లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) వారు ఏటా ఆసియాలోని విశ్వవిద్యాలయాలకు ఇచ్చే ర్యాంకింగ్స్‌లో ఈసారి భారత విశ్వవిద్యాలయాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) గతేడాది సాధించిన 29వ ర్యాంకును ఈ ఏడాది కూడా నిలుపుకుంది. టాప్–100లో చూస్తే ఐఐటీ ఇండోర్ 50వ ర్యాంకు, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 54వ ర్యాంకు, జేఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 62వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 76వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 82వ ర్యాంకు, ఐఐటీ ఢిల్లీ 91వ ర్యాంకు పొందాయి. భారత యూనివర్సిటీల్లో అత్యుత్తమ ర్యాంకు ఐఐఎస్‌సీదే. ఇక మొత్తంగా చూస్తే చైనాకు చెందిన సింఘువా యూనివర్సిటీ తొలిస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment