు 53 శాతం వృద్ధితో రూ.1,232 కోట్లకు దూసుకుపో యింది. ఆదాయం పెద్దగా మార్పు లేకుండా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.8,430 కోట్ల నుంచి రూ.8,452 కోట్లకు వృద్ధి చెందింది. ప్రధానంగా ముడి సరుకుల ధరలు తగ్గడం, కార్యకలాపాల సామర్థ్యాలు మెరుగుపడడం లాభాలు పెరిగేందుకు దారితీసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో పోలి్చచూస్తే స్థూల మార్జిన్లు 7.7 శాతం మేర పెరిగాయి. మొత్తం వ్యయాలు 6 శాతం తగ్గి రూ.7,022 కోట్లుగా ఉన్నాయి. కోటింగ్స్, డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ ఆదాయంలో కేవలం ఒక శాతమే వృద్ధి నమోదైంది. నైరుతి రుతుపవనాల్లో అస్థిరతలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు ఏషియన్ పెయింట్స్ తెలిపింది. ఫలితంగా కొనుగోళ్లు వాయిదా పడినట్టు పేర్కొంది. దేశీయ డెకరేటివ్ వ్యాపారం విలువ పరంగా 6 శాతం వృద్ధిని చూపించింది. అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారా దాయం 4 శాతం తగ్గి రూ.775 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 3 శాతానికి పైగా తగ్గి రూ.2,958 వద్ద స్థిరపడింది. -
ఏషియన్ పెయింట్స్ అశ్విన్ డాని కన్నుమూత
ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ (Asian Paints) నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రమోటర్ గ్రూప్ సభ్యుడు, బిలియనీర్ అశ్విన్ డాని (Ashwin Dani) 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతదేశపు అతిపెద్ద పెయింట్ తయారీ కంపెనీ అయిన ఏషియన్ పెయింట్స్ నలుగురు సహ-వ్యవస్థాపకులలో ఒకరైన డాని మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత పొందారు. ఆసియాలోని అతిపెద్ద పెయింట్ కంపెనీలలో ఒకటిగా ఉన్న ఏషియన్ పెయింట్స్‌లో అశ్విన్ డాని 1968లో చేరారు. ఈ కంపెనీని అతని తండ్రి సూర్యకాంత్ డాని, మరో ముగ్గురు 1942లో స్థాపించారు. డాని కుమారుడు మాలావ్ కూడా కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. 2023 నాటికి అశ్విన్ డాని నికర విలువ 7.1 బిలియన్ డాలర్లు (రూ. 59 వేల కోట్లు). ఏషియన్ పెయింట్స్ హోమ్ పెయింటింగ్ సేవలతోపాటు ఇంటీరియర్ డిజైన్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. అశ్విన్ డాని కన్నుమూతతో గురువారం (సెప్టెంబర్ 28) ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ షేర్లు ట్రేడింగ్‌లో 4 శాతానికి పైగా పడిపోయాయి. -
సైంటిస్ట్ నుంచి వేల కోట్ల కంపెనీ సారధిగా..! ఎవరీ అశ్విన్ డాని?
భారతదేశంలో ఉన్న అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరైన 'అశ్విన్ డాని' (Ashwin Dani) గురించి ఇప్పుడు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కెమిస్ట్ స్థాయి నుంచి ఈ రోజు కుబేరుల జాబితాలోకి ఎలా చేరాడు? దాని వెనుక ఆయన కృషి ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏషియన్ పెయింట్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశ్విన్ డాని ముంబైలో పుట్టి 1966లో ముంబై యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తరువాత కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌లోని అక్రోన్ యూనివర్సిటీలో చేరాడు. ఉన్నత చదువులు పూర్తయిన తరువాత డెట్రాయిట్లో శాస్త్రవేత్తగా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆ తరువాత సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా తన కుటుంబానికి చెందిన ఏషియన్ పెయింట్స్ కంపెనీలో చేరాడు. 1977లో ఏషియన్ పెయింట్స్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి పదోన్నతి పొందారు. అశ్విన్ డాని నేతృత్వంలో ఏషియన్ పెయింట్స్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగింది. అశ్విన్ డాని ఆర్ & డి డైరెక్టర్‌గా ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు ఏషియన్ పెయింట్స్ అభివృద్ధికి చాలా దోహదపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో అతిపెద్ద పెయింట్ తయారీదారుగా, ఆసియాలో మూడవ అతిపెద్ద కంపెనీగా, అంతర్జాతీయ స్థాయిలో తొమ్మిదవ అతిపెద్దది కంపెనీగా అవతరించింది. (ఇదీ చదవండి: ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?) అశ్విన్ డాని నేతృత్వంలో కంపెనీ చాలా అభివృద్ధి చెందింది. భారతదేశంలో ఆటోమేటెడ్ కలర్ మిక్సింగ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి అశ్విన్ కావడం గమనార్హం. కంపెనీ 2023లో 7.1 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 58,000 కోట్లు. రానున్న రోజుల్లో కంపెనీ మరింత ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. -
హైదరాబాద్: వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం
-
ఏషియన్ పెయింట్స్ కొనుగోళ్ల జోరు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న హోమ్ ఇంప్రూవ్మెంట్, డెకరేటివ్ విభాగాలలో మరింత పట్టు సాధించేందుకు వీలుగా దేశీ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ పావులు కదుపుతోంది. తాజాగా వైట్ టీక్, వెదర్‌సీల్ ఫెనస్ట్రేషన్ కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. వైట్ టీక్ బ్రాండ్ కంపెనీ ఆబ్జెనిక్స్ సాఫ్ట్‌వేర్‌లో 100 శాతం వాటాను దశలవారీగా మూడేళ్లలో సొంతం చేసుకోనున్నట్లు ఏషియన్ పెయింట్స్ వెల్లడించింది. దీనిలో భాగంగా 49 శాతం వాటా కొనుగోలుకి ప్రమోటర్లతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు సుమారు రూ. 180 కోట్లు చెల్లించనున్నట్లు తెలియజేసింది. అయితే ఇందుకు ఇరువైపులా అంగీకరించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవలసి ఉంటుందని వివరించింది. ఇదే పద్ధతిలో మరో 11 శాతం వాటాను రూ. 66 కోట్లకు చేజిక్కించుకోనుంది. ఇక 2025–26కల్లా మిగిలిన 40 శాతం వాటా కోసం ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా రూ. 360 కోట్లవరకూ చెల్లించనుంది. 2016లో ఏర్పాటైన వైట్ టీక్ 2020–21లో రూ. 37.7 కోట్ల టర్నోవర్ సాధించింది. రూ. 19 కోట్లకు ఇంటీరియర్ డెకరేషన్, పీవీసీ కిటికీలు, ఫర్నీషింగ్ తదితరాల తయారీ కంపెనీ వెదర్‌సీల్ ఫెనస్ట్రేషన్లో 51 శాతం వాటాను రూ. 19 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఏషియన్ పెయింట్స్ పేర్కొంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కాగా.. మూడేళ్ల కాలంలో దశలవారీగా మరో 23.9 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 3,112 వద్ద ముగిసింది. -
దేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఇవే!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ఏషియన్ పెయింట్స్, టాటా టీలు టెక్, నాన్-ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీజీ కేటగిరీల్లో 2021లో భారతదేశంలో "అత్యంత పాపులర్" బ్రాండ్లుగా నిలిచాయి. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కాంటార్ తాజాగా "బ్రాండ్ జెడ్ ఇండియా" పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కన్సల్టింగ్ సంస్థ కాంటార్ మూడు(టెక్, నాన్-ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీజీ) కేటగిరీలలో దేశంలోని మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ పేర్లను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. టెక్నాలజీ కేటగిరీలో టాప్ స్థానంలో అమెజాన్ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం జొమాటో, యూట్యూబ్, గూగుల్, స్వీగ్గి, ఫ్లిప్ కార్ట్ నిలిచాయి. ఇక ఎఫ్ఎంసీజీ కేటగిరీలో టాప్ స్థానంలో టాటా టీ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో తాజ్ మహల్, సర్ఫ్ ఎక్సెల్, మ్యాగీ, పారాచూట్, బ్రిటానియా ఉన్నాయి. నాన్-ఎఫ్ఎంసీజీ కేటగిరీలో టాప్ స్థానంలో ఏషియన్ పెయింట్స్ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో జియో, శామ్ సంగ్, ఎంఆర్ఎఫ్, టాటా హౌసింగ్, ఎయిర్ టెల్ ఉన్నాయి. 2020-21లో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియా కోసం కాంటూర్ 418 కంపెనీల డేటాను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రతి సందర్భంలో, 30 కేటగిరీల్లో బ్రాండ్ పర్సెప్షన్, బ్రాండ్ ఈక్విటీ మెట్రిక్స్ విశ్లేషించారు. ఈ సర్వేలో దేశం మొత్తంగా 12,000 మంది పాల్గొన్నారు. (చదవండి: కీలక రంగాల్లో దేశం కంటే మెరుగ్గా తెలంగాణ) -
సామాన్యుల నెత్తి మీద మరో పిడుగు..!
Paint Companies To Hike Prices In December Again: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు, అధిక రిటైల్ ద్రవ్యోల్భణంలో సతమతమవుతున్న సామాన్యుల నెత్తి మీద మరో భారం పడనుంది. దేశవ్యాప్తంగా పెయింట్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ముడిపదార్థాల ధరలు, ఇంధన వ్యయాలతో పోరాడుతున్న పెయింట్ కంపెనీలు మార్జిన్లను కాపాడుకునేందుకు గాను వరుసగా మరోసారి పెయింట్ధరలను పెంచనున్నాయి. పెయింట్ ఇండస్ట్రీలో సుమారు 50 శాతం మేర వాటాలను కల్గిన ఏషియన్ పెయింట్స్, బెర్జర్ కంపెనీలు వచ్చే నెల 5 నుంచి సుమారు 4-6 శాతం మేర పెయింట్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఈ కంపెనీలు దాదాపు 8-10 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది మొత్తంగా పెయింట్ ధరలు రికార్డుస్థాయిలో 19-20 శాతం మేర పెరిగాయి. దిగ్గజ పెయింట్ కంపెనీలు ధరల పెంపును ప్రకటించడంతో అక్జో నోబెల్ ఇండియా , ఇండిగో పెయింట్స్ వంటి పెయింట్ కంపెనీలు కూడా ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ద్రవ్యల్భోణం...! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్ రంగాల్లోని అంతరాయాలు నియంత్రణలోకి వచ్చిన ముడిసరుకు ఖర్చులు తగ్గుముఖం పడతాయనే అంచనాలు తలకిందులైనాయి. పెయింట్ కంపెనీలు కనీస మార్జిన్ లాభాలను పొందేందుకుగాను కచ్చితంగా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమిత్ సింగల్ క్యూ2 ఫలితాల్లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. గత 40 ఏళ్లలో కనీస వస్తు ధరల్లో ఈ విధమైన ద్రవ్యోల్బణాన్ని చూడలేదని అమిత్ సింగల్ అన్నారు. ఒక వేళ ధరలను పెంచకపోతే కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్ రేట్స్ భారీగా పడిపోయే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆపరేటింగ్ మార్జిన్లను 18-20 శాతం స్థాయిలో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజ్మెంట్ సూచించింది పెంపుదల అనివార్యం... పెయింట్ ధరల పెంపు అనివార్యమని బెర్జర్ పెయింట్స్ ఎమ్డీ, సీఈవో అభిజీత్ రాయ్ అన్నారు. FY22 క్యూ2లో దాదాపు అన్ని పెయింట్ కంపెనీలు రెండంకెల వాల్యూమ్ వృద్ధిని సాధించాయి. FY22 క్యూ4లో కనీసం నుండి 18 శాతం ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. చదవండి: పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా? -
ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 29 శాతం క్షీణించి రూ. 605 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 852 కోట్లు ఆర్జించింది. ముడిసరుకుల వ్యయాలు పెరగడం ప్రధానంగా ప్రభావం చూపింది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 5,350 కోట్ల నుంచి రూ. 7,096 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 4,299 కోట్ల నుంచి రూ. 6,418 కోట్లకు పెరిగాయి. వీటిలో మెటీరియల్స్ వ్యయాలు రూ. 2,646 కోట్ల నుంచి రూ. 4,571 కోట్లకు పెరిగాయి. ఈ కేలండర్ ఏడాది(2021) జనవరి నుంచి ముడిసరుకుల ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. దీంతో అన్ని విభాగాలలోనూ స్థూల మార్జిన్లు ప్రభావితమైనట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రొడక్టుల ధరలను పెంచినట్లు తెలియజేశారు. ఇకపైన కూడా ముడివ్యయాలకు అనుగుణంగా ధరలను పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5.2 శాతం పతనమై రూ. 3,004 వద్ద ముగిసింది. -
ఫలితాలు, ప్రపంచ సంకేతాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం(18–22) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలపై ఆధారపడి కదలనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై మరిన్ని కంపెనీలు ఆర్థిక పనితీరును వెల్లడించనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ తదితర ఐటీ బ్లూచిప్ కంపెనీలతోపాటు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ బాటలో ఫలితాల సీజన్ మరింత వేడెక్కనున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2 జాబితా ఇలా ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజాల జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీతోపాటు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఇవేకాకుండా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సైతం క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇక మరోవైపు చైనా క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెపె్టంబర్ నెలకు యూఎస్పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. సెంటిమెంటుపై ఎఫెక్ట్ ఈ వారం దలాల్ స్ట్రీట్‌లో త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తదుపరి కాలానికి కంపెనీలు ప్రకటించే ఆదాయ అంచనాలు(గైడెన్స్) తదితరాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆయా కంపెనీలు విడుదల చేసే ప్రోత్సాహకర లేదా నిరుత్సాహకర ఫలితాల ఆధారంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. వారాంతాన ఫలితాలు వెలువడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్లలో నేడు(సోమవారం) అధిక యాక్టివిటీ నమోదుకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ వారం ఎఫ్ఎంసీజీ, సిమెంట్ దిగ్గజాలుసహా ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర ఫలితాలు మార్కెట్లను నడిపించే వీలున్నట్లు అంచనా వేశారు. కరెక్షన్ తదుపరి కొద్ది రోజుల దిద్దుబాటు తదుపరి ఈ వారం గ్లోబల్ మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు సంతోష్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఫలితాలకు ఇవి జత కలిసే అవకాశమున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా నిలవనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు క్యూ2 పనితీరు వెల్లడించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ ఆర్జనల్లో పటిష్ట రికవరీపట్ల పెరుగుతున్న అంచనాలు మార్కెట్లలో బుల్ రన్ కొనసాగేందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అంచనాలు విఫలమైతే ఆయా రంగాలలో స్వల్పకాలానికి దిద్దుబాటు జరగవచ్చని అంచనా వేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఇటీవల జోరు చూపుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితర అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. కాగా.. గత గురువారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,247 పాయింట్లు(2 శాతం) పుంజుకోవడం ద్వారా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో నిఫ్టీ 18,000 పాయింట్ల మార్క్ ఎగువన నిలిచింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గత శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. రుణ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు అక్టోబర్‌లో నికరంగా వెనకడుగు అక్టోబర్‌లో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు విరుద్ధంగా ఎఫ్‌పీఐలు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు రూపాయి మారకపు విలువ పతనం, ప్రపంచ పరిణామాలు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1,472 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా రుణ(డెట్) మార్కెట్లో అమ్మకాల ట్రెండ్ నమోదైంది. ఫలితంగా రూ. 1,698 కోట్లు విలువైన సెక్యూరిటీలను విక్రయించారు. ఇదేసమయంలో మరోపక్క రూ. 226 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. -
Asian Paints: ఏషియన్ పెయింట్స్ విస్తరణ
సాక్షి, అమరావతి: రెండో దశ విస్తరణ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏషియన్ పెయింట్స్ ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ కరెంట్ అఫైర్స్ గ్రూప్ హెడ్ అమిత్ కుమార్‌సింగ్ విజయవాడలో బుధవారం సమావేశమై పలు కీలక అంశాలు చర్చించారు. విశాఖ సమీపంలో తొలి దశలో రూ.1,350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే రెండో దశ విస్తరణ పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఏటా 3 లక్షల కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. విస్తరణ పూర్తయితే ఈ సామర్థ్యం 5 లక్షల లీటర్లకు చేరుకుంటుంది. అదేవిధంగా మొబైల్ కలర్ అకాడమీ ద్వారా ఏటా 15 వేల నుంచి 17 వేల మందికి పెయింటింగ్‌లో శిక్షణ ఇస్తున్నామని, విశాఖ యూనిట్లో ఏటా 75 మంది ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.