భారతదేశంలో ఉన్న అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరైన 'అశ్విన్ డాని' (Ashwin Dani) గురించి ఇప్పుడు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కెమిస్ట్ స్థాయి నుంచి ఈ రోజు కుబేరుల జాబితాలోకి ఎలా చేరాడు? దాని వెనుక ఆయన కృషి ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏషియన్ పెయింట్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశ్విన్ డాని ముంబైలో పుట్టి 1966లో ముంబై యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తరువాత కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌లోని అక్రోన్ యూనివర్సిటీలో చేరాడు.
ఉన్నత చదువులు పూర్తయిన తరువాత డెట్రాయిట్‌లో శాస్త్రవేత్తగా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆ తరువాత సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా తన కుటుంబానికి చెందిన ఏషియన్ పెయింట్స్ కంపెనీలో చేరాడు. 1977లో ఏషియన్ పెయింట్స్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి పదోన్నతి పొందారు. అశ్విన్ డాని నేతృత్వంలో ఏషియన్ పెయింట్స్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగింది.
అశ్విన్ డాని ఆర్ & డి డైరెక్టర్‌గా ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు ఏషియన్ పెయింట్స్ అభివృద్ధికి చాలా దోహదపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో అతిపెద్ద పెయింట్ తయారీదారుగా, ఆసియాలో మూడవ అతిపెద్ద కంపెనీగా, అంతర్జాతీయ స్థాయిలో తొమ్మిదవ అతిపెద్దది కంపెనీగా అవతరించింది.
(ఇదీ చదవండి: ఇంటర్‌లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?)
అశ్విన్ డాని నేతృత్వంలో కంపెనీ చాలా అభివృద్ధి చెందింది. భారతదేశంలో ఆటోమేటెడ్ కలర్ మిక్సింగ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి అశ్విన్ కావడం గమనార్హం. కంపెనీ 2023లో 7.1 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 58,000 కోట్లు. రానున్న రోజుల్లో కంపెనీ మరింత ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment