న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 9వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్, 30వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 19వ ర్యాంకర్ లక్ష్య సేన్, 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.
మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–6, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... ప్రియాన్షు 16–21, 21–16, 21–13తో లక్ష్య సేన్‌కు షాక్ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జి 12–21, 15–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) జోడీ లు తొలి రౌండ్‌ను దాటలేకపోయాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 14–21, 13–21తో నాలుగో ర్యాంక్ జోడీ నమి మత్సుయామ–íÙడా చిహారు (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. టింగ్ యెంగ్–పుయ్ లామ్ యెంగ్ (హాంకాంగ్) జంట 21–6, 21–7తో రితూపర్ణ–శ్వేతపర్ణ జోడీపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment