husband injured
-
శుభకార్యానికి వెళ్తూ.. అనంతలోకాలకు
రామడుగు(చొప్పదండి) : కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపై రామడుగు మండలం వెదిర శివారులోని గణేష్‌నగర్ స్టేజీ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెదిర గ్రామానికి చెందిన రాల్లబండి భాగ్యమ్మ (65)మృతి చెందింది. అమె భర్త రాల్లబండి హన్మంతరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెదిరకు చెందిన రాల్లబండి హన్మంతరెడ్డి– భాగ్యమ్మలు బుధవారం వాళ్ల కూతురి ఇంట్లో శుభకార్యం ఉండడంతో బయల్దేరారు. రోడ్డుపై నిల్చుని బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఆటోరాగా ఆపేందుకు ప్రయత్నించారు. వెనకాలే వస్తున్న టిప్పర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనకాలే వస్తున్న ఆయిల్ ట్యాంకర్ టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో టిప్పర్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న దంపతులను ఢీకొట్టి రోడ్డు కిందకు వెళ్లిపోయింది. తీవ్రగాయాలైన వీరిని గ్రామస్తులు కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాగ్యమ్మ మృతి చెందింది. హన్మంతరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతరాలి కుమారుడు మధుసూదన్‌రెడ్డి జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. గురువారం స్వగ్రామానికి చేరుకోనున్నాడు. రామడుగు పోలీసులు కేసు నమోదు చేశారు. -
డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం!
-
డబుల్ బెడ్రూమ్ కోసం దారుణం!
హైదరాబాద్: నగరంలోని బన్సీలాల్ పేట ఐడీహెచ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో భాగం కావాలంటూ బంధువులు ఓ జంటను భవనం పైనుంచి కిందకి నెట్టివేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. బాధితుడి కథనం ప్రకారం.. బన్సీలాల్‌పేటలో నివాసం ఉంటున్న దంపతులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయింది. ఆ డబుల్ బెడ్ రూమ్ ఇల్లులో తమకు వాటా ఇవ్వాలంటూ తరచూ బంధువులు గొడవపడేవారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న తమను బంధువులే భవనం పైనుంచి నెట్టివేశారని భర్త ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తల్లికూతురు ఇద్దరూ కలసి..
శ్రీనగర్: రహస్యంగా మరో వివాహం చేసుకున్న భర్తపై అతని భార్య యాసిడ్ దాడి చేసింది. ఈ దాడికి కూతురు సహకరించింది. జమ్ము కశ్మీర్‌లోని బాని పట్టణంలో ఈ ఘటన జరిగింది. మహ్మద్ డిన్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పదేళ్ల క్రితం షమీమా అక్తర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. కాగా డిన్ ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న షమీమా కూతురు, మరో ఇద్దరి సాయంతో డిన్ ముఖంపై యాసిడ్ పోసింది. డిన్ తీవ్రంగా గాయపడటంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో షమీమా కూడా గాయపడింది. ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
బీబీనగర్‌లో దంపతులపై కత్తులతో దాడి
నల్గొండ : నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. బీబీనగర్‌లో దొంగలు బీభత్సం స్పష్టించారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు.... దంపతులపై కత్తులతో దాడి చేసి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. దొంగల దాడిలో భార్య అక్కడికక్కడే మరణించగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇది దొంగల పని కాదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘాటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు. -
శివసేన నాయకురాలి దారుణ హత్య
ఉత్తరప్రదేశ్‌లో శివసేన మహిళా నాయకురాలు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆమె భర్తకు కత్తిపోట్లతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె ఇంట్లోనే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరతి బోర్కర్, ఆమె భర్త అనిల్ ఇద్దరిపై ముగ్గురు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. గతంలో శివసేనకు సెంట్రల్ నాగ్‌పూర్ శాఖా ప్రముఖ్‌గా వ్యవహరించిన ఆరతి తన భర్తను కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కువ కత్తిపోట్లకు గురయ్యారు. బహుశా అనిల్ బోర్కరే దుండగుల ప్రధాన లక్ష్యం అయి ఉంటారని భావిస్తున్నారు. దుండగులలో ఒకరైన ఆకాశ్ గౌర్ఖండే అనే వ్యక్తిని అక్కడ స్థానికులు పట్టుకుని, అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. గతంలో పొరుగువారితో ఉన్న వివాదమే ఈ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసర్వానీ కుటుంబానికి చెందిన నరేంద్ర, సురేంద్ర, సోను అనే ముగ్గురితో పాటు రవి ఖాంతే అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని, వారిపై హత్య, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపామని పోలీసులు తెలిపారు.