బ్యాంక్ స్ట్రీట్.. మిశ్రమ ఫలితాలు... | Reliance Securities remains neutral on Bank of Baroda | Sakshi
Sakshi News home page

బ్యాంక్ స్ట్రీట్.. మిశ్రమ ఫలితాలు...

Published Wed, May 13 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

బ్యాంక్ స్ట్రీట్.. మిశ్రమ ఫలితాలు...

బ్యాంక్ స్ట్రీట్.. మిశ్రమ ఫలితాలు...

   యూనియన్ బ్యాంక్...
మొండి బకాయిల భారం

న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని బ్యాంక్  పేర్కొంది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.579 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.444 కోట్లకు తగ్గిందని వివరించింది.  మొండి బకాయిలకు కేటాయింపులు రూ.920 కోట్ల నుంచి రూ.1,009 కోట్లకు పెరిగాయని పేర్కొంది.
 
   యూకో బ్యాంక్...
లాభం 27 శాతం డౌన్
న్యూఢిల్లీ:  యూకో బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 27 శాతం తగ్గింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.285 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.209 కోట్లకు తగ్గిందని  తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,309 కోట్ల నుంచి రూ.5,263 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 4.32 శాతం నుంచి 6.76 శాతానికి, నికర మొండి బకాయిలు 2.38 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగాయని తెలిపింది.
 
   సెంట్రల్ బ్యాంక్...
మొండి బకాయిలు తగ్గాయ్
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ నికర లాభం నాలుగో త్రైమాసిక కాలానికి 7 శాతం పెరిగింది.  2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.162 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.174 కోట్లకు పెరిగిందని  తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,962 కోట్ల నుంచి రూ.7,322 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 6.27 శాతం నుంచి 6.09 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 3.75 శాతం నుంచి 3.61 శాతానికి తగ్గాయి.
 
   విజయ బ్యాంక్...
వేతనాలకు అధిక కేటాయింపులు  
చెన్నై: విజయ బ్యాంక్ నికర లాభం క్యూ4లో 29% తగ్గింది. 2013-14  క్యూ4లో రూ.136 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.97 కోట్లకు తగ్గిందని  విజయ బ్యాంక్ ఎండీ, సీఈఓ కిశోర్ కుమార్ శాన్సి వివరించారు. వేతన పెంపు నిమిత్తం  రూ.208 కోట్ల ఏక మొత్తం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.3,029 కోట్ల నుంచి రూ.3,406 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. షేర్‌కు రూ.1.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement