india open
-
సింధు సులువుగా...
న్యూఢిల్లీ: ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిలకడడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సింధు వరుసగా రెండో విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 21–15, 21–13తో ప్రపంచ 46వ ర్యాంకర్ మనామి సుజి (జపాన్)పై గెలిచింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. తొలి గేమ్‌లో 11–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధుకు ఆ తర్వాత కాస్త ప్రతిఘటన ఎదురైంది. జపాన్ ప్లేయర్ వరుస పాయింట్లు సాధించడంతో సింధు ఆధిక్యం 14–13తో ఒక పాయింట్‌కు చేరింది. ఈ దశలో సింధు చెలరేగి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 17–13తో ముందంజ వేసింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ చేజార్చుకొని ఆ వెంటనే మళ్లీ మూడు పాయింట్లు సాధించింది.అదే జోరులో తొలి గేమ్‌ను 21–15తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు కొనసాగింది. వరు సగా ఐదు పాయింట్లు నెగ్గిన భారత స్టార్ 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు ఆధిక్యం 13–3కు, 17–5కు పెరిగింది. సింధు స్మాష్‌లకు మనామి వద్ద సమాధానం లేకపోయింది. చివరకు రెండో గేమ్‌తోపాటు మ్యాచ్ కూడా సింధు వశమైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ సింధు సత్తాకు పరీక్షగా నిలువనుంది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్ (ఇండోనేసియా)తో సింధు ఆడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 9–3తో మరిస్కాపై ఆధిక్యంలో ఉంది. అయితే చివరిసారి వీరిద్దరు గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో తలపడగా మరిస్కా విజేతగా నిలిచింది. మరో భారత ప్లేయర్ అనుపమ ఉపాధాŠయ్య్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అనుపమ 6–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకొని... పురుషుల సింగిల్స్‌లో బరిలో మిగిలిన ఏకైక భారత ప్లేయర్ కిరణ్ జార్జి సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ అలెక్స్ లానీర్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ కిరణ్ జార్జి 22–20, 21–13తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కేరళకు చెందిన కిరణ్ తొలి గేమ్‌లో 14–20తో వెనుకబడ్డాడు. ఈ దశలో కిరణ్ అనూహ్యంగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకోవడం విశేషం. తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (ఇండోనేసియా)ను ఓడించిన అలెక్స్ ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను చేజార్చుకున్నాక గాడి తప్పాడు. రెండో గేమ్‌లో కిరణ్ ఆరంభం నుంచే జోరు ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ హాంగ్ యాంగ్ వెంగ్‌తో కిరణ్ ఆడతాడు. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 20–22, 21–14, 21–16తో కెన్యా మిత్సుహాషి–హిరోకి ఒకమురా (జపాన్) జంటపై గెలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌లో 20–19తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు సమర్పించుకొని గేమ్‌ను కోల్పోయారు. అయితే రెండో గేమ్ నుంచి భారత జోడీ అతి విశ్వాసం కనబర్చకుండా జాగ్రత్తగా ఆడింది. స్కోరు 15–13 వద్ద సాత్విక్–చిరాగ్ చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 19–13తో ముందంజ వేశారు. అదే జోరులో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో భారత జోడీ 1–4తో వెనుకబడ్డా వెంటనే తేరుకుంది. నిలకడగా రాణించి 13–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. మహిళల డబుల్స్‌లో ముగిసిన పోరు మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) 9–21, 21–23తో యుకీ ఫకుషిమా–మయు మత్సుమితో (జపాన్)లపై, రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) 6–21, 7–21తో హా నా బేక్–సో హీ లీ (దక్షిణ కొరియా) చేతిలో... అశ్విని భట్–శిఖా గౌతమ్ (భారత్) 7–21, 10–21తో యి జింగ్ లీ–జు మిన్ లువో (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) 18–21, 17–21తో హిరోకి మిదోరికవా–నత్సు సైతో (జపాన్) చేతిలో... అశిత్ సూర్య–అమృత (భారత్) 8–21, 11–21తో పో సువాన్ యాంగ్–లింగ్ ఫాంగ్ యు (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. -
సింధు బోణీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాజీ చాంపియన్ సింధు 21–12, 22–20తో షువో యున్ సుంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో మనామి షిజు (జపాన్)తో సింధు ఆడుతుంది. భారత్‌కే చెందిన అనుపమ ఉపాధ్యాయ్ ముందంజ వేయగా... మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. అనుపమ 21–17, 21–18తో రక్షిత శ్రీ (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక 22–20, 16–21, 11–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 17–21, 13–21తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్ 15–21, 10–21తో చున్ యి లిన్ (చైనీస్ తైపీ) చేతిలో, ప్రణయ్ 21–16, 18–21, 12–21తో లీ యాంగ్ సు (చైనీస్ తైపీ) చేతిలో, ప్రియాన్షు 16–21, 22–20, 13–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి 21–19, 14–21, 27–25తో యుషీ తనాకా (జపాన్)పై గెలిచాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ 23–21, 19–21, 21–16తో వె చోంగ్ మాన్–కాయ్ వున్ తీ (మలేసియా)లపై నెగ్గారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 21–23, 19–21తో అరీసా ఇగారషి–అయాకో సకురామోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
భారత్ నుంచి 21 మంది బరిలోకి
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇండియా ఓపెన్ ఈసారి స్టార్ ఆటగాళ్లతో కళకళలాడనుంది. ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 21 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత నెలలో వివాహం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీతో కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. సింధు, లక్ష్యసేన్‌తోపాటు పారిస్ ఒలింపిక్ చాంపియన్స్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), అన్ సె యంగ్ (దక్షిణ కొరియా), ప్రపంచ నంబర్‌వన్ షి యుకి (చైనా) వంటి అంతర్జాతీయ స్టార్లు ఇందులో భాగం కానున్నారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో ముగ్గురు, మహిళల సింగిల్స్‌లో నలుగురు, పురుషుల డబుల్స్‌లో రెండు జోడీలు, మహిళల డబుల్స్‌లో 8 జంటలు, మిక్స్డ్ డబుల్స్‌లో 4 జోడీలు టోర్నీలో ఆడనున్నాయి. ‘ఈ టోర్నీలో చాలా మంది భారత షట్లర్లు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత బ్యాడ్మింటన్ పురోభివృద్ధికి ఇది సంకేతం. ఈ ఏడాది పురుషుల సింగిల్స్‌లో టాప్–20 నుంచి 18 మంది, మహిళల సింగిల్స్‌లో టాప్–20 నుంచి 14 మంది ఈ టోర్నీలో ఆడనున్నారు. ఇప్పటికే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు కూడా మరిన్ని విజయాలు సాధిస్తారనే నమ్మకముంది’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. భారత ఆటగాళ్ల జాబితా పురుషుల సింగిల్స్: లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్. మహిళల సింగిల్స్: పీవీ సింధు, మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ్, ఆకర్షి కశ్యప్. పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, సాయి ప్రతీక్–పృథ్వీరాయ్. మహిళల డబుల్స్: పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో, రుతుపర్ణ–శ్వేతపర్ణ, మానస రావత్–గాయత్రి రావత్, అశ్విని భట్–శిఖా గౌతమ్, సాక్షి–అపూర్వ, సానియా సికందర్–రష్మీ గణేశ్, మృణ్మయీ దేశ్‌పాండే–ప్రేరణ అల్వేకర్. మిక్స్డ్ డబుల్స్: ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, సతీశ్ కుమార్–ఆద్య వరియత్, రోహన్ కపూర్–రుత్వివక శివాని, అశిత్ సూర్య–అమృత. -
India Open 2024: ప్రణయ్, ప్రియాన్షు శుభారంభం
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 9వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్, 30వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 19వ ర్యాంకర్ లక్ష్య సేన్, 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–6, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... ప్రియాన్షు 16–21, 21–16, 21–13తో లక్ష్య సేన్‌కు షాక్ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జి 12–21, 15–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) జోడీ లు తొలి రౌండ్‌ను దాటలేకపోయాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 14–21, 13–21తో నాలుగో ర్యాంక్ జోడీ నమి మత్సుయామ–íÙడా చిహారు (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. టింగ్ యెంగ్–పుయ్ లామ్ యెంగ్ (హాంకాంగ్) జంట 21–6, 21–7తో రితూపర్ణ–శ్వేతపర్ణ జోడీపై గెలిచింది. -
భారత్ పోరాటం ముగిసె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ గాయంతో వైదొలగగా... కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట కూడా నిరాశపరిచింది. గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఏడో సీడ్ లక్ష్యసేన్ 21–16, 15–21, 18–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 9–21, 12–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫె (చైనా) ధాటికి నిలువలేకపోయింది. మహిళల డబుల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట 9–21, 16–21తో ఆరో సీడ్ జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో గరగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 14–21, 10–21తో లియాంగ్ వి కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఇంటిదారి పట్టింది. సాత్విక్ సాయిరాజ్ తుంటిగాయం వల్ల చిరాగ్ షెట్టితో కలిసి బరిలోకి దిగలేకపోయాడు. దీంతో చైనాకే చెందిన లియు చెన్–జువాన్ యి జంట వాకోవర్‌తో ముందంజ వేసింది. -
India Open 2023: శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 14–21, 19–21తో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్‌కిది పదో పరాజయం కావడం గమనార్హం. 2017లో డెన్మార్క్ ఓపెన్‌లో చివరిసారి అక్సెల్సన్ను ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ డెన్మార్క్ ప్లేయర్ చేతిలో వరుసగా ఏడోసారి ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక (భారత్) 17–21, 12–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో... ఆకర్షి 15–21, 12– 21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని –శిఖా (భారత్) 8–21, 11–21తో పియర్లీ తాన్–థినా (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
సాత్విక్–చిరాగ్ జంట సంచలనం.. టైటిల్ సొంతం.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
India Open 2022: బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్లో ... అదీ సొంతగడ్డపై భారత షట్లర్లు అద్భుతం చేశారు. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో భారత్‌కు రెండు టైటిల్స్ అందించారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి ద్వయం ప్రపంచ రెండో ర్యాంక్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన మొహమ్మద్ ఎహ్సాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్)ను కంగుతినిపించి భారత యువస్టార్ లక్ష్య సేన్ విజేతగా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ శెట్టి 21–16, 26–24తో టాప్ సీడ్ ఎహ్సాన్–సెతియవాన్ జోడీ ని ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టికిది రెండో సూపర్ –500 స్థాయి టైటిల్ కావడం విశేషం. 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జోడీ అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఎహ్సాన్–సెతియవాన్ జంటతో 43 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం కీలకదశలో పట్టు కోల్పోకుండా ఓర్పుతో ఆడింది. తొలి గేమ్‌లో స్కోరు 13–13తో సమంగా ఉన్న దశలో సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో రెండు జోడీలు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడాయి. చివరకు భారత జోడీనే పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 31,600 డాలర్లు (రూ. 23 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత నెలలో కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన లో కీన్ యుతో 54 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 24–22, 21–17తో గెలుపొంది కెరీర్లో తొలి సూపర్–500 టైటిల్ సాధించాడు. గత నెలలో ప్రపంచ చాంపియన్ షిప్లో కాంస్యం నెగ్గిన 20 ఏళ్ల లక్ష్య సేన్ ఫైనల్లో ఆద్యంతం నిలకడగా ఆడాడు. తొలి గేమ్‌లో 19–20, 21–22 వద్ద రెండుసార్లు గేమ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కిన లక్ష్య సేన్ రెండో గేమ్‌లో మాత్రం లో కీన్ యుపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. విజేతగా నిలిచిన లక్ష సేన్‌కు 30 వేల డాలర్లు (రూ. 22 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు 14–21, 21–13, 10–21 తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!? How Lakshya Sen won his first World Tour 500 title on his debut at the India Open 🥇 (via @bwfmedia) pic.twitter.com/02od3Arg73 — ESPN India (@ESPNIndia) January 16, 2022 -
సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్లు, భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 24 నుంచి జరుగనున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో 2017 చాంపియన్ పీవీ సింధు హాంకాంగ్‌కు చెందిన చెంగ్ నాన్ యితో ఆడనుంది. చెంగ్‌పై పైచేయి సాధిస్తే క్వార్టర్స్‌లో ఆమెకు ఏడో సీడ్ మిచెల్లీ లీ (కెనడా) ఎదురుపడే అవకాశముంది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ఈ టోర్నీ బరిలోకి దిగనున్న 2015 ఇండియా ఓపెన్ విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో పెయ్ యి పు (హాంకాంగ్)తో తలపడనుంది. అంతా సవ్యంగా జరిగితే ఆమెకు రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హ్యూన్ (కొరియా) రూపంలో పెద్ద పరీక్ష ఎదురుగా నిలిచింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోన్న భారత స్టార్ ప్లేయర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లో క్వాలిఫయర్ ఎదురుపడ్డాడు. తర్వాత రౌండ్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో శ్రీకాంత్ ఆడాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం టోక్యోకు అర్హత పొందాలంటే ఏప్రిల్ 28లోగా ర్యాంకింగ్స్‌లో టాప్–16లో చోటు దక్కించుకోవాలి. దీంతో మాజీ ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ శ్రీకాంత్‌కు ఈ టోర్నీ ప్రదర్శన కీలకంగా మారింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హెచ్ఎస్ ప్రణయ్‌తో మూడో సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్, సిత్తికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ, ఏడో సీడ్ వాంగ్ జు వెయ్ (చైనీస్ తైపీ)తో సౌరభ్ వర్మ, ఖోసిత్ పెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)తో పారుపల్లి కశ్యప్ ఆడనున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట తొలి రౌండ్లో జపాన్ జోడీ టకురో హోకి–యుగో కొబయాషితో ఆడుతుంది. మరోవైపు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతగా పరిగణించే ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే క్వాలిఫయింగ్ టోర్నీలను నిలిపివేసే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) పేర్కొంది. ఇప్పటికే వైరస్ కారణంగా నాలుగు ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. చైనా మాస్టర్స్, వియత్నాం ఇంటర్నేషనల్ చాలెంజ్, జర్మన్ ఓపెన్, పోలిష్ ఓపెన్ టోర్నీ తేదీలను సవరించారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 3000 మంది మృతి చేందారు. -
రన్నరప్ శ్రీకాంత్
న్యూఢిల్లీ: చాన్నాళ్ల తర్వాత టైటిల్ బాట పట్టాలనుకున్న భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆశలపై విక్టర్ అక్సెల్సన్ నీళ్లుచల్లాడు. దీంతో ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో మాజీ చాంపియన్ శ్రీకాంత్ 7–21, 20–22తో డెన్మార్క్‌కు చెందిన రెండో సీడ్ అక్సెల్సన్ చేతిలో పరాజయం చవి చూశాడు. 17 నెలల తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్లో ఫైనల్ చేరిన మూడో సీడ్ శ్రీకాంత్ టైటిల్ వేటలో చతికిలబడ్డాడు. తొలి గేమ్‌లో లెక్కలేనన్ని అనవసర తప్పిదాలు చేయడంతో పాటు ప్రత్యర్థి జోరుకు తలవంచాడు. 