నల్గొండ: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీనగర్ జాతీయ రహదారి ఫ్లైఓవర్పై ఆగిఉన్న బస్సును లారీ ఢీ కొట్టింది. ఆ సంఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.