bibinagar
-
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
3,238 కోట్ల ఖర్చుతో గుంటూరు-బీబీనగర్ రైల్వే ప్రాజెక్టు
సాక్షి, ఢిల్లీ: పలు కొత్త పథకాలతో పాటు కీలక నిర్ణయాలకు ఇవాళ ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. ‘‘పీఎం ఈ - బస్ సేవ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 169 నగరాల్లో 10వేల ఈ - బస్ లు ప్రవేశ పెట్టనుంది కేంద్రం. అలాగే.. 181 నగరాల్లో గ్రీన్ ఈ-మొబిలిటి కోసం మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది. ఇక పీఎం విశ్వ కర్మ నూతన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. చేతివృత్తుల వారికి రూ.13వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం 32,500 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న కేంద్రం వీటిలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు - బీబీ నగర్ మధ్య 239 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇందుకోసం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక హైదరాబాద్ - చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ముద్కేడ్ - మేడ్చల్, మహబూబ్ నగర్ - డోన్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. తద్వారా హైదరాబాద్ - బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ఏపీలో.. విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్ మీదుగా నెర్గుండి వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం - చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్ సిద్దం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి. -
బీబీనగర్ ఎయిమ్స్‌పై కేంద్రం చిన్నచూపు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా నిధుల విడుదలకు సంబంధించి ఇది స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రానికి మంజూరు అయిన బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు నిధుల విడుదలలో కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సమాచార హక్కు చట్టం కింద ఇనగంటి రవికుమార్ అనే యాక్టివిస్టు సమాచారం కోరగా.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి అజయ్‌కుమార్ లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. 2024లో బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి కావాల్సి ఉన్నా.. దీనికి ఇప్పటి వరకు కేవలం 8.75 శాతం మాత్రమే నిధులు విడుదల చేశారు. కేంద్రంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ సంవత్సరాల్లో మొత్తం 16 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ 16 ఎయిమ్స్‌లలో బిహార్‌లోని దర్బంగా, హరియాణాలోని మనేథిలలో ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కేంద్రానికి అప్పగించలేదు. అలాగే తమిళనాడులోని మదురైలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తిగా జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా)నిధులతో చేపట్టాలని నిర్ణయించడం వల్ల ఆ నిధుల మంజూరులో ఆలస్యం కావడంతో విడుదల కాని పరిస్థితి నెలకొంది. నిమ్స్ భవనాలను ఇచ్చినా.. బీబీనగర్‌లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విస్తరణ కోసం నిర్మాణం చేసిన భవనాలను ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. అయితే ఇక్కడ మరిన్ని భవనాల నిర్మాణంతోపాటు, జాతీయ స్థాయిలో పేరున్న విజ్ఞాన సంస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చేస్తుండడం గమనార్హం. 2018 సంవత్సరంలో నాలుగు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నాలుగు ఎయిమ్స్‌లలో బీబీనగర్ (తెలంగాణ), మధురై (తమిళనాడు), బిలాస్పూర్ (హిమాచల్‌ప్రదేశ్), దేవఘర్ (జార్ఖండ్) ఉన్నాయి. అయితే బిలాస్పూర్ ఎయిమ్స్‌కు రూ.1,471 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1407.93 కోట్లు విడుదల చేయడంతో నిర్మాణం దాదాపు 98 శాతం పూర్తయింది. అలాగే దేవఘర్ ఎయిమ్స్‌కు రూ.1,103 కోట్లు కేటాయించగా.. రూ.713 కోట్లు విడుదల చేసింది. అదే బీబీనగర్ ఎయిమ్స్‌కు రూ.1,365 కోట్లు కేటాయించగా రూ. 156.01 కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 16 ఎయిమ్స్‌లలో ఏడు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో నాలుగు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతాయని కేంద్రం వెల్లడించింది. ఇందులో వైద్య కళాశాల, ఆస్పత్రి, ఉద్యోగుల నివాస సముదాయాలు, పరికరాలు అన్నీ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. బీబీనగర్ ఎయిమ్స్ మొదట రూ.1,028 కోట్లు మంజూరు చేసి, 2022 అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని భావించారు. కానీ నిధులు కేటాయింపులో జాప్యంతో దీనిని 2024 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అంచనా వ్యయం కూడా రూ.1,365 కోట్లకు చేరింది. కాగా, ఇప్పటికే నిమ్స్‌కోసం నిర్మించిన భవనాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఔట్‌పేషంట్ సేవలు మాత్రం అక్కడ కొనసాగుతున్నాయి. కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్లో వంద ఎకరాల స్థలంతోపాటు, నిమ్స్ భవనాలను కేంద్రానికి అప్పగించింది. అయినా ఇక్కడ ఎయిమ్స్ అభివృద్ధిలో పురోగతి లేదని విమర్శలు వస్తున్నాయి. -
అరకొర ఫ్యాకల్టీ.. క్లాసులు పల్టీ.. దయనీయ స్థితిలో బీబీనగర్ ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రస్తుతం సగం ఫ్యాకల్టీతోనే నడుస్తున్నాయి. బోధన సిబ్బంది (ఫ్యాకల్టీ)కి సంబంధించి మంజూరైన పోస్టులు 183 ఉండగా, కేవలం 92 మందినే నియమించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ఈ అంశాన్ని వెల్లడిస్తుండగా.. ఏకంగా 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఎయిమ్స్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభమైన అనేక ఎయిమ్స్‌ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భోపాల్ ఎయిమ్స్‌లో 305 పోస్టులకు, 105 ఖాళీగా ఉన్నాయి. భువనేశ్వర్‌లో 305కు గాను 74, జో«ధ్‌పూర్‌లో 305కు గాను 77, పాట్నాలో 305కు గాను 151, రాయిపూర్లో 305కు 135, రిషికేష్‌లో 305కు గాను 106, మంగళగిరిలో 183కు గాను 65, నాగ్‌పూర్‌లో 183కు గాను 64, కళ్యాణిలో 183కు గాను 88, గోరఖ్‌పూర్‌లో 183కు గాను 105, భటిండాలో 183కు గాను 72, భిలాస్పూర్లో 183కు గాను 90, గౌహతిలో 183కు గాను 89, రాజ్‌కోట్‌లో 183కు గాను 143, విజయ్‌పూర్‌లో 183కు గాను 107, రాయ్‌బరేలీలో 183కు గాను 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ ఇంత తక్కువగా ఉండటం వల్ల తరగతులు సరిగా జరగక పోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని రాష్ట్ర వైద్య వర్గాలు చెబుతున్నాయి. 2021లో శస్త్రచికిత్సలు షురూ బీబీనగర్ ఎయిమ్స్‌లో 2021లో శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం ప్రధాన శస్త్రచికిత్సలు 26 జరగ్గా, 2022 జూలై నాటి వరకు 294 జరిగాయి. ఇక చిన్నపాటి శస్త్రచికిత్సలు ఇప్పటివరకు 3,600పైగా జరిగాయి. అయితే సీనియర్ రెసిడెంట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషితో రాష్ట్రానికి ఎయిమ్స్ వచ్చింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్‌లో ఏకంగా 200 ఎకరాల భూమి ఇచ్చింది. అలాగే అక్కడ నిమ్స్ ఆసుపత్రి భవనాలను కూడా ఉచితంగా అప్పగించింది. అనంతరం 2019 నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్‌తో అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రధాన ఉద్దేశం. కీలకమైన 50 రకాల స్పెషలిస్టు వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉండాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంబీబీఎస్, నర్సింగ్ విద్య అందించాలన్నది లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఎయిమ్స్‌ను బీబీనగర్‌లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో, ఔటర్‌రింగ్ రోడ్డుకు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి అన్ని జిల్లాలకూ సులువుగా వెళ్లి వచ్చేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎయిర్‌పోర్టుకు ఇక్కడి నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిపుణులైన వైద్యులు సులభంగా వచ్చివెళ్లేందుకు అవకాశం ఉంది. ఇంత కీలకమైన ఎయిమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మాటలెక్కువ.. చేతలు తక్కువ
సాక్షి, యాదాద్రి: కేంద్ర ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు.. బీబీనగర్ ఎయిమ్స్, భువనగిరి ఆస్పత్రి వద్ద మంత్రి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క ఎయిమ్స్‌ను కూడా గాలికొదిలేసిందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండాల్సిన ఎయిమ్స్.. నిధుల లేమితో, సౌకర్యాలు లేక చతికిలబడిందన్నారు. ఎయిమ్స్‌లో పరిస్థితులపై కేంద్రానికి లేఖ ద్వారా వివరిస్తానని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో ఓపీ సేవలే తప్ప ఇన్‌పేషంట్ సేవలు ఎక్కడ అని ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 202 ఎకరాల స్థలం ఇస్తే ఇంత వరకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయలేదని, ఒక్క డెలివరీ జరగలేదని విమర్శించారు. అవసరమైన సిబ్బంది నియామకాలు కూడా జరగలేదన్నారు. 812 నర్సు పోస్టులకు గాను ఇప్పటి వరకు 200 మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు కూడా రూపొందించలేదని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎయిమ్స్‌కు వచ్చి... రాష్ట్రం నుంచి భూముల బదలాయింపు జరగలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడారని, కాగితాలతో సహా రుజువులు చూపిస్తే నాలుక కరుచుకున్నారని గుర్తు చేశారు. ‘నువ్వు వచ్చిపోవుడు కాదు, కేంద్ర మంత్రిగా ఎయిమ్స్‌ను పట్టించుకోవాలి’అని చురక వేశారు. కిషన్‌రెడ్డికి ఏ మాత్రం బాధ్యత ఉన్నా కేంద్రంతో మాట్లాడి, అన్ని సదుపాయాలు కల్పించి ఎయిమ్స్‌లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ వాళ్లు మాటలకే పనికి వస్తారు తప్ప.. వారి వల్ల ఏదీ కాదన్నారు. ఇక్కడ చదువుతున్న 212 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడానికి ఏమీ లేకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వారికి అవకాశం కల్పించిందన్నారు. -
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు వ్యవహరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా.. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు మంగళవారం ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. ఈ క్రమంలో బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. (చదవండి: ధాన్యం మద్దతు ధర పొందాలంటే..) ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరిపంట విషయంలో కేంద్రానికి, రాష్ట్రప్రభుత్వాన్ని మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని, రైతులు యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది. చదవండి: నెగిటివ్ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్! -
రూ.10కే అత్యాధునిక వైద్యం
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ ఎయిమ్స్‌లో గురువారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయని, రూ.10కే అత్యాధునిక వైద్యం అందజేస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. దేశంలోని టాప్–10 ఎయిమ్స్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ.. 2024 నాటికి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రజలకు ఇక్కడ వైద్యం అందనుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఎయిమ్స్ కోసం సుమారు రూ.1,000 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందన్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, గైనిక్, ఫ్యామిలీ మెడిసిన్, పీడియాట్రిక్ సేవలు అందించనున్నట్లు వివరించారు. ఇందుకోసం డాక్టర్ల నియామకం, వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ చివరి వారంలో 100 పడకల ఇన్‌పేషెంట్ విభాగాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో 40 పడకలకే పరిమితం చేస్తున్నామని, ఇందులో పాజిటివ్ కేసుల కోసం 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన సేవల కోసం రాజీపడం మెరుగైన సేవల కోసం ఎక్కడా రాజీపడేది లేదని వికాస్ భాటియా స్పష్టం చేశారు. తెలంగాణ ఎయిమ్స్‌లో పనిచేయడానికి దేశంలోని ప్రముఖ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పెద్దఎత్తున పోటీ పడుతున్నారని తెలిపారు. 483 మంది ప్రొఫెసర్ల ఉద్యోగాల కోసం 2 వేల మంది దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22 మంది డాక్టర్ల నియామకం పూర్తయిందని, మరికొంత మంది డాక్టర్ల నియామకం త్వరలో పూర్తవుతుందని ఆయన వివరించారు. 2024 నాటికి 750 పడకలతో పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ అప్రూవ్ అయ్యింది ఎయిమ్స్ ప్రధాన భవన సముదాయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయ్యిందని భాటియా తెలిపారు. 201 ఎకరాల్లో విశాలమైన పార్కులు, క్రీడా మైదానాలు, ఆస్పత్రి భవనాలు, విద్యార్థుల వసతి గృహాల 28 అంతస్తుల 3 టవర్లు బాలురు, బాలికలు, స్టాఫ్ కోసం వేర్వేరుగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్స్, గార్డెనింగ్, గెస్ట్‌హౌజ్, మెడికల్ కళాశాల, ఆయుష్ బిల్డింగ్, ఆడిటోరియం వెనక స్టాఫ్ రెసిడెన్షియల్ భవనాలు, పార్కులు ఇలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. నిమ్స్ భవన సముదాయాలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అధికారికంగా అప్పగించలేదన్నారు. ఎయిమ్స్‌కు అనుబంధంగా 40 నుంచి 60 కిలో మీటర్ల లోపు రూరల్ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. -
ఎయిమ్స్ కళాశాల ప్రారంభం
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురం వద్ద ఏర్పాటు చేసిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల (ఎయిమ్స్) మంగళవారం ప్రారంభమైంది. భోపా ల్ ఎయిమ్స్ సంస్థ డైరెక్టర్ శర్మన్ సింగ్ సాదాసీదాగా ప్రారంభ కార్యక్రమాలను కొనసాగించారు. అనంతరం విద్యార్థులకు మొదటి రోజు ఓరియెంటేషన్ క్లాస్‌ను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రులు, ఫ్యాకల్టీతో కలసి పరిచయ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో 50 మంది ఏంబీబీఎస్ విద్యార్థులు చేరగా 20 మంది ఫ్యాకల్టీని నియమించారు. కళాశాలలోని అనాటమీ, ఫిజి యోలజీ, బయోకెమిస్ట్రీ, సామాజిక, కుటుంబ వైద్య విభాగాలతోపాటు హిస్టాలాజీ, అడ్మిన్ లా కార్యాలయం, డీయెన్, వీఐపీ లాంజ్, క్యాంటిన్లను ప్రారంభించారు. వైద్య రంగ పరిశోధన, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించేలా ప్రత్యేకమైన హాల్స్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఏంబీబీఎస్ తరగతులు కొనసాగుతాయని, విద్యార్థులకు సంబంధించిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ శర్మన్ సింగ్ తెలిపారు. ప్రారంభోత్సవంలో గందరగోళం.. కళాశాల ప్రారంభోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఎయిమ్స్ అధికారులు, ఫ్యాకల్టీకి తప్పా ప్రజా ప్రతినిధులకు, ఇతరులకు ఆహ్వానం లేదు. అయితే టీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ నాయకులు ఎయిమ్స్ భవనంలోకి పెద్ద ఎత్తున రావడం, పరిచయ వేదికలో ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చోవడంతో కొంత గందరగోళం నెలకొంది. -
నిమ్స్ ఇకపై ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: 2019–20 విద్యా సంవత్సరం నుంచే హైదరాబాద్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించటంతో ఇందుకు అనుగుణంగా బీబీనగర్ నిమ్స్ భవనాన్ని ఎయిమ్స్‌కు రాష్ట్ర అధికారులు అప్పగించారు. దీనికి ఇటీవల రూ.1028 కోట్ల నిధులకు కూడా కేంద్రం కేటాయించింది. 45 నెలల్లో ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సూచించింది.ఈ నేపథ్యంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన భూ, భవన నిర్మాణం సహా అన్ని రకాల పత్రాలను ఎయిమ్స్‌కు అధికారులు అందజేశారు. ఇప్పటి వరకు నిమ్స్ ఆధ్వర్యంలో ఉన్న రూ.200 కోట్లకుపైగా విలువ చేసే రెండు బహుళ అంతస్తుల భవనాలు, 151 ఎకరాల భూమి సహా రూ.60 లక్షల విలువ చేసే లేబొరేటరీ, వైద్య పరికరాలు ఎయిమ్స్ అధీనంలోకి వెళ్లాయి. దీంతో నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆర్థికంగా నష్ట పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు యాదాద్రిజిల్లా రెవెన్యూ అధికారులు ఇటీవల మరో 49 ఎకరాల భూమిని సేకరించి ఎయిమ్స్‌కు సమకూర్చారు. ఓపీ సేవలు కొనసాగుతాయి అనేక విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 2016 మార్చిలో బీబీనగర్ నిమ్స్‌లో అవుట్ పేషెంట్ సేవలను ప్రారంభించింది. త్వరలోనే ఇన్ పేషెంట్ సేవలను ప్రారంభించాలని నిర్ణయిం చింది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే కేంద్రం రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేసింది. ఎయిమ్స్ సేవలు ప్రారంభమయ్యే వరకు ఓపీ సేవలు కొనసాగుతాయని బీబీనగర్ నిమ్స్ ఇన్చార్జి డాక్టర్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
వ్యక్తి దారుణ హత్య
బీబీనగర్:ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బీబీనగర్ మండలం మగ్దుంపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శెట్టి నర్సింహ్మ(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నర్సింహ్మ తండ్రి అన్న కొడుకైన శెట్టి శ్రీశైలం ఏపని చేయకుండా ఖాళీగా ఉండడంతో అతడి భార్య గ్రామంలోనే వేరుగా ఉంటూ ఇటీవలే తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి శ్రీశైలం మానసికంగా కుంగిపోయి గ్రామాన్ని విడిచి యాదగిరిగుట్టపై సంచరిస్తూ కొద్ది రోజులు గడిపాడు. ఇటీవల గ్రామానికి వచ్చిన శ్రీశైలం అన్న నర్సింహపై కక్ష పెంచుకున్నాడు. దీంతో సోమవారం ఉదయం 10గంటల సమయంలో ఓ గొడ్డలిని తీసుకుని రోడ్డుపై ఉన్న నర్సింహ్మ వద్దకు వెళ్లి అందరూ చూస్తుండగానే అతని మెడపై నరికాడు. బలమైన గాట్లు పడడంతో రక్తం మడుగులో ఉన్న నర్సింహ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య గతంలోనే మృతి చెందగా ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ వ్యవహారంలో తలదూర్చినందుకేనా..? శ్రీశైలం అతడి భార్యకు గతంలో తగాదాలు జరుగుతుండేవని తెలిసింది. గతంలో జరిగిన పంచాయితీలో నర్సింహ తలదూర్చి భార్యను పిల్లలను దూరమయ్యేలా చేశాడని శ్రీశైలం కక్ష పెంచుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నర్సింహ్మను హత్య చేసివుండవచ్చని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగ, శ్రీశైలం భార్యతో నర్సింహ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అతడి సంసారాన్ని నాశనం చేశాడనే నెపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గ్రామ పంచాయతీలో నిర్బంధం హత్య చేసిన అనంతరం శ్రీశైలం రోడ్డుపైనే ఉండడంతో గ్రామస్తులు అతన్ని పట్టుకుని గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనస్థలానికి చేరుకుని హంతకుడిని అదుసులోకి తీసుకునాకనరు. అతడి వద్ద ఉన్న గొడ్డలిని స్వాధీనం చేసుకుని బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పరిశీలించిన డీసీపీ హత్య విషయం తెలుసుకున్న రాచకొండ డీసీపీ యాదగిరి భువనగిరి ఏరియా ఆస్పత్రి మర్చూరీలో ఉంచిన నర్సింహ్మ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం హత్య జరిగిన సమయంలో సంఘటన స్థలంలో ఉన్న ప్రత్యేక సాక్షులైన కాశపాక కృష్ణ, యంజాల మోహన్ నుంచి వివరాల అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అర్జునయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీబీనగర్‌లో సేల్స్‌టాక్స్ అధికారుల తనిఖీలు
బీబీనగర్: మండల కేంద్రంలోని పూసల గోదాములో శనివారం భువనగిరికి చెందిన సేల్స్‌టాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను చెల్లించకుండా ఓç ³రిశ్రమ నుంచి అక్రమంగా ముడి సరుకును తీసుకువచ్చి గోదాములో ఉంచి రవాణా చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో అధికారులు గోదాముకు చేరుకొని రెండు గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లోని రికార్డుల్లో నమోదు చేయకుండా, పన్ను చెల్లించకుండా గోదాముల్లో నిల్వ ఉంచిన అయిల్ తయారీకి ఉపయోగించే 3వేల టన్నుల డీ అయిల్డ్ కిక్ బస్తాలు, 630టన్నుల సన్ప్లై పౌడర్ బస్తాలు, 6లక్షల ఖాళీ గన్నీ బ్యాగులను గుర్తించినట్లు ఏఎస్టీఓ విజయ్‌కుమార్ తెలిపారు. దీంతో స్టాక్ వేసి ఉన్న 3బ్లాక్‌ల గోదాములను సీజ్ చేశామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అంత వరకు సరుకును తరలించకూడదని సంబంధిత వ్యక్తికి సూచించి గోదాం ఇన్‌చార్జీగా ఉన్న నగేష్‌కు నోటీస్ అందజేశారు. యజమానిపై చర్య తీసుకోవాలి మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆనంద్ సాల్వెక్స్ పరిశ్రమ నుంచి ముడి సరుకును కొనుగోలు చేసి పన్ను చెల్లించకుండా తప్పుడు బిల్లులతో సరుకును తరలించే యత్నం చేస్తున్న సంబంధిత యాజమానిపై చర్యలు తీసుకోవాలని ఆనంద్ సాల్వెక్స్ పరిశ్రమ బాధిత కార్మికులు డిమాండ్ చేశారు. ఆనంద్ సాల్వెక్స్లో పని చేసిన తమకు వేతనాలను చెల్లించకుండా యాజమాన్యం పరిశ్రమను మూసి వేసి ఇతర వ్యక్తులకు ప్రొడక్షన్‌ను విక్రయించిదని, దీంతో వారు పన్ను చెల్లించకుండా స్టాక్‌ను తరలించే యత్నం చేస్తున్నారని అధికారులకు విన్నవించారు. -
బీబీనగర్‌లో చోరీ
బీబీనగర్: మండల కేంద్రంలోని రైల్వే కాలనీలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ప్రణీత్‌కుమార్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే కాలనీలోని నివాసముంటున్న లోకదాసు కిష్టయ్య ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లడంతో తాళం వేసి ఉండడాన్ని గమనించిన అపరిచిత వ్యక్తులు మధ్యాహ్న సమయంలోనే తలుపులు విరగగొట్టి లోనికి చొరబడ్డారు. తాళం చెవులు హాల్లోనే ఉండడంతో వాటిని తీసుకొని బీరువా తెరిచారు. అందులో ఉన్న 70తులాల వెండి, 20వేల నగదు, అద్దతులం బంగారు కమ్మలు అపహరించి బీరువాకు తాళం వేసి వెళ్లారు. అదే రాత్రి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు విరిగినట్లు ఉండడంపై అనుమానం రావడంతో బీరువాను తెరిచి చుశారు. దీంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం: స్థానిక ఎస్ఐ ప్రణీత్‌కుమార్ క్లూస్‌టీమ్‌తో సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను వివరాలను అడిగి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్థానికుడైన ఓ వ్యక్తి ఈచోరీకి పాల్పడి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
బీబీనగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అన్నదమ్ములు బోగ జిత్తీష్‌రాజు, కులదీప్‌లు బీబీనగర్ మండలం గూడూరు పరిధిలోని టీడీఆర్ ఇంజనీర్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరు ఇద్దరు హైదరాబాద్‌లోని నివాసముంటూ రోజు కళాశాలకు వచ్చి వెళ్తున్నారు. కాగా సోమవారం ద్విచక్రవాహనంపై వచ్చిన అన్నదమ్ములు ఇద్దరు కళాశాల ముగిసిన అనంతరం తిరిగి బైక్‌పై వెళ్తున్నారు. కొండమడుగు మెట్టు సమీపంలోని జైన్ ఇరిగేషన్ పరిశ్రమ వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈసంఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా జిత్తీష్‌రాజు(21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరిస్థితి విషమంగా ఉన్న కులదీప్‌ను ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
బీబీనగర్: రైలు ఢీకొన ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన బోనస్ శివప్రసాద్(36) కుటంబ సభ్యులతో కలిసి కొండమడుగు మెట్టు వద్ద నివాసముంటున్నాడు. బతుకుదెరువు కోసం హమాలీ పని చేస్తున్న శివప్రసాద్ ఆదివారం రాత్రి మెట్టు సమీపంలోని రైలు పట్టాలను దాటుతున్నాడు. ఈక్రమంలో గుర్తు తెలియని రైలు ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారం మేరకు సోమవారం ఘటన స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. -
సంక్రాంతి నుంచి నిమ్స్‌లో ఇన్‌పేషెంట్ సేవలు
బీబీనగర్ : బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీలోని నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తి చేస్తే సంక్రాంతి నుంచి ఇన్‌పెషెంట్ సేవలను ప్రారంభిస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. నిమ్స్ యూనివర్సిటీలోని ఇన్‌పెషెంట్ విభాగం కోసం కొనసాగుతున్న నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా భవన నిర్మాణ పనులను తిరిగి చేపడుతుండడంతో జాప్యమవుతుందన్నారు. నిమ్స్‌ను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా ఎమర్జెన్సీ వార్టులోకి నేరుగా అంబులెన్స్ వచ్చేలా, భవనంలోని లిప్టులు, ర్యాంపులు ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. సొంత నిధులను వెచ్చించి రహదారిపై బస్‌స్టాప్‌లు ఏర్పాటు చేయిస్తానన్నారు. నిమ్స్ వద్ద రహదారిపై నుంచి పుట్ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేలా హైవే అధికారులతో మాట్లాడుతానని పేర్కొన్నారు. నిమ్స్‌లోని ఇన్పెషెంట్ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీంతో సంక్రాంతి నుంచి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎయిమ్స్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ప్రజా ప్రతినిధులు కొన్ని సందర్బాల్లో చెప్రాసీ పనులు చేయక తప్పడం లేదని అన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాల పనితీరుపై అధ్యయనం
బీబీనగర్: మహిళా సంఘాల పనితీరుపై అధ్యయనం చేయడానికి శుక్రవారం వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ గ్రామీణ అభివృద్ధి బృందం సభ్యులు శుక్రవారం బీబీనగర్‌లోని మహిళా సంఘాలతో సమావేశమై సంఘాల నిర్వహణ, పనితీరుపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కెన్యా, సౌతాఫ్రికా, శ్రీలంక, ఘనా, భూటాన్, టువాలీ, మ్యాన్మార్, ఇండోనేషియా, డిజిబోటీ దేశాలకు చెందిన 13 మంది సభ్యులు సంఘం సభ్యులతో చర్చించారు. సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, తీసుకున్న రుణాల ద్వారా ఎలా ఉపాధి పొందుతున్నారు, తిరిగి ఏ పద్ధతిలో వాటిని చెల్లిస్తున్నారు అనే అంశాలపై చర్చించారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ ఇతర దేశాల్లో మహిళలు స్వశక్తితో ఎదిగేలా సంఘాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇక్కడ సంఘాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బృందం సభ్యులు స్టాన్లస్, సబుహీ యూసీఫ్, ప్రెసికిల్లా లెగనోలోచిడీ, జనత్ చమ్రా, పడివాలా, సతీశ్‌కుమార్, రన్జాన్, బస్తే, సెమీసీ, ఆలీ సదీ, వెలుగు ఏపీయం మల్లేశం, సీసీలు మల్లేశం పాల్గొన్నారు. -
ఉరివేసుకొని వివాహిత బలవన్మరణం
గూడూరు(బీబీనగర్): కుటుంబంలో తలెత్తిన కలహాలతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీస్‌లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నంపట్ల గ్రామానికి చెందిన సాదినేని శ్రీనివాస్ కూతురు కావ్య(22), గూడూరు గ్రామానికి చెందిన కొలను చంద్రారెడ్డి కుమారుడు కొలను మహిపాల్‌రెడ్డి 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహాం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించకపోవడంతో దంపతులిద్దరూ గూడూరులోనే చంద్రారెడ్డి ఇంటి సమీంలోనే మరో ఇంట్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పాప పుట్టిన అనంతరం ఇరు కుటుంబాల మధ్యన మాటలు కలవగా రాకపోకలు సాగుతున్నాయి. కాగా గత కొద్ది రోజలుగా కావ్య తన భర్త, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా పుట్టింటికి పండుగలకు వెళ్లకపోవడం, తరుచూ ఇంట్లో వాగ్వాదం చేస్తూ మొండిగా ప్రవర్తిస్తూ వస్తుంది. దీంతో భర్త మహిపాల్‌రెడ్డి, తల్లిదండ్రులు మందలించడంతో కావ్య మనస్థాపానికి గురైంది. మంగళవారం ఉదయం మహిపాల్‌రెడ్డి తన కూతరును తీసుకొని కిరాణం తీసురావడానికి రోడ్డు పైకి వెళ్లాడు. ఇంతలో కావ్య ఇంట్లోని చున్నితో దూలానికి ఉరి వేసుకొని మృతి చెందింది. జరిగిన సంఘటనను స్థానికులు గమనించి పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రణీత్‌కుమార్ స్థానికులు, కుటంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుంతలమయంగా కొండమడుగు రోడ్డు
కొండమడుగు(బీబీనగర్) మండలంలోని కొండమడుగు మెట్టు నుంచి కొండమడుగు గ్రామం మీదుగా ఉన్న ఆర్అండ్బీ రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడింది. నిత్యం ఈరహదారి మీదుగా వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండడం, గ్రామ పరిసర ప్రాంతంలో పరిశ్రమలు, పశువుల సంత ఉండడం వలన ఒవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలు ఇతర వాహనాల కారణంగా రహదారి అధ్వానంగా తయారైంది. దీనికి తోడు సింగిల్ రోడ్డు కావడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటì కీ రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో నాణ్యత లేకుండా మరమ్మతుల పనులు చేపట్టడంతో రోడ్డు యథాస్థితికి చేరింది. ఆరు నెలలవుతున్నా.. కొండమడుగు మెట్టు నుంచి కొండమడుగు గ్రామం మీదుగా నాయినంపల్లి, బొమ్మలరామారం వరకు గల ఈరహదారిని డబుల్‌రోడ్డుగా మార్చేందుకు 6నెలల క్రితం ఆర్అండ్బీ శాఖ నుంచి 16కోట్ల రుపాయల నిధులను మంజూరు చేశారు. కాని ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కొన్ని ప్రాంతాలలో నిధులు లేక రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోగా ఇక్కడ నిధులున్నా పనులు జరగని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే.. రహదారిని డబుల్ రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరు కావడంతో టెండర్లు వేయగా ఓ కాంట్రాక్టర్ పనులు చేసేందుకు మందుకు వచ్చి టెండర్ దక్కించుకున్నాడు. ఈప్రక్రియ జరిగి 6నెలలవుతున్నా సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు చేపట్టకుండా ఊదాసీనంగా వ్యవహరించడంతో వాహనదారుల పాలిట శాపంగా మారింది. పట్టించుకోని ఉన్నతాధికారులు టెండర్ ప్రక్రియ పూర్తయి 6 నెలలవుతున్నా కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడం పట్ల ఆర్అండ్బీ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ 6నెలలుగా పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేస్తున్నా అధికారులు మాత్రం అతన్ని మార్చి మరొకరికి కాంట్రాక్ట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి– కడెం చంద్రశేఖర్, ఎంపీటీసీ, కొండమడుగు రోడ్డు గుంతలమయం కావడం, సింగిల్ రోడ్డు కావడంతో తరుచూ ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిని డబల్రోడ్డుగా నిర్మించేందుకు నిధులు మంజూరైనా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పనులు జరిగేలా చూడాలి. ప్రమాదాలకు గురవుతున్నాం– పాండు, కొండమడుగు, రోడ్డు ఎక్కడికక్కడ గుంతలుగా ఏర్పడడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురవుతున్నా. రోడ్డు పొడువునా మాలమలుపులు ఉండడం, కంకర రాళ్లు తేలి ఉండడంతో వాహనాలను నడపలేకపోతున్నాం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే..– రామరాజు, ఆర్అండ్బీ, ఏఈ, బీబీనగర్ రోడ్డు పనులను చేసేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వహిస్తుండడంతోనే పనులు జరగడం లేదు. 16కోట్ల నిధులు మంజూరై 6నెలలు కావస్తున్నా కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో కాంట్రాక్టర్‌ను మార్చి మరొకరికి కాంట్రాక్ట్ ఇచ్చి రోడ్డు పనులు జరిగేలా చూస్తాం. -
భావి తరాల కోసం మొక్కలను నాటాలి
బీబీనగర్ : భావితరాల కోసం సామాజిక దృక్పథంతో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. సోమవారం కొండమడుగు గ్రామ పరిధిలోని రాగాల రిసార్ట్‌లో మండల పరిశ్రమల యాజమాన్యాలు, రియల్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో హరితహారంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాజమాన్యాలు తమ పరిశ్రమల్లోనే కాకుండా గ్రామాలను దత్తత తీసుకుని మొక్కలను నాటాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ అశోక్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకయ్య, జెడ్పీటీసీ బస్వయ్య, వైస్ ఎంపీపీ లింగయ్యగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి, ఎంపీటీసీలు మన్నె బాల్‌రాజు, చంద్రశేఖర్, సర్పంచ్‌లు ఇస్తారి, అంజయ్యగౌడ్, పాండు, రేణుక, జంగయ్య, టీఆర్ఎస్ నాయకులు బొక్క జైపాల్‌రెడ్డి, ఎరుకల సుధాకర్‌గౌడ్, పిట్టల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే
మాదారం (బీబీనగర్) : మండలంలోని మాదారం గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన సందెల కుమార్, ముత్యాల అనిల్ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాదారం గ్రామంలోని మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా ట్రాన్స్‌కో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గొల్లగూడెం, నీలంబావిలో జరుగుతున్న సీసీరోడ్ల పనులను పరిశీ లించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, బొక్క జైపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, ప్రధాన కార్యదర్శి పంజాల సత్తీష్గౌడ్, సర్పంచ్‌లు ఒగ్గు పాండు, శ్రీరాం పద్మజంగయ్య, జిట్ట అలివేలమల్లారెడ్డి పాల్గొన్నారు. -
దశలవారీగా 'నిమ్స్' అభివృద్ధి
బీబీనగర్ నిమ్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు ప్రకటన భువనగిరి (నల్లగొండ జిల్లా) : నిమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి నిమ్స్ ఓపీ సేవల ప్రారంభోత్సవంలో ప్రకటించారు. ఆదివారం ఉదయం బీబీనగర్‌లోని 'నిమ్స్' ఓపీ సేవలను ప్రారంభించిన అనంతరం వారు మట్లాడుతూ ఆసుపత్రిని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు వారు తెలిపారు. -
నేడు బీబీనగర్ నిమ్స్ ప్రారంభోత్సవం
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయనున్న నిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హాజరవుతారు. నిమ్స్ డెరైక్టర్ ఆధ్వర్యంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఎట్టకేలకు ముహూర్తం ఖరారు
రేపు ఉదయం 9:30 నుంచి బీబీనగర్ నిమ్స్‌లో సేవలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు బీబీనగర్ నిమ్స్ అవుట్ పేషంట్ విభాగం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 6వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఓపీ సేవలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా, మరో మంత్రి జగదీశ్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. తొలిదశలో భాగంగా అబ్‌స్ట్రక్టీవ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ వంటి సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం నిమ్స్ వైద్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి రాజధానిలోని నిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యుల సేవలనే వినియోగించుకోనున్నారు. బీబీనగర్‌లో ఓపీ సేవల ప్రారంభంతో భువనగిరి సహా నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. తొలి దశలో కొన్ని వైద్యసేవలే... నాలుగు అంతస్తుల్లో 400 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనంలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులతో పాటు ప్రాథమిక అవసరాల కోసం 700 మంది ఇతర సిబ్బంది అవసరం. నియామకాలు చేపట్టకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రారంభించి అభాసుపాలు కావడం కంటే దశల వారీగా సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు తొలి దశలో బేసిక్ ఓపీ వైద్య సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ కె.మనోహర్ ప్రకటించారు. -
'త్వరలో బీబీ నగర్ ఎయిమ్స్‌కు నిధులు'
నల్లగొండ: బీబీనగర్‌లోని ఏయిమ్స్‌కు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి హోదాలో యాదాద్రి నరసింహుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని.. త్వరలో యాదాద్రిని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని.. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అనంతరం ఆయన ఆలేరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే కుల వృత్తి సమావేశంలో నడ్డా పాల్గొంటారు. -
అక్రమ కట్టడాల కూల్చివేత
-
పసికందును పడేశారు..
బీబీనగర్ (నల్లగొండ) : అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు కంప చెట్లలో పడేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం వెంకిరాలలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పసికందు రోదన విన్న స్థానికులు వెళ్లి చూసేసరికి బొడ్డు పేగు తెగని పసికందు కనిపించింది. వెంటనే వాళ్లు 108కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పసికందును స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పసికందు తల్లిదండ్రుల కోసం గాలింపు చేపడుతున్నారు. -
విషాదం నింపిన ప్రమాదం
ఆటో బోల్తాపడి కూలీ మృతి మరో 20 మంది కూలీలకు గాయాలు బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన 21 మంది మహిళా వ్యవసాయకూలీలు గురువారం ఉదయం రోజులాగే సద్ది కట్టుకొని అదే గ్రామానికి చెందిన రాములుకు చెందిన సెవెన్ సీట్స్ ఆటోలో పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామంలో వరిపొలంలో ముదురు తీయడానికి బయలుదేరారు. వారి వాహనం కప్రాయపల్లి గ్రామసమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే వేగం అతిగా ఉండటంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టుపైకి ఎక్కి బోల్తా పడింది. పెద్ద శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న సర్పంచ్ రాగీరు సత్యనారాయణ, గ్రామస్తులను వెంట తీసుకొని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆటోలో చిక్కుకున్న వారిని చూసి బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఆటో ఒకవైపు ఒరిగిపోవడంతో చివరలో కూర్చున్న దొంటికే సుగుణమ్మ (55) అనే మహిళపై మిగతా కూలీలంతా పడిపోయారు. దాంతో సుగుణమ్మ గొంతుకు ఆటోలోని రాడుకు మధ్య ఒత్తిడి ఏర్పడి ఊపిరాడక కొట్టుమిట్టాడిపోయింది. అతికష్టంమీద ఆమెను బయటికి తీసి నీళ్లు తాగిస్తుండగానే ప్రాణాలొదిలింది. ఇదిలావుండగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మిర్యాల అంజమ్మ, కొమురమ్మ, నారి పోషమ్మ, మిర్యాల లక్ష్మమ్మ, మల్లమ్మ, బీర కళమ్మ, దొంటికె రేణుక, కడెం లక్ష్మి, కడెం కళమ్మ, సంకూరి బాలమణి, కడెం బీరమ్మ, దొమ్మిడికే భాగ్య, కడెం ఆగమ్మ, దొడ్డి లావణ్య, అండాలులకు బలమైన గాయాలవ్వగా మిగిలిన నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఉప్పల్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో దొంటికే రేణుక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ జగన్మోహన్రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.చనిపోయిన సుగుణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేశారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని, అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ నిర్ధారించారు. మిన్నంటిన రోదనలు సంఘటన స్థలంలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. మంచిచెడ్డా చెప్పుకుంటూ, పల్లె పాటలు పాడుకుంటూ నవ్వుతూ వెళ్తున్న కూలీలు ఒక్కసారిగా ప్రమాదం బారిన పడటంతో వారు షాక్‌కు గురయ్యారు. తోటి కూలీ మృతి చెందిందని తెలిసి వారు జీర్జించుకోలేక పోయారు. ఇదిలావుండగా సుగుణమ్మ భర్త రెండేళ్ల క్రితం చనిపోగా ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుండగా ఆమె మృతితో పిల్లలు అనాథలుగా మారారు. -
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళికట్టించుకుంది.. పద్నాలుగేళ్లు అతడితో జీవితాన్ని పంచుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. వివాహేతర బంధం మోజులో పడి చివరకు కట్టుకున్న భర్త ఊపిరినే తీసేసింది.. ఆ ఇల్లాలు. ఈ దారుణ ఘటన బీబీనగర్ మండల కేం ద్రంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీ సులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -బీబీనగర్ బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామానికి చెందిన మెడబోయిన ప్రభాకర్‌కు(32) మండల కేంద్రానికి చెందిన గుండెగళ్ల సత్తయ్య కూతురు రేణుకతో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం ప్రభాకర్ తన కుటుంబంతో పదేళ్ల క్రితం బీబీనగర్‌కు వలసవచ్చాడు. రైల్వేస్టేషన్ సమీపంలో తన అత్తమామ ఇంటి పక్కనే అద్దె ఇంట్లో నివాసాముంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ప్రభాకర్ భార్య రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని నచ్చజెప్పాడు. మారకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో రేణుక తన కార్యకలాపాలకు అడ్డొస్తున్న భర్తనే ఎలాగైనా కడతేర్చాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ప్రభాకర్ నిద్రిస్తున్న సమయంలో రేణుక గొంతు నులిపి చంపివేసింది. ఈ విషయం ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. కాగా రేణుక ఒక్కతే ప్రభాకర్‌ను హతమార్చిందా లేక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలసి ఈఘాతుకానికి ఒడిగట్టిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు. రేణుక పథకం ప్రకారం ప్రభాకర్‌ను హతమార్చిందని మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ హత్య విషయం తెలుసుకున్న సీఐ తిరుపతిరెడ్డి,ఎస్ఐ ప్రణీత్‌కుమార్, దేవేందర్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం రేణుకను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెలుగులోకి వచ్చాయి. తానే ప్రభాకర్‌ను నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి హత్య చేసినట్టు రేణుక విచారణలో ఒప్పుకున్నట్టు ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపారు. -
నెరవేరని ఎయిమ్స్!
* ఎంపీ కొండా ప్రయత్నం వృథా ప్రయాసే * బీబీనగర్‌లో ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒంటరి పోరు వృథా ప్రయాసగా మారింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అఖిల భారత వైద్య, విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను జిల్లాలో స్థాపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ, పక్క జిల్లాకు తరలిపోవడం నిరాశే మిగిల్చింది. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర సర్కారు తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వతహాగా వైద్యసంస్థలపై పట్టున్న కొండా.. ఎయిమ్స్ వస్తే మెడికల్ కాలేజీ కూడా దానంతట అదే మంజూరవుతుందని ఆశించి ఎలాగైనా ఈ సంస్థను జిల్లాలో నెలకొల్పాలనే పట్టుదల ప్రదర్శించారు. కేంద్రంతో సంప్రదింపులు.. స్థలం కేటాయిస్తే ఎయిమ్స్‌ను నిర్మిస్తామని పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టం చేయడమే తరువాయి ప్రభుత్వ స్థలాల వేట కొనసాగించారు. రాజధానికి సమీపంలో శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండేలా ముచ్చర్ల, చేవెళ్ల, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించిన ఆయన ఈ అంశంపై అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీధర్‌తో కూడా పలుమార్లు చర్చించారు. ఎంపీ ప్రతిపాదనలతో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న జవహర్‌నగర్‌లో కూడా ఎయిమ్స్ నిర్మాణాన్ని పరిశీలించాలంటూ శ్రీధర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ క్రమంలోనే తెలంగాణకు కేటాయించిన ఎయిమ్స్ జిల్లాకు రావడం ఖాయమనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ముచ్చర్ల భూములను ఫార్మాసిటీకి కేటాయించడం, శేరిలింగంపల్లిలోని ప్రతిపాదిత స్థలాలను వేలం వేయాలని నిర్ణయించడం ఎంపీ ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. ఆఖరికి జవహర్‌నగర్‌ను కూడా పరిగణనలోకి తీసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎయిమ్స్‌ను నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆయన వర్గీయులకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. కొత్త ప్రాజెక్టుల ఎంపికకు రంగారెడ్డి జిల్లాను పరిగణనలోకి తీసుకోవడం ఒక ఎత్తయితే.. కనీసం ఈ వ్యవహారంలో జిల్లా ప్రతినిధులు కలిసిరాలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు ముచ్చర్లలో ప్రతిపాదించిన ఫార్మాసిటీపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. 13వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధనగరి నిర్మిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించినా.. ఇప్పటివరకు కనీసం 2వేల ఎకరాలను కూడా సమీకరించకపోవడం, ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు తటాపటాయిస్తున్నట్లు తెలుస్తుండడంతో ప్రభుత్వంలో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదు. ఈ క్రమంలోనే సర్వే పనులను కూడా నెమ్మదిగా కొనసాగిస్తోంది. -
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తాం
