Mixed results
-
టాప్–5లో రౌనక్, హారిక
న్యూయార్క్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఓపెన్ విభాగంలో భారత్ నుంచి 9 మంది గ్రాండ్‌మాస్టర్లు... మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. తొలి రోజు ఓపెన్ విభాగంలో 5 రౌండ్ గేమ్‌లు... మహిళల విభాగంలో 4 రౌండ్ గేమ్‌లు జరిగాయి. ఐదు రౌండ్లు ముగిశాక ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ రౌనక్ సాధ్వాని 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. భారత్‌కే చెందిన ఇరిగేశి అర్జున్ 4 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో, ప్రణవ్ 3.5 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద 3 పాయింట్లతో 56వ ర్యాంక్‌లో, దీప్తాయన్ ఘోష్ 3 పాయింట్లతో 69వ ర్యాంక్‌లో, హర్ష భరతకోటి 2 పాయింట్లతో 108వ ర్యాంక్‌లో, అరవింద్ చిదంబరం 2 పాయింట్లతో 120వ ర్యాంక్‌లో, కార్తీక్ వెంకటరామన్ 1.5 పాయింట్లతో 144వ ర్యాంక్‌లో, 1.5 పాయింట్లతో 156వ ర్యాంక్‌లో ఉన్నారు. ప్లేయర్ల పాయింట్లు సమంగా ఉంటే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరిస్తున్నారు. హెల్గీ గ్రేటర్సన్ (ఐస్లాండ్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), షాంగ్లీ లు (చైనా)లపై గెలిచిన రౌనక్... సామ్యూల్ సెవియన్ (అమెరికా), రే రాబ్సన్ (అమెరికా)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. డేవిడ్ బ్రాడ్స్కయ్ (అమెరికా), విక్టర్ బోలోగన్ (మాల్డొవా), ఫిడేల్ జిమెనెజ్ (అమెరికా), ఎల్తాజ్ సఫార్లీ (అజర్బైజాన్)లపై గెలిచిన అర్జున్... సామ్యూల్ సెవియన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. మహిళల విభాగంలో నాలుగు రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఇనా అగ్రెస్ట్ (స్వీడన్), నటాలియా జుకోవా (ఉక్రెయిన్), ఉల్వియా ఫతాలియెవా (అజర్బైజాన్)లపై నెగ్గిన హారిక... టియోడోరా ఇన్జాక్ (సెర్బియా)తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. భారత్‌కే చెందిన వైశాలి 3 పాయింట్లతో 15వ ర్యాంక్‌లో, వంతిక అగర్వాల్ 2.5 పాయింట్లతో 35వ ర్యాంక్‌లో, కోనేరు హంపి 2.5 పాయింట్లతో 38వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి 2 పాయింట్లతో 57వ ర్యాంక్‌లో, నూతక్కి ప్రియాంక 2 పాయింట్లతో 61వ ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్ 2 పాయింట్లతో 70వ ర్యాంక్‌లో, పద్మిని రౌత్ 1.5 పాయింట్లతో 78వ ర్యాంక్‌లో ఉన్నారు. -
అవును..‘ ఉగాది పచ్చడే’
సాక్షి, హైదరాబాద్ : ‘పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు కొంచెం తియ్యగా..కొంచెం పుల్లగా, కొంచెం వగరుగా వచ్చాయి. ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలా ఉన్నాయి.’... లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. నిజంగా ముఖ్యమంత్రి చెప్పినట్టే అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరునెలలే అవుతున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రావడం దేనికి సంకేతమన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 42 చోట్ల అధికంగా ఓట్లు సాధించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిరూపించుకోగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చాలా స్థానాల్లో ఓట్లు తగ్గడం గమనార్హం. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను ఎనిమిది చోట్ల అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, తొమ్మిది చోట్ల తగ్గాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కేవలం రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన ఆరు చోట్ల ఓడిపోయారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చినా, ఆరుస్థానాల్లో త్రిముఖ పోటీ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగలిగారు. ఇక, రాష్ట్ర మంత్రివర్గం విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చాయి. ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇతర మంత్రుల్లో కేవలం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్, మధిర స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, మిగిలిన అందరు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లతో సరిపెట్టుకున్నారు. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసిన స్థానం మినహా 92,35,792 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా, లోక్‌సభ ఎన్నికల్లో 86,53,707 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం 39 నుంచి 40.5 శాతానికి పెరిగినా, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ 5.82లక్షల ఓట్లు కోల్పోవడం గమనార్హం. పోస్టుమార్టం హైలైట్స్ ఇవే : » గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం పరిధిలో ఓట్లు భారీగా పెరిగాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. సిర్పూర్, ముథోల్ నియోజకవర్గాల్లో అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే 50వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. » పెద్దపల్లి లోక్‌సభ ఎంపీ స్థానం గెలిచినా, ఆ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. » కరీంనగర్లోనూ అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు తగ్గాయి. అత్యధికంగా మానకొండూరు నియోజకవర్గంలో 44వేల ఓట్లు తక్కువ వచ్చాయి. » అసెంబ్లీ ఎన్నికల కంటే నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 72వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఈ పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల స్థానాల్లో ఓట్లు పెరగ్గా, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో తగ్గాయి. » జహీరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే స్వల్పంగా ఓట్లు తగ్గినా, ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ బాన్సువాడ, కామారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు పెరగ్గా, మిగిలిన చోట్ల తగ్గాయి. » మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే అతి స్వల్పంగా 7వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే, సిద్దిపేటలో 9,968 ఓట్లు, గజ్వేల్‌లో 32,971 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ వచ్చాయి. సంగారెడ్డిలో స్వల్పంగా ఓట్లు పెరిగాయి. » మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో వచి్చన ఓట్ల కంటే లోక్‌సభ ఎన్నికల్లో వచి్చన ఓట్లు ఎక్కువ. » సికింద్రాబాద్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే 1.4 లక్షల ఓట్లు ఎక్కువ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి. » ఎంఐఎం అడ్డా హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. తెలంగాణ మొత్తంగా చూస్తే.. అత్యల్పంగా కేవలం 62,497 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. » చేవెళ్లలోనూ అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యత కనిపించింది. » మహబూబ్‌నగర్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే 1.10లక్షల ఓట్లు తగ్గాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో వచి్చన ఓట్ల కంటే 23వేల ఓట్లు తగ్గాయి. » నాగర్‌కర్నూల్‌లో ఓట్లు తగ్గినా త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగింది. ఇక్కడ కూడా అన్ని అసెంబ్లీ స్థానాల పరిధిలో లోక్‌సభ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లభించడం గమనార్హం. » తెలంగాణలోనే రికార్డు మెజారిటీతో గెలిచిన నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలోనికి వచ్చే హుజూర్నగర్, సూర్యాపేట అసెంబ్లీ స్థానాల్లో లోక్‌సభకు ఓట్లు పెరిగాయి. మిగిలిన చోట్ల స్వల్పంగా తగ్గాయి. సూర్యాపేటలో ఏకంగా 32వేల ఓట్లు అధికంగా లభించాయి. » భువనగిరి లోక్‌సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. » వరంగల్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు తగ్గాయి. » మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోనూ అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. కేవలం భద్రాచలం అసెంబ్లీ పరిధిలో (ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది.) మాత్రమే ఓట్లు పెరగ్గా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ప్రతి చోటా ఓట్లు తగ్గాయి. » ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం, పాలేరులో ఓట్లు తగ్గాయి. ఖమ్మం అసెంబ్లీ పరిధిలో అత్యధికంగా 10వేల ఓట్లు తగ్గడం గమనార్హం. » మొత్తం మీద ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, నల్లగొండ, ఖమ్మంలలో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, మిగిలిన చోట్ల తక్కువ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచి్చనా, భువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్, జహీరాబాద్‌లలో త్రిముఖ పోటీ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సానుకూలతలున్నా...! అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనేక సానుకూలతలున్నా, ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో సీపీఎం కాంగ్రెస్ పార్టీకి అధికార మిత్రపక్షంగా తోడయింది. ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చింది.జాతీయస్థాయి రాజకీయాల నేపథ్యంలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలిచారనే అంచనాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అధికారంలో ఉన్న కారణంగా ఉండే సానుకూలత, వనరులు ఆ పార్టీకి అదనపు బలాన్నిచ్చాయి. ఇన్ని సానుకూలతల నేపథ్యంలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకోవడం గమనార్హం. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో బ్యాంకింగ్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,124 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్(4%), మారుతీ సుజుకీ(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. రోజంతా లాభాలే.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 73,139 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు ఎగసి 22,193 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మళ్లీ రూ.20 లక్షల కోట్లపైకి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేరు 3.60% లాభపడి రూ.2988 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ రిలయన్స్ కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం ఈ షేరుకు డిమాండ్ లభించింది. ట్రేడింగ్‌లో 4% లాభపడి రూ.3000 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,039 కోట్లు పెరిగి రూ.20.21 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 13న కంపెనీ రిలయన్స్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల స్థాయిని అందుకుంది. దేశంలో టాప్–5 మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థల్లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలవగా.., టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► జ్యువెలరీ రిటైల్ కంపెనీ పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ► బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 83,000 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ► మారుతీ సుజుకీ రూ.12,256 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దీనితో ఇంట్రాడేలో మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లను అందుకుంది. -
India Open 2024: ప్రణయ్, ప్రియాన్షు శుభారంభం
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 9వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్, 30వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 19వ ర్యాంకర్ లక్ష్య సేన్, 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–6, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... ప్రియాన్షు 16–21, 21–16, 21–13తో లక్ష్య సేన్‌కు షాక్ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జి 12–21, 15–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) జోడీ లు తొలి రౌండ్‌ను దాటలేకపోయాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 14–21, 13–21తో నాలుగో ర్యాంక్ జోడీ నమి మత్సుయామ–íÙడా చిహారు (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. టింగ్ యెంగ్–పుయ్ లామ్ యెంగ్ (హాంకాంగ్) జంట 21–6, 21–7తో రితూపర్ణ–శ్వేతపర్ణ జోడీపై గెలిచింది. -
ఏషియన్ పెయింట్స్ మిశ్రమ పనితీరు
న్యూఢిల్లీ: ఏషియన్ పెంయింట్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.803 కోట్లతో పోల్చిచూసినప్పుడు 53 శాతం వృద్ధితో రూ.1,232 కోట్లకు దూసుకుపో యింది. ఆదాయం పెద్దగా మార్పు లేకుండా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.8,430 కోట్ల నుంచి రూ.8,452 కోట్లకు వృద్ధి చెందింది. ప్రధానంగా ముడి సరుకుల ధరలు తగ్గడం, కార్యకలాపాల సామర్థ్యాలు మెరుగుపడడం లాభాలు పెరిగేందుకు దారితీసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో పోలి్చచూస్తే స్థూల మార్జిన్లు 7.7 శాతం మేర పెరిగాయి. మొత్తం వ్యయాలు 6 శాతం తగ్గి రూ.7,022 కోట్లుగా ఉన్నాయి. కోటింగ్స్, డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ ఆదాయంలో కేవలం ఒక శాతమే వృద్ధి నమోదైంది. నైరుతి రుతుపవనాల్లో అస్థిరతలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు ఏషియన్ పెయింట్స్ తెలిపింది. ఫలితంగా కొనుగోళ్లు వాయిదా పడినట్టు పేర్కొంది. దేశీయ డెకరేటివ్ వ్యాపారం విలువ పరంగా 6 శాతం వృద్ధిని చూపించింది. అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారా దాయం 4 శాతం తగ్గి రూ.775 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 3 శాతానికి పైగా తగ్గి రూ.2,958 వద్ద స్థిరపడింది. -
ఉప పోరులో మిశ్రమ ఫలితాలు
లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న జరిగిన ఉప ఎన్నికలో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార బీజేపీ మూడు, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, త్రిపురలోని ధన్పూర్ సీట్లను బీజేపీ నిలబెట్టుకోవడంతోపాటు త్రిపురలోని బొక్సానగర్ స్థానాన్ని సీపీఐ నుంచి కైవసం చేసుకుంది. బెంగాల్‌లోని ధుప్‌గురిలో జరిగిన ముక్కోణపు పోటీలో టీఎంసీ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు. ఇక కేరళలోని పుత్తుప్పల్లి సీటును ప్రతిపక్ష కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమికి చెందిన చాందీ ఊమెన్ గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన దిగ్గజ నేత ఊమెన్ చాందీ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఊమెన్ చాందీ కొడుకే చాందీ ఊమెన్. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలోనివే అయినప్పటికీ ఇక్కడ పరస్పరం తలపడటం గమనార్హం. ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) జార్ఖండ్‌లోని దుమ్రి సీటును నిలబెట్టుకుంది. యూపీలోని ఘోసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమి బలపరిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బీజేపీకి చెందిన సమీప ప్రత్యర్థిపై గెలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి పోరు బనశంకరి: వచ్చే లోక్‌సభ ఎన్నికలను బీజేపీ, జేడీఎస్ పారీ్టలు ఉమ్మడిగా ఎదుర్కోనున్నాయని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ఢిల్లీలో జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలు జరిపారన్నారు. యడియూరప్ప శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అయిదు వరకు ఎంపీ స్థానాలను జేడీఎస్‌కు కేటాయించడానికి అమిత్ షా సమ్మతించారని తెలిపారు. -
World Boxing Championships: నరేందర్ ముందుకు... శివ థాపాకు చుక్కెదురు
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), గోవింద్ సహాని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపక్ కుమార్ (51 కేజీలు) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అయితే స్టార్ బాక్సర్ శివ థాపా పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. తొలి రౌండ్ బౌట్లలో నరేందర్ 4–1తో మొహమ్మద్ అబ్రోరిదినోవ్ (తజికిస్తాన్)పై, గోవింద్ 5–0తో మెహ్రోన్ షఫియెవ్ (తజికిస్తాన్)పై, దీపక్ 5–0తో లూయిస్ డెల్గాడో (ఈక్వెడోర్)పై విజయం సాధించారు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన శివ థాపా ఈసారి మాత్రం నిరాశపరిచాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్లో బరిలోకి దిగిన శివ థాపా 3–4తో డోస్ రెస్ యురీ (బ్రెజిల్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో భారత బాక్సర్లు హుసాముద్దీన్ (57 కేజీలు), ఆశిష్ చౌధరీ (80 కేజీలు), నవీన్ (92 కేజీలు) పోటీపడతారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. అయితే మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–19తో కాంగ్ మిన్ హ్యుక్–సియో సెయుంగ్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌లో 16–15తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. సింగిల్స్‌లో ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 21–12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–13, 22–20తో జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ సైనా 17–21, 21–19, 11–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్‌కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు కాంస్యం
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఢాకాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టు ఓడిపోయింది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రిషభ్ యాదవ్‌లతో కూడిన భారత జట్టు 235–223తో బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం నెగ్గింది. భారత మహిళల జట్టు కాంస్య పతక పోరులో 208–220తో కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో సంజీత్, నిశాంత్
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఒకవైపు నిశాంత్ దేవ్ (71 కేజీలు), సంజీత్ (92 కేజీలు) అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరగా... మరోవైపు రోహిత్, ఆకాశ్, సుమిత్, దీపక్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌ల్లో నిశాంత్ దేవ్ 3–2తో మార్కో అల్వారెజ్ వెర్డె (మెక్సికో)పై, సంజీత్ (92 కేజీలు) 4–1తో జియోర్జి చిగ్లాడ్జె (జార్జియా)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రోహిత్ (భారత్) 1–4తో సెరిక్ (కజకిస్తాన్) చేతిలో.... ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు) 0–5తో కెవిన్ బ్రౌన్ (క్యూబా) చేతిలో ... సుమిత్ (75 కేజీలు) 0–5తో యోన్లిస్ (క్యూబా) చేతిలో... దీపక్ 0–5తో సాకెన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
మదుపర్లకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్లో బేర్ స్వైరవిహారంతో గురువారం సూచీలు కుప్పకూలాయి. కొన్నిరోజులుగా బుల్ ఆధిపత్యంతో స్తబ్ధుగా ఉన్న బేర్ ఒక్కసారిగా అదును చూసి పంజా విసిరింది. అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూలతల సంకేతాలు అందాయి. దేశీయ కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. తాజాగా మోర్గాన్ స్టాన్లీ భారత మార్కెట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. ఈ అంశాలు దేశీయ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మార్కెట్ మొదలు.., తుదిదాకా బేర్ సంపూర్ణ ఆధిపత్యం కనబరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ నెలకొంది. ఫలితంగా స్టాక్ సూచీలు గత ఆరునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,159 పాయింట్ల నష్టంతో 60వేల దిగువున 59,985 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18,000 వేల స్థాయిని కోల్పోయి 354 పాయింట్ల పతనంతో 17,857 వద్ద నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదితో తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టం. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలోని మొత్తం షేర్లలో కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముంగింపు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,819 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.837 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడంతో రూపాయి 11 పైసలు బలపడి 74.92 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు... ఆసియా మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ ఉదయం 62 పాయింట్ల లాభంతో 61,081 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 18,188 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల కౌంటర్లలో అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో సూచీలు మార్కెట్ ముగిసే వరకూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1365 పాయింట్లు నష్టపోయి 59,778 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు కోల్పోయి 17,799 ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఐటీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఆరుశాతం నష్టపోయి రూ.225 వద్ద ముగిసింది. ► నష్టాల మార్కెట్లోనూ ఎల్అండ్టీ షేరు రాణించింది. 2% లాభంతో రూ.1814 వద్ద నిలిచింది. ► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో టైటాన్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.2,375 వద్ద స్థిరపడింది. పతనానికి ఐదు కారణాలు... ఎఫ్అండ్ఓ ముగింపు... అక్టోబర్ ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్యేర్ ఆఫ్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం సూచీల భారీ నష్టాలకు కారణమైంది. కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు.. ఇటీవల పలు కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడిసరుకు ధరల పెరుగదలతో ఆయా కంపెనీల లాభాలు పరిమితమయ్యాయి. చాలా కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూ పింది. ఐటీసీ, కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రస్ షేర్లు 5% నుంచి 2% నష్టపోయాయి. ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ.... విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టడం ప్రస్తుత కరెక్షన్కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐలు రూ.13 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూలతలు... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక రికవరీ అందోళనలతో ఆసియా మార్కెట్లు 1.5%నష్టంతో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ద్రవ్యపాలసీ, యూఎస్ మూడో క్వార్టర్ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో యూరప్, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రేటింగ్ డౌన్‌గ్రేడ్... అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతుందనే కారణంతో నోమురా, యూఎస్బీ రేటింగ్ భారత స్టాక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. తాజాగా మోర్గాన్‌స్టాన్లీ మన మార్కెట్ రేటింగ్ ‘అధిక వెయిటేజీ’ నుంచి ‘సమాన వెయిటేజీ(ఈక్వల్ వెయిటేజీ)’ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థల డౌన్‌గ్రేడ్ రేటింగ్ కేటాయింపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ సూచీలు దాదాపు రెండుశాతం మేర కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.4.82 లక్షల కోట్లు నషపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘వ్యవస్థలో అధిక లిక్విడిటీ, రిటైల్ ఇన్వెస్టర్ల రూపంలో కొత్త తరం(యువత) పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడంతో ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీలు 25% ర్యాలీ చేశాయి. ఇప్పటికే అధిక విలువలతో ట్రేడ్ అవుతున్న షేర్లలో ఎఫ్అండ్ఓ ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బుల్ సుదీర్ఘ ర్యాలీ నేపథ్యంలో 10–20 శాతం వరకూ కరెక్షన్కు అవకాశం ఉంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ పట్ల అప్రమత్తత అవసరం’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. -
సింధు శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేయగా... మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ, లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్, ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 21–18తో జూలీ దవాల్ జాకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. సయాకా తకహాషి (జపాన్)తో మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 2–9తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 22–20, 19–21తో పోరాడి ఓడిపోయాడు. మొమోటో చేతిలో శ్రీకాంత్‌కిది 14వ పరాజయం కావడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ 17–21, 21–17, 11–21తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో... ప్రణయ్ 11–21, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్ 21–10, 21–16తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై, సౌరభ్ వర్మ 22–20, 21–19తో వైగోర్ కొహెలో (బ్రెజిల్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–19, 21–15తో మథియాస్ థైరి–మై సురో (డెన్మార్క్) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో టాప్ సీడ్ లీ సోహీ–షిన్ సెయుంగ్‌చన్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 21–17, 21–13తో లీ హుయ్–యాంగ్ సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. -
శ్రీకాంత్ జోరు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత అగ్రశ్రేణి షట్లర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా... లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–15, 21–14తో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–15, 7–21, 17–21తో హాన్స్ క్రిస్టియాన్ సోల్బెర్గ్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. దూకుడే మంత్రంగా... 33 నిమిషాల పాటు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‌లోనే 9–4తో జోరు కనబరిచిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు 11–8తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 17–9తో దూసుకెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆరంభంలో శ్రీకాం త్ 5–8తో వెనుకబడ్డాడు. ఈ దశలో పుంజుకున్న అతను వరుసగా 6 పాయింట్లు స్కోర్ చేసి 11–8తో రేసులోకి వచ్చాడు. జేసన్ 10–11తో శ్రీకాంత్‌ను సమీపించాడు. మరోసారి ధాటిగా ఆడిన శ్రీకాంత్ 15–11... 19–11తో ప్రత్యర్థిపై దాడి చేసి విజయా న్ని దక్కించుకున్నాడు. నేడు జరుగనున్న క్వార్టర్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్–2 ఆటగాడు చౌ టియాన్ చెన్ (చైనీస్‌తైపీ)తో శ్రీకాంత్ తలపడతాడు. -
క్వార్టర్స్‌లో సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో ఐదో సీడ్ శుభాంకర్ డే, ఏడో సీడ్ సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్ క్వార్టర్స్‌కు చేరుకోగా... మహిళల సింగిల్స్ కేటగిరీలో ఆకర్షి కశ్యప్, చుక్కా సాయి ఉత్తేజితరావు పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శుభాంకర్ డే 21–16, 21–15తో చికో అరా వార్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందగా... సౌరభ్ వర్మ 21–16, 21–11తో సన్ పెయ్ జియాంగ్ (చైనా)ను, అజయ్ జయరామ్ 21–18, 21–13తో జియా వీ తాన్ (మలేసియా)ను ఓడించారు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ పారుపల్లి కశ్యప్ 21–17, 15–21, 19–21తో లోహ్ కియాన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత రావు 10–21, 21–9, 8–21తో క్వాలిఫయర్ బెన్యప ఎమ్‌సార్డ్ (థాయ్‌లాండ్) చేతిలో, క్వాలిఫయర్ ఆకర్షి కశ్యప్ 18–21, 13–21తో రెండో సీడ్ అన్ సు యంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. -
ఐఐఎస్సీకి 29వ ర్యాంకు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వారు ఏటా ఆసియాలోని విశ్వవిద్యాలయాలకు ఇచ్చే ర్యాంకింగ్స్‌లో ఈసారి భారత విశ్వవిద్యాలయాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) గతేడాది సాధించిన 29వ ర్యాంకును ఈ ఏడాది కూడా నిలుపుకుంది. టాప్–100లో చూస్తే ఐఐటీ ఇండోర్ 50వ ర్యాంకు, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 54వ ర్యాంకు, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 62వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 76వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 82వ ర్యాంకు, ఐఐటీ ఢిల్లీ 91వ ర్యాంకు పొందాయి. భారత యూనివర్సిటీల్లో అత్యుత్తమ ర్యాంకు ఐఐఎస్సీదే. ఇక మొత్తంగా చూస్తే చైనాకు చెందిన సింఘువా యూనివర్సిటీ తొలిస్థానంలో నిలిచింది. -
రామ్‌గఢ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం
-
రామ్‌గఢ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : హర్యానా, రాజస్ధాన్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పాలక, విపక్షాలకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. రాజస్ధాన్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సఫీయా ఖాన్ విజయం సాధించారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జుబైర్ ఖాన్ భార్య సఫీయా ఖాన్ భారీ ఆధిక్యంతో బీజేపీ అభ్యర్ధిపై ఘనవిజయం సాధించారు. జింద్‌లో బీజేపీ ముందంజ హర్యానాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పాలక బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, జేజేపీల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఎన్నికల ఫలితాలూ ఉత్కంఠను రేపుతున్నాయి. తొలి రౌండ్లో ఆధిక్యం కనబరిచిన జేజేపీ, కాంగ్రెస్‌లు ఆ తర్వాత వెనుకంజ వేయగా ఏడో రౌండ్ ముగిసిన అనంతరం బీజేపీ 9300 ఓట్ల ఆధిక్యం సాధించింది. జింద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున దిగ్గజ నేత రణ్‌దీప్ సుర్జీవాలా బరిలో నిలవగా, బీజేపీ తరపున మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మిద్ధా కుమారుడు కృష్ణ మిద్దా పోటీ చేశారు. ఐఎన్ఎల్డీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా రంగంలో నిలిచారు. -
ట్రంప్ దూకుడుకు కళ్లెం!
ప్రతినిధుల సభలో మెజారిటీ చేతులు మారడం ట్రంప్ దూకుడుకు కళ్లెం వేస్తుందని భావిస్తున్నారు. వలసలు, ఆర్థికం, వాణిజ్యం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఏకపక్షంగా అమలుచేస్తున్న అధ్యక్షుడి విధానాల్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష డెమొక్రాట్లకు తాజా ఫలితాలతో మంచి అవకాశం లభించనుంది. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల్ని మూకుమ్మడిగా ఎదిరిస్తామని కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇదివరకే ప్రకటించడం తెల్సిందే. ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల బలం పెరగడంతో ట్రంప్‌పై ఉన్న వివిధ కేసుల దర్యాప్తు ముమ్మరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడి దుందుడుకు, విపరీత వైఖరిని కట్టడి చేయడానికి డెమొక్రాట్ల ముందున్న కొన్ని మార్గాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ స్థాయీ సంఘాలపై డెమొక్రాట్లకు మరింత నియంత్రణ లభిస్తే ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన పలు కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలపై విచారణలు ఊపందుకుంటాయి. ట్రంప్‌పై అభిశంసన చేపట్టేందుకు చర్యలు తీసుకునే చాన్సుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు బడ్జెట్ విషయంలో ట్రంప్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిలా ట్రంప్ తనకు కావలసిన నిధుల కోసం ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండదు. ట్రంప్ గతంలో వెల్లడించడానికి నిరాకరించిన వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్ పత్రాలను వెలుగులోకి తెచ్చేందుకు డెమొక్రాట్లు ప్రయత్నిస్తారు. ఈసారి కూడా ట్రంప్‌ను రిటర్న్స్ కోసం అడుగుతామని, ఆయన తిరస్కరిస్తే తమకున్న అధికార పరిధిలో చట్టబద్ధంగా వాటిని తీసుకుంటామని హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీకి నాయకత్వం వహించనున్న రిచర్డ్ నీల్ చెప్పారు. అక్రమ వలసల కట్టడికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ విస్తృతంగా ప్రచారం చేశారు. సంఖ్యాబలం పెరగడంతో డెమొక్రాట్లు గోడ నిర్మాణాన్ని ఆపేసేందుకు చర్యలు తీసుకోవచ్చు. ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని కొనసాగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి పెంచే చాన్సుంది. -
సెనెట్ నీది ‘హౌస్’ నాది!
వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు రెఫరెండంగా భావించిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతిపక్షానికి బాసటగా నిలిచే ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రతినిధుల సభ డెమొక్రటిక్ పార్టీ వశమైందని ప్రాథమిక ఫలితాలు తేల్చాయి. కానీ, ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్లు సాధారణ మెజారిటీ కన్నా కనీసం 23 సీట్లు అధికంగా గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 235 సీట్లు, డెమొక్రాట్లకు 193 సీట్లున్నాయి. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి డెమొక్రాట్లు సుమారు 27 సీట్లు కైవసం చేసుకున్నారని ప్రాథమిక ఫలితాలు వెల్లడించాయి. కొత్త సభ వచ్చే జనవరిలో కొలువుదీరుతుంది. నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయ్యారు. వారంతా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే. ఈసారి రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభకు ఎన్నికయ్యారు. అందులో 28 మంది తొలిసారి ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల నాన్సీ పెలోసి ప్రతినిధుల సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యే చాన్సుంది. ఈ పదవి భారత్‌లో లోక్‌సభ స్పీకర్ హోదాతో సమానం. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందారు. మరోవైపు, 35 స్థానాలకు ఎన్నికలు జరిగిన సెనెట్ (మొత్తం సభ్యులు 100)లో రిపబ్లికన్లు తమ ఆధిక్యతను కొనసాగించారు. తాజా ఎన్నికల తరువాత ఎగువ సభలో వారి బలం 51 పైనే ఉందని స్థానిక మీడియా తేల్చింది. ఇండో–అమెరికన్ల విజయం.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికవగా, మరో డజను మందికి పైగా రాష్ట్రాల స్థాయిలో జరిగిన అసెంబ్లీ, సెనెట్, అటార్నీ జనరల్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇలినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాలో రాజా క్రిష్ణమూర్తి మళ్లీ గెలిచారు. కాలిఫోర్నియా 7వ కాంగ్రెషనల్ జిల్లాలో అమీ బేరా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. సిలికాన్ వ్యాలీలో రో ఖన్నా గెలిచారు. ప్రతినిధుల సభలో ఏకైక మహిళా ఇండో అమెరికన్ ప్రమీలా జయపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోష్ కౌల్.. అటార్నీ జనరల్‌గా ఎన్నికై, ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో–అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీకే చెందిన నీమా కులకర్ణి కెంటుకీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అమీశ్, కెవిన్ థామస్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ముజతబా మొహమ్మద్ ఉత్తర కరోలినాసెనెట్కు ఎన్నికయ్యారు. మీడియాపై ట్రంప్ ఫైర్ వాషింగ్టన్: మీడియాపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. మధ్యంతర ఎన్నికలు ముగిసిన తరువాత బుధవారం శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా సీఎన్ఎన్ పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ట్రంప్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి నిరాకరించి మైక్రోఫోన్‌కు దూరంగా జరిగారు. ట్రంప్ నేరగాళ్లుగా అభివర్ణించిన మధ్య అమెరికా ప్రజల వలసల గురించి సీఎన్ఎన్ పాత్రికేయుడు ప్రశ్నించగా..‘మీ పని మీరు చూసుకోండి..దేశ పాలనను నన్ను చేయనీయండి’ అని ట్రంప్ బదులిచ్చారు. రిపబ్లికన్ పార్టీ శ్వేత జాతీయులకు మద్దతిస్తోందా? అని మహిళా జర్నలిస్ట్ అడగ్గా.. ఆమె జాత్యహంకార ప్రశ్నలు వేస్తోందని మండిపడ్డారు. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన సీఎన్ఎన్ విలేకరి ప్రెస్ ప్రవేశ అర్హతా పత్రాల్ని వైట్‌హౌజ్ రద్దుచేసింది. మీడియాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రవర్తన హద్దులు మీరిందని సీఎన్ఎన్ ఆరోపించింది. -
ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు
సెయింట్ లూయిస్ (అమెరికా): ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మొదట విజయంతో శుభారంభం చేసిన ఆనంద్ తర్వాత రెండో రౌండ్లో ఓడిపోయాడు. మూడో రౌండ్లో డ్రా చేసుకున్నాడు. తొలి రౌండ్లో అమెరికాకు చెందిన హికరు నకమురపై 35 ఎత్తుల్లో గెలిచిన ఆనంద్... ఫ్రాన్స్ ఆటగాడు మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రేవ్‌తో జరిగిన రెండో గేమ్‌లో 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. రష్యా ఆటగాడు సెర్గెయ్ కర్జాకిన్‌తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 29 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. దీంతో తొలిరోజు మూడు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ లభిస్తుంది. మరోవైపు మూడు గేముల్లోనూ గెలిచిన ఫాబియానో కరువానా (అమెరికా) ఆరు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. -
మిజోరంలో ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో ప్రధాన వైరి పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చక్మా అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్(సీఏడీసీ)ను పాలించేందుకు ఒక్కటయ్యాయి. 20 స్థానాలున్న సీఏడీసీకి ఏప్రిల్ 20న జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) 8 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 6 సీట్లు, బీజేపీ ఐదు సీట్లలో గెలుపొందాయి. కాగా, ఫుటులి సీటుకు జరిగిన ఎన్నికల ఫలితాలపై గౌహతి హైకోర్టు స్టే విధించడంతో ఫలితాలను వెల్లడించలేదు. సీఏడీసీలో ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడిగా తమకు చోటివ్వడానికి ఎంఎన్ఎఫ్ నిరాకరించడంతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపినట్లు బీజేపీ నేత ఒకరు తెలిపారు. తాజాగా కాంగ్రెస్ మద్దతుతో సీఏడీసీ పాలనను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై ఇరుపార్టీలు ఏప్రిల్ 25న ఓ అంగీకారానికి వచ్చాయన్నారు. త్వరలోనే రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్ శర్మతో సమావేశమై సీఏడీసీ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చర్చిస్తామన్నారు. -
బీజీ–3 పత్తి విత్తనంపై ఏంచేయాలి?
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాన్ని ఈ ఖరీఫ్‌లో రైతులు విరివిగా వేశారని, అనేకచోట్ల మంచి ఫలితాలు రాగా అక్కడక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రానికి తెలిపింది. అనుమతి లేకున్నా అనేక కంపెనీలు, డీలర్లు బీజీ–3ని రైతులకు విక్రయించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజీ–3 విత్తనానికి సంబంధించి వివిధ అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి బుధవారం కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఈసారి పత్తి విస్తీర్ణంలో దాదాపు 20 శాతం బీజీ–3 పత్తి విత్తనాన్ని రైతులు సాగు చేసినట్లు తెలిసింది. వారంలో పత్తి రైతులకు గుర్తింపు కార్డులు వారం రోజుల్లో పత్తి రైతులకు గుర్తింపు కార్డులు జారీచేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పత్తి రైతుల వివరాల నమోదు పూర్తయిందని, గుర్తింపు కార్డులను ప్రింట్ చేసి వారంలో గ్రామాల్లో రైతులకు అందజేస్తామని తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను గుర్తించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ లోడింగ్ జరుగుతోందన్నారు. వచ్చే 23వ తేదీ నాటికి ఇది పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఒకవేళ గుర్తింపు కార్డు లేకున్నా డేటాలో పొందుపరిచిన ఆధార్‌కార్డు నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు తెలిపి ఆ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవచ్చన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు తొందరపడి పత్తి అమ్ముకోకూడదని, మార్కెట్ బలపడ్డాక కనీస మద్దతు ధరకు విక్రయించుకోవాలని ఆయన కోరారు. ఈ ఏడాది 5.60 లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తి 2017–18 ఖరీఫ్‌లో 2.40 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.20 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరుగుతుందని పార్థసారథి తెలిపారు. ఈ అంశంపై బుధవారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జాతీయ విత్తన సంస్థ (ఎన్ఎస్సీ) నుంచి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు 20 వేల క్వింటాళ్ల సోయాబీన్, 40 వేల క్వింటాళ్ల దయించా (పచ్చిరొట్ట) విత్తనాలను సరఫరా చేసేలా ఒప్పందం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఎన్ఎస్సీకి తెలంగాణ సోనా వరి, డీహెచ్ఎం 121 మొక్కజొన్న రకం విత్తనాలను సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అలాగే హైబ్రీడ్ మొక్కజొన్న విత్తన ఉత్పత్తిని హాకా, విత్తనాభివృద్ధి సంస్థలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్థసారథి వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంచాలకుడు డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
సెమీస్‌లో జోష్నా
ముంబై: ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు జోష్నా చిన్నప్ప, దీపిక పళ్లికల్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. జోష్నా సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి0ది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జోష్నా 11-7, 5-11, 11-5, 11-5తో లియు లింగ్ (హాంకాంగ్)పై గెలుపొందగా... దీపిక 13-15, 11-8, 10-12, 8-11తో టెస్నీ ఇవాన్‌స (వేల్స్) చేతిలో ఓడిపోయి0ది. -
బ్యాంక్ స్ట్రీట్.. మిశ్రమ ఫలితాలు...
యూనియన్ బ్యాంక్... మొండి బకాయిల భారం న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని బ్యాంక్ పేర్కొంది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.579 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.444 కోట్లకు తగ్గిందని వివరించింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.920 కోట్ల నుంచి రూ.1,009 కోట్లకు పెరిగాయని పేర్కొంది. యూకో బ్యాంక్... లాభం 27 శాతం డౌన్ న్యూఢిల్లీ: యూకో బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 27 శాతం తగ్గింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.285 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.209 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,309 కోట్ల నుంచి రూ.5,263 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 4.32 శాతం నుంచి 6.76 శాతానికి, నికర మొండి బకాయిలు 2.38 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగాయని తెలిపింది. సెంట్రల్ బ్యాంక్... మొండి బకాయిలు తగ్గాయ్ న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ నికర లాభం నాలుగో త్రైమాసిక కాలానికి 7 శాతం పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.162 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.174 కోట్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,962 కోట్ల నుంచి రూ.7,322 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 6.27 శాతం నుంచి 6.09 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 3.75 శాతం నుంచి 3.61 శాతానికి తగ్గాయి. విజయ బ్యాంక్... వేతనాలకు అధిక కేటాయింపులు చెన్నై: విజయ బ్యాంక్ నికర లాభం క్యూ4లో 29% తగ్గింది. 2013-14 క్యూ4లో రూ.136 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.97 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్ ఎండీ, సీఈఓ కిశోర్ కుమార్ శాన్సి వివరించారు. వేతన పెంపు నిమిత్తం రూ.208 కోట్ల ఏక మొత్తం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.3,029 కోట్ల నుంచి రూ.3,406 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. షేర్‌కు రూ.1.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామన్నారు.