ఐఐఎస్సీ సీబీఆర్‌తో ఒప్పందం చేసుకున్న విప్రో
దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నియంత్రణ, నిర్వహణకు తోడ్పడే టెక్నాలజీల అభివృద్ధికి విప్రో సంస్థ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త టెక్నాలజీల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించుకోనుంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఆధ్వర్యంలోని సీబీఆర్ స్వయంప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి విప్రో సీబీఆర్‌తో కలిసి వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్‌ను తయారుచేయనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్త టెక్నాలజీ ఇంజిన్‌లో వాడే కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్‌డేటా అనలిటిక్స్ నిత్యం వ్యక్తులతో మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులను విశ్లేషిస్తాయి. గుండె, న్యూరోడిజెనరేటివ్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం, వాటిని నిర్వహించడంపై దృష్టి పెడుతాయి. సీబీఆర్ సహకారంతో డిజిటల్ యాప్ ఆధారిత ప్రయోగాల ద్వారా ఈ ఇంజిన్‌ను విప్రో పరీక్షిస్తుంది.
ఇదీ చదవండి: రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..
విప్రో లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శుభా తటవర్తి మాట్లాడుతూ..‘సాంకేతిక ఆవిష్కరణల ద్వారా హెల్త్‌కేర్ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈమేరకు కంపెనీ ప్రతిష్టాత్మకమైన ఐఐఎస్సీ ఆధ్వర్యంలోని సీబీఆర్‌తో భాగస్వామ్యం కావడం సంతోషకరం. విప్రో సాంకేతికత అనుభవానికి సీబీఆర్ పరిశోధన తోడవ్వడం వల్ల రోగుల ఆరోగ్య సంరక్షణకు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయ’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment