బీబీనగర్‌లో చోరీ
బీబీనగర్‌లో చోరీ
Published Mon, Sep 19 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
బీబీనగర్:
మండల కేంద్రంలోని రైల్వే కాలనీలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే కాలనీలోని నివాసముంటున్న లోకదాసు కిష్టయ్య ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లడంతో తాళం వేసి ఉండడాన్ని గమనించిన అపరిచిత వ్యక్తులు మధ్యాహ్న సమయంలోనే తలుపులు విరగగొట్టి లోనికి చొరబడ్డారు. తాళం చెవులు హాల్‌లోనే ఉండడంతో వాటిని తీసుకొని బీరువా తెరిచారు. అందులో ఉన్న 70తులాల వెండి, 20వేల నగదు, అద్దతులం బంగారు కమ్మలు అపహరించి బీరువాకు తాళం వేసి వెళ్లారు. అదే రాత్రి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు విరిగినట్లు ఉండడంపై అనుమానం రావడంతో బీరువాను తెరిచి చుశారు. దీంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం:
స్థానిక ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ క్లూస్‌టీమ్‌తో సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను వివరాలను అడిగి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. స్థానికుడైన ఓ వ్యక్తి ఈచోరీకి పాల్పడి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement