
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్‌లో ఆరు కోట్ల మందికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్సీ) వెల్లడించింది. అదే ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఈ సంఖ్యను 37.4 లక్షలకే పరిమితం చేయొచ్చని పేర్కొంది.మార్చి 23 నుంచి జూన్ 18 వరకూ దేశంలో కోవిడ్–19 విస్తృతి ఆధారంగా ఓ మెథమెటికల్ మోడల్‌ను ఐఐఎస్సీ అభివృద్ధి చేసింది. దీని ఆధారంగా వచ్చే మార్చి వరకూ దేశంలో కోవిడ్ ఉధృతి తారస్థాయికి చేరుకోదు(అంటే ఆరు కోట్ల కేసులు నమోదు కావొచ్చు). అదే తక్కువ కేసులు నమోదైతే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోనే కోవిడ్ తారస్థాయికి చేరుకుంటుంది. (అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్ కిట్)
వారంలో రెండ్రోజులు లాక్డౌన్
దేశంలో వారంలో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ను పాటించడం, మిగతా రోజుల్లో మనిషికి మనిషి మధ్య దూరం ఉండేలా చూసుకోవడం వల్ల కొత్త కేసుల నమోదు తీవ్రతను గణనీయంగా తగ్గించొచ్చని ఐఐఎస్సీ పేర్కొంది. దేశంలో కోవిడ్ రికవరి రేటు పెరగడం వెనుక మెడికల్ కేర్, క్వారంటైన్ పాత్ర ప్రముఖంగా ఉందని వెల్లడించింది.(‘లేడీ సింగాన్ని కాదు.. ఐపీఎస్‌గా వస్తాను’)
Comments
Please login to add a commentAdd a comment