TERI University
-
భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్ ‘స్వర్’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) డైరెక్టర్ కే.ఎస్. గోపాల్ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్‌డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్‌ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం! -
‘టేరి’లో పీహెచ్డీ
న్యూఢిల్లీ: పర్యావరణంపై పరిశోధనలకు నిలయమైన టేరి (ఇంధన, వనరుల సంస్థ) యూనివర్సిటీ సమీప భవిష్యత్తులో గువాహటి, హైదరాబాద్ క్యాంపస్‌లలో పీహెచ్డీ కోర్సులను ప్రారంభించనుంది. హైదరాబాద్ క్యాంపస్‌లో పునరుత్పాదక ఇంధనం, గువాహటిలో బయోటెక్నాలజీ, సుస్థిర వనరులు, వ్యవసాయం, వాటర్‌షెడ్ నిర్వహణ తదితరాలపై పరిశోధనలు నిర్వహిస్తామని వర్సిటీ వీసీ లీనా శ్రీవాస్తవ చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన వర్సిటీ 8వ స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడారు. 2018 నాటికల్లా గువాహటిలో మౌలిక వసతులు కల్పిస్తామని, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. -
బాలీవుడ్ నటి షబానా ఆజ్మీకి ఐదవ గౌరవ డాక్టరేట్!
బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీకి తెరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 5న జరిగే ఓ కార్యక్రమంలో తెరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారని షబానా ఆజ్మీ ట్విటర్ లో వెల్లడించారు. షబానా ఆజ్మీకి ఇది ఐదవ గౌరవ డాక్టరేట్ కావడం విశేషం. 2003లో పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ, 2007లో యార్క్ షైర్ లోని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, 2008లో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ, 2013లో సిమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను షబానా ఆజ్మికి ప్రకటించారు. 1974లో శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన అంకుర్ చిత్రం ద్వారా బాలీవుడ్ లో ప్రవేశించిన షబానా ఆజ్మీ ఇప్పటి వరకు 120 చిత్రాల్లో నటించారు. సామాజిక కార్యకర్తగా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు, బాలల సంరక్షణ కోసం షబానా ఆజ్మీ సేవలందిస్తున్నారు. Honoured and humbled to be getting a Doctorate from TERI university on 5th Feb. It is my 5th!— Azmi Shabana (@AzmiShabana) February 3, 2014