ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ఏషియన్ పెయింట్స్, టాటా టీలు టెక్, నాన్-ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీజీ కేటగిరీల్లో 2021లో భారతదేశంలో "అత్యంత పాపులర్" బ్రాండ్‌లుగా నిలిచాయి. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కాంటార్ తాజాగా "బ్రాండ్ జెడ్ ఇండియా" పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కన్సల్టింగ్ సంస్థ కాంటార్ మూడు(టెక్, నాన్-ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీజీ) కేటగిరీలలో దేశంలోని మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ పేర్లను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. టెక్నాలజీ కేటగిరీలో టాప్ స్థానంలో అమెజాన్ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం జొమాటో, యూట్యూబ్, గూగుల్, స్వీగ్గి, ఫ్లిప్ కార్ట్ నిలిచాయి.
ఇక ఎఫ్ఎంసీజీ కేటగిరీలో టాప్ స్థానంలో టాటా టీ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో తాజ్ మహల్, సర్ఫ్ ఎక్సెల్, మ్యాగీ, పారాచూట్, బ్రిటానియా ఉన్నాయి. నాన్-ఎఫ్ఎంసీజీ కేటగిరీలో టాప్ స్థానంలో ఏషియన్ పెయింట్స్ ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో జియో, శామ్ సంగ్, ఎంఆర్ఎఫ్, టాటా హౌసింగ్, ఎయిర్ టెల్ ఉన్నాయి. 2020-21లో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియా కోసం కాంటూర్ 418 కంపెనీల డేటాను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రతి సందర్భంలో, 30 కేటగిరీల్లో బ్రాండ్ పర్సెప్షన్, బ్రాండ్ ఈక్విటీ మెట్రిక్స్ విశ్లేషించారు. ఈ సర్వేలో దేశం మొత్తంగా 12,000 మంది పాల్గొన్నారు.
(చదవండి: కీలక రంగాల్లో దేశం కంటే మెరుగ్గా తెలంగాణ)
Comments
Please login to add a commentAdd a comment