wife dies
-
భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
-
తెల్లారిన బతుకు
- కూలి పనులకు సైకిల్‌పై బయలుదేరిన దంపతులు - వేగంగా వచ్చి ఢీకొన్న బస్సు - రోడ్డుపైనే మాంసపు ముద్దలా మిగిలిన భార్య - భర్తకు తీవ్ర గాయాలు ------------------------------------------------------------------- రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. ఒక రోజు కూలి పనులకు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి.. వచ్చే అరకొర సంపాదనతోనే పిల్లలను చదివించుకుంటున్నారు. తెలవారక ముందే కూలి పనులకు వెళ్లడం ఆ దంపతులకు అలవాటు. రోజులాగే గురువారం తెల్లవారుజామున సైకిల్‌పై దంపతులిద్దరూ బయలుదేరారు. మార్గమధ్యంలో వేగంగా ఎదురొచ్చిన ఓ బస్సు ఢీకొనడంతో సైకిల్ నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే రోడ్డుపై మాంసపు ముద్దలా మిగలగా, భర్త త్రుటిలో తప్పించుకున్నాడు. - పామిడి ----------------------------------------------------------- పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన దళిత రంగమ్మ(36) రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడగా, ఆమె భర్త మేకల పెద్దసుంకన్న తీవ్రంగా గాయపడ్డారని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వారిద్దరూ గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైకిల్‌పై ఇటుకల బట్టీ వద్ద పనుల కోసం బయలుదేరారు. బైపాస్‌లోని హనుమాన్ లింకురోడ్డు జంక్షన్ వద్దకు రాగానే సైకిల్‌ను బట్టీల వైపునకు తిప్పారు. దూసుకొచ్చిన మృత్యువు అంతలోనే ఊహించని రీతిలో అనంతపురం నుంచి గుత్తి వైపునుక విపరీతమైన వేగంతో వచ్చిన ఓ బస్సు బలంగా ఢీకొనడంతో సైకిల్ తునాతునకలు కాగా, వెనకాల కూర్చున్న రంగమ్మ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆమె భర్త పెద్దసుంకన్న డివైడర్‌పై ఎగిరిపడి సృహ కోల్పోయాడు. ప్రమాదంలో అతని ఎడమకాలుకూ గాయమైంది. క్షతగాత్రుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగమ్మ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. మృతురాలికి కుమార్తె దస్తగిరమ్మ(డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది), కుమారుడు వసంతకుమార్(పామిడిలోని టీసీ హైస్కూల్లో ఆరో తరగతి చదవుతున్నాడు) ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. -
భర్త.. ఆ వెంటనే భార్య మృతి
గన్నేరువరం(కరీంనగర్ జిల్లా): భర్త మృతిచెందాడన్న మనోవేదనతో భార్య కూడా మృతిచెందిన సంఘటన కరీంనగర్జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో జరిగింది. గుంటుక వీరయ్య(80), అతని భార్య రాజవ్వ(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వీరయ్యకు కొద్దిరోజులుగా జ్వరం కూడా వస్తోంది. మంగళవారం రాత్రి వీరయ్య మృతిచెందగా బుధవారం ఉదయం దహన సంస్కారాలు పూర్తిచేశారు. బంధువులు ఇంటికి వచ్చేసరికి వీరయ్య భార్య కూడా మృతిచెందింది. ఒకేసారి వృద్ధ దంపతులు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
భర్త శాడిజానికి ఇల్లాలు బలి
-
డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం!
-
డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం!
హైదరాబాద్: నగరంలోని బన్సీలాల్ పేట ఐడీహెచ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో భాగం కావాలంటూ బంధువులు ఓ జంటను భవనం పైనుంచి కిందకి నెట్టివేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. బాధితుడి కథనం ప్రకారం.. బన్సీలాల్‌పేటలో నివాసం ఉంటున్న దంపతులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయింది. ఆ డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో తమకు వాటా ఇవ్వాలంటూ తరచూ బంధువులు గొడవపడేవారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న తమను బంధువులే భవనం పైనుంచి నెట్టివేశారని భర్త ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇదే మా చివరి పుట్టిన రోజు..
అరవై ఏళ్ల సంసార జీవితంలో ఇద్దరూ అలిసి‘పోయారు’.. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. మరణంలోనూ తాము ఒక్కటేనంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిమ్మని రామస్వామి(80) ఆదివారం గుండెపోటుతో చనిపోయాడు. ఈవిషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా పనిమనిషి చెబుతుండగానే రామలక్ష్మి (75) ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. సిరిసిల్ల టౌన్(కరీంనగర్): మరణంలోనూ తాము ఒక్కటేనంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు ఆ వృద్ధదంపతులు. సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకున్న విషాద సంఘటన ఇది.. ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన చిమ్మని రామస్వామి(80), రామలక్ష్మి(75) దంపతులు. వీరు కొన్నేళ్లక్రితమే సిరిసిల్లకు వచ్చి భావనారుషినగరంలో ఇల్లుకట్టుకుని స్థిరపడ్డారు. రామస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1996లో ఉద్యోగ విరమణ పొందారు. దంపతుల కూతుళ్లు కరుణ, అరుణ, సువర్ణ, సుకర్ణకు వివాహం జరిపించారు. రామలక్ష్మి షుగర్, కీళ్లనొప్పులతో బాధపడుతోంది. రామస్వామికి కిడ్నీలో రాళ్లు రావడంతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 6గంటలకు ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఈవిషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా పనిమనిషి చెబుతుండగానే రామలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. రామస్వామి దంపతులు శేషజీవితాన్ని కూతుళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లతో హాయిగా గడుపుతున్నారు. ఈక్రమంలో ఈనెల 7న రామస్వామి 80వ పుట్టిన రోజు జరిపారు. ఇదేమా చివరి జన్మదినమంటూ దంపతులిద్దరూ వ్యాఖ్యానించారంటూ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరమూ ఒకేసారి చనిపోవాలనే వారని గుర్తు చేసుకున్నారు. అన్నట్లుగానే ఇద్దరూ ఒకేసారి చనిపోవడం విషాదాన్ని నింపింది. -
భార్య శవంతో బస్సు ప్రయాణం
-
డీఎస్సీ పరీక్షకు వెళ్తూ..
విశాఖపట్నం: డీఎస్సీ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో సోమవారం జరిగింది. వివరాలు.. ఈశ్వరమ్మ (28) తన భర్త సుబ్బారావుతో కలిసి డీఎస్సీ పరీక్ష రాసేందుకు వెళ్తోంది. మార్గ మధ్యలో పాడేరు మండలం మూలకుండమ్మ పాదాల మలుపు వద్దకు రాగానే చెట్టు కొమ్మ విరిగి వారు ప్రయాణిస్తున్న బైక్‌పై పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ సుబ్బారావును మెరుగైన వైద్యం కోసం పాడేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (పాడేరు)