తల్లికూతురు ఇద్దరూ కలసి.. | Woman throws acid on husband for remarrying | Sakshi
Sakshi News home page

తల్లికూతురు ఇద్దరూ కలసి..

Published Sat, Sep 24 2016 11:48 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

తల్లికూతురు ఇద్దరూ కలసి..

తల్లికూతురు ఇద్దరూ కలసి..

శ్రీనగర్: రహస్యంగా మరో వివాహం చేసుకున్న భర్తపై అతని భార్య యాసిడ్ దాడి చేసింది. ఈ దాడికి కూతురు సహకరించింది. జమ్ము కశ్మీర్లోని బాని పట్టణంలో ఈ ఘటన జరిగింది.

మహ్మద్ డిన్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన పదేళ్ల క్రితం షమీమా అక్తర్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. కాగా డిన్ ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న షమీమా కూతురు, మరో ఇద్దరి సాయంతో డిన్ ముఖంపై యాసిడ్ పోసింది. డిన్ తీవ్రంగా గాయపడటంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో షమీమా కూడా గాయపడింది. ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement