ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్‌గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు కనీసం 3 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా కరెన్సీ రుబెళ్లలో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ డీల్ ఒక ఏడాదిపాటు కొనసాగుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి.
రోస్‌నెఫ్ట్‌తో కుదిరిన ఈ డీల్ వల్ల రిలయన్స్ రాయితీ ధరలకే చమురు పొందనుంది. చమురు ఉత్పత్తిదారుల ఒపెక్ ప్లస్ కూటమి జూన్ తర్వాత స్వచ్ఛందంగా క్రూడ్ సరఫరాలో కోతలు విధించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్), రష్యాతో సహా మిత్రదేశాలతో కూడిన ఒపెక్ ప్లస్ కూటమి జూన్ 2న జరిగే ఆన్‌లైన్ సమావేశంలో చమురు కోతలపై చర్చించనుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఈ డీల్ కుదుర్చుకోవడంపట్ల మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: థాయ్‌లాండ్ వీసా నిబంధనల్లో మార్పులు
రష్యా-ఉక్రెయిన్ మధ్య అనిశ్చితులు తీవ్రరూపం దాల్చిన సమయంలో వెస్ట్రన్ దేశాలు, అమెరికా రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించింది. దాంతో రష్యా తక్కువ ధరకే భారత్ వంటి ఇతర దేశాలకు చమురు అమ్మడం ప్రారంభించింది. అందులో భాగంగానే రిలయన్స్ వంటి భారత ప్రైవేట్ చమురు కంపెనీలు ఆ దేశం నుంచి క్రూడ్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment