ఇండియా ఓపెన్లో సైనా నెహ్వాల్ అవుట్ | Saina Nehwal crashes out of India Open | Sakshi
Sakshi News home page

ఇండియా ఓపెన్లో సైనా నెహ్వాల్ అవుట్

Published Fri, Apr 4 2014 6:57 PM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

ఇండియా ఓపెన్లో సైనా నెహ్వాల్ అవుట్

ఇండియా ఓపెన్లో సైనా నెహ్వాల్ అవుట్

న్యూఢిల్లీ: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ నుంచి వైదొలిగింది. చైనా అడ్డుగోడను అధిగమించడంలో మరోసారి చతికిలపడింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సైనా ఓటమి చవిచూసింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో హైదరాబాదీ 16-21, 14-21తో ప్రపంచ మాజీ చాంపియన్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. వాంగ్ చేతిలో సైనా ఓడటమిది ఏడోసారి. వీరిద్దరూ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడగా, హైదరాబాదీ ఓ సారి మాత్రమే నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement