నల్గొండ : నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. బీబీనగర్‌లో దొంగలు బీభత్సం స్పష్టించారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు.... దంపతులపై కత్తులతో దాడి చేసి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. దొంగల దాడిలో భార్య అక్కడికక్కడే మరణించగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
అయితే ఇది దొంగల పని కాదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘాటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు.