Times Higher Education (THE) Ranking
-
Employability Rankings: ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగార్హత ఈ యూనివర్సిటీవాళ్లదే!
Times Higher Education (THE) Graduate Employability Rankings 2021: ఉద్యోగవకాశాలు కల్పించడంలో సాంకేతిక విద్యాలయాల పాత్ర ఎంతో ప్రముఖమైంది. అయితే ఈ ఏడాది మన దేశంలోని ప్రముఖ విద్యాలయాలు గ్లోబల్ స్థాయిలో సత్తా చాటాయి. ఏకంగా 27వ స్థానంతో టైమ్స్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో నిలిచింది ఐఐటీ ఢిల్లీ. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021లో ఢిల్లీ యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ 32వ ర్యాంక్), యూనివర్సిటీ ఆఫ్ చికాగో(33వ ర్యాంక్)లను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎక్కువమందిని ఢిల్లీ ఐఐటీ అందిస్తోందన్నమాట. ఇక ఈ లిస్ట్‌లో టాప్-100లో బెంళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc(61), ఐఐటీ బాంబే(97) కూడా చోటు దక్కించుకున్నాయి. గతంలో వీటి ర్యాంక్స్ 71, 128గా ఉండగా.. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్(162), ఐఐటీ ఖరగ్పైర్ (170), అమిటీ యూనివర్సిటీ(225), బెంగళూరు యూనివర్సిటీ(249) స్థానాల్లో నిలిచాయి. ఇక క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ టాప్ 150లో ఢిల్లీ, బాంబే ఐఐటీలు స్థానం దక్కించుకున్నాయి. ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌ను ఉద్యోగుల సబ్జెక్ట్ స్పెషలైజేషన్, గ్రాడ్యుయేట్ స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఎక్సలెన్స్, డిజిటల్ పర్ఫార్మెన్స్, ఫోకస్ ఆన్ వర్క్, సాఫ్ట్ స్కిల్స్-డిజిటల్ లిటరసీ, ఇంటర్నేషనలిజం, స్పెషలైజేషన్.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. THE Graduate Employability Rankings 2021 లో మాసెచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(అమెరికా) టాప్ ప్లేస్‌లో ఉంది. ఆసియా నుంచి టోక్యో యూనివర్సిటీ(6), సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ (9) మాత్రమే టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్నాయి. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! సంచలన విషయాలు వెల్లడి..! -
ఐఐఎస్సీకి 29వ ర్యాంకు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వారు ఏటా ఆసియాలోని విశ్వవిద్యాలయాలకు ఇచ్చే ర్యాంకింగ్స్‌లో ఈసారి భారత విశ్వవిద్యాలయాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) గతేడాది సాధించిన 29వ ర్యాంకును ఈ ఏడాది కూడా నిలుపుకుంది. టాప్–100లో చూస్తే ఐఐటీ ఇండోర్ 50వ ర్యాంకు, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 54వ ర్యాంకు, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 62వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 76వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 82వ ర్యాంకు, ఐఐటీ ఢిల్లీ 91వ ర్యాంకు పొందాయి. భారత యూనివర్సిటీల్లో అత్యుత్తమ ర్యాంకు ఐఐఎస్సీదే. ఇక మొత్తంగా చూస్తే చైనాకు చెందిన సింఘువా యూనివర్సిటీ తొలిస్థానంలో నిలిచింది. -
టాప్ 250లో లేని భారత యూనివర్సిటీలు
లండన్ : ‘ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్లో భారత్ నుంచి ఒక్క విశ్వవిద్యాలయం కూడా చోటు దక్కించుకోలేదు. కాగా, బుధవారం విడుదలైన ఈ జాబితాలో ప్రపంచ అత్యుత్తమ యూనివర్సీటీగా ఆక్స్ఫర్డ్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మాసాచుసెట్స్ నాలుగో స్థానంలో ఉంది. 2019కి సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 250 యూనివర్సీటీలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్ ఇచ్చింది. ఇదిలాఉండగా.. భారత్‌లోని అన్ని యూనివర్సిటీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగుళూరు టాప్‌లో నిలిచింది. ఐఐటీ-ఇండోర్, ఐఐటీ-బాంబే యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోని భారత్.. గతేడాదికంటే కొంత మెరుగు పడింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాబితాలో భారత్‌నుంచి పోయిన సంవత్సరం 42 యూనివర్సీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో 250పైన ర్యాంకులు గల దేశాల జాబితాలో ఇండియా అయిదో స్థానంలో నిలిచింది. ఐఐఎస్సీ బెంగుళూరు 251-300 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతోంది. -
టాప్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఐఐఎస్సీ!
లండన్: బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) విద్యారంగంలో భారత ప్రతిష్ఠను అంతర్జాతీయంగా చాటింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ విద్యలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 యూనివర్సిటీల్లో ఐఐఎస్సీ చోటు సపాందించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎచ్ఈ) ర్యాంకింగ్స్ ఫర్ ఇంజినీరింగ్, టెక్నాలజీ జాబితాలో ఐఐఎస్సీ 99వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా విశ్వవిద్యాలయాలే అత్యధికంగా చోటు సంపాదించాయి. అమెరికాకు చెందిన స్టాన్‌ఫర్డ్, కాల్టెక్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. దేశంలో పేరొందిన ఐఐటీలకు కూడా ఇటీవల అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ర్యాంకులు పెద్దగా రాని విషయం తెలిసిందే. 'ఈ ఏడాది విజయగాథ భారత్‌దే అవుతుంది. ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్, టెక్నాలజీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి భారత యూనివర్సిటీ చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అత్యుత్తమ యూనివర్సిటీలకే ఈ ర్యాంకింగ్ లభిస్తుంది' అని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్ ఎడిటర్ ఫిల్ బాటీ తెలిపారు. 'హైటెక్ రంగాలైన ఐటీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సెక్టర్లతోపాటు, సంప్రదాయ రంగమైన ఉక్కు ఉత్పత్తిలోనూ భారత ఇంజినీరింగ్, సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటుతూనే ఉంది. అదేవిధంగా భారత్‌కు చెందిన కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, టాటా, మిట్టల్ కంపెనీలతోపాటు భారతీయులు నడిపిస్తున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ప్రపంచానికి భారత శక్తిని చాటుతున్నాయి' అని ఆయన చెప్పారు.