‘టేరి’లో పీహెచ్డీ
న్యూఢిల్లీ: పర్యావరణంపై పరిశోధనలకు నిలయమైన టేరి (ఇంధన, వనరుల సంస్థ) యూనివర్సిటీ సమీప భవిష్యత్తులో గువాహటి, హైదరాబాద్ క్యాంపస్‌లలో పీహెచ్‌డీ కోర్సులను ప్రారంభించనుంది. హైదరాబాద్ క్యాంపస్‌లో పునరుత్పాదక ఇంధనం, గువాహటిలో బయోటెక్నాలజీ, సుస్థిర వనరులు, వ్యవసాయం, వాటర్‌షెడ్ నిర్వహణ తదితరాలపై పరిశోధనలు నిర్వహిస్తామని వర్సిటీ వీసీ లీనా శ్రీవాస్తవ చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన వర్సిటీ 8వ స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడారు. 2018 నాటికల్లా గువాహటిలో మౌలిక వసతులు కల్పిస్తామని, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.