గేట్-2016 | Gate -2016 | Sakshi
Sakshi News home page

గేట్-2016

Published Thu, Aug 13 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

గేట్-2016

గేట్-2016

 గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్ సహాయంతో ప్రతిష్టాత్మక ఐఐఎస్‌సీ, ఐఐటీ, నిట్‌లు వంటి సంస్థల్లో ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా మెరుగైన గేట్ స్కోర్‌తో ఓఎన్‌జీసీ, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ చేజిక్కించుకోవచ్చు.
 ఉన్నత విద్య, ఉద్యోగం... రెండిటికీ బాటలు వేసే గేట్-2016 షెడ్యూల్ విడుదలైంది. దీనిపై ప్రత్యేక కథనం...
 
 అర్హత
 బీటెక్/ బీఆర్క్/ నాలుగేళ్ల బీఎస్/ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ (పోస్ట్ బీఎస్సీ)/ ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ.
 కోర్సుల చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 
 పరీక్ష విధానం
 గేట్-2016ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) నిర్వహిస్తుంది.
 ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 2016, జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు ప్రతి శనివారం, ఆదివారాల్లో పరీక్ష జరుగుతుంది.
 మొత్తం 23 పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 65 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
 ప్రశ్నపత్రంలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి పది ప్రశ్నలు ఇస్తారు. మిగిలినవి అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు స్పెషలైజేషన్ నుంచి ఉంటాయి.
 
 మార్పులు
 పరీక్ష సమయంలో ఆన్‌లైన్ వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. సాధారణ కాలిక్యులేటర్‌ను అనుమతించరు. ప్రాక్టీస్ కోసం ఈ కాలిక్యులేటర్‌ను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.
 పరీక్ష తర్వాత ‘కీ’లను అందుబాటులో ఉంచుతారు. సమాధానాలపై ఫిర్యాదు చేయొచ్చు. దీనికి నామమాత్రపు ఫీజు చెల్లించాలి.
 గేట్-2016లో కొత్తగా పెట్రోలియం ఇంజనీరింగ్ (పీఈ) పేపర్‌ను ప్రవేశపెట్టారు.
 
 ముందంజలో 5 బ్రాంచ్‌లు
 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గేట్‌కు ఏటా పది లక్షలకు పైగా విద్యార్థులు పోటీపడుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి రెండు లక్షల మంది చొప్పున హాజరవుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ల నుంచి దాదాపు 3.5 లక్షల మంది హాజరవుతున్నారు. పరీక్ష రాసేవారిలో తెలుగు విద్యార్థులదే అగ్రస్థానం.
 
 ముఖ్యాంశాలు
 దరఖాస్తు:
 గేట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో.
 
 దరఖాస్తు తేదీలు:
 2015, సెప్టెంబరు 1- అక్టోబరు 1.
 
 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్:
 డిసెంబరు 17, 2015.
 
 పరీక్ష తేదీలు:
 2016, జనవరి 30 నుంచి 2016,
 ఫిబ్రవరి 7 వరకు ప్రతి శని, ఆదివారాలు.
 
 పరీక్ష కేంద్రాలు
 ఏపీ: కర్నూలు, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి. పరీక్ష కేంద్రాలు
 టీఎస్: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్.
 ఫలితాల వెల్లడి: మార్చి 19, 2016.
 వెబ్‌సైట్: gate.iisc.ernet.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement