హర్యానా, రాజస్ధాన్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పాలక, విపక్షాలకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. రాజస్ధాన్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సఫీయా ఖాన్ విజయం సాధించారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జుబైర్ ఖాన్ భార్య సఫీయా ఖాన్ భారీ ఆధిక్యంతో బీజేపీ అభ్యర్ధిపై ఘనవిజయం సాధించారు.