11–7తో భారత ఆటగాడిపై ఆధిక్యం కనబరిచిన అక్సెల్సన్ అదే ఊపుతో వరుసగా పాయింట్లు సాధించాడు. ఈ గేమ్‌లో రిటర్న్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు నేర్పుగా ఆడటంలో శ్రీకాంత్ విఫలమయ్యాడు. ఇదే అదనుగా డెన్మార్క్ స్టార్ 21–7తో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో మాత్రం శ్రీకాంత్ పుంజుకున్నాడు. ఒక దశలో ఆరంభంలో 1–5తో వెనుకబడినా... తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి టచ్‌లోకి వచ్చాడు. విరామ సమయానికి 9–11తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఆ తర్వాత ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో 12–12 వద్ద స్కోరు సమం చేసిన భారత ఆటగాడు 14–13తో అక్సెల్సన్పై ఆధిక్యంలోకి వచ్చాడు. స్మాష్‌లతో మరో రెండు పాయింట్లు సాధించాడు. అయితే రిటర్న్ షాట్లను నేర్పుగా ఆడగలిగే అక్సెల్సన్ మరో గేమ్‌దాకా పొడిగించకుండానే వరుస పాయింట్లతో గేమ్‌ను, మ్యాచ్‌ను ముగించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) గెలుచుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్ రచనోక్ 21–15, 21–14తో మూడో సీడ్ హి బింగ్ జియావో (చైనా)పై విజయం సాధించింది. -
ఫైనల్‌కు శ్రీకాంత్
న్యూఢిల్లీ: తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ ఒక మేజర్ టోర్నీలో ఎట్టకేలకు ఫైనల్ చేరాడు. 17 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత తాజా ఇండియా ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. 2017 అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక మరే ఇతర బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో ఫైనల్ చేరలేకపోయాడు. గతేడాది కామన్వెల్త్గేమ్స్లో ఫైనల్లోకి అడుగుపెట్టి రజతంతో సరిపెట్టుకున్నాడు. మరో వైపు భారత టాప్‌స్టార్, రెండో సీడ్ పీవీ సింధుతో పాటు పారుపల్లి కశ్యప్‌కు సెమీ ఫైనల్లోనే చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 14–21 21–16, 21–19తో చైనాగోడ హువాంగ్ యుజియంగ్‌ను దాటేశాడు. మూడు గేమ్‌ల పాటు జరిగిన ఈ పోరులో మూడో సీడ్ శ్రీకాంత్‌కు గట్టి పోటీ ఎదురైంది. ప్రత్యర్థి జోరుతో తొలి గేమ్‌ను కోల్పోయిన ఏపీ ఆటగాడు రెండో సెట్లో పట్టుదలగా శ్రమించాడు. ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని చాటాడు. 8–4తో ఆధిక్యంలోకి వచ్చిన 26 ఏళ్ల శ్రీకాంత్ స్మాష్, క్రాస్‌కోర్ట్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. హువాంగ్ను అదేస్కోరుపై నిలువరించి 11–4తో దూసుకెళ్లాడు. రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ హోరాహోరీగా జరిగింది. దీంతో స్కోరు 18–18తో సమమైంది. ఈ దశలో ప్రత్యర్థి పొరపాట్ల నుంచి లబ్దిపొందిన శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో భారత ఆటగాడు... డెన్మార్క్‌కు చెందిన రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో సెమీఫైనల్లో అక్సెల్సన్ వరుస గేముల్లో పారుపల్లి కశ్యప్‌ను ఇంటిదారి పట్టించాడు. భారత ఆటగాడు 11–21, 17–21తో విక్టర్ అక్సెల్సన్ ధాటికి తలవంచాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ పూసర్ల వెంకట సింధు పోరాడి ఓడింది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో ఆమె 21–23, 18–21తో మూడో సీడ్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓటమి పాలైంది. -
సిక్కి–అశ్విని జంట శుభారంభం
నేడు జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో థమాసిన్ (థాయ్‌లాండ్)తో గురుసాయిదత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; కార్తికేయ్ (భారత్)తో సాయిప్రణీత్; లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో పారుపల్లి కశ్యప్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో రాహుల్ యాదవ్ తలపడతారు. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చనాన్‌చిదా జుచారోయెన్ (థాయ్‌లాండ్)తో గుమ్మడి వృశాలి; ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో చుక్కా సాయిఉత్తేజిత రావు; హి బింగ్జియావో (చైనా)తో ప్రాషి జోషి; ముగ్ధా ఆగ్రేతో పీవీ సింధు ఆడతారు. న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళల డబుల్స్ నంబర్‌వన్ జంట నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం మొదలైన ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సంచలన విజయంతో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి– అశ్విని ద్వయం 22–20, 21–19తో ఆరో సీడ్, ప్రపంచ 18వ ర్యాంక్ జోడీ లి వెన్మె–జెంగ్ యు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర డబుల్స్ మ్యాచ్‌ల్లో రాచపల్లి లీలాలక్ష్మి–వర్ష బేలవాడి (భారత్) ద్వయం 2–21, 7–21తో కితితారకుల్–రవింద (థాయ్‌లాండ్) జోడీ చేతిలో... జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జంట 16–21, 19–21తో లైసువాన్–మింగ్‌చువా (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయాయి. మెయిన్ ‘డ్రా’కు రాహుల్ యాదవ్, ప్రాషి ఊహించినట్టే క్వాలిఫయింగ్ విభాగంలో ఆతిథ్య భారత క్రీడాకారులు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌లలో అందుబాటులో ఉన్న మొత్తం ఎనిమిది బెర్త్‌లను భారత క్రీడాకారులే సంపాదించడం విశేషం. పురుషుల డబుల్స్‌లో నాలుగు, మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్డ్ డబుల్స్‌లో మరో మూడు బెర్త్‌లు భారత్ ఖాతాలోకే వచ్చాయి. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్‌తోపాటు కార్తీక్ జిందాల్, సిద్ధార్థ్ ఠాకూర్, కార్తికేయ్ గుల్షన్ కుమార్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌లో రాహుల్ తొలి మ్యాచ్‌లో 21–11, 21–12తో రేపూడి అనీత్ కుమార్ (భారత్)పై, రెండో మ్యాచ్‌లో 21–14, 21–15తో అనంత్ శివం జిందాల్ (భారత్)పై గెలుపొందాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సిద్ధార్థ్ ఠాకూర్ 21–6, 21–13తో గుర్ప్రతాప్ సింగ్ (భారత్)పై, కార్తీక్ 21–12, 21–23, 21–19తో దున్నా శరత్ (భారత్)పై, కార్తికేయ్ 21–16, 21–13తో సిద్ధార్థ్ (భారత్)పై విజయం సాధించారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 21–14, 21–17తో శ్రుతి ముందాడ (భారత్)పై, రితిక 21–6, 21–6తో దోహ హనీ (ఈజిప్ట్)పై గెలిచారు. భారత్‌కే చెందిన రియా ముఖర్జీ, వైదేహిలకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించింది. -
ఫైనల్లో పోరాడి ఓడిన సింధు
సాక్షి, న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ను నెగ్గి ఈ ఏడాది సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలనుకున్న భారత ప్లేయర్ పీవీ సింధు ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడోర్యాంకర్, టాప్ సీడ్, సింధు 18–21, 21–11, 20–22తో ఐదోసీడ్, బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో తడబడిన భారతస్టార్ తగిన మూల్యం చెల్లించకుంది. మ్యాచ్ పాయింట్‌ను కోల్పోయి.. నిర్ణయాత్మక మూడోగేమ్‌లో ఓ దశలో 20–19తో మ్యాచ్ పాయింట్ ముందు నిలిచిన సింధు తడబడి ఓటమిపాలైంది. తొలిగేమ్ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచిన సింధు.. అనంతరం పోరాడి 5–5తో సమం చేసింది ఈదశలో పుంజుకున్న బీవెన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి 8–5తో నిలిచింది. ఈ స్థితిలో పోరాటపటిమ ప్రదర్శించి భారతస్టార్ 9–8తో ముందంజ వేసింది. అనంతరంన క్రమంగా 12–10తో ఆధిపత్యం ప్రదర్శించింది. ఈదశలో ఇరువురు పోరాడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. చివరకు 19–18తో ఆధిక్యంలో నిలిచన అమెరికన్ ప్లేయర్.. వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలిగేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండోగేమ్‌లో సింధు జూలు విదిల్చింది. కచ్చితమైన షాట్లతో భారత స్టార్ చెలరేగడంతో బీవెన్ వద్ద సమాధానం లేకపోయింది. ఈ దశలో 13–10తో ముందంజలో నిలిచిన సింధు వరసగా పాయింట్లు సాధించి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడోగేమ్ ఆరంభంలో 4–9తో వెనుకంజలో నిలిచిన సింధు.. అనంతరం పోరాడి స్కోరును సమం చేసింది. ఈదశలో ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. చివరకు 19–20తో ఓటమి అంచున నిలిచిన బీవెన్.. వరుసగా మూడుపాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో నాలుగోసీడ్, షి యుఖి (చైనా) 21–18, 21–14తో మూడోసీడ్, చై తియాన్ చెన్ (చైనీస్‌తైపీ)పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో మూడోసీడ్, ఇండోనేసియా ద్వయం, గ్రెసియా పోలి–అప్రియాని రహయూ విజేతగా నిలవగా.. పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్, ఇండోనేసియా ద్వయం, మార్కస్ ఫెర్నాల్డి–కెవిన్ సంజయ చాంపియన్‌గా అవతరించింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఐదోసీడ్, డెన్మార్క్ జోడీ, మథియాస్ క్రిస్టియన్సెన్–క్రిస్టీనా పెడర్సన్ విజేతగా నిలిచింది. -
ఇండియా ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు
ఈ ఏడాది తాను ఆడుతోన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్ ఇండియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21–13, 21–15తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు ఆడుతుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 16–21, 19–21తో క్రిస్టియాన్సన్–క్రిస్టినా (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఫేవరెట్స్ సింధు, సైనా
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత టాప్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో మాజీ చాంపియన్లయిన వీరిద్దరితో పాటు భారత అగ్రశ్రేణి క్రీడాకారులంతా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సన్ చివరి నిమిషంలో వైదొలిగాడు. తొలి రోజు మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సీజన్‌ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించిన 2015 చాంపియన్ సైనా ఇండోనేసియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. చీలమండ గాయంతో సతమతమైన ఆమె గతేడాది పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాక బరిలోకి దిగి ఇండోనేసియా టోర్నీలో ఫైనల్‌దాకా పోరాడింది. సైనా... ఒక్క ఫైనల్ మినహా ప్రతీ మ్యాచ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఇదే ఉత్సాహాన్ని స్వదేశంలోనూ కనబరచాలని ఆశిస్తోంది. నాలుగో సీడ్ సైనా తొలి మ్యాచ్‌లో సోఫీ డాల్ (డెన్మార్క్)తో తలపడుతుంది. రియో ఒలింపిక్స్ నుంచి సంచలన ఆటతీరుతో అదరగొడుతున్న సింధు గత సీజన్లో మూడు టైటిల్స్ గెలిచింది. మరో మూడింటిలో రన్నరప్‌గా నిలిచింది. ఇండోనేసియా టోర్నీ క్వార్టర్స్‌లో సైనా చేతిలో ఓడిన సింధు ఇండియా ఓపెన్ ద్వారా తన ఫామ్ చాటుకోవాలని భావిస్తోంది. తొలిరౌండ్లో నటాలియా రోడ్ (డెన్మార్క్)తో సింధు పోటీపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్శ్రీకాంత్ తొలి రౌండ్లో లీ చుక్ యి (హాంకాంగ్)తో తలపడతాడు. గాయంతో ఇండోనేసియా మాస్టర్స్ ఈవెంట్ నుంచి తప్పుకున్న ఈ మాజీ చాంపియన్ (2014) ఇండియా ఓపెన్ ద్వారా పుంజుకోవాలని తహతహలాడుతున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్... రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో, కశ్యప్... క్రిస్టియన్ (డెన్మార్క్)తో, జయరామ్... సుగియార్తో (ఇండోనేసియా)తో పోటీపడతారు. -
ఇండియా ఓపెన్‌పై శ్రీకాంత్ కన్ను
న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించాలనుకుంటున్నాడు. సంచలన ఆటతీరుతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి దూసుకొచ్చిన అతను తదనంతరం గాయంతో 31వ ర్యాంకుకు పడిపోయాడు. ఈ నేపథ్యంలో గ్లాస్గోలో జరగనున్న ఆ ఈవెంట్లో బరిలోకి దిగాలంటే వచ్చే నెల 27 కటాఫ్ తేదీకల్లా తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సి వుంటుంది. దీంతో అతను ఇండియా ఓపెన్ సహా మలేసియా, సింగపూర్ టోర్నీల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందేందుకు ఈ మూడు టోర్నీలు తనకు కీలకమని శ్రీకాంత్ చెప్పాడు. ‘ఇప్పుడైతే నేను ఇండియా ఓపెన్‌పైనే దృష్టి పెట్టాను. ఇటీవల జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఈవెంట్లలో ఆడటం ద్వారా తదుపరి టోర్నీలకు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. తప్పకుండా ఇండియా ఓపెన్‌లో రాణిస్తాను’ అని అన్నాడు. ఈ నెల 28 నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీలో తనకు క్లిష్టమైన డ్రా ఎదురైనప్పటికీ ఎలాంటి ఆందోళన లేదన్నాడు. ఎలాంటి టార్గెట్లు లేకుండా బరిలోకి దిగుతానని, ప్రస్తుతానికి తొలి రౌండ్‌పైనే దృష్టిపెట్టానని చెప్పాడు. ఇక్కడ 2015లో శ్రీకాంత్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ‘కాలి పాదం గాయం తర్వాత మళ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయా. కానీ ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుకునేందుకు నాకు కావాల్సిన సమయం లభించింది. ఇపుడు ప్రతీరోజు నా ఫిట్నెస్ మెరుపరుచుకునేందుకే ఎక్కువ శ్రమిస్తున్నా. ఇటీవల ఆడిన రెండు ఈవెంట్లతో నాకు కావాల్సిన మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభించింది. ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది’ అని 24 ఏళ్ల శ్రీకాంత్ అన్నాడు. ప్రస్తుత ర్యాంకుపై కలవరపడటం లేదని, దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తనకు తెలుసన్నాడు. టోర్నీల్లో మంచి ఫలితాలు సాధిస్తే ఆటోమెటిక్‌గా ర్యాంకూ మెరుగవుతుందన్నాడు. రెండేళ్ల క్రితం ఇక్కడ విజేతగా నిలిచిన తనకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నాడు. అయితే ఈ రెండేళ్లలో ఎంతో మంది యువకులు తెరపైకి వచ్చారని కాబట్టి 100 శాతం అంకితభావాన్ని ప్రదర్శించాల్సి వుంటుందని చెప్పాడు. -
అ‘ద్వితీయం’
నిరీక్షణ ఫలించింది. కల నిజమైంది. సంబరం రెట్టింపైంది. ‘మన రాకెట్’ మళ్లీ మెరిసింది. ఇంతకాలం విదేశీ గడ్డపై సత్తా చాటుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సొంత అభిమానుల సమక్షంలో అద్వితీయ ఆటతీరుతో అబ్బుర పరిచారు. గతేడాది చైనా ఓపెన్‌లో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని ఇండియా ఓపెన్‌లోనూ పునరావృతం చేశారు. ఏకకాలంలో ఒకే సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్‌ను రెండోసారి సొంతం చేసుకొని సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వారెవ్వా అనిపించారు. న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ ప్రారంభమై నాలుగేళ్లు గడిచాయి. సొంతగడ్డపై భారత క్రీడాకారులకు ఈ టోర్నీ చేదు ఫలితాలనే ఇచ్చింది. ఇన్నాళ్లూ ఏ విభాగంలోనూ మనోళ్లు సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. అయితే ఐదో యేట అందరి అంచనాలు తారుమారయ్యాయి. అటు మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్... ఇటు పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ చాంపియన్స్‌గా అవతరించి ‘ఔరా’ అనిపించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సైనా 21-16, 21-14తో ప్రపంచ మాజీ చాంపియన్, మూడో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)పై నెగ్గగా... ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 18-21, 21-13, 21-12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. విజేతలుగా నిలిచిన సైనా, శ్రీకాంత్‌లకు 20,625 డాలర్ల చొప్పున (రూ. 12 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో ఆడిన నాలుగు పర్యాయాల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైన సైనా ఈసారి ఏకంగా విజేతగా నిలిచింది. భుజం నొప్పితో బాధపడుతున్నా ఈ హైదరాబాద్ అమ్మాయి పట్టుదలగా పోరాడి తన ఖాతాలో తొమ్మిదో ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను జమచేసుకుంది. సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఓడించిన రత్చనోక్‌ను తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే సైనా పక్కా ప్రణాళికతో ఆడింది. చురుకైన కదలికలు, నెట్ వద్ద అప్రమత్తత, పదునైన స్మాష్‌లు సంధిస్తూ నిలకడగా పాయింట్లు సాధించింది. రత్చనోక్ అనవసర తప్పిదాలు, అభిమానుల మద్దతు కూడా లభించడంతో రెండు గేముల్లోనూ సైనా స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచి 49 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించింది. టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం. రెండు వారాల క్రితం విక్టర్ అక్సెల్సన్ను ఓడించి స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ కుర్రాడు శ్రీకాంత్ మళ్లీ అలాంటి ఫలితాన్ని భారత్‌లోనూ పునరావృతం చేశాడు. తొలి గేమ్‌లో తడబడిన శ్రీకాంత్ రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. అక్సెల్సన్ జోరుకు పగ్గాలు వేస్తూ నిలకడగా పాయింట్లు స్కోరు చేశాడు. అదే జోరులో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ ప్రారంభంలో శ్రీకాంత్ 3-7తో వెనుకబడ్డాడు. ఈ దశలో ఏమాత్రం కంగారు పడకుండా ఆడిన శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించాడు. 10-12తో వెనుకబడిన దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. కసితీరా ఆడుతూ ఎవ్వరూ ఊహించని విధంగా వరుసగా 11 పాయింట్లు నెగ్గి అక్సెల్సన్ను నిశ్చేష్టుడిని చేశాడు. 55 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించి తన ఖాతాలో రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను జమచేసుకున్నాడు. ‘బాయ్’ నజరానా గురువారం విడుదలయ్యే తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనున్న సైనా నెహ్వాల్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఇండియా ఓపెన్ నెగ్గినందుకు శ్రీకాంత్‌కు రూ. 5 లక్షలు అందజేస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా తెలిపారు. కల నిజమైంది... ‘‘ఇండియా ఓపెన్ టైటిల్ నెగ్గడంతో గత నాలుగేళ్ల నుంచి నాపై ఉన్న భారం తొలగిపోయింది. గత నాలుగేళ్లుగా విఫలమవుతున్న టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరడమే కాకుండా విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. సొంతగడ్డపై నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం... ఇండియా ఓపెన్ గెలవడంతో నా కల నిజమైంది. నా ఆటతీరుపట్ల గర్వంగా ఉన్నాను. ఎంతో కష్టపడ్డాక నేనీ స్థాయికి చేరుకున్నాను. నా జీవితంలో ఇవి మధుర క్షణాలు. ఈ గెలుపు నాలోని విజయకాంక్షను రెట్టింపు చేస్తుంది. మరిన్ని టైటిల్స్ నెగ్గేందుకు ప్రేరణలా నిలుస్తుంది. ఈ విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను. ఐస్‌క్రీమ్ తింటాను. మిల్క్ షేక్ తాగుతాను. చాక్లెట్ తింటాను. సోమవారం విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెడతాను. తదుపరి టోర్నీలో ఆడేందుకు మలేసియాకు బయలుదేరుతాను.’’ -సైనా నెహ్వాల్ నంబర్‌వన్ సాధిస్తా.... ‘‘ప్రతిసారీ గెలుస్తానని అనుకోను. ఓడిపోతే భయపడను. బరిలోకి దిగిన ప్రతిసారీ నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషి చేస్తాను. ఈ తరహా దృక్పథమే నాకు విజయాలు అందిస్తోంది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించాలనే లక్ష్యం నా మదిలో ఉంది. నిలకడగా మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్‌లో ఈ ఘనత సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇలాంటి విజయాలు నాలో కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మున్ముందు మరిన్ని టోర్నమెంట్లలో మెరుగ్గా ఆడేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి.’’ -శ్రీకాంత్ -
ఫైనల్లో సైనా, శ్రీకాంత్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో మహిళల, పురుషుల విభాగాల్లో సైనా, కిడాంబి శ్రీకాంత్‌లు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్‌సీడ్ సైనా 21-15, 21-11తో యు హాషిమోటో (జపాన్)పై గెలవగా, రెండోసీడ్ శ్రీకాంత్ 21-16, 21-13తో క్వాలిఫయర్ జుయ్ సాంగ్ (చైనా)ను ఓడించాడు. హాషిమోటోతో 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా సుదీర్ఘమైన ర్యాలీలతో పాటు చక్కటి డ్రాప్ , డీప్ షాట్లు, రిటర్న్స్‌తో ఆకట్టుకుంది. తొలి గేమ్‌లో 18-12 ఆధిక్యం తర్వాత సైనా సర్వీస్ ఫాల్ట్‌లు చేసింది. కానీ చివర్లో హాషిమోటో రెండు అనవసర తప్పిదాలు చేయడంతో హైదరాబాద్ అమ్మాయి గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ కొనసాగిన జపాన్ క్రీడాకారిణి తప్పిదాలను ఆసరాగా చేసుకున్న సైనా 11-2 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సునాయాసంగా నెగ్గింది. ఫైనల్లో సైనా... రత్చనోక్ (థాయ్‌లాండ్)తో ఆడుతుంది. సాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఆరంభంలో కాస్త వెనుకబడినా బాగా పుంజుకున్నాడు. 4-4, 7-7తో స్కోరు సమమైన తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఓ దశలో సాంగ్ 16-17తో దూసుకొచ్చినా.. భారత కుర్రాడి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. రెండో గేమ్‌లో సాంగ్ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లినా.. శ్రీకాంత్ వరుస పాయింట్లతో 9-9తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మరింత దూకుడు పెంచి సాంగ్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ గెలిచాడు. ఫైనల్లో శ్రీకాంత్... అక్సెల్సెన్ (డెన్మార్క్)తో తలపడతాడు. -
సెమీస్‌లో సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సైనా 21-15, 21-12తో హనా రమదిని (ఇండోనేసియా)పై విజయం సాధించింది. కాగా పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్లు గురుసాయి దత్, ప్రణోయ్ ఓటమిచెందారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రణోయ్ 21-16, 9-21, 18-21తో విక్టర్ అగ్జెల్సెన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో గురుసాయి 21-15 18-21 13-21 ఝూ సోంగ్ చేతిలో ఓడిపోయాడు. -
ప్రణయ్ సంచలనం
ప్రపంచ రెండో ర్యాంకర్‌పై గెలుపు న్యూఢిల్లీ: అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార హెచ్ఎస్ ప్రణయ్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ ప్రణయ్ 18-21, 21-14, 21-14తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రణయ్‌తోపాటు హైదరాబాద్ ఆటగాళ్లు రెండో సీడ్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే కశ్యప్‌కు మాత్రం ఓటమి ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21-12, 15-21, 21-15తో కెంటో మోమోటా (జపాన్)పై నెగ్గాడు. ఈ గెలుపుతో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తొలి రౌండ్లో మోమోటా చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ అతికష్టమ్మీద 18-21, 21-19, 21-18తో క్వాలిఫయర్ సమీర్ వర్మ (భారత్)పై గెలిచాడు. కశ్యప్ 17-21, 11-21తో జుయ్ సాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సైనా 21-16, 21-17 తో హైదరాబాద్‌కే చెందిన గద్దె రుత్విక శివానిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కోనా తరుణ్-సంతోష్ రావూరి ద్వయం 12-21, 11-21తో నాలుగో సీడ్ లియు జియోలాంగ్-కియు జిహాన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
టాప్ ర్యాంక్‌పై సైనా గురి
నేటి నుంచి ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ దక్కించుకోవాలనే రెండు లక్ష్యాలతో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్‌లో బరిలోకి దిగుతోంది. మంగళవారం మొదలయ్యే ఈ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా ఫైనల్‌కు చేరితే తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సైనాతోపాటు ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)కు కూడా ఈ టోర్నీ ద్వారా టాప్ ర్యాంక్‌ను అందుకునే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే చెరో పార్శ్వం నుంచి సైనా, కరోలినా ఫైనల్‌కు చేరుకోవచ్చు. తొలి రౌండ్లో సైనా క్వాలిఫయర్‌తో; కరోలినా భారత్‌కు చెందిన నేహా పండిత్‌తో ఆడతారు. సైనాతోపాటు మహిళల విభాగంలో భారత్ తరఫున తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని, సయాలీ గోఖలే, రియా పిళ్లై, పి.సి.తులసీ, శ్రుతి ముందాడ, శైలి రాణే, ముద్ర ధైన్జి, తన్వీ లాడ్ పాల్గొంటున్నారు. ఇండియా ఓపెన్‌లో ఆడిన నాలుగు పర్యాయాల్లోనూ సైనా ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో స్విస్ ఓపెన్ విజేత కిడాంబి శ్రీకాంత్‌తోపాటు పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్, ఆనంద్ పవార్ బరిలో ఉన్నారు. -
టాప్ సీడ్‌గా సైనా
న్యూఢిల్లీ: విదేశాల్లో పలు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ‘ఇండియా ఓపెన్’ మాత్రం కలిసిరాలేదు. గత నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారి మంచి ఫలితాలను సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈనెల 24 నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ మెగా టోర్నీలో సైనాకు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడింగ్ లభించింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్... ‘ఆల్ ఇంగ్లండ్’ తాజా చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)కు రెండో సీడింగ్‌ను కేటాయించారు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో... ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్ (చైనా) తొలిసారి బరిలోకి దిగుతున్నాడు. నిలకడగా ఫలితాలు: సైనా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ద్వారా ఎన్నో సానుకూలాంశాలు లభించాయని సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. ‘కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఓవరాల్‌గా నా ఆటతీరులో ఎంతో పురోగతి కనిపిస్తోంది. సీజన్‌లోని ఇతర టోర్నీల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా సైనా వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాను. ఈ వారం తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి వచ్చే అవకాశముంది’ అని ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా తెలిపింది. -
ఇండియా ఓపెన్‌లో సైనా నెహ్వాల్ అవుట్
న్యూఢిల్లీ: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ నుంచి వైదొలిగింది. చైనా అడ్డుగోడను అధిగమించడంలో మరోసారి చతికిలపడింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సైనా ఓటమి చవిచూసింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ 16-21, 14-21తో ప్రపంచ మాజీ చాంపియన్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. వాంగ్ చేతిలో సైనా ఓడటమిది ఏడోసారి. వీరిద్దరూ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడగా, హైదరాబాదీ ఓ సారి మాత్రమే నెగ్గింది. -
సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నమెంట్ ఇండియా ఓపెన్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధులకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. గతంలో ఈ టోర్నీలో ఆడిన మూడు పర్యాయాల్లో రెండో రౌండ్‌ను దాటలేకపోయిన సైనా ఈసారి ఆ అడ్డంకిని అధిగమించే అవకాశముంది. తొలి రౌండ్లో సిమోన్ ప్రుశ్ (ఆస్ట్రియా)తో ఆడనున్న సైనాకు రెండో రౌండ్లో రాన్‌కిన్ (న్యూజిలాండ్) లేదా నచా సెంగ్‌చోటి (థాయ్‌లాండ్) ఎదురవుతారు. అయితే క్వార్టర్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయికి మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) రూపంలో అగ్ని పరీక్ష సిద్ధంగా ఉండే అవకాశముంది. యిహాన్ వాంగ్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సైనా ఏడుసార్లు ఓడిపోవడం గమనార్హం. మరోవైపు సింధు తొలి రౌండ్లో రెండో సీడ్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిజియాన్ వాంగ్ (చైనా)తో ఆడనుంది. షిజియాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సింధు నెగ్గినప్పటికీ చైనా క్రీడాకారిణులను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ సింధు తొలి రౌండ్‌ను దాటితే క్వార్టర్ ఫైనల్లో ఆమెకు ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)... సెమీఫైనల్లో సైనా లేదా యిహాన్ వాంగ్ ఎదురవుతారు. మరో పార్శ్వం నుంచి ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా), ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత క్రీడాకారులకు కష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో పారుపల్లి కశ్యప్; చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో గురుసాయిదత్; ఏడో సీడ్ డూ పెంగ్యూ (చైనా)తో సాయిప్రణీత్; టకుమా ఉయెదా (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ తలపడతారు.