డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం! | couple attacked by relatives due to double bed room home | Sakshi
Sakshi News home page

డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం!

Published Mon, Nov 7 2016 10:28 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం! - Sakshi

డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం!

హైదరాబాద్: నగరంలోని బన్సీలాల్ పేట ఐడీహెచ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో భాగం కావాలంటూ బంధువులు ఓ జంటను భవనం పైనుంచి కిందకి నెట్టివేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో  సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

బాధితుడి కథనం ప్రకారం.. బన్సీలాల్పేటలో నివాసం ఉంటున్న దంపతులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయింది. ఆ డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో తమకు వాటా ఇవ్వాలంటూ తరచూ బంధువులు గొడవపడేవారు. ఈ క్రమంలో  అనారోగ్యంతో ఉన్న తమను బంధువులే భవనం పైనుంచి నెట్టివేశారని భర్త ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement