PHD Course
-
హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సును హైదరాబాద్ ఐఐటీ ప్రవేశపెట్టింది. ఈ మేరకు శ్రీ విశ్వేశ్వర యోగా పరిశోధన సంస్థ (ఎస్‌వీవైఆర్‌ఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశోధనలు చేసే రీసెర్చ్ స్కాలర్లకు ప్రతినెలా రూ.75 వేల పారితోషికంతో పాటు, విదేశాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో యోగా, ఆయుర్వేదం, సంగీతం, నృత్యం, భారతీయ భాషలు, కళలు, అర్కిటెక్చర్, శిల్పం వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రంపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ కీలక మైలురాయిని అధిగమిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఐఐటీలో హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సు ప్రవేశపెట్టామని హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి మోహన్‌రాఘవన్ పేర్కొన్నారు. ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న బీఎస్ మూర్తి, ఎస్‌వీవైఆర్‌ఐ సంస్థ ప్రతినిధులు -
University of Hyderabad: పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ..యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఉన్నత ప్రమాణాలతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంటున్న విశ్వవిద్యాలయం. అనేక విభాగాల్లో విద్య, పరిశోధనలు కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా.. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. హెచ్‌సీయూ అందిస్తున్న కోర్సుల వివరాలు.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ, హెల్త్ సైకాలజీ స్పెషలైజేషన్స్‌తో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ అందుబాటులో ఉంది. అలాగే ఆరేళ్ల వ్యవధితో మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రి కోర్సును సైతం ఈ యూనివర్సిటీ అందిస్తోంది. అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు అన్ని గ్రూపుల విద్యార్థులు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్: హిందీ, తెలుగు, లాంగ్వేజ్ సైన్సెస్, ఉర్దూ. సోషల్ సైన్సెస్: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు అందుబాటులో ఉంది. అర్హత: ఏదైనా గ్రూపులో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. పరీక్ష విధానం ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ–మ్యాథ్స్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఎమ్మెస్సీ హెల్త్ సైకాలజీ కోర్సు ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్ స్థాయి సైకాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉండే ప్రశ్నపత్రంలో అభ్యర్థి ఎంచుకున్న లాంగ్వేజ్‌పై 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 35 ప్రశ్నలు, వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్‌పై 25 ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుగుతుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సోషల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. పీజీ స్థాయి కోర్సులు మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎమ్మెస్సీ) మ్యాథ్స్/అప్లయిడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ, న్యూరల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలను ఆర్సీబీ ఫరీదాబాద్ నిర్వహించే గాట్–బి ద్వారా ఖరారు చేస్తారు. ఎంసీఏ: నిమ్‌సెట్–2021 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ: హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్,ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. క్యాట్ ర్యాంకు ఆధారంగా ఎంబీఏలో ప్రవేశాలను ఖరారు చేస్తారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎంఏ) ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, కమ్యూనికేషన్(మీడియా ప్రాక్టీస్) తదితరాలు. ఎంఈడీ, ఎంపీఏ(డ్యాన్స్), ఎంపీఏ(థియేటర్ ఆర్ట్స్), ఎంపీఏ మ్యూజిక్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ అండ్ స్కల్పచర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్). ఎంపిక విధానం: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్) కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బయోఇన్ఫర్మాటిక్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి గేట్ స్కోర్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్:ఎంటెక్ కంప్యూటర్ సైన్స్‌లో జేఈఈ సీఎస్ఏబీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీహెచ్డీ అప్లయిడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్ స్టడీస్, కంపారిటివ్ లిటరేచర్, సంస్కృతం, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, ఫోక్ కల్చర్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్, కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ స్టడీస్, హెల్త్ సైన్సెస్, ఫిజియాలజీ, మెటీరియల్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/పీహెచ్డీ: బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20,2021 వెబ్సైట్: https://uohyd.ac.in -
17 ఏళ్లకే పీహెచ్డీ, అది కూడా ఆ సబ్జెక్ట్‌లో!
చదువుకు వయసుతో సంబంధం లేదని ఎంతోమంది నిరూపిస్తుంటే.. అతిపిన్న వయసులో డిగ్రీలు పూర్తిచేసి ఔరా అనిపిస్తున్నారు మరికొందరు. పీహెచ్డీ చేయాలంటే.. పది, పన్నెండు తరగతులు, డిగ్రీ, పీజీ, ఎంఫిల్ చదవాల్సిందే. ఇవన్నీ చదివి పీహెచ్డీ పూర్తి చేసేనాటికి సాధారణంగా చాలామందికి తల నెరుస్తుంది. కానీ అమెరికాకు చెందిన ఓ టీనేజర్ అమ్మాయి అతి చిన్నవయసులో పీహెచ్డీ పూర్తిచేసి అబ్బురపరుస్తోంది. ఎక్కువమంది కష్టంగా భావించే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ పొంది చరిత్ర సృష్టించింది. సంకల్పం గట్టిదైతే సాధించలేనిది ఏదీ ఉండదని 17 ఏళ్ల కింబెర్లీ స్ట్రాంబుల్ చాటిచెబుతోంది. అమెరికాలోని మోంటానాకు చెందిన కింబెర్లీ.. కాలిఫోర్నియా ‘ఇంటర్కాంటినెంటల్ యూనివర్సిటీ’ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ పూర్తిచేసి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రపంచ నాయకత్వ ప్రాధాన్యం...’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఆమె డాక్టరేట్ చేసింది. వివిధ సబ్జెక్టుల్లో డాక్టరేట్ పొందిన ప్రపంచ అతిపిన్న వయస్కుల జాబితాలో మూడోవ్యక్తిగా కింబెర్లీ్ల నిలిచింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత చిన్నవయసులో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్‌ను ఎవరూ పొందకపోవడం గమనార్హం. కింబెర్లీ మాట్లాడుతూ..‘‘ఇప్పుడు నేను చాలా సంతోషంగానూ ప్రశాంతంగానూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. తరువాత ఏం చేయాలి? తరువాత ఏం చేయాలి? అనుకుంటూ ముందుకు సాగి చివరికి డాక్టరేట్ పొందాను’’ అని కింబెర్లీ్ల చెప్పింది. ‘‘ప్రస్తుతం నేను చట్టపరమైన అంశాలపై పనిచేస్తున్నాను. వయసు పరంగా చాలా వివక్షకు గురయ్యాను. అయినప్పటికీ నేను ఆర్జించిన జ్ఞానంతో ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని కింబర్లే చెప్పింది. కింబర్లే కాకుండా ఆమె అక్క కూడా 18 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం తన చెల్లి కూడా చిన్నవయసులో డిగ్రీలు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ‘‘మేము ఎప్పుడూ పిల్లల్ని అలా చదవండి, ఇలా చదవండి అని బలవంతపెట్టలేదు. వాళ్లకు ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రోత్సహించాము. కింబెర్లీ్ల ఇష్టంతో చదివి డాక్టరేట్ సాధించింది’’ అని ఆమె తండ్రి జార్జ్ చెప్పారు. తను పీహెచ్డీ పూర్తిచేయడంలో మేమూ ఎంతో కష్టపడ్డామని, ఆమెకు అన్నిరకాలుగా సాయం చేస్తూ.. డాక్టరేట్ వచ్చేంతవరకు కృషిచేశామన్నారు. చదవండి: మోస్టు డేంజరస్ రోడ్లు ఎక్కడున్నాయంటే? -
విద్యానిధి.. ప్రతిభకు పెన్నిధి
20 లక్షలు - ఏఓవీఎన్ కింద పీజీ, పీహెచ్డీ కోర్సులకు.. 465 మంది - నాలుగేళ్లలో లబ్ధిపొందిన విద్యార్థులు 81.10 కోట్లు - మొత్తం అయిన ఖర్చు సాక్షి, హైదరాబాద్: సంపన్నులకే సాధ్యమయ్యే విదేశీ చదువు సామాన్యుడి చెంతకు చేరింది. తెలంగాణ ప్రభు త్వం తలపెట్టిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (ఏఓవీఎన్) పథకంతో వందలాది దళిత ప్రతిభావంతులు విదేశాల్లో పట్టభద్రులయ్యారు. అంతేకాదు, అక్కడున్న బహుళజాతీయ సంస్థల్లో ఉన్నత కొలువులు సంపాదించి తోటివారికిమార్గదర్శకులయ్యారు. నాలుగేళ్లలో ఏకంగా 465 మంది తెలంగాణ బిడ్డలు అమె రికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంతో లబ్ధిపొందిన వారి పరిస్థితి ఎలా ఉందనే కోణంలో ఆ శాఖ ఇటీవల పరిశీలన చేపట్టింది. ఎంపిక చేసిన జాబితా ఆధారంగా దాదాపు 65 మందితో మాట్లాడారు. ఇందులో దాదాపు 50 మంది అభ్యర్థులు కోర్సు పూర్తి చేసి బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తుండటంతో అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు సాయంతో... 2013–14 విద్యా సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఏఓవీఎన్ కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసేవారు. విదేశీ విద్యకు ఆ మొత్తం సరిపోయేది కాదు. దీంతో సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు లబ్ధిపొందేవారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఎస్సీ, బీసీ, ఈబీసీలకు వేర్వేరు పేర్లతో విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలుత ఎస్సీలకు ఈ పథకాన్ని అమలుచేసిన క్రమంలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని భావించిన ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్, క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏఓవీఎన్ పథకం కింద 465 మంది ఎంపిక కాగా, రూ.81.10 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం రూపంలో అందించింది. లక్ష్యాన్ని సాధించా... హైదరాబాద్‌లో మాది మధ్యతరగతి కుటుంబం. అమెరికాలో పీజీ చదవాలనేది నా కోరిక. బీటెక్ పూర్తి చేసిన తర్వాత అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద దరఖాస్తు చేశా. డల్లాస్‌లోని బాప్టిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశా. తొలి ప్రయత్నంలోనే డెల్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుంటే విదేశీ విద్య అభ్యసించేదాన్ని కాదు. – కొల్లాబత్తుల సింధూజ ఉత్తమమైన పథకం ఇది.. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యానిధి పథకం ఎస్సీలకు వరమే. ఈ పథకం కింద రూ.20లక్షల ఆర్థిక సాయం అందుతుంది. వీసా ఖర్చు, యూనివర్సిటీలో ప్రవేశం, ట్యూషన్ ఫీజు, ఫ్లైట్ చార్జీలు సైతం ఈ నిధుల నుంచే వినియోగించుకున్నా. ప్రతిభగల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ పథకం ఉత్తమమైనది. నా కుటుంబం ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. – నీరటి భాస్కర్ పథకంతో దశ తిరిగింది.. నాన్న అరకొర వేతనంతో మా జీవితం అంతంతమాత్రంగానే ఉండేది. డిగ్రీ వరకు ఎలా గోలా నెట్టుకొచ్చినా ఎమ్మెస్ చేయలేనని భావించా. అప్పుడే ఈ పథకం గురించి తెలిసింది. దరఖాస్తు ప్రక్రియంతా పారదర్శకంగా జరిగింది. ప్రభుత్వ కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నా. మంచి మార్కులు రావడంతో అమెరికాలోని బ్రిడ్జిపోర్ట్ యూనివర్సిటీలో కంప్యూ టర్ సైన్స్‌లో ఎంఎస్‌లో చేరా. డిస్టింక్షన్లో పాసై అబ్వీ అండ్ ఇన్ఫినిటీ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీలో ఐటీ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించా. – వూట్ల దివ్యశాంతి అపరిమిత సంఖ్యలో ఎంపిక.. ఏఓవీఎన్ పథకానికి ప్రస్తుతం ఎలాంటి సీలింగ్ లేదు. అర్హులు ఎంత మంది ఉన్నా వారికి ఆర్థిక సాయం అందిస్తాం. యూనివర్సిటీ ప్రవేశాలు, ఫీజుల ఆధారంగా ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నాం. అర్హత సాధించిన అనంతరం యూనివర్సిటీలో ప్రవేశం తీసుకున్నట్లు అడ్మిట్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసిన వెంటనే రెండు వాయిదాల్లో ఫీజులు చెల్లిస్తున్నాం. వందశాతంపారదర్శకంగా నిర్వహిస్తున్నాం. – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు -
పీహెచ్డీ దళిత విద్యార్థి ఆత్మహత్య కలకలం
సాక్షి, కాన్పూర్: ప్రముఖ ఐఐటీలో పీహెచ్డీ చదువుతున్న దళిత విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లోని మూడో సంవత్సరం పీహెచ్బీ విద్యార్ధి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడిని భీమ్‌సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గలకారణాలు ఇంకా తెలియ రాలేదు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిలేష్ కుమార్ మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే సూసైడ్ నోట్ ముక్కలు, ముక్కలుగా చింపి ఉండడం పలు అనుమానాలను రేకేత్తిస్తోంది. మరోవైపు ఈ పేపర్ ముక్కలను ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని కాన్పూర్ ఐఐటీ డిప్యూటీ డైరెక్టర్ మణింద్ర అగర్వాల్ వెల్లడించారు. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌కు చెందిన సింగ్ తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. గురువారం రోజు పోస్టుమార్టం నిర్వహించనున్నారని స్థానిక కళ్యాణ్పూర్ పోలీసు స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతీష్ కుమార్ సింగ్ చెప్పారు. కాగా సింగ్ వరంగల్ నిట్ లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 2015లో మెకానికల్ ఇంజీనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీలో జాయిన్ అయినట్టు సమాచారం -
బ్రెయిన్ గెయిన్: బీటెక్ విద్యార్థులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీటెక్ విద్యార్థుల ఫెలోషిప్ పథకంపై కేంద్రం శరవేగంగా కదులుతోంది. అత్యుత్తమ ప్రతిభగల వెయ్యి మంది బీటెక్ విద్యార్థులకోసం ఉద్దేశించిన పీఎం రీసెర్చ్ ఫెలోషిప్స్(పీఎంఆర్ఎఫ్) పథకానికి కేబినెట్ ఆమోదం లభించింది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లే ఔత్సాహికులకు ప్రోత్సాహిమిచ్చే దశగా ఈ ఫెలోషిప్‌ను ఇవ్వనున్నామని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ఇందుకోసం రూ.1,650 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. తద్వారా విద్యార్థుల బ్రెయిన్ డ్రెయిన్ శ్రమను..బ్రెయిన్ గెయిన్గా మార్చుతున్నామన్నారు. 2018-19 నుంచి మూడేళ్లపాటు ప్రతి ఏడాది 1000 మంది పీహెచ్డీ విద్యార్థుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నామని మంత్రి వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థుల నుంచి తుది జాబితాను ఎంపిక చేస్తారు. వీరందరూ మొదటి రెండు సంవత్సరాలకు నెలకు రూ.70వేలు, మూడో ఏడాది రూ.75వేలు, నాలుగు, ఐదో సంవత్సరం రూ.80వేల స్కాలర్షిప్ పొందనున్నారు. అంతేకాదు అధ్యయన పేపర్ల ప్రజెటింగ్ కోసం విదేశాల్లో సెమినార్లు, కాన్ఫరెన్సెలకు వెళ్లే అధ్యయన విద్యార్థులకు వార్షికంగా (విదేశీ ప్రయాణ ఖర్చులు)మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్కాలర్షిప్లు కూడా అందిస్తున్నామని మంత్రి వివరించారు. పీఎం రిసెర్చ్ ఫెలోషిప్స్(పీఎంఆర్ఎఫ్) పథకం కింద.. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐఎస్సీ, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీల్లో బీటెక్ పూర్తయిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎమ్మెస్సీ(సైన్స్ అండ్ టెక్నాలజీ) విద్యార్థులు నేరుగా ఐఐటీలు, ఐఐఎస్‌లో పీహెచ్డీ చేసేందుకు అవకాశం లభించనుంది. -
సీఐడీ దర్యాప్తు జరగాల్సిందే..!
ద్రవిడ వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 8 వేల మందికి ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించడంలో ఎలాంటి తప్పులేదని, రాష్ట్రంలో వర్సిటీల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలకు విశ్వసనీయత ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. దర్యాప్తు వల్ల ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్న నెపంతో నిలుపుదల చేయలేమంది. దర్యాప్తు పేరుతో ఎంఫిల్, పీహెచ్‌డీల కోసం ద్రవిడ వర్సిటీలో రిజిష్టర్ చేసుకున్న వ్యక్తులను ఏ రకమైన వేధింపులకు గురి చేయరాదని, దీనిపై క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని సీఐడీ అదనపు డీజీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ద్రవిడ వర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఎంఫిల్ డిగ్రీలు, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ జె.ప్రసాద్‌బాబు, అప్పాజీ, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. -
‘టేరి’లో పీహెచ్డీ
న్యూఢిల్లీ: పర్యావరణంపై పరిశోధనలకు నిలయమైన టేరి (ఇంధన, వనరుల సంస్థ) యూనివర్సిటీ సమీప భవిష్యత్తులో గువాహటి, హైదరాబాద్ క్యాంపస్‌లలో పీహెచ్డీ కోర్సులను ప్రారంభించనుంది. హైదరాబాద్ క్యాంపస్‌లో పునరుత్పాదక ఇంధనం, గువాహటిలో బయోటెక్నాలజీ, సుస్థిర వనరులు, వ్యవసాయం, వాటర్‌షెడ్ నిర్వహణ తదితరాలపై పరిశోధనలు నిర్వహిస్తామని వర్సిటీ వీసీ లీనా శ్రీవాస్తవ చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన వర్సిటీ 8వ స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడారు. 2018 నాటికల్లా గువాహటిలో మౌలిక వసతులు కల్పిస్తామని, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. -
ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చే యడం ఎలా?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్డీ కోర్సుల్లో సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-జేఆర్ఎఫ్; జెస్ట్ (జాయింట్ ఎంట్రన్స స్క్రీనింగ్ టెస్ట్), ఎన్బీహెచ్ఎం (నేషనల్ బోర్డ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్) లేదా ఐఐఎస్సీ ఎంట్రన్స్ టెస్ట్ లేదా గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. వెబ్సైట్: www.iisc.ernet.in మెటలర్జీ ఇంజనీరింగ్ చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -షఫి, నిర్మల్. మెటలర్జీ ఇంజనీరింగ్ కోర్సుకు మంచి భవిష్యత్ ఉంది. లోహ ప్రమేయం తప్పనిసరైన ప్రతి వస్తువుకు సంబంధించి డిజైన్, మాన్యు ఫాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్లో మెటలర్జీ ఇంజనీర్లు పాల్పంచుకుంటారు. ప్రైవేటు రంగ సంస్థల్లో ఖనిజాలు, లోహాల అన్వేషణ, ఉత్పత్తి ప్రక్రియ, వాణిజ్య విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. టాటా స్టీల్, సెయిల్, నాల్కో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఎన్టీపీసీ వంటి సంస్థలు మెటలర్జికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకుంటున్నాయి. సేఫ్టీ, వెల్డింగ్, క్వాలిటీ ప్లానింగ్, ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇంజనీర్స్ వంటి ఉద్యోగాలతోపాటు రీసెర్చర్స్, కన్సల్టెంట్స్గా కూడా అవకాశాలు లభిస్తాయి. రీసెర్చ్ రంగంలో మంచి భవిష్యత్ ఉంది. ఇస్రో, బీడీఎల్ వంటి సంస్థలు రీసెర్చ్ చేసేవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. సిస్కో సర్టిఫికేషన్స్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి? -ప్రదీప్, హైదరాబాద్. నెట్ వర్కింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగాల్లో సిస్కో సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు.. తమ నెట్వర్కింగ్ కోసం సిస్కో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. అందువల్ల సిస్కో సర్టిఫికెట్ కలిగి ఉండడం కెరీర్ ఉన్నతితోపాటు జాబ్ మార్కెట్లో మీ అవకాశాలను మరింత విస్తృతం చేస్తుంది. ఇప్పటి వరకు చదివిన బీటెక్ కోర్సుతో నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. నెట్వర్క్, నిర్వహణ విషయంలో విస్తృత పరిజ్ఞానం సిస్కో సర్టిఫికెట్తో లభిస్తుంది. ఇందులో ప్రారంభంలో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ (సీసీఎన్ఏ), సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్ (సీసీఎన్‌పీ) కోర్సులు ఉంటాయి. తర్వాత సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్క్ ఇంజనీర్ (సీసీఐఈ), సిస్కో సర్టిఫైడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ (సీసీఎస్పీ) వంటి అడ్వాన్స్డ్ కోర్సులు ఉంటాయి. కోర్సు పూర్తై తర్వాత జాబ్ నేచర్‌ను బట్టి వివిధ రకాల బాధ్యతలను నిర్వహించాలి. ఇన్‌స్టాలింగ్ అండ్ అనాలిసింగ్ నెట్వర్క్స్, మానిటరింగ్ నెట్వర్క్, యాడింగ్ న్యూ సర్వర్స్, సిస్టమ్ ఆప్‌గ్రేడ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, రైటింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, నెట్వర్క్ ట్రైనర్స్ వంటి విధులను నిర్వర్తించాలి. మన దేశంలో.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (వెబ్సైట్: ఠీఠీఠీ.జీజీట్ఛఛిఠటజ్టీడ.జీ) నిట్ (వెబ్సైట్: www. niit.com), జెట్‌కింగ్ వంటి ఇన్స్టిట్యూట్లు సిస్కో సర్టిఫికేషన్‌లో శిక్షణను అందిస్తున్నాయి. ఫ్యాషన్ రంగంలో ఎటువంటి కోర్సులు ఉంటాయి. వివరాలు తెలపండి? -కిరణ్, నిజామాబాద్. ఫ్యాషన్ రంగంలో గార్మెంట్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ అండ్ జ్యూయెలరీ డిజైన్, మోడలింగ్, గార్మెంట్ డిజైనింగ్, లెదర్ డిజైనింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ డిజైనింగ్ వంటి పలు రకాల విభాగాలు ఉంటాయి. ఫ్యాషన్ డిజైన్ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రస్తుత జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. ఈ క్రమంలో కాస్ట్యూమ్ డిజైనర్లు, ఫ్యాషన్ కన్సల్టెంట్స్, టెక్నికల్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, ప్రొడక్షన్ ప్యాట్రన్ మేకర్, ఫ్యాబ్రిక్ బయ్యర్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, షోరూం సేల్స్ రిప్రజెంటేటివ్ తదితర ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎగుమతి సంస్థలు, టెక్స్టైల్ మిల్స్, లెదర్ కంపెనీలు, గార్మెంట్ స్టోర్ చైన్స్, ఫ్యాషన్ షో ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ హ్యాండ్లూమ్ సంస్థలు, మీడియా సంస్థలు కూడా ఫ్యాషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశంలో పలు కాలేజీలు ఫ్యాషన్ కోర్సులను అందిస్తున్నాయి. వాటిల్లో కొన్ని.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్- దేశ వ్యాప్తంగా 16 నిఫ్ట్ క్యాంపస్‌లు ఉన్నాయి, వెబ్సైట్: www.nift.ac.in). నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ-దీనికి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులలో క్యాంపస్‌లు ఉన్నాయి, వెబ్సైట్: www.nid.edu); సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే(http://sid.edu.in)పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్-న్యూఢిల్లీ (వెబ్సైట్: http://pearlacademy.com).