వాషింగ్టన్ : బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కు అరుదైన అవకాశం దక్కించుకుంది. యూఎస్ మిలటరీకి చెందిన సోలార్ పవర్ మైక్రో గ్రిడ్ అభివృద్ధి పరిశోధన కాంట్రాక్ట్ను ఈ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ కింద రూ. 52,900 యూఎస్ డాలర్లను యూఎస్ పసిఫిక్ ఎయిర్ పోర్స్ నిధులు కేటాయించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దక్కిన అరుదైన అవకాశాల్లో యూఎస్ మిలటరీ కాంట్రాక్ట్ ఒకటి. వాషింగ్టన్లో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి అస్టోన్ కార్టర్ గురువారం పెంటగాన్లో భేటీ అయ్యారు. భారత్ - అమెరికా దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్చల్లో భాగంగా పారికార్ ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు.