డీఎస్సీ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఒక మహిళ మృతి చెందింది.
విశాఖపట్నం: డీఎస్సీ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో సోమవారం జరిగింది. వివరాలు.. ఈశ్వరమ్మ (28) తన భర్త సుబ్బారావుతో కలిసి డీఎస్సీ పరీక్ష రాసేందుకు వెళ్తోంది.
మార్గ మధ్యలో పాడేరు మండలం మూలకుండమ్మ పాదాల మలుపు వద్దకు రాగానే చెట్టు కొమ్మ విరిగి వారు ప్రయాణిస్తున్న బైక్‌పై పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ సుబ్బారావును మెరుగైన వైద్యం కోసం పాడేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
(పాడేరు)