బీబీనగర్ :తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. బీబీనగర్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని తెలిసినా, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు నిరాశ పడవద్దని, భవిష్యత్ అంతా కాంగ్రెస్‌దేనని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. భౌతికం గా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉందని సభ్యత్వ నమోదు ద్వారా రుజువు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీబీనగర్‌లో నిమ్స్‌కు శంకుస్థాపన చేసి సగం పనులు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. మిగతా పనులు పూర్తిచేయించి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సీసీఎంబీ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సత్తా ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో ఉంటారు : కుంత్యా సత్తా ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో ఉంటారని.. లేని వాళ్లు పార్టీని వీడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంత్యా పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఎన్నో గెలుపు, ఓటములను చవిచూసిందని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు బూత్, బ్లాక్, జిల్లా, రాష్ట్ర కమిటీలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పేదలను ఆదుకున్నది కాంగ్రెస్సే : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణలోని పేద ప్రజలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజలను అభద్రతా భావానికి లోను చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుందన్నారు. టీఆర్ఎస్ అసమర్ధ పాలన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, నిరుద్యోగులు, ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిమ్స్, సాగునీటి కాల్వలను పూర్తి చేయిస్తామన్నారు. పవిత్ర కార్యంగా భావించాలి : తూడి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు పవిత్ర కార్యంగా భావించాలని డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి అన్నారు. పదేళ్లల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పోట్టోళ్ల శ్యామ్‌గౌడ్, ప్రధాన కా ర్యదర్శి పంజాల రామంజనేయులుగౌడ్, కాం గ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ బస్వయ్య, సర్పంచ్ స్వరుపారాణి, నాయకులు ప్రమోద్‌కుమార్, కాసుల ఆంజనేయులు, రవికుమార్, టంటం లక్ష్మ య్య, అచ్చయ్యగౌడ్, సుర్వి వేణు, మగ్తానాయక్, ఆగమయ్య, బాలచందర్ పాల్గొన్నారు. -
పట్టపగలు హత్యాయత్నం
పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు భూవివాదాలే కారణం బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద ఘటన బీబీనగర్ : పట్టపగలు... అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. హోటల్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వేటకొడవలి, కర్రలతో విరుచుకుపడ్డారు. బాధితుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర భయాందోళన రేకెత్తించిన ఈ ఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండమడుగు గ్రామానికి చెందిన సయ్యద్ హైదర్జ్రా కొంతకాలంగా హైదరాబాద్‌లోని రెయిన్‌బజార్‌లో ఉంటున్నాడు. ఇతను కొండమడుగులోని పీర్ల కొట్టం ముతావళి నిర్వహణ, గ్రామ పరిధిలోని వక్ఫ్ భూముల సంరక్షణ పెద్దగా వ్యవహరిస్తున్నాడు. అదే గ్రామంలో ఉండే పెద్దనాన్న కుమారుడు మక్బూల్‌తో హైదర్జ్రాకు పీర్లకొట్టం, వక్ఫ్‌భూముల విషయంలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. బుధవారం ఉదయం గ్రామానికి వచ్చిన హైదర్జ్రా పీర్ల కొట్టానికి వెళ్లగా.. మక్బూల్ అతడితో గొడవపడి వెళ్లిపోయాడు. అనంతరం హైదర్జ్రా కొండమడుగు మెట్టు వద్ద జాతీయ రహదారి పక్కన గల న్యూషాలిమార్ హోటల్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. ఇదే సమయంలో మక్బూల్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అందరూ చూస్తుండగానే హైదర్జ్రాపై కత్తులు, కర్రలతో దాడి చేశాడు. తలపై కత్తితో వేటు పడటంతో బాధితుడు పెద్దగా కేకలు వేశాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకోగా దుండగులు పారిపోయారు. తీవ్రగాయాలకు గురైన హైదర్జ్రాను ఉప్పల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా హత్యాయత్నానికి పాల్పడిన మక్బూల్ బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తానే దాడి చేశానని లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
బీబీనగర్ :అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడిచేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్తకు తీవ్రగాయాలయ్యా యి. బీబీనగర్ మండల కేంద్రంలో శనివారం ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పటి వరకు కబుర్లు చెప్పుకుని.. మండల కేంద్రానికి చెందిన ఖాజామియాకు అబ్జల్, ఖాజాఅసమొద్దీన్, హాజీ, బాబాజాన్, జానీపాషా అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరిలో హాజీ హైదరాబాద్‌లో నివసిస్తుండగా మిగతా నలుగురు మండల కేంద్రంలోని రైల్వే కాలనీలో ఇటీవల ఓ పెద్ద గృహాన్ని నిర్మించుకుని వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. చివరి సంతానమైన జానీపాష వృత్తి రీత్యా గూడూరులోని టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తన విధులను ముగించుకుని ఇంటికి వచ్చాడు. అనంతరం సోదరులంతా రాత్రి పదిగంటలవరకు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. రాత్రి పదిగంటలకు భోజనాలు చేసి పడుకున్నారు. సోదరుల గదులకు గడియపెట్టి అర్ధరాత్రి దాటిన తరువాత నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే కాలనీలో నివాసిస్తున్న వీరి ఇంటికి వచ్చారు. తొలుత జానీపాష సోదరుల ఇంటి గదులకు గడియపెట్టా రు. అనంతరం జానీపాష గది ద్వారానికి పక్కనే ఉన్న కిటికి తెరిచి ఉండడంతో అందులోనుంచి కర్రసాయంతో తలుపు గడియతెరిచి లోనికి ప్రవేశించారు. అనంతరం బెడ్రూంలోకి చొరబడి బీరువాను తెరుస్తుడగా శబ్దం రావడంతో జానీ పా ష, అతడి భార్య షాజియా లేచి దుండగులను చూసి ఎదురు తిరిగారు. దీంతో వారు కర్రమొద్దుతో షాజీయాను(22) మంచంపై పడవేసి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆపై జానీపాషను విచక్షణా రహితంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం బీరువాలో ఉన్న నగలతో పాటు, షాజీయా ఒంటిపై ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. హత్య జరిగిన గంట తరువాత ఒకే ఇంటిలో వేర్వేరు గదుల్లో నివాసాముంటున్న జానీపాష సోదరులు దుండగుల దాడి సమయంలో మేల్కోలేకపోయారు.ఘటన జరిగిన గంట తరువాత ఒంటిగంట సమయంలో జానీపాష వదిన నసీమా బాత్రూం వెళ్లడానికి తలుపు డోరు తీయగా ఎంతకూ వెళ్లకపోవడంతో భర్తను లేపి ంది. బయట నుంచి గడియపెట్టి ఉం డడంతో ఇద్దరు వెనుక డోర్ నుంచి బయటకు వచ్చి చూడగా జానీపాష ఇంట్లోని వస్తువులు బయట వేసి ఉన్నాయి. దీం తో లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న షాజీ యాను, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జానీని చూసి నివ్వెరపోయి పెద్ద పెట్టున కేకలు వేశారు. దీంతో ఇంటి మేడపై గదిలో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులతో పాటు స్థాని కులు అక్కడకు చేరుకున్నారు. షాజీయా, జానీపాషను ఆటో లో గూడూరు వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో భువనగిరి ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షాజియా మృతిచెం దిందని వైద్యులు ధ్రువీకరించారు. పరిస్థితి విషమంగా ఉన్న జానీపాషను ఉప్పల్‌లో ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం 108 సిబ్బం ది విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ దుండగుల దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ప్రభాకర్‌రావు తెల్లవారుజామున 4గంటలకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను గంటపాటు విచారిం చారు. అనంతరం నల్లగొండ నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి హత్యాస్థలంలో ఆధారాలు సేకరిం చారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ పని అయి ఉండవచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో కేసు ను దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చా రు. ఆయనతో పాటు భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు నరేందర్, సత్తీష్రెడ్డి, ఎస్ఐలు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌లు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. -
బీబీనగర్‌లో దంపతులపై కత్తులతో దాడి
నల్గొండ : నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. బీబీనగర్‌లో దొంగలు బీభత్సం స్పష్టించారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు.... దంపతులపై కత్తులతో దాడి చేసి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. దొంగల దాడిలో భార్య అక్కడికక్కడే మరణించగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇది దొంగల పని కాదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘాటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు. -
ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
నల్గొండ: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీనగర్ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఆగిఉన్న బస్సును లారీ ఢీ కొట్టింది. ఆ సంఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ భర్తే నిందితుడు
ప్రేమించి వివాహమాడాడు.. ఆపై నీతో నాకు కుదరదంటూ విడాకులిచ్చాడు.. అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు..నీకు అన్యాయం చేశానంటూ మళ్లీ మాజీ భార్య జీవతంలోకి ప్రవేశించాడు.. నిన్నే ఇప్పటికీ ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు...ఆపై కుటుంబంలో గొడవలొస్తున్నాయని దారుణంగా హత మార్చాడు.. ఇదీ ఓ యువతి మృగాడి చేతిలో బలై‘పోయిన’ ఉదంతం. - భువనగిరి బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన గొర్రెంకల జ్యోతి(22) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాజీభర్తే జ్యోతిని దారుణంగా హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు అనుమానితులైన పాండు, అతడి తండ్రి పెంట య్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు భువనగిరి రూరల్ సీఐ జువ్వాజీ నరేందర్‌గౌడ్ తెలిపారు. అరె స్ట్ చేసిన నిందితులను భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు సీఐ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు, హత్యజరిగిన తీరుతెన్నులను వివరించారు. నాడు ప్రేమ ఒలకబోసి.. బీబీనగర్ మండలం గూడూరుకు చెందిన జ్యోతి, అదే గ్రామానికి చెందిన చింతల పాండు గ్రామ శివారులోని అట్టల కంపెనీలో పనిచేస్తుండగా పరిచయమయ్యారు. ఒకే గ్రామం, కులం, ఇద్దరివీ ఒకే దగ్గర ని వాసాలు కావడంతో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. 2008 వివాహం చేసుకున్నారు. కొద్ది కాలనికే వారి సంసారంలో కలతలు ఏర్పడ్డాయి. పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి నా వారిది కలహాల కాపురమే అయ్యింది. దీంతో వారు విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. 2012లో భువనగిరి కోర్టు వారికి విడాకులు మంజూరు చేయగా అప్పటి నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు. మళ్లీ మాటలు కలిపి.. జ్యోతి నుంచి విడాకులు తీసుకున్న తరువా త 2013లో రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట గ్రా మానికి చెందిన స్రవంతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే పాండు నీకు అన్యాయం చేశానంటూ జ్యోతితో మాటలు కలిపాడు. ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఆ మాటలకు ఉ ప్పొంగిన జ్యోతి అతడితో సఖ్యతగా ఉండటమే కొంపముంచింది. పాండు కుటుంబంలో కలతలు.. పాండు, జ్యోతిలు సఖ్యతగా మెలుగుతుండడంతో అతడి కుటుంబలో కలతలు ఏర్పడ్డా యి. దీంతో పాండు తండ్రి పెంటయ్య రం గంలోకి దిగాడు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా వారి ప్రవర్తనలో మార్పు రాలే దు. దీంతో జ్యోతిని దూరం చేసుకోవాలని, లేకుంటే చంపేయాలని అతడిపై ఒత్తిడి చేశాడు. దీనికి తోడు పాండు వ్యవహారశైలి తో అతడి భార్య స్రవంతి కూడా ఇంటి నుం చి వెళ్లిపోయింది. ‘జ్యోతి’ని ఆర్పేశాడు ఇలా.. తండ్రి ఒత్తిడి, భార్య స్రవంతి ‘ఛీ’దరింపు లు పాండుని మృగాడిగా మార్చాయి. ఎలాగైనా జ్యోతిని అంతమొందించి తన కాపురా న్ని చక్కదిద్దుకోవాలని పన్నాగం పన్నాడు. ఈ నెల 7వ తేదీన రాత్రి జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉండగా పాండు మోటా ర్ సైకిల్‌పై వెళ్లి హారన్కొట్టాడు. అతడి కుట్ర తెలి యక బయటికి వచ్చిన జ్యోతిని అదే బైక్‌పై తన వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో జ్యోతితో గొడవపడి చేయిచేసుకున్నాడు. అనంతరం కిందపడేసి ఇనుపరాడ్‌తో గొంతుపై నొక్కడంతో జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిందో లేదో అన్న అనుమానంతో బోరు పంప్క్లాంప్తో తలపై బలంగా కొట్టాడు. ఆపై యూరియా సంచిలో శవాన్ని పెట్టి గూడూరు దయాకర్‌రెడ్డి బావిలో పడవేసి వెళ్లిపోయాడు. జ్యోతి కనిపించకుండా పోయిందని అమె తమ్ము డు 8వ తేదీన బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు వెం టనే అక్కడి ఎస్ఐ కేసు నమోదు చేశారు. 9వ తేదీ ఉదయం ఆమెశవం వ్యవసాయ బావిలో కన్పించి ందని వివరించారు. సమావేశంలో బీబీనగర్ ఎస్ఐ నర్సింహారావు ఉన్నారు. -
కాపురానికి అడ్డొస్తుందనే..
గూడూరు (బీబీనగర్) : ఎంతగానో ఇష్టమని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాది గడవక ముందే విడాకులు ఇచ్చాడు. తిరిగి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఓవైపు భార్యతో కాపురం చేస్తూనే మరో వైపు విడాకులు ఇచ్చిన మాజీ భార్యతో సఖ్యతగా ఉంటున్నాడు. విషయం భార్యకు తెలియడంతో ఆమె, తన కుటుంబ సభ్యులు కలసి ప్రియుడితోనే ప్రియురాలిని హత్య చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన గొరెంకల జ్యోతి(22) హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల దర్యాప్తులో మాజీ భర్త కుటుంబ సభ్యులే జ్యోతిని అంతమొంచారని వెల్లడైనట్లు తెలిసింది. అత్తా, మామ ఒత్తిడితోనే.. విడాకులు తీసుకున్నా గ్రామంలో పక్క,పక్కనే నివసిస్తున్న పాండు, జ్యోతిలు సఖ్యతగా ఉంటున్నారు. దీంతో కూతురి కాపురం సజావుగా కొనసాగాలంటే జ్యోతి ప్రాణాలతో ఉండకూడదని పాండు అత్త మామ భావించారు.ఎలాగైనా జ్యోతిని చంపాలని పాండుపై ఒత్తిడి చేశారు. చంపకపోతే నిన్ను చంపుతామంటూ పాండును బెదిరించినట్లు సమాచారం. దీంతో పాండు జ్యోతిని పథకం ప్రకారం హత్య చేసి సంచిలో మూటగట్టి పాడుపడిన బావిలో వేసినట్లు తెలిసింది. పోలీసుల దర్యాప్తు వేగవంతం జ్యోతి హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానితులైన పాండు కు టుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ట్లు తెలిసింది. కాగా జ్యోతిని హత్య చేయడానికి పాం డుకు ఎవరెవరూ సహకరించారు? ఏవిధంగా హత్య చేశారనే విషయాలపై పాండు, అతడి భార్య, అత్తమా మ, తండ్రి పెంటయ్యను విచారిస్తున్నట్లు సమాచారం. -
హామీలు..పట్టాలెక్కేనా..?
ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో జిల్లాకు అరకొర కేటాయింపులతోనే సరిపుచ్చుతున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వారి ప్రతిపాదనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులు రావడం లేదన్న అభిఫ్రాయం ఉంది. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు కూడా మోక్షం కలగడం లేదు. ఇక కేంద్రం కేటాయించిన నిధులు రైల్వే లైన్ల సర్వేకే సరిపోతున్నాయి తప్ప రైలు మార్గాల నిర్మాణానికి చాలడం లేదు. నెలకు రూ.40లక్షల ఆదాయం నల్లగొండ మీదుగా నిత్యం 12 రైళ్లు రెండు సార్లు రాకపోకలు సాగిస్తున్నా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సమయాల్లో రైలులో కాలు పెట్టడానికి కూడా స్థలం దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం 1500 జనరల్ టికెట్లు, రెండు వేల వరకు రిజర్వేషన్ టికెట్లు అమ్ముడవుతుంటాయి. వీటి ద్వారా రైల్వే శాఖకు నెలకు రూ.40 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. అయినా కేంద్రం రైల్వే స్టేషన్‌కు బడ్జెట్లో మొండిచేయి చూపిస్తోంది. సింగిల్ లైన్ మార్గం వల్ల రైళ్ల రాకపోకలు ఇబ్బంది కరంగా మారింది. గుంటూరు, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు జిల్లా కేంద్రానికి రాకముందే ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లా మీదుగా మిర్యాలగూడ వరకు వెళ్లే ప్యాసింజర్ రైలు నడికుడి వరకు పొడగించారు. దీంతో తిరిగి రైలు జిల్లాకు వచ్చే సరికి నిండిపోతుంది. పూణే-భువనేశ్వర్-కాకినాడ-భావన్‌నగర్ వరకు ప్రస్తుతం వారానికోసారి రైళ్లు వెళ్తున్నాయి. వాటిని ప్రతి రోజు నడిపిస్తే సౌకర్యంగా ఉంటుంది. డబ్లింగ్, విద్యుదీకరణకు చోటు దక్కేనా.. బీబీనగర్-నల్లపాడు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ జిల్లా ప్రజల చిరకాల స్పప్నంగా మారింది. డబ్లింగ్తో పాటు విద్యుద్దీకరణ చేపట్టాలని జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు గతంలో ప్రతిపాదనలు పెట్టినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతే కాకుండా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా గుర్తించాలనే డిమాండ్‌ను సైతం గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాగా బీబీనగర్-నల్లపాడు వరకు డబ్లింగ్ పనులకు రెండేళ్ల క్రితం సర్వే కోసం ప్రతిపాదనలు చేశారు. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా వేసిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే. రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండటం వల్ల సింగిల్ లైన్‌తో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మిర్యాలగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. డబ్లింగ్‌లో పాటు విద్యుదీకరణ చేస్తే గంటల తరబడి క్రాసింగ్‌లో పెట్టే పరిస్థితి నుంచి ప్రయాణికులకు ఉపశమణం కలుగుతుంది. ఈసారైనా నిధులు మంజూరయ్యేనా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఎంఎంటీఎస్ వచ్చేనా..? ఎంఎంటీఎస్ రైళ్లను భువనగిరి వరకు పొడిగించాలని ఇక్కడి ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారు. రెండేళ్ల క్రితం బడ్జెట్లో ఎంఎంటీఎస్(మల్టీ మోడ ల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) రైళ్లను రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. దీంతో మూడో దశలో ఉన్న భువనగిరికి ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఘట్కేసర్కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరికి ఎంఎంటీఎస్ రైళ్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, వైద్య, విద్యా సౌకర్యాలు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్ల అవసరం ఎంతో పెరిగింది. -
బీబీనగర్ జంక్షన్ అయ్యేనా ?
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వేసిన మొదటి రైల్వేలైన్ నడికుడి-బీబీనగర్. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1977లో ఈ రైల్వేలైన్‌ను ప్రారంభించారు. ఈ మార్గం ద్వారా తెలంగాణ, సీమాంధ్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు రవాణాను సులభతరం చేశారు. నిత్యం గూడ్స్, ప్యాసిం జర్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న నడికుడి రైల్వేలైన్ ఏర్పా టు సమయంలోనే బీబీనగర్‌లో జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. సికింద్రాబాద్ దక్షిణమధ్య రైల్వేకు అనుబంధంగా బీబీనగర్, పగిడిపల్లి, బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు రైలులైన్లను విస్తరించి జంక్షన్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ 40ఏళ్ల క్రితం చేసిన ప్రతిపాదనను పాలకులు ఏనాడో మరిచిపోయారు. బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతం రైల్వే జంక్షన్‌గా రూపాంతరం చెందితే ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఉండేవి. రైల్వే వ్యాపార కేంద్రంగా బీబీనగర్ రైల్వే ద్వారా బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమలకు ముడి సరుకుల రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. హిందుస్థాన్, బాంబీనో, ఐషర్ ట్రాక్టర్స్ వంటి పలు కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. బీబీనగర్ ప్రధాన కేంద్రంగా కంకర రవాణా జరుగుతుంది. గుట్టల ప్రాంతంగా ఉన్న భువనగిరి డివిజన్లో వెలసిన క్రషర్ల ద్వారా 40ఎంఎం కంకర రైల్వే పట్టాల కింద వేయడానికి వినియోగించుకుంచారు. ఈ కంకరను దక్షిణమధ్య రైల్వే పరిధిలోని బల్లార్ష, కొండపల్లి, మహబూబ్‌నగర్, షెడామ్, వికారాబాద్, శంకర్పల్లి, విజయవాడ, వరంగల్ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు . సికింద్రాబాద్‌పై తగ్గనున్న వత్తిడి బీబీనగర్ రైల్వే జంక్షన్ ఏర్పాటు చేస్తే దక్షిణ మధ్యరైల్వే ప్రధాన స్టేషనైన సికింద్రాబాద్‌పై వత్తిడి తగ్గనుంది. పలు రైళ్లు సికింద్రాబాద్‌నుంచి ప్రారంభమై ఇక్కడే ఆగిపోతుంటాయి. బీబీనగర్‌ను జంక్షన్ చేయడం వల్ల పలు రైళ్లను ఇక్కడినుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. బీబీనగర్‌లో దిగిపోతున్న ప్రయాణికులు సికింద్రాబాద్ -ఖాజీపేట మార్గంలో భువ నగిరిలో ఇప్పటికే రైల్వే స్టేషన్ ఉంది. అ యితే భువనగిరి శివారు గుండా నడికుడి మార్గం ఉన్నా.. ఇక్కడ స్టేషన్ లేక రైళ్లు ఆగడం లేదు. దీంతో సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు బీబీనగర్‌లో, నల్లగొండ నుంచి వచ్చే వారు నాగిరెడ్డిపల్లిలో దిగి 11కిలోమీటర్లు బస్‌లో ప్రయాణించి భువనగిరికి చేరుకోవాల్సి వస్తోంది. ఈ మార్గంలో రైల్వేస్టేషన్ నూతనంగా ఏర్పాటు చేస్తే భువనగిరి డివిజన్ ప్రాంత ప్రయాణికులతో పాటు జిల్లా ప్రయాణికులకు మేలు చేసినట్లవుతుంది. భువనగిరి-2 రైల్వేస్టేషన్ ఏర్పాటుకు వినతి పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన భువ నగిరి పట్టణానికి అనుసంధానంగా బీబీనగర్-నడికుడి మార్గంలో భువనగిరి-2 రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా కోరుతున్నారు. బీబీనగర్ పగిడిపల్లి, ముగ్దుంపల్లి తర్వాత భువనగిరి రెవెన్యూ గుండా వెళ్లే రైల్వేలైన్ అనాజీపురం మీదుగా నాగిరెడ్డిపల్లి వరకు ఉంది. ఈ మధ్యలో ఎక్కడా రైల్వేస్టేషన్ లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు రైల్వే ప్రయాణం చేయాలంటే సికింద్రాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది. భువనగిరి ప్రయాణికులు సమారు 80కిలో మీటర్లు అప్ అండ్ డౌన్ అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. తిరుపతి, చెన్నై, తివేండ్రం, కోయంబత్తూర్ ఇలా పలు దక్షిణాది రాష్ట్రాలకు ఈ మార్గం గుండా రైళ్లు వెళ్తుంటాయి. నారాయణాద్రి, నర్సాపూర్ సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లు మిర్యాలగూడ డెమూ, డెల్టాప్యాసింజర్, రేపల్లే ప్యాసింజర్లు వెళ్తున్నాయి. ఇవి కాకుండా బీబీనగర్‌లో ఆగకుండా పల్నాడు, విశాఖ, ఫలక్‌నుమా, శబరి, జన్మభూమి, వారాకోసారి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తాన్నాయి. భువనగిరి-2 రైల్వే స్టేషన్ ఉంటే ఈ రైళ్లలో ఎక్కువ భాగం ఆగే అవకాశం ఉంటుంది. -
అవినీతికొండలు
బీబీనగర్ రోజురోజుకూ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. అందుకుతగినట్టు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. ఇక్కడ రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలని 40 ఏళ్ల క్రితమే అనుకున్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి..పాలకులు మారిపోతున్నారు. కానీ జంక్షన్ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జంక్షన్ ఏర్పాటవుతుందని భువనగిరి డివిజన్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ : కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనేది వాడుక సామెత. ఈ సామెతను బాగా ఒంట పట్టించుకుంటున్నారు దేవరకొండ సబ్‌డివిజన్ అధికారులు. వేలకు వేల జీతాలు సరిపోవన్నట్టు బల్ల కింద చేతులు పెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక్కడిప్రజల వెనుకబాటు, నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని లంచాలకు అలవాటు పడి అవినీతికి తెరతీస్తున్నారు. దేవరకొండ సబ్‌డివిజన్‌లో ఇటీవల కాలంలోనే చాలామంది అధికారులు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనాలు. అవినీతికి ఛాన్స్ దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల్లో కొన్ని.. వారం రోజుల క్రితం దేవరకొండ సబ్‌డివిజన్‌లో జిల్లా నీటిపారుదల శాఖలో నకిలీ ప్రొసీడింగ్స్ సృష్టించి లక్షల రూపాయల సొమ్మును కాజేశారు. ఎటువంటి అగ్రిమెంట్, ప్రొసీడింగ్ లేకుండానే సుమారు 23 పనులు చేపట్టి అవినీతికి పాల్పడిన దేవరకొండ డీఈ సురేందర్‌రావు, జేఈ మోహన్లతో పాటు మరో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. వీరి అవినీతి రీతిని చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఈ సంఘటన కంటే ముందు నకిలీ పాస్‌బుక్కులు సృష్టించి ఏకంగా బ్యాంకునే టార్గెట్ చేసిన బ్యాంకు అధికారులు సస్పెండ్ అవడమే కాకుండా జైలు ఊచలు కూడా లెక్కపెట్టారు. దేవరకొండ సహకార బ్యాంకులో నకిలీ పాస్‌బుక్కులు సృష్టించి బినామీ పేర్లతో కోట్ల రూపాయల మేర అవినీతి చేశారు. సుమారు రూ.ఆరు నుంచి రూ.ఏడు కోట్ల మేర అవినీతి జరిగిందని భావిస్తున్న ఈ కేసులో అసిస్టెంట్ జనరల్ మేనేజరు రామయ్య సస్పెండ్‌కు గురయ్యారు. ఆరు నెలల క్రితం ఉద్యానవన శాఖ నుంచి రైతులకు మంజూరు చేసే కూరగాయల సాగు పందిర్ల సబ్సిడీ పథకంలో ఓ రైతు నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దేవరకొండ ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏడాది క్రితం చందంపేట ఇన్చార్జ్ ఏంఈఓ కె.మల్లయ్య 2012 ఏప్రిల్ 30న పదవి విరమణ పొందాల్సి ఉండగా, అతను తన పుట్టిన తేదీ 21.04.1954 కాగా.. స్వల్పంగా మార్పు చేసి, పదవీ విరమణ తేదీని పెంచుకున్నాడు. ఇది గ్రహించిన జిల్లా అధికారులు మల్లయ్యను సస్పెండ్ చేశారు. కొంతకాలం క్రితం పెద్దఅడిశర్లపల్లి ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్‌నాయక్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడం కోసం మండల పరిధిలోని భారతీపురానికి చెందిన ఓ రైతును డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రూ.30వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి సస్పెండ్‌కు గురయ్యాడు. లెక్కలేని చిన్న చేపలెన్నో.... అవినీతిలో చిన్న చేపలెన్నో ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్‌కు గురైన సంఘటనలు ఉన్నాయి. అధికారులకు చిక్కడమే కాకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో సస్పెండ్ అయిన వీఆర్ఓలు, లైన్మన్లు, ఇతర అధికారులు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది.