న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ... ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికే ఆలోచన లేదని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. మోకాలి గాయంతో బాధపడుతున్న 33 ఏళ్ల సైనా గత జూన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉంది. ఫలితంగా ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న ఆమె ప్రస్తుతం 55వ ర్యాంక్‌కు పడిపోయింది.
‘ప్రపంచ చాంపియన్ ఆన్ సె యింగ్, తై జు యింగ్, అకానె యామగుచిలాంటి స్టార్స్‌తో తలపడాలంటే కేవలం ఒక గంట శిక్షణ సరిపోదు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించాకే మళ్లీ బరిలోకి దిగుతాను. ప్రతి ప్లేయర్ రిటైర్ అవుతాడు. నా విషయంలో మాత్రం వీడ్కోలు పలికేందుకు తుది గడువు పెట్టుకోలేదు’ అని 2019లో చివరిసారి అంతర్జాతీయ టోర్నీ టైటిల్ గెలిచిన సైనా వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment