IISC
-
దేశంలో ‘ఐఐఎస్సీ’ టాప్
సాక్షి, అమరావతి : దేశంలో అగ్రశ్రేణి వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తాజా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల ఓవరాలవిభాగంలో 251–300 మధ్య కొనసాగుతోంది. అయితే, గతేడాదితో 201–250 బాండ్ నుంచి స్వల్పంగా పడిపోయింది. ఫలితంగా వరల్డ్ టాప్–250లోకి ప్రవేశించలేకపోయింది. ఈ క్రమంలో 53.7–55.7 స్కోరు సాధించింది. పరిశోధన, ఇంటెన్సివ్ వర్సిటీలను ఐదు ప్రధాన అంశాల ఆధారంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ ర్యాంకులు కేటాయిస్తోంది. వీటిల్లో బోధన, పరిశోధన వాతావరణం, పరిశోధన నాణ్యత, అంతర్జాతీయ అవుట్‌లుక్, ఇండస్ట్రీ ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఈ ఏడాది 115 దేశాలకు చెందిన 2,092 ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే 185 కొత్త ఎంట్రీలు వచి్చనట్లు పేర్కొంది. ఈ ఏడాది ర్యాంకుల్లో భారతీయ వర్సిటీలు కేవలం మిశ్రమ ఫలితాలు మాత్రమే చూశాయి. బెనారస్ హిందూ వర్సిటీ, భారతియార్ వర్సిటీ, ఐఐటీ గౌహతి వంటివి 2025లో భారతీయ టాప్–10 జాబితా నుంచి చోటుకోల్పోయాయి. ప్రపంచ వేదికపై బలమైన పోటీదారులు ఉండటంతోనే భారతీయ వర్సిటీలు కొంత వెనుకబడినట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీల్లో కేవలం ఇండోర్ ఐఐటీ మాత్రమే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. భారతీయ వర్సిటీల పురోగతి.. అన్నా వర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, శూలినీ వర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ర్యాంకులను మెరుగుపర్చుకుని 401–500 బాండ్లోకి చేరుకున్నాయి. ఈ సంస్థల్లో ప్రతి ఒక్కటి 46–49.2 మధ్య స్కోర్‌ను సాధించాయి. అయినప్పటికీ కొన్ని వర్సిటీలు వెనుకబడ్డాయి. ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ర్యాంకు గతేడాదితో పోలిస్తే తగ్గింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఇండోర్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)తో కలిసి 501–600 ర్యాంకును పంచుకుంది. ఈ రెండు సంస్థలు గణనీయమైన పురోగతి ప్రదర్శించడం విశేషం. 601–800 బెల్ట్‌లో 14 భారతీయ విద్యా సంస్థలు నిలిచాయి. వీటిల్లో అలీఘర్ ముస్లిం వర్సిటీ, అమిటీ వర్సిటీ, బెనారస్ హిందూ వర్సిటీ, బిట్స్ పిలానీ, చిత్కారా వర్సిటీ, ఐఐటీ పాటా్న, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ (కేఐఐటీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ, సింబయాసిస్ ఇంటర్నేషనల్ వర్సిటీ, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, విట్ వర్సిటీ (తమిళనాడు) స్థానం దక్కించుకున్నాయి.జేఎన్టీయూ అనంతపురం.. ఎస్వీయూలకు చోటు.. ఇక 801–1000 మధ్య 22 భారతీయ విద్యా సంస్థలు ఉండగా.. మన రాష్ట్రం నుంచి జేఎన్టీయూ అనంతపురం, కేఎల్‌యూ (34.5–38.1)లకు మాత్రమే చోటుదక్కింది. అలాగే, 1,201–1,500 మధ్య 23 సంస్థలు ఉండగా.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీ–ఎస్వీయూ (25.2–30.6)తో పాటు తెలంగాణకు చెందిన ఉస్మానియా, ఎన్ఐటీ–నిట్ (25.2–30.6) ఉంది. 1,501 ప్లస్ విభాగంలో.. ఆచార్య నాగార్జున వర్సిటీ, గీతం, జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన్ (10.5–25.1) నిలిచాయి. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో సంచలనం సృష్టించిన ఐఐటీ గౌహతి 801–1000 బెల్డ్కు దిగజారింది.అగ్రస్థానంలో ఆక్స్ఫర్డ్.. మరోవైపు.. ప్రపంచ అత్యుత్తమ వర్సిటీగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ని ఆరో స్థానానికి నెడుతూ స్టాన్ఫోర్డ్ వర్సిటీ రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది బ్రెజిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విద్యా సంస్థలు టాప్–200లో చోటు దక్కించుకోవడం విశేషం. కానీ, ఆ్రస్టేలియాలోని టాప్–5 విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్‌లో పడిపోయాయి. చైనా విశ్వవిద్యాలయాలు అద్భుత ప్రదర్శనతో టాప్–10కి చేరువలోకి రావడం విశేషం. యూఎస్, యూకే ఉన్నత విద్యా రంగాల ప్రతిష్ట క్షీణిస్తున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. -
వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయం
దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నియంత్రణ, నిర్వహణకు తోడ్పడే టెక్నాలజీల అభివృద్ధికి విప్రో సంస్థ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త టెక్నాలజీల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించుకోనుంది.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఆధ్వర్యంలోని సీబీఆర్ స్వయంప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి విప్రో సీబీఆర్తో కలిసి వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్‌ను తయారుచేయనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్త టెక్నాలజీ ఇంజిన్‌లో వాడే కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్‌డేటా అనలిటిక్స్ నిత్యం వ్యక్తులతో మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులను విశ్లేషిస్తాయి. గుండె, న్యూరోడిజెనరేటివ్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం, వాటిని నిర్వహించడంపై దృష్టి పెడుతాయి. సీబీఆర్ సహకారంతో డిజిటల్ యాప్ ఆధారిత ప్రయోగాల ద్వారా ఈ ఇంజిన్‌ను విప్రో పరీక్షిస్తుంది.ఇదీ చదవండి: రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..విప్రో లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శుభా తటవర్తి మాట్లాడుతూ..‘సాంకేతిక ఆవిష్కరణల ద్వారా హెల్త్‌కేర్ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈమేరకు కంపెనీ ప్రతిష్టాత్మకమైన ఐఐఎస్సీ ఆధ్వర్యంలోని సీబీఆర్తో భాగస్వామ్యం కావడం సంతోషకరం. విప్రో సాంకేతికత అనుభవానికి సీబీఆర్ పరిశోధన తోడవ్వడం వల్ల రోగుల ఆరోగ్య సంరక్షణకు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయ’ని అన్నారు. -
6జీ టెక్నాలజీపై పరిశోధనకు ప్రతిష్టాత్మక కంపెనీల జట్టు
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరికరాలను మరింత సమర్థంగా తయారుచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వాటిలో చాలామార్పులు చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా డేటాలోనూ, దాని వేగంలోనూ మరిన్ని పరిశోధనలు జరగాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న 5జీకి బదులు 6జీపై ఎన్నో సంస్థలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా సమాజంపై నేరుగా ప్రభావం చూపనున్న 6జీ సాంకేతికత, 6జీ వినియోగంపై సంయుక్తంగా పరిశోధన చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), నోకియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో 6జీ పరిశోధనలకు అవసరమయ్యే ల్యాబ్‌ను సైతం ప్రారంభించారు. రేడియో టెక్నాలజీస్, ఆర్కిటెక్చర్, ఎయిర్ ఇంటర్ఫేస్లో మెషీన్ లెర్నింగ్ యాప్ అప్లికేషన్.. ఈ మూడు విభాగాల్లో పరిశోధనలు చేస్తారని నోకియా తెలిపింది. ఐఐఎస్సీతో జట్టు కట్టడం ద్వారా భారత్‌లో 6జీ సాంకేతికతపై తాము ఇచ్చిన హామీని మరింత ముందుకు తీసుకెళ్లనున్నామని నోకియా పేర్కొంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిశోధనలు ఉంటాయని, అయితే భారత్‌లో సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. ఇదీ చదవండి: 2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..? ఇంధన సామర్థ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని మెరుగపర్చడం, ఏఐ వినియోగం, రవాణా భద్రతను మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి విస్తరణ నిమిత్తం నెట్వర్క్ సెన్సార్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం లాంటి వాటిపై ఈ పరిశోధనల సాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
మరో సూపర్ కంప్యూటర్ను అభివృద్ది చేసిన సీ-డీఏసీ
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) కోసం సీ-డీఏసీ మరొక అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను అభివృద్ది చేసింది. 3.3 పెటాఫ్లాప్స్ సామర్థ్యాన్ని ఈ సూపర్ కంప్యూటర్ కలిగి ఉంది. పరమ్ ప్రవేగా అని పిలిచే ఈ సూపర్ కంప్యూటర్ భారతీయ విద్యా సంస్థలో ఇన్స్టాల్ చేసిన వాటిలో అతిపెద్దది. దీనిని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సీ-డీఏసీ) రూపొందించింది. సూపర్ కంప్యూటర్లో ఉపయోగించే చాలా భాగాలు భారతదేశంలో అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ సహాయంతో తయారు చేశారు. దేశవ్యాప్తంగా విభిన్న పరిశోధన & విద్యా అన్వేషణల కోసం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్(ఎన్ఎస్ఎమ్) కింద ఈ సూపర్ కంప్యూటర్ నియమించబడింది. ఎన్ఎస్ఎమ్ ఇప్పటివరకు 17 పెటాఫ్లాప్స్ క్యుమిలేటివ్ కంప్యూటింగ్ శక్తితో భారతదేశం అంతటా 10 సూపర్ కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. "ఈ సూపర్ కంప్యూటర్లు అధ్యాపక సభ్యులు & విద్యార్థులు ప్రధాన ఆర్ అండ్ డి కార్యకలాపాలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడ్డాయి. వీటితో జెనోమిక్స్ & ఔషధ ఆవిష్కరణ, పట్టణ పర్యావరణ సమస్యలను అధ్యయనం చేయడం, వరద హెచ్చరిక & అంచనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, టెలికామ్ నెట్ వర్క్స్ కోసం ఆప్టిమైజ్ చేయవచ్చు" అని ఐఐఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పరమ్ ప్రవేగా అంటే ఏమిటి? పరమ్ ప్రవేగా అంటే హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లాస్ ఆఫ్ సిస్టమ్స్ కలిగిన ఒక సూపర్ కంప్యూటర్. సీపీయు నోడ్స్ కోసం ఇంటెల్ జియోన్ కాస్కేడ్ లేక్ ప్రాసెసర్లు, జిపియు నోడ్స్ పై ఎన్ విడియా టెస్లా వి100 కార్డులు ఉన్నాయి. సీ-డీఏసీ అందించే హార్డ్ వేర్ పైన సాఫ్ట్ వేర్ సహాయంతో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్(హెచ్‌పిసి) అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో విజయ్ పాండురంగ్ భట్కర్ అనే వ్యక్తి పరం సూపర్ కంప్యూటర్ అభివృద్ధికి పునాది వేశారు. ఆలా 1991 సంవత్సరంలోనే మొదటి పరం -8000 అనే సూపర్ కంప్యూటర్ను తయారుచేశారు. ఆ తర్వాత 1998వ సంవత్సరంలో పరం-10000 పేరుతో కొత్తగా అభివృద్ధి చేశారు. అప్పటినుండి పరం సిరీస్ నుండి వచ్చిన శివాయ్, పరం-బ్రహ్మ, ప్రతుష్ ,మిహిర్ అనే సూపర్ కంప్యూటర్లు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ పరం సిరీస్ సూపర్ కంప్యూటర్స్ ని పూనేలోని సీ-డీఏసీ రూపొందించింది. పరం సిరీస్ సూపర్ కంప్యూటర్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోచింనందుకు గాను భారత ప్రభుత్వం పరం సూపర్ కంప్యూటర్ పితామహకు విజయ్ పి భట్కర్ ని పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి సత్కరించింది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో!) -
స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు
బెంగళూరు: అంతరిక్షంలో జరిపే జీవసంబంధిత ప్రయోగాలకు ఉపయోగపడే ఒక సాధనాన్ని ఇస్రో, ఐఐఎస్సీ సైంటిస్టులు రూపొందించారు. ఈ మాడ్యులర్ సాధనంతో జీవప్రయోగాలకు అవసరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తారు. అక్టా ఆస్ట్రోనాటికాలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. స్పొరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాను చాలా రోజులపాటు పెంచి పోషించేందుకు కొత్త సాధనం ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధనలో వివరించారు. అంతరిక్షంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల్లో సదరు సూక్ష్మజీవులు ఎలా స్పందిస్తాయన్న విషయాలను అవగతం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటి స్పందనల ఆధారంగా మనిషికి ఎదురయ్యే సవాళ్లను పసిగట్టవచ్చు. గగన్‌యాన్ పేరిట త్వరలో స్వదేశీయ అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సాధనంలో ఎల్ఈడీ, ఫొటోడయోడ్ సెన్సార్లతో బ్యాక్టీరియా పెరుగుదలను గమనిస్తారు. కొత్త పరికరం వంద శాతం లీక్ప్రూఫ్ అని, ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది.జీవేతర ప్రయోగాలకు సైతం దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశోధకుల్లో ఒకరైన కుమార్ చెప్పారు. చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం! -
మార్చి నెలకు ఆరు కోట్ల కేసులు..!
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్‌లో ఆరు కోట్ల మందికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్సీ) వెల్లడించింది. అదే ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఈ సంఖ్యను 37.4 లక్షలకే పరిమితం చేయొచ్చని పేర్కొంది.మార్చి 23 నుంచి జూన్ 18 వరకూ దేశంలో కోవిడ్–19 విస్తృతి ఆధారంగా ఓ మెథమెటికల్ మోడల్‌ను ఐఐఎస్సీ అభివృద్ధి చేసింది. దీని ఆధారంగా వచ్చే మార్చి వరకూ దేశంలో కోవిడ్ ఉధృతి తారస్థాయికి చేరుకోదు(అంటే ఆరు కోట్ల కేసులు నమోదు కావొచ్చు). అదే తక్కువ కేసులు నమోదైతే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోనే కోవిడ్ తారస్థాయికి చేరుకుంటుంది. (అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్ కిట్) వారంలో రెండ్రోజులు లాక్డౌన్ దేశంలో వారంలో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ను పాటించడం, మిగతా రోజుల్లో మనిషికి మనిషి మధ్య దూరం ఉండేలా చూసుకోవడం వల్ల కొత్త కేసుల నమోదు తీవ్రతను గణనీయంగా తగ్గించొచ్చని ఐఐఎస్సీ పేర్కొంది. దేశంలో కోవిడ్ రికవరి రేటు పెరగడం వెనుక మెడికల్ కేర్, క్వారంటైన్ పాత్ర ప్రముఖంగా ఉందని వెల్లడించింది.(‘లేడీ సింగాన్ని కాదు.. ఐపీఎస్‌గా వస్తాను’) -
రూ.10వేలకే ఆక్సిజన్ యంత్రం!
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్ అరుణ్‌రావు, కె.భాస్కర్‌తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు. మనం పీల్చే గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 78 శాతం నైట్రోజన్ ఉంటే 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మిగిలిన ఒక శాతంలో కొన్ని ఇతర వాయువులు ఉంటాయి. ఈ గాలి ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యంత్రంలోకి ప్రవేశించినప్పుడు అవి జియోలైట్ అనే పదార్థం గుండా ప్రయాణిస్తాయి. చౌకగా లభించే ఈ జియోలైట్ గాల్లోని నైట్రోజన్‌ను పీల్చుకునే లక్షణం కలది. అంటే.. యంత్రం నుంచి బయటకు వచ్చే గాలిలో ఆక్సిజన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యంత్రాన్ని తయారు చేసిన తరువాత మార్కెట్లో లభించే వాటర్ ఫిల్టర్లను ఉపయోగించి దాన్ని జియోలైట్‌తో నింపారు. ప్రస్తుతం ఈ యంత్రం ద్వారా 70 శాతం స్వచ్ఛతతో కూడిన ఆక్సిజన్ వెలువడుతుండగా.. దీన్ని 90 శాతానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రం నిర్వహణకు తాము అర్డినో కంప్యూటర్ బోర్డులను వాడామని ప్రొఫెసర్ రామమూర్తి తెలిపారు. -
కృష్ణమ్మకు కష్టం.. గోదారమ్మకూ నష్టం
సాక్షి, అమరావతి : పశ్చిమ కనుమల్లో అడ్డగోలుగా అడవుల నరికివేత గోదావరి, కృష్ణా నదుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందా.. నైరుతి రుతు పవనాల గమనాన్ని మార్చేస్తుందా.. ఈ పరిస్థితి ద్వీపకల్ప భారతావనిని దుర్భిక్షంలోకి నెడుతుందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) తాజా పరిశోధనలు. పశ్చిమ కనుమల్లోని అడవులను ఇష్టారాజ్యంగా నరికివేయడం వల్లే గతేడాది కేరళ, ఈ ఏడాది కర్ణాటకలో జల విలయాలు సంభవించాయనే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల గ్రీన్హౌస్ వాయువుల ప్రభావం పెరగటం ప్రమాదకరంగా పరిణమించిందనే వాస్తవాన్ని చాటుతున్నాయి. పశ్చిమ కనుమల్లో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1.15 డిగ్రీలకు పెరుగుతున్నాయని.. దీనివల్లే ఒకట్రెండు నెలల్లో కురవాల్సిన వర్షం.. మూడు నాలుగు రోజుల్లోనే కుండపోతలా కురుస్తోందని.. ఈ పరిస్థితి వరదలకు దారి తీస్తోందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాలు బలహీనపడే అవకాశం ఉందని.. ఇది ద్వీపకల్ప భారతదేశాన్ని కరువు కోరల్లోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో పశ్చిమ కోస్తా తీరానికి 1,621 కిలోమీటర్ల పొడవున గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పశి్చమ కనుమల్లో పచ్చటి అడవులు విస్తరించి ఉన్నాయి. నైరుతి రుతు పవనాలు పశ్చిమ కనుమల మీదుగానే కేరళలో ప్రవేశించి.. దేశమంతటా విస్తరిస్తాయి. వర్షాలు కురిపిస్తాయి. ద్వీపకల్ప భారతదేశంలో ప్రధానమైన గోదావరి, కృష్ణ, పెరియర్, పంబా తదితర జీవ నదులకు పుట్టినిల్లు పశ్చిమ కనుమలే. అక్కడ సమృద్ధిగా వర్షాలు కురిస్తే గోదావరి, కృష్ణ, పెరియర్ వంటి నదులు ఉరకలెత్తి ద్వీపకల్పాన్ని సస్యశ్యామలం చేస్తాయి. ప్రపంచం విడుదల చేసే గ్రీన్హౌస్ వాయువుల్లో ఏటా 37.5 మిలియన్ టన్నుల బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డైయాక్సైడ్)ను పశ్చిమ కనుమల్లో అడువులు పీల్చుకుని.. అంతే స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేసి పర్యావరణ సమతౌల్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇది 100 బిలియన్ డాలర్ల (రూ.2,142 కోట్లు)కు సమానం. వరదలు.. లేకుంటే ఎడారులు పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం తగ్గుదల వల్ల ఒకట్రెండు నెలల్లో కురవాల్సిన వర్షం.. రెండు మూడు రోజుల్లోనే కుండపోతగా కురుస్తోందని ఐఐఎస్సీ, సీడబ్ల్యూసీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కుండపోతలా కురిసిన వర్షపు నీటిని అడ్డగించేందుకు అడవులు లేవు. దీనివల్ల పశ్చిమ కనుమల్లో వాగులు, వంకలు ఉప్పొంగి.. నదులు వరదెత్తేలా చేస్తున్నాయి. ఈ వరదల దెబ్బకు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. గతేడాది కేరళను వరదలు అతలాకుతలం చేయడానికి పశ్చిమ కనుమల్లో అడవుల అడ్డగోలు నరికివేతే కారణమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది కర్ణాటకను, కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహించడానికి కూడా అదే కారణమని ఐఐఎస్సీ వెల్లడించింది. పశ్చిమ కనుమల్లో ఒక్కసారిగా కుండపోత కురిసి.. ఆ తర్వాత వర్ష విరామం (డ్రై స్పెల్) వస్తే వరదతో ఉప్పొంగిన నదులు.. నీటి చుక్క లేక ఎడారులను తలపిస్తాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గోదావరి, కృష్ణా నదులే ఆధారం. పశ్చిమ కనుమల్లో అటవీ క్షయం గోదావరి, కృష్ణా నదుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని, ఇది ద్వీపకల్ప భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఐఎస్సీ కేంద్రానికి నివేదిక ఇచి్చంది. ద్వీపకల్పానికి గొడ్డలిపెట్టు.. ప్రపంచానికి, ద్వీపకల్ప భారతదేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పశ్చిమ కనుమల్లో అడవులను వ్యవసాయం, రహదారులు, ఖనిజ నిక్షేపాల వెలికితీత పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. దీనివల్ల గత రెండు దశాబ్దాల్లో పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం ఐదు శాతం తగ్గిపోయిందని ఐఎల్పీసీ సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ డైరెక్టర్ టీవీ రామచంద్ర నేతృత్వంలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. 1985 అటవీ లెక్కల ప్రకారం పశ్చిమ కనుమల్లో 16.21 శాతం హరితారణ్యాలు ఉంటే 2019 నాటికి ఆ అడవుల విస్తీర్ణం 11.3 శాతానికి తగ్గిపోయింది. అంటే ఏడాది పొడవునా పచ్చగా ఉండే అటవీ విస్తీర్ణం 4.91 శాతం తగ్గిపోయిందని ఐఐఎస్సీ వెల్లడించింది. దీనివల్ల గ్రీన్హౌస్ వాయువులను గ్రహించే సామర్థ్యం పశ్చిమ కనుమలు 11 శాతం కోల్పోయాయి. ఇది భూతాపం పెరగడానికి దారి తీస్తోంది. పశ్చిమ తీరం వెంబడి సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.5 నుంచి 1.15 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ కనుమల్లోనూ అదే రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాల ప్రవేశంలో జాప్యం చోటుచేసుకుంటోందని ఐఐఎస్సీ పరిశోధనలో మరోమారు వెల్లడైంది. నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించినా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏకరీతిగా వర్షాలు కురవడం లేదు. ఇది ద్వీపకల్ప భారతదేశంలో ఖరీఫ్ పంటలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. తీవ్ర దుర్భిక్షానికి దారి తీస్తోంది. ►పశ్చిమ కనుమల పొడవు 1,621కి.మీ ►అడవుల విస్తీర్ణం 1.40 లక్షల చ.కి.మీ. ►దీని పరిధిలో గల రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ►ఇక్కడి అడవులు పీల్చుకునే కార్బన్ డైయాక్సైడ్ 37.50 మిలియన్ టన్నులు ►ఇవి విడుదల చేసే ఆక్సిజన్ విలువకు సమానమైన మొత్తం రూ.2,142 కోట్లు ►1985 నాటికి పశ్చిమ కనుమల్లో గల హరితారణ్యాలు 16.21% ►2019 నాటికి వీటి విస్తీర్ణం 11.3% -
దేశంలోనే బెంగళూరు ఐఐఎస్సీ టాప్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)ను దేశంలో ఉత్తమ విద్యా సంస్థగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఆ సంస్థ 2019 సంవత్సరానికి గానూ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లను ప్రకటించింది. అందులో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఇండోర్ ఐఐటీ నిలిచింది. బోధన, ప్రమాణాలు, పరిశోధన, అంతర్జాతీయ స్థాయి తదితర 8 అంశాల్లో సర్వే చేసి ఆ సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,258 సంస్థలకు ర్యాంకులను కేటాయించింది. అందులో మొదటి ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు లభించగా, రెండో ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి లభించింది. అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరు ఐఐఎస్సీకి 251–300 ర్యాంకు లభించింది. 351–400 ర్యాంకు ఇండోర్ ఐఐటీకి లభించగా, 401–500 ర్యాంకు బాంబే, రూర్కీ ఐఐటీలకు లభించాయి. రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్‌కు 601–800 ర్యాంకు లభించింది. ఉస్మానియా యూనివర్సిటీకి 801–1000 ర్యాంకు లభించింది. వీటితోపాటు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా 49 విద్యా సంస్థలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకులను ప్రకటించింది. వరల్డ్ ర్యాంకులు ఇవీ.. - 251–300 ర్యాంకులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - 351–400 ర్యాంకులో ఇండోర్ ఐఐటీ - 401–500 ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ - 501–600 ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, సావిత్రిబాయి పూలే పూణె యూనివర్సిటీ - 601–800 ఐఐటీ హైదరాబాద్, అమృత విశ్వ విద్యా పీఠం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐఎస్సీ పూణె, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ గౌహతి, ఐఐటీ మద్రాసు, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఎన్ఐటీ రూర్కెలా, పంజాబ్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ - 801–1000 ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, ఐఐటీ ధన్‌బాద్, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా, ఎన్ఐటీ తిరుచురాపల్లి, పాండిచ్చేరి యూనివర్సిటీ. -
ఐఐఎస్సీకి 29వ ర్యాంకు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వారు ఏటా ఆసియాలోని విశ్వవిద్యాలయాలకు ఇచ్చే ర్యాంకింగ్స్‌లో ఈసారి భారత విశ్వవిద్యాలయాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) గతేడాది సాధించిన 29వ ర్యాంకును ఈ ఏడాది కూడా నిలుపుకుంది. టాప్–100లో చూస్తే ఐఐటీ ఇండోర్ 50వ ర్యాంకు, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 54వ ర్యాంకు, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 62వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 76వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 82వ ర్యాంకు, ఐఐటీ ఢిల్లీ 91వ ర్యాంకు పొందాయి. భారత యూనివర్సిటీల్లో అత్యుత్తమ ర్యాంకు ఐఐఎస్సీదే. ఇక మొత్తంగా చూస్తే చైనాకు చెందిన సింఘువా యూనివర్సిటీ తొలిస్థానంలో నిలిచింది. -
అత్యుత్తమ వర్సిటీగా ఐఐఎస్సీ
జాతీయం దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ప్రారంభం దేశంలోనే పొడవైన సొరంగ మార్గ రహదారి ని ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 2న ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని చెనాన్–నష్రి ప్రధాన రహదారి లో భాగంగా 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గ రహదారిని నిర్మించారు. దీని కోసం ప్రభుత్వం రూ.3720 కోట్లను వెచ్చించింది. దీని నిర్మాణంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గడంతోపాటు ఏటా రూ.99 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అంచనా. బీఎస్–3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిషేధం భారత్ స్టేజ్–4 (బీఎస్–4) కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాల అమ్మకాలను, రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ మార్చి 29న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బీఎస్–3 ఇంజన్లు కలిగిన వాహనాలు బీఎస్–4 వాహనాలతో పోల్చితే 80 శాతం అధికంగా కాలుష్య కారకాలను గాలిలోకి విడుదల చేస్తాయి. భారత్, మలేసియాల మధ్య 7 ఒప్పందాలు మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ భారత పర్యటనలో భాగంగా ఏప్రిల్ 1న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మలేసియాను సందర్శించే భారత పర్యాటకులను ప్రోత్సహించేలా వీసా రుసుము రద్దు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో అనుమతి, రెండు దేశాల్లోని కోర్సులకు పరస్పరం గుర్తింపు వంటి అంశాలు ఉన్నాయి. అత్యుత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్సీ దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల ర్యాంకులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఏప్రిల్ 3న విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఓవరాల్ కేటగిరీలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రథమ స్థానంలో నిలిచింది. తొలి పది స్థానాల్లో ఏడు ఐఐటీలకు చోటు దక్కింది. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్, ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ ప్రథమ స్థానంలో నిలిచాయి. యూనివర్సిటీ విభాగంలో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలవగా, హెచ్‌సీయూకి 7వ స్థానం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 23వ స్థానం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 68వ స్థానం, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి 69వ స్థానం దక్కాయి. హైవేలపై మద్యం నిషేధం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని సుప్రీంకోర్టు మార్చి 31న ఆదేశించింది. 2016, డిసెంబర్ 15కు ముందు లైసెన్సులు తీసుకున్న (తెలంగాణ, ఏపీతో సహా పలు రాష్ట్రాలు) వారికి మాత్రం కొంత గడువు ఇచ్చింది. రాష్ట్రీయం ఇండియన్ ఐడల్‌గా రేవంత్ తెలుగు గాయకుడు ఎల్వీ రేవంత్ ఇండియన్ ఐడల్ సీజన్–9 ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 2న ముంబైలో ముగిసిన షోలో విజేతగా నిలిచిన రేవంత్‌కు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ఐడల్ ట్రోఫీ అందించాడు. మరో తెలుగు యువకుడు రోహిత్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. గతంలో శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్–5 సీజన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఏపీలో హెచ్‌సీఎల్ ఏర్పాటుకు ఒప్పందం విజయవాడలో హెచ్‌సీఎల్.. బీపీవోను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌సీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయం ప్రపంచంలో 30 కోట్ల మందికి డిప్రెషన్డిప్రెషన్ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)వెల్లడించింది. 2005 నుంచి 2015 నాటికి ఈ కేసులు ఏకంగా 18 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో డిప్రెషన్‌కు గురవుతున్నవారిలో 50 శాతం మంది చికిత్స తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ ఏప్రిల్ 2న తెలిపారు. వాతావరణ ఒప్పందాలను రద్దు చేసిన ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా కాలంలో వాతావరణ మార్పులపై రూపొందించిన విధానాలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై మార్చి 28న సంతకం చేశారు. దీంతో ఇంధన వెలికితీత, బొగ్గు తవ్వకానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్న పాత విధానాలు రద్దయినట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరికా ఇంధన రంగంలో ప్రభుత్వ ప్రమేయాన్ని నిలువరించామన్నారు. విద్యుచ్ఛక్తి ఉద్గారాల నియమాలను సమీక్షించాలని, శిలాజ ఇంధనాల వెలికితీతకు ప్రతిబంధకాలుగా ఉన్న నిబంధనలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని అధికార యంత్రాంగాన్ని ట్రంప్ ఆదేశించారు. బ్రెగ్జిట్ ఉత్తర్వులపై బ్రిటన్ ప్రధాని సంతకం యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగేందుకు(బ్రెగ్జిట్) ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే మార్చి 29న సంతకం చేశారు. దీని ప్రకారం ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 దేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈయూలోని బ్రిటన్ రాయబారి సర్ టిమ్ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్ మండలి అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు అందించారు. ఈ రెండేళ్లలో ఈయూ సభ్య దేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్ తెగదెంపులు చేసుకుంటుంది. కాగా, ఈయా దేశాల పౌరులు బ్రిటన్‌లో నివసించేందుకు అన్ని హక్కులు ఉన్నాయని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. రిఫరెండం నిర్వహించాలని స్కాట్లాండ్ నిర్ణయం బ్రిటన్ నుంచి విడిపోయే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని స్కాట్లాండ్ చట్ట సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఎడిన్బర్గ్లో మార్చి 28న సమావేశమై.. రిఫరెండానికి అనుకూలంగా ఓటేశారు. ఆర్థికం జీఎస్టీకి లోక్‌సభ ఆమోదం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు అనుబంధ బిల్లులకు లోక్‌సభ మార్చి 29న ఆమోదం తెలిపింది. సెంట్రల్ జీఎస్టీ బిల్లు–2017, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ బిల్లు–2017, యూనియన్ టెరిటరీ జీఎస్టీ బిల్లు–2017, జీఎస్టీ పరిహార(రాష్ట్రాలకు) బిల్లు–2017లను లోక్‌సభ ఆమోదించింది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు కొత్తగా ఐటీఆర్ 1 ఫామ్ ఐటీ రిటర్న్స్‌ను సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఒకే ఒక్క పేజీతో కూడిన ఐటీఆర్ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 31న నోటిఫై చేసింది. ప్రస్తుతం ఉన్న ఏడు పేజీల ఐటీఆర్ పత్రం స్థానంలో ఆదాయపన్ను శాఖ కొత్తగా ఫామ్–1 సహజ్‌ను తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జీతం పెంపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ల జీతాలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గవర్నర్, డిప్యూటీ గవర్నర్ల మూల వేతనాలు ఏకంగా 100 శాతం మేర పెరిగాయి. తాజా పెంపుతో ఉర్జిత్ పటేల్.. నెలకు రూ.2.50 లక్షల జీతం అందుకోనుండగా.. డిప్యూటీ గవర్నర్లు రూ.2.25 లక్షలు పొందనున్నారు. అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఎస్బీఐ ప్రపంచంలోని టాప్–50 బ్యాంకుల్లో ఒకటిగా అవతరించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ఎక్స్.. రాకెట్ పునర్వినియోగ పరీక్ష విజయవంతం అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సేవల ప్రైవేట్ కంపెనీ స్పేస్ఎక్స్.. ఒకసారి ఉపయోగించిన రాకెట్‌ను మరోసారి విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి మార్చి 30న ఫాల్కాన్–9 అనే పునర్వినియోగ రాకెట్ ద్వారా సమాచార ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. 50 వేల ప్రదక్షిణలు చేసిన వ్యోమనౌక నాసాకు చెందిన మార్స్ రికాన్‌సెన్స్ ఆర్బిటర్ (ఎంఆర్వో) అంగారకుడి చుట్టూ 50 వేలసార్లు తిరిగింది. దీన్ని 2005లో ప్రయోగించారు. ఇది ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని శాస్త్రవేత్తలు మార్చి 29న తెలిపారు. వార్తల్లో వ్యక్తులు దక్షిణాఫ్రికా ఉద్యమ నేత అహ్మద్ కత్రడా కన్నుమూతయ భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేకోద్యమ నేత అహ్మద్ కత్రడా (87) జోహన్నెస్‌బర్గ్‌లో మార్చి 27న మరణించారు. ఆయన నెల్సన్ మండేలా అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరొందారు. కత్రడా 2005లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. ఎస్ఐగా నియమితులైన తొలి హిజ్రా తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. ఆమెకు ధర్మపురి (తమిళనాడు)లో పోస్టింగ్ ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రీతి పటేల్‌కు ప్రవాసీ సమ్మాన్ పురస్కారం భారత సంతతికి చెందిన బ్రిటన్ సీనియర్ మంత్రి ప్రీతి పటేల్ మార్చి 27న ప్రవాసీ భారతీయ సమ్మాన్–2017 పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. క్రీడలు ఇండియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న పీవీ సింధు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను పీవీ సింధు గెలుచుకుంది. న్యూఢిల్లీలో ఏప్రిల్ 2న జరిగిన ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)ను సింధు ఓడించింది. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ భారత్ సొంతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) టెస్ట్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. మార్చి 28న ముగిసిన చివరి టెస్ట్ మ్యాచ్‌ను భారత్ గెలుచుకుంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2–1 తేడాతో భారత్ నెగ్గింది. రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మయామి మాస్టర్ టైటిల్ గెలుచుకున్న ఫెడరర్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫ్లోరిడాలో ఏప్రిల్ 3న జరిగిన ఫైనల్లో రాఫెల్ నాదల్(స్పెయిన్)ను ఓడించాడు. -
దేశంలో ఐఐఎస్సీయే టాప్
లండన్: భారత్ విశ్వవిద్యాలయాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మంగళవారం విడుదలైన క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2016-17 జాబితాలో ఐఐఎస్సీ ర్యాంకు 152కు తగ్గింది. గత ఏడాది జాబితాలో దీనికి 147వ స్థానం లభించింది. తాజా జాబితాలోని తొలి 400 ర్యాంకుల్లో స్థానం దక్కిన ఇతర భారత ఉన్నత విద్యా సంస్థల్లో ఢిల్లీ ఐఐటీ(185), బాంబే ఐఐటీ(219), మద్రాస్ ఐఐటీ(249), కాన్పూర్ ఐఐటీ (302), ఖరగ్‌పూర్ ఐఐటీ (313), రూర్కీ ఐఐటీ(399) ఉన్నాయి. ఈ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ (2), హార్వర్డ్ యూనివర్సిటీ(3), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్(4) తదితరాలున్నాయి. -
కెరీర్ కౌన్సెలింగ్
ఐఐఎస్సీ (బెంగళూరు) నుంచి పీహెచ్డీ చే యడం ఎలా? -ధరణి, సికింద్రాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు.. నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్డీ కోర్సులకు సీఎస్ఐఆర్-నెట్ జేఆర్ఎఫ్/డీబీటీ జేఆర్ఎఫ్/ ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్/ గేట్లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు వివరాలకు: www.iisc.ernet.in -
యూఎస్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఐఐఎస్సీ
వాషింగ్టన్ : బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కు అరుదైన అవకాశం దక్కించుకుంది. యూఎస్ మిలటరీకి చెందిన సోలార్ పవర్ మైక్రో గ్రిడ్ అభివృద్ధి పరిశోధన కాంట్రాక్ట్‌ను ఈ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ కింద రూ. 52,900 యూఎస్ డాలర్లను యూఎస్ పసిఫిక్ ఎయిర్ పోర్స్ నిధులు కేటాయించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దక్కిన అరుదైన అవకాశాల్లో యూఎస్ మిలటరీ కాంట్రాక్ట్ ఒకటి. వాషింగ్టన్లో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి అస్టోన్ కార్టర్ గురువారం పెంటగాన్‌లో భేటీ అయ్యారు. భారత్ - అమెరికా దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్చల్లో భాగంగా పారికార్ ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. -
మన 'విద్య'కు పురస్కారం
మన దేశంలో అంతర్జాతీయ శ్రేణి విద్యా సంస్థ ఒక్కటైనా లేదుగదా అనే దిగులు తీరింది. ప్రపంచవ్యాప్త ఉన్నత విద్యా సంస్థల జాబితాల్లో మన దేశానికి సంబంధించిన రెండు సంస్థలు తొలిసారి చోటు సంపాదించుకున్నాయి. ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) ఈసారి విడుదల చేసిన వంద ఉన్నత శ్రేణి విద్యా సంస్థల జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ఒకటిగా నిలిచింది. మరో ర్యాంకింగ్ సంస్థ క్యూఎస్ వెలువరించిన 200 ఉన్నత స్థాయి విద్యా సంస్థల జాబితాలో ఢిల్లీ ఐఐటీ చేరింది. ఈ సంస్థలు ఏటా ర్యాంకింగ్‌లు విడుదల చేయడం, అందులో మన సంస్థల పేర్లు లేకపోవడం...ఈ పరిస్థితిపై అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు రావడం రివాజే. మన ఉన్నత విద్యా సంస్థలు ఆ స్థాయికి ఎప్పటికి చేరుకుంటాయన్న ఆవేదన వ్యక్తం చేసేవారు కొందరైతే...ఆ ర్యాంకింగ్‌లకు అనుసరించే విధానాన్ని, వర్థమాన దేశాలపట్ల వారికుండే చిన్నచూపునూ దుయ్యబట్టేవారు మరికొందరు. ఇక్కడ చదివి వెళ్లినవారు దిగ్గజాల దగ్గర పెద్ద పెద్ద సంస్థల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారని అలా దుయ్యబట్టేవారు గుర్తుచేసేవారు. మన ఉన్నత విద్యా సంస్థలు ర్యాంకులందించే సంస్థలకు తగిన సమాచారాన్ని ఇవ్వకపోవడంవల్లనే ఇలా జరుగుతోందని మరికొందరనేవారు. అయితే మన ఉన్నత విద్యా వ్యవస్థ తీరుతెన్నుల్ని...మన ప్రభుత్వాలు మొత్తంగా విద్యారంగంపై అనుసరిస్తున్న విధానాలనూ గమనిస్తే తప్ప ఈ వాదాల్లోని నిజానిజాలు తేలవు. మనకు ఇప్పుడొచ్చిన ర్యాంకులు కూడా అంత ఘనమైనవేమీ కాదు. వంద ఉన్నతశ్రేణి విద్యాసంస్థల జాబితాలో ఐఐఎస్సీ 99వ స్థానాన్ని పొందగా, 200 ఉన్నత శ్రేణి విద్యా సంస్థల్లో ఢిల్లీ ఐఐటీ 179వ స్థానాన్ని సంపాదించింది. ఐఐఎస్సీ నిరుడు పొందిన ర్యాంకు 327 అని గుర్తుంచుకుంటే ఈ ఏడాది అది ఎన్నివిధాల మెరుగైందో అర్థమవుతుంది. మన దేశం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా పొరుగునున్న చైనాను ప్రస్తావించుకోక తప్పదు. అంతర్జాతీయ విద్యా ర్యాంకింగుల్లో మనకంటే ఎప్పుడూ చైనాయే ముందుంటుంది. మనకంటే రెండేళ్లు ఆలస్యంగా వలస పాలననుంచి విముక్తి పొందిన చైనా ఇతర రంగాలతోపాటు విద్యా రంగంలోనూ దూసుకెళ్తున్నది. ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలోకి అడుగుపెట్టే విద్యార్థుల సంఖ్య రీత్యా చూస్తే చైనాది ప్రపంచంలో తొలి స్థానం. మనది మూడో స్థానం. రెండు దేశాల్లోనూ ఉన్నత శ్రేణి విద్యా సంస్థల సంఖ్య తక్కువే. ఈ సంస్థలకు ప్రభుత్వాలపరంగా అందే నిధులతో పోల్చినా...అక్కడ లభించే నాణ్యతగల విద్యతో పోల్చినా మిగిలిన సంస్థలు వాటి దరిదాపుల్లోకి కూడా రావు. కనుకనే ఉన్నత విద్యా కోసం అటు చైనా నుంచి అయినా, ఇటు భారత్‌నుంచి అయినా ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. కేవలం డబ్బుండబట్టే విద్యార్థులు ఇలా వెళ్తున్నారనుకోవడానికి లేదు. ఇటీవలే విడుదలైన ఒక నివేదిక ప్రకారం 2014-15లో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య లక్షా 32 వేల 888. ఇది అంతక్రితం సంవత్సరంకంటే 29.4 శాతం అధికం. వీరివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 360 కోట్ల డాలర్లు(సుమారు రూ. 23,760 కోట్లు) ఆదాయంగా లభించింది. అమెరికాలో ఉన్నత విద్యపై చూపుతున్న శ్రద్ధలో కొంచెమైనా మన ప్రభుత్వాలు చూపితే ఇన్ని వేల కోట్ల రూపాయలు అమెరికాకు తరలిపోయే పరిస్థితి ఉండదు. విద్యలో అమెరికాతో పోటీ పడటం మాట అటుంచి కనీసం చైనా కనబరుస్తున్న శ్రద్ధనైనా మన పాలకులు ప్రదర్శించలేకపోతున్నారు. తమ ఉన్నత విద్యారంగం క్షీణ దశకు చేరువైన వైనాన్ని గమనించి 1995లో చైనా 'ప్రాజెక్టు 211' పేరిట ఒక పథకాన్ని ప్రకటించింది. దేశంలో వంద ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలన్నది ఆ ప్రాజెక్టు ధ్యేయం. ప్రభుత్వంనుంచి వెల్లువలా వచ్చిపడిన నిధులతో ఉన్నత విద్యారంగంలో దిగ్గజాలనదగ్గవారిని ఆ యూనివర్సిటీలు అధ్యాపకులుగా నియమించుకున్నాయి. కనుకనే పరిశోధనలు జోరందుకున్నాయి. 2013లో ఆ యూనివర్సిటీలు 8,25,136 పేటెంట్లకు దరఖాస్తు చేయడం వీటి ఫలితమే. ఆ ఏడాది మన దేశంలో 43,031 దరఖాస్తులు దాఖలయ్యాయంటే మనం ఎక్కడున్నామో అర్ధం చేసుకోవచ్చు. సృజన, పరిశోధనలపై దృష్టి నిలపాలని యూపీఏ సర్కారు హయాంలో నిర్ణయించి అందుకోసం 2012లో ఒక బిల్లును కూడా రూపొందించారు. ఆ బిల్లు కాస్తా మూలనబడింది. ఉన్నతశ్రేణి విద్యా సంస్థలు నెలకొల్పేందుకు ఇతర మంత్రిత్వ శాఖలనూ అనుమతించేలా బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు మొన్న ఏప్రిల్‌లో ఎన్డీయే సర్కారు ప్రకటించింది. పార్లమెంటు సమావేశాలు సరిగా సాగే పరిస్థితులుంటే ఇలాంటి బిల్లులపై కూలంకషంగా చర్చలు జరుగుతాయి. కానీ ఆ అవకాశమేదీ? దేశంలో సాగుతున్న పరిణామాలను గమనిస్తే అసలు విద్యారంగాన్ని మన పాలకులు ఏం చేయదల్చుకున్నారన్న సందేహం తలెత్తుతుంది. ఉన్నత విద్యారంగాన్ని చైనా అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందిస్తే మన దేశం అందుకు భిన్నమైన మార్గంలో పోతున్నది. ఈమధ్య నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ తో సంబంధం లేని పరిశోధక విద్యార్థులకు(నాన్ నెట్) ఫెలోషిప్ ఇవ్వదల్చుకోలేదని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దానిపై ఆందోళనలు చెలరేగాక ఆ నిర్ణయం తాత్కాలికంగా ఆగింది. నిధుల కొరత పేరిట ఉన్నత విద్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు పెట్టి డబ్బున్నవారికే విద్య అంటున్నాయి. పేరుకు కొత్తగా ఐఐటీలు, ఐఐఎంలూ ప్రారంభిస్తున్నా వాటికి కావలసిన సదుపాయాల కల్పనలోనూ, నిధుల కేటాయింపులోనూ మొహం చాటేస్తున్నాయి. ఫీజుల ఖర్చును తడిసిమోపెడు చేస్తున్నాయి. ఇలాంటి దశలో ఉన్నత విద్యారంగం బాగుపడేదెప్పుడు? మన సంస్థలు ప్రపంచ ఖ్యాతి సాధించేదెన్నడు? -
గేట్-2016
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్ సహాయంతో ప్రతిష్టాత్మక ఐఐఎస్సీ, ఐఐటీ, నిట్లు వంటి సంస్థల్లో ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా మెరుగైన గేట్ స్కోర్‌తో ఓఎన్జీసీ, ఐవోసీఎల్, ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ చేజిక్కించుకోవచ్చు. ఉన్నత విద్య, ఉద్యోగం... రెండిటికీ బాటలు వేసే గేట్-2016 షెడ్యూల్ విడుదలైంది. దీనిపై ప్రత్యేక కథనం... అర్హత బీటెక్/ బీఆర్క్/ నాలుగేళ్ల బీఎస్/ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ (పోస్ట్ బీఎస్సీ)/ ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ. కోర్సుల చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష విధానం గేట్-2016ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నిర్వహిస్తుంది. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 2016, జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు ప్రతి శనివారం, ఆదివారాల్లో పరీక్ష జరుగుతుంది. మొత్తం 23 పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 65 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి పది ప్రశ్నలు ఇస్తారు. మిగిలినవి అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు స్పెషలైజేషన్ నుంచి ఉంటాయి. మార్పులు పరీక్ష సమయంలో ఆన్లైన్ వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. సాధారణ కాలిక్యులేటర్‌ను అనుమతించరు. ప్రాక్టీస్ కోసం ఈ కాలిక్యులేటర్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. పరీక్ష తర్వాత ‘కీ’లను అందుబాటులో ఉంచుతారు. సమాధానాలపై ఫిర్యాదు చేయొచ్చు. దీనికి నామమాత్రపు ఫీజు చెల్లించాలి. గేట్-2016లో కొత్తగా పెట్రోలియం ఇంజనీరింగ్ (పీఈ) పేపర్‌ను ప్రవేశపెట్టారు. ముందంజలో 5 బ్రాంచ్‌లు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గేట్‌కు ఏటా పది లక్షలకు పైగా విద్యార్థులు పోటీపడుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి రెండు లక్షల మంది చొప్పున హాజరవుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ల నుంచి దాదాపు 3.5 లక్షల మంది హాజరవుతున్నారు. పరీక్ష రాసేవారిలో తెలుగు విద్యార్థులదే అగ్రస్థానం. ముఖ్యాంశాలు దరఖాస్తు: గేట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో. దరఖాస్తు తేదీలు: 2015, సెప్టెంబరు 1- అక్టోబరు 1. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: డిసెంబరు 17, 2015. పరీక్ష తేదీలు: 2016, జనవరి 30 నుంచి 2016, ఫిబ్రవరి 7 వరకు ప్రతి శని, ఆదివారాలు. పరీక్ష కేంద్రాలు ఏపీ: కర్నూలు, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి. పరీక్ష కేంద్రాలు టీఎస్: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్. ఫలితాల వెల్లడి: మార్చి 19, 2016. వెబ్సైట్: gate.iisc.ernet.in -
ఉన్నత కొలువులకు ‘గేట్’వే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థిరాయాలనుకునే పరీక్ష! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీలు, నిట్లు తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగానిలిచే ఈ పరీక్ష.. గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ఎంట్రీ లెవల్ నియామకాలకు గేట్వేగా నిలుస్తోంది. 2015 గేట్ స్కోర్‌తో నియామకాల కోసం నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి పరిశ్రమలు ఆశిస్తున్న అన్వయ సామర్థ్యం, సమస్యా సాధన, విశ్లేషించే గుణం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలను పరీక్షించడంలో గేట్‌కు మించిన పరీక్ష మరొకటి లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు.. సొంతంగా నిర్వహించే నియామక ప్రక్రియలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఈ అంశాలను పరీక్షించడం సాధ్యమయ్యేది కాదు. గేట్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రతిభ ఉన్న విద్యార్థులు మాత్రమే గేట్లో మంచి స్కోర్ సాధించగలుగుతున్నారు. గేట్‌ను దేశంలోని అత్యున్నత సాంకేతిక సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. వేర్వేరుగా ప్రకటనలు: ఉద్యోగ నియామకాలకు సంబంధించి పీఎస్‌యూలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయి. వాటికనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియలో గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఇస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు తర్వాతి దశలో బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు (కంపెనీని బట్టి ఇవి మారుతుంటాయి) నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు. హెచ్‌పీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్సీఎల్, గెయిల్ వంటి సంస్థలు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ పేరుతో బృంద చర్చలు సైతం నిర్వహించి అందులోనూ రాణించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేస్తాయి. ఈ క్రమంలో దాదాపు 75 శాతం వెయిటేజీని గేట్ స్కోరుకు ఇచ్చి మిగతా 25 శాతం వెయిటేజీని ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్లకు కేటాయిస్తున్నాయి. కాబట్టి గేట్లో మంచి స్కోర్ సాధించడం కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగా గేట్: ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా గేట్-2015కు దరఖాస్తు చేసుకోవాలి. గేట్ అడ్మిట్ కార్డ్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్/ఇంటర్వ్యూకు ఎంపికైతే గేట్ దరఖాస్తు ప్రింటవుట్, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ తీసుకువెళ్లాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు గేట్ దరఖాస్తులో ఏ వివరాలైతే (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) నింపారో అవే వివరాలను సంబంధిత కంపెనీల దరఖాస్తులోనూ నింపాలి. అయా కంపెనీల్లో ఏ విభాగాల్లో అయితే నియామక ప్రకటనలు వెలువడ్డాయో అదే ఇంజనీరింగ్ బ్రాంచ్ పేపర్‌తో గేట్ రాయాలి. ఎంపిక ప్రక్రియ: తొలుత పీఎస్‌యూలు గేట్ నిర్వహణ తేదీ కంటే ముందుగానే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. అభ్యర్థులు వీటికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. గేట్ ఫలితాలు వెలువడ్డాక ర్యాంకుల ఆధారంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయి. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో తదుపరి దశలకు హాజరయ్యేందుకు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి మలి దశలకు అనుమతి లభిస్తుంది. ఇంటర్వ్యూ కాల్: గేట్ స్కోర్ 500లోపు (ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు) ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు 700 నుంచి 800 ర్యాంకులోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యరులు 1500 నుంచి మూడు వేల మధ్య ర్యాంకు సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు. ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలు: ఎంపిక ప్రక్రియ తుది దశ ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అవి.. వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్‌కు సంబంధించి సైద్ధాంతిక అవగాహనతో పాటు బీటెక్ స్థాయిలో అభ్యర్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్స్ వంటి వాటిపైనా ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ విజయం సాధించిన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వంటి హోదాలతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయి. సర్వీస్ అగ్రిమెంట్: కొన్ని పీఎస్‌యూలు ఎంపికైన అభ్యర్థుల నుంచి నిర్ణీత కాలానికి సర్వీస్ అగ్రిమెంట్ కూడా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇది ఒక ఏడాది వ్యవధిలో ఉంటోంది. అంటే ఎంపికైన వారు తప్పనిసరిగా ఏడాది పాటు సంస్థలో విధులు నిర్వర్తించాల్సిందే. శిక్షణ: ఎంపికైన అభ్యర్థులు మొదట కొంత కాలంపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి మేనేజ్మెంట్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వంటి హోదాలు కేటాయిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ సమయంలో వీరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, సౌకర్యాలు, భత్యాలు లభిస్తాయి. వేతనాల విషయానికొస్తే.. ప్రారంభ వేతనం ఏడాదికి సగటున ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది. భవిష్యత్తుపై స్పష్టతతో.. తగిన ప్రణాళిక గేట్ ర్యాంకు ఇప్పుడు ఐఐటీల్లో ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సాధనంగా మారిన నేపథ్యంలో అభ్యర్థులు భవిష్యత్తుపై స్పష్టతతో తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఉన్నత విద్య లేదా ఇతర ఉద్యోగాలు లక్ష్యంగా ఆలోచించే అభ్యర్థులు పీఎస్‌యూల్లో దరఖాస్తు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆయా సంస్థల నియామక నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా సర్వీస్ అగ్రిమెంట్, ఇతర సర్వీస్ నిబంధనలు అమలు చేస్తున్న సంస్థలకు దరఖాస్తు చేసుకునేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక.. పీఎస్‌యూల్లో ఉద్యోగమే లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ వంటి వాటిపై ఆందోళన చెందక్కర్లేదు. ఇవి సాధారణంగా బీటెక్ స్థాయిలో తమ బ్రాంచ్‌కు సంబంధించిన అంశాలపైనే ఉంటాయి. ఈ నేపథ్యంలో గేట్లో టాప్-500లోపు ర్యాంకు లక్ష్యంగా కృషి చేస్తే.. పీఎస్‌యూ ఆఫర్ గ్యారెంటీ. - ఎ. రవితేజ, గేట్-2013 ఆల్ ఇండియా 2వ ర్యాంకు (ఎలక్ట్రికల్) -
ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చే యడం ఎలా?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్డీ కోర్సుల్లో సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-జేఆర్ఎఫ్; జెస్ట్ (జాయింట్ ఎంట్రన్స స్క్రీనింగ్ టెస్ట్), ఎన్బీహెచ్ఎం (నేషనల్ బోర్డ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్) లేదా ఐఐఎస్సీ ఎంట్రన్స్ టెస్ట్ లేదా గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. వెబ్సైట్: www.iisc.ernet.in మెటలర్జీ ఇంజనీరింగ్ చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -షఫి, నిర్మల్. మెటలర్జీ ఇంజనీరింగ్ కోర్సుకు మంచి భవిష్యత్ ఉంది. లోహ ప్రమేయం తప్పనిసరైన ప్రతి వస్తువుకు సంబంధించి డిజైన్, మాన్యు ఫాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్లో మెటలర్జీ ఇంజనీర్లు పాల్పంచుకుంటారు. ప్రైవేటు రంగ సంస్థల్లో ఖనిజాలు, లోహాల అన్వేషణ, ఉత్పత్తి ప్రక్రియ, వాణిజ్య విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. టాటా స్టీల్, సెయిల్, నాల్కో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఎన్టీపీసీ వంటి సంస్థలు మెటలర్జికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకుంటున్నాయి. సేఫ్టీ, వెల్డింగ్, క్వాలిటీ ప్లానింగ్, ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇంజనీర్స్ వంటి ఉద్యోగాలతోపాటు రీసెర్చర్స్, కన్సల్టెంట్స్గా కూడా అవకాశాలు లభిస్తాయి. రీసెర్చ్ రంగంలో మంచి భవిష్యత్ ఉంది. ఇస్రో, బీడీఎల్ వంటి సంస్థలు రీసెర్చ్ చేసేవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. సిస్కో సర్టిఫికేషన్స్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి? -ప్రదీప్, హైదరాబాద్. నెట్ వర్కింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగాల్లో సిస్కో సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు.. తమ నెట్వర్కింగ్ కోసం సిస్కో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. అందువల్ల సిస్కో సర్టిఫికెట్ కలిగి ఉండడం కెరీర్ ఉన్నతితోపాటు జాబ్ మార్కెట్లో మీ అవకాశాలను మరింత విస్తృతం చేస్తుంది. ఇప్పటి వరకు చదివిన బీటెక్ కోర్సుతో నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. నెట్వర్క్, నిర్వహణ విషయంలో విస్తృత పరిజ్ఞానం సిస్కో సర్టిఫికెట్తో లభిస్తుంది. ఇందులో ప్రారంభంలో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ (సీసీఎన్ఏ), సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్ (సీసీఎన్‌పీ) కోర్సులు ఉంటాయి. తర్వాత సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్క్ ఇంజనీర్ (సీసీఐఈ), సిస్కో సర్టిఫైడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ (సీసీఎస్పీ) వంటి అడ్వాన్స్డ్ కోర్సులు ఉంటాయి. కోర్సు పూర్తై తర్వాత జాబ్ నేచర్‌ను బట్టి వివిధ రకాల బాధ్యతలను నిర్వహించాలి. ఇన్‌స్టాలింగ్ అండ్ అనాలిసింగ్ నెట్వర్క్స్, మానిటరింగ్ నెట్వర్క్, యాడింగ్ న్యూ సర్వర్స్, సిస్టమ్ ఆప్‌గ్రేడ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, రైటింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, నెట్వర్క్ ట్రైనర్స్ వంటి విధులను నిర్వర్తించాలి. మన దేశంలో.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (వెబ్సైట్: ఠీఠీఠీ.జీజీట్ఛఛిఠటజ్టీడ.జీ) నిట్ (వెబ్సైట్: www. niit.com), జెట్‌కింగ్ వంటి ఇన్స్టిట్యూట్లు సిస్కో సర్టిఫికేషన్‌లో శిక్షణను అందిస్తున్నాయి. ఫ్యాషన్ రంగంలో ఎటువంటి కోర్సులు ఉంటాయి. వివరాలు తెలపండి? -కిరణ్, నిజామాబాద్. ఫ్యాషన్ రంగంలో గార్మెంట్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ అండ్ జ్యూయెలరీ డిజైన్, మోడలింగ్, గార్మెంట్ డిజైనింగ్, లెదర్ డిజైనింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ డిజైనింగ్ వంటి పలు రకాల విభాగాలు ఉంటాయి. ఫ్యాషన్ డిజైన్ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రస్తుత జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. ఈ క్రమంలో కాస్ట్యూమ్ డిజైనర్లు, ఫ్యాషన్ కన్సల్టెంట్స్, టెక్నికల్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, ప్రొడక్షన్ ప్యాట్రన్ మేకర్, ఫ్యాబ్రిక్ బయ్యర్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, షోరూం సేల్స్ రిప్రజెంటేటివ్ తదితర ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎగుమతి సంస్థలు, టెక్స్టైల్ మిల్స్, లెదర్ కంపెనీలు, గార్మెంట్ స్టోర్ చైన్స్, ఫ్యాషన్ షో ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ హ్యాండ్లూమ్ సంస్థలు, మీడియా సంస్థలు కూడా ఫ్యాషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశంలో పలు కాలేజీలు ఫ్యాషన్ కోర్సులను అందిస్తున్నాయి. వాటిల్లో కొన్ని.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్- దేశ వ్యాప్తంగా 16 నిఫ్ట్ క్యాంపస్‌లు ఉన్నాయి, వెబ్సైట్: www.nift.ac.in). నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ-దీనికి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులలో క్యాంపస్‌లు ఉన్నాయి, వెబ్సైట్: www.nid.edu); సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే(http://sid.edu.in)పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్-న్యూఢిల్లీ (వెబ్సైట్: http://pearlacademy.com). -
ఇదీ పాయే..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దుర్భిక్ష ‘అనంత’ నుంచి చివరకు ఆర్మీ ఫైరింగ్ రేంజ్ కూడా చేజారిపోయింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్) క్షిపణి పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయలేమని రక్షణ శాఖ స్పష్టీకరించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి వర్తమానం పంపింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను డీ-నోటిఫై చేయడంలో అధికారులు జాప్యం చేస్తుండటం రైతులకు శాపంగా మారుతోంది. పంట రుణాలు, ఏపీఎంఐపీ(ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం) వంటి పథకాల కింద లబ్ధి పొందలేని దుస్థితిలో రైతులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో నెలకొల్పుతామని కేంద్రం ప్రకటించిన ఐఐఎస్సీ, నిట్ కేంద్రాలను ఏర్పాటు చేయలేమని తేల్చి చెప్పిన విషయం విదితమే. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో రూ.650 కోట్ల వ్యయంతో క్షిపణి తయారీ పరిశ్రమ ఏర్పాటుకు 2008లో బీడీఎల్ ముందుకొచ్చింది. ఆ పరిశ్రమలో తయారు చేసిన క్షిపణిలను పరీక్షించడం.. ఫైరింగ్‌లో సైనికులకు శిక్షణను ఇవ్వడం కోసం జిల్లాలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయడానికి రక్షణ శాఖ అంగీకారం తెలిపింది. ఆ మేరకు భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కనగానపల్లి, కంబదూరు మండలాల్లో రాళ్ల అనంతపురం, కర్తనపర్తి, డి.చెన్నేపల్లి, నూతిమడుగు, రామోజీనాయక్ తండా, మద్దెలచెర్వు, మద్దెలచెర్వు తండా, కోనేటిపాళ్యం, శివపురం గ్రామాల్లో 15,200 ఎకరాలను ఫైరింగ్ రేంజ్‌కు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు ఆ ప్రాంతం అనుకూలమంటూ సైనిక అధికారులు పంపిన నివేదికపై కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 2008లోనే జారీ చేసింది. ఈ నిర్ణయం వెలువడిన 15 రోజుల్లోగానే రక్షణ శాఖ సర్వే బృందం ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించి.. భూమిని సర్వే చేసింది. సరిహద్దులు నాటింది. రక్షణ శాఖ ఆదేశాల మేరకు.. తొలి విడతగా రాళ్ల అనంతపురంలో 2,464, కర్తనపర్తిలో 2,145, నూతిమడుగులో 1,438, మద్దెలచెర్వు తండాలో 2,311, కోనేటిపాళ్యంలో 2,337.. మొత్తం 10,695 ఎకరాలను సేకరించడానికి ప్రణాళిక రచించింది. రెండో విడతగా 4,564 ఎకరాలను సేకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 15,200 ఎకరాల భూసేకరణకు రూ.384 కోట్లు, ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుతో కనుమరుగయ్యే డి.చెన్నేపల్లి, మద్దెలచెర్వు తండా, రామోజీనాయక్ తండా ప్రజలకు పునరావాసం కల్పించడానికి రూ.ఐదు కోట్లు అవసరమంటూ జిల్లా అధికారులు సహాయ, పునరావాస ప్యాకేజీని కూడా కేంద్రానికి పంపారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే.. ఐదేళ్లుగా ఆ తొమ్మిది గ్రామాల్లోనూ పంట రుణాల పంపిణీ, సూక్ష్మ నీటి పారుదల పథకం, ఉపాధి హామీ పథకం, ఉద్యానవన పథకాల అమలును నిలిపివేశారు. కేంద్ర రక్షణ శాఖ ఎంతకూ భూసేకరణ చేయకపోవడం.. పరిహారం ఇవ్వక పోవడంతో రైతుల దీనావస్థలపై 2010 ఆగస్టు 6న ‘వీళ్లేం పాకిస్థానీలా?’ శీర్షికన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అదే రోజున జిల్లాలో పర్యటించిన అప్పటి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎం.పళ్లంరాజు తక్షణమే భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటిదాకా ఒక్క పైసా నిధులను కూడా విడుదల చేయలేదు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో కేటాయించిన భూమిని అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీడీఎల్ పరిశ్రమ నిర్మాణానికి నోచుకోలేదు. క్షిపణి పరిశ్రమను బీడీఎల్ ఏర్పాటు చేసి ఉంటే.. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉండేది. కానీ.. బీడీఎల్ పరిశ్రమే ఏర్పాటు చేయని నేపథ్యంలో.. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ కూడా ఏర్పాటు చేయలేమని రక్షణ శాఖ చేతులెత్తేసింది. భూసేకరణ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయలేమంటూ జిల్లా అధికార యంత్రాంగానికి రక్షణ శాఖ వర్తమానం పంపింది. రక్షణ శాఖ వర్తమానం నేపథ్యంలో ఆర్మీ ఫైరింగ్ ఏర్పాటుకు నోటిఫై చేసిన భూమిని డీనోటిఫై చేయాలి. కానీ.. అధికార యంత్రాంగం డీనోటిఫై చేయకపోవడం వల్ల రైతులు కనీసం రబీ పంటల రుణాలను కూడా పొందలేని దుస్థితి నెలకొంది. -
విభజన సెగ..ఐఐఎస్సీ ఔట్..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దుర్భిక్ష ‘అనంత’లో కలికితురాయి అవుతుందనుకున్న ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్స్) కర్ణాటక తన్నుకెళ్లింది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు కేంద్రంపై మూకుమ్మడిగా ఒత్తిడి తెచ్చి హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కావాల్సిన ఐఐఎస్సీ రెండో క్యాంపస్‌ను చిత్రదుర్గకు తరలించుకుపోయారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నా కర్ణాటక ఒత్తిళ్లకే కేంద్రం తలొగ్గింది. రాష్ట్ర విభజనకు ముందే మందబలంతో కర్ణాటక మన జిల్లాకు తీరని అన్యాయం చేసింది. ఇక విభజన జరిగితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దుర్భిక్ష ‘అనంత’లో చదువు ఒక్కటే బతుకును ఇస్తుందని విశ్వసించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యున్నత విద్యా సంస్థలను మన జిల్లాలో ఏర్పాటుచేయడానికి పూనుకున్నారు. ఆ క్రమంలోనే అనంతపురంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విద్యాలయం(జేఎస్టీయూ)ను ఏర్పాటుచేశారు. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్సీ రెండో క్యాంపస్‌ను హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని 2007 నవంబర్ 9న అప్పటి కేంద్ర మానవనరులశాఖ మంత్రి అర్జున్‌సింగ్‌కు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి లేఖ రాశారు. ఐఐఎస్సీ ప్రధాన కేంద్రం, క్యాంపస్ ఇప్పటికే కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరులో ఏర్పాటైన విషయం విదితమే. రెండో క్యాంపస్‌ను హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేయడానికి అప్పట్లో అర్జున్‌సింగ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఐఎస్సీ రెండో క్యాంపస్ ఏర్పాటుపై కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మహానేత వైఎస్ హఠాన్మరణం చెందిన తర్వాత 2010 ఏప్రిల్ 24న హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఐఐఎస్సీ రెండో క్యాంపస్ ఏర్పాటుకుకు అంగీకరిస్తూ అప్పటి కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్ సిబల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఉత్తర్వులు జారీచేసిన వెంటనే కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు తేరుకున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అప్పట్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఐఐఎస్సీ రెండో క్యాంపస్‌ను కూడా చిత్రదుర్గలోనే ఏర్పాటుచేయాలని కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం చిత్రదుర్గలో ఐఐఎస్సీ ప్రయోగశాలను ఏర్పాటుచేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన నెల రోజుల్లోనే ప్రయోగశాల పనులను చిత్రదుర్గలో ఐఐఎస్సీ యాజమాన్యం ప్రారంభించింది. గతేడాది పనులు కూడా పూర్తవడంతో.. ప్రయోగశాలను ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఐఐఎస్సీ ఏర్పాటుకు అనువైన భూమి కోసం కేంద్ర బృందం రెండుసార్లు పర్యటించింది. హిందూపురం-చిలమత్తూరు మధ్యలో ఎన్‌హెచ్-44కు సమీపంలో ఉన్న వెయ్యి ఎకరాల భూమిని ఐఐఎస్సీ రెండో క్యాంపస్ ఏర్పాటుకు అనువుగా కేంద్ర బృందం గుర్తించింది. భవన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభిస్తామని.. 2012 విద్యా సంవత్సరంలో తరగతులు కూడా ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఇప్పటిదాకా రెండో క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కూడా ఐఐఎస్సీ యాజమాన్యం చేయలేదు. రెండో క్యాంపస్ పనులు ప్రారంభించేలా ఐఐఎస్‌సీపై మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు గానీ, ఎంపీలు గానీ ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. మన రాష్ట్రానికి కేంద్ర మంత్రులు, ఎంపీల నిర్లక్ష్యం ఒక ఎత్తయితే.. వేర్పాటువాదం మరొక ఎత్తు. రాష్ట్రంలో 2009 డిసెంబర్ 9 నుంచి నేటి వరకూ రాజకీయ అనిశ్చితి నెలకొంది. వేర్పాటువాదం.. సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 30న కేంద్రం రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటన సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎగిసేలా చేసింది. ఈ ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. ఇదే సందర్భంలో కర్ణాటకలో బీజేపీ సర్కారు స్థానంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరింది. మన రాష్ట్రంలో వేర్పాటువాదం వెర్రితలలు వేస్తోన్న నేపథ్యంలో రెండో క్యాంపస్ ఏర్పాటుకు ఐఐఎస్సీ అంగీకరించడం లేదు. ఇది పసిగట్టిన కర్ణాటక సర్కారు, ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. చిత్రదుర్గలో ఐఐఎస్సీ ఏర్పాటు చేసిన ప్రయోగశాల స్థానంలోనే రెండో క్యాంపస్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం చిత్రదుర్గలో ఐఐఎస్సీ రెండో క్యాంపస్ ఏర్పాటుచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూ కర్ణాటక సర్కారుకు వర్తమానం పంపింది. ఐఐఎస్సీ కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ సారధ్యంలోనే పనిచేస్తుంది. ప్రస్తుతం ఆశాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. కానీ.. హిందూపురంలో ఏర్పాటుకావాల్సిన ఐఐఎస్సీ రెండో క్యాంపస్‌ను కర్ణాటక తన్నుకెళ్తోంటే కనీసం అడ్డుకోలేకపోయారు. రాష్ట్ర విభజన జరగక ముందే ‘అనంత’కు ప్రతిష్ఠాత్మక ఐఐఎస్సీ రెండో క్యాంపస్ దూరమవుతోన్న నేపథ్యంలో.. విభజన జరిగితే మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది సమైక్యవాదులను ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి పురిగొల్పుతోంది.