ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్‌డీ కోర్సుల్లో సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/ యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్‌ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-జేఆర్‌ఎఫ్; జెస్ట్ (జాయింట్ ఎంట్రన్‌స స్క్రీనింగ్ టెస్ట్), ఎన్‌బీహెచ్‌ఎం (నేషనల్ బోర్‌డ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్) లేదా ఐఐఎస్సీ ఎంట్రన్స్ టెస్ట్ లేదా గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.iisc.ernet.in
మెటలర్జీ ఇంజనీరింగ్ చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
-షఫి, నిర్మల్.
మెటలర్జీ ఇంజనీరింగ్ కోర్సుకు మంచి భవిష్యత్ ఉంది. లోహ ప్రమేయం తప్పనిసరైన ప్రతి వస్తువుకు సంబంధించి డిజైన్, మాన్యు ఫాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్‌లో మెటలర్జీ ఇంజనీర్లు పాల్పంచుకుంటారు. ప్రైవేటు రంగ సంస్థల్లో ఖనిజాలు, లోహాల అన్వేషణ, ఉత్పత్తి ప్రక్రియ, వాణిజ్య విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. టాటా స్టీల్, సెయిల్, నాల్కో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఎన్‌టీపీసీ వంటి సంస్థలు మెటలర్జికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకుంటున్నాయి. సేఫ్టీ, వెల్డింగ్, క్వాలిటీ ప్లానింగ్, ప్లాంట్ ఎక్విప్‌మెంట్ ఇంజనీర్స్ వంటి ఉద్యోగాలతోపాటు రీసెర్చర్స్, కన్సల్టెంట్స్‌గా కూడా అవకాశాలు లభిస్తాయి. రీసెర్చ్ రంగంలో మంచి భవిష్యత్ ఉంది. ఇస్రో, బీడీఎల్ వంటి సంస్థలు రీసెర్చ్ చేసేవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి.
సిస్కో సర్టిఫికేషన్స్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి?
-ప్రదీప్, హైదరాబాద్.
నెట్ వర్కింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగాల్లో సిస్కో సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు.. తమ నెట్‌వర్కింగ్ కోసం సిస్కో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. అందువల్ల సిస్కో సర్టిఫికెట్ కలిగి ఉండడం కెరీర్ ఉన్నతితోపాటు జాబ్ మార్కెట్‌లో మీ అవకాశాలను మరింత విస్తృతం చేస్తుంది. ఇప్పటి వరకు చదివిన బీటెక్ కోర్సుతో నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. నెట్‌వర్క్, నిర్వహణ విషయంలో విస్తృత పరిజ్ఞానం సిస్కో సర్టిఫికెట్‌తో లభిస్తుంది. ఇందులో ప్రారంభంలో సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్ (సీసీఎన్‌ఏ), సర్టిఫైడ్ నెట్‌వర్క్ ప్రొఫెషనల్ (సీసీఎన్‌పీ) కోర్సులు ఉంటాయి. తర్వాత సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్క్ ఇంజనీర్ (సీసీఐఈ), సిస్కో సర్టిఫైడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ (సీసీఎస్‌పీ) వంటి అడ్వాన్స్‌డ్ కోర్సులు ఉంటాయి. కోర్సు పూర్తై తర్వాత జాబ్ నేచర్‌ను బట్టి వివిధ రకాల బాధ్యతలను నిర్వహించాలి. ఇన్‌స్టాలింగ్ అండ్ అనాలిసింగ్ నెట్‌వర్క్స్, మానిటరింగ్ నెట్‌వర్క్, యాడింగ్ న్యూ సర్వర్స్, సిస్టమ్ ఆప్‌గ్రేడ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, రైటింగ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్, నెట్‌వర్క్ ట్రైనర్స్ వంటి విధులను నిర్వర్తించాలి. మన దేశంలో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (వెబ్‌సైట్: ఠీఠీఠీ.జీజీట్ఛఛిఠటజ్టీడ.జీ) నిట్ (వెబ్‌సైట్: www. niit.com), జెట్‌కింగ్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు సిస్కో సర్టిఫికేషన్‌లో శిక్షణను అందిస్తున్నాయి.
ఫ్యాషన్ రంగంలో ఎటువంటి కోర్సులు ఉంటాయి. వివరాలు తెలపండి?
-కిరణ్, నిజామాబాద్.
ఫ్యాషన్ రంగంలో గార్మెంట్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ అండ్ జ్యూయెలరీ డిజైన్, మోడలింగ్, గార్మెంట్ డిజైనింగ్, లెదర్ డిజైనింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ డిజైనింగ్ వంటి పలు రకాల విభాగాలు ఉంటాయి. ఫ్యాషన్ డిజైన్ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటోంది. ఈ క్రమంలో కాస్ట్యూమ్ డిజైనర్‌లు, ఫ్యాషన్ కన్సల్టెంట్స్, టెక్నికల్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, ప్రొడక్షన్ ప్యాట్రన్ మేకర్, ఫ్యాబ్రిక్ బయ్యర్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, షోరూం సేల్స్ రిప్రజెంటేటివ్ తదితర ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
ఎగుమతి సంస్థలు, టెక్స్‌టైల్ మిల్స్, లెదర్ కంపెనీలు, గార్మెంట్ స్టోర్ చైన్స్, ఫ్యాషన్ షో ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ హ్యాండ్లూమ్ సంస్థలు, మీడియా సంస్థలు కూడా ఫ్యాషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశంలో పలు కాలేజీలు ఫ్యాషన్ కోర్సులను అందిస్తున్నాయి. వాటిల్లో కొన్ని.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్- దేశ వ్యాప్తంగా 16 నిఫ్ట్ క్యాంపస్‌లు ఉన్నాయి, వెబ్‌సైట్: www.nift.ac.in). నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ-దీనికి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులలో క్యాంపస్‌లు ఉన్నాయి, వెబ్‌సైట్: www.nid.edu); సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే(http://sid.edu.in)పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్-న్యూఢిల్లీ (వెబ్‌సైట్: http://pearlacademy.com).