బాలీవుడ్ నటి షబానా ఆజ్మీకి ఐదవ గౌరవ డాక్టరేట్! | Shabana Azmi gets fifth Honorary doctorate by TERI university | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటి షబానా ఆజ్మీకి ఐదవ గౌరవ డాక్టరేట్!

Published Mon, Feb 3 2014 12:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

బాలీవుడ్ నటి షబానా ఆజ్మీకి ఐదవ గౌరవ డాక్టరేట్!

బాలీవుడ్ నటి షబానా ఆజ్మీకి ఐదవ గౌరవ డాక్టరేట్!

బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీకి తెరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 5న జరిగే ఓ కార్యక్రమంలో తెరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారని షబానా ఆజ్మీ ట్విటర్ లో వెల్లడించారు. షబానా ఆజ్మీకి ఇది ఐదవ గౌరవ డాక్టరేట్ కావడం విశేషం.  
 
2003లో పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ, 2007లో యార్క్ షైర్ లోని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, 2008లో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ, 2013లో సిమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను షబానా ఆజ్మికి ప్రకటించారు. 
 
1974లో శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన అంకుర్ చిత్రం ద్వారా బాలీవుడ్ లో ప్రవేశించిన షబానా ఆజ్మీ ఇప్పటి వరకు 120 చిత్రాల్లో నటించారు. సామాజిక కార్యకర్తగా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు, బాలల సంరక్షణ కోసం షబానా ఆజ్మీ సేవలందిస్తున్నారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement