న్యూఢిల్లీ: ఏషియన్ పెంయింట్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.803 కోట్లతో పోల్చిచూసినప్పుడు 53 శాతం వృద్ధితో రూ.1,232 కోట్లకు దూసుకుపో యింది. ఆదాయం పెద్దగా మార్పు లేకుండా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.8,430 కోట్ల నుంచి రూ.8,452 కోట్లకు వృద్ధి చెందింది. ప్రధానంగా ముడి సరుకుల ధరలు తగ్గడం, కార్యకలాపాల సామర్థ్యాలు మెరుగుపడడం లాభాలు పెరిగేందుకు దారితీసింది.
క్రితం ఏడాది ఇదే కాలంలో పోలి్చచూస్తే స్థూల మార్జిన్లు 7.7 శాతం మేర పెరిగాయి. మొత్తం వ్యయాలు 6 శాతం తగ్గి రూ.7,022 కోట్లుగా ఉన్నాయి. కోటింగ్స్, డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ ఆదాయంలో కేవలం ఒక శాతమే వృద్ధి నమోదైంది. నైరుతి రుతుపవనాల్లో అస్థిరతలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు ఏషియన్ పెయింట్స్ తెలిపింది. ఫలితంగా కొనుగోళ్లు వాయిదా పడినట్టు పేర్కొంది. దేశీయ డెకరేటివ్ వ్యాపారం విలువ పరంగా 6 శాతం వృద్ధిని చూపించింది. అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారా దాయం 4 శాతం తగ్గి రూ.775 కోట్లకు పరిమితమైంది.
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 3 శాతానికి పైగా తగ్గి రూ.2,958 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment