బీబీనగర్:ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బీబీనగర్ మండలం మగ్దుంపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శెట్టి నర్సింహ్మ(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నర్సింహ్మ తండ్రి అన్న కొడుకైన శెట్టి శ్రీశైలం ఏపని చేయకుండా ఖాళీగా ఉండడంతో అతడి భార్య గ్రామంలోనే వేరుగా ఉంటూ ఇటీవలే తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి శ్రీశైలం మానసికంగా కుంగిపోయి గ్రామాన్ని విడిచి యాదగిరిగుట్టపై సంచరిస్తూ కొద్ది రోజులు గడిపాడు. ఇటీవల గ్రామానికి వచ్చిన శ్రీశైలం అన్న నర్సింహపై కక్ష పెంచుకున్నాడు. దీంతో సోమవారం ఉదయం 10గంటల సమయంలో ఓ గొడ్డలిని తీసుకుని రోడ్డుపై ఉన్న నర్సింహ్మ వద్దకు వెళ్లి అందరూ చూస్తుండగానే అతని మెడపై నరికాడు.
బలమైన గాట్లు పడడంతో రక్తం మడుగులో ఉన్న నర్సింహ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి
భార్య గతంలోనే మృతి చెందగా ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కుటుంబ వ్యవహారంలో తలదూర్చినందుకేనా..?
శ్రీశైలం అతడి భార్యకు గతంలో తగాదాలు జరుగుతుండేవని తెలిసింది. గతంలో జరిగిన పంచాయితీలో నర్సింహ తలదూర్చి భార్యను పిల్లలను దూరమయ్యేలా చేశాడని శ్రీశైలం కక్ష పెంచుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నర్సింహ్మను హత్య చేసివుండవచ్చని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగ, శ్రీశైలం భార్యతో నర్సింహ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అతడి సంసారాన్ని నాశనం చేశాడనే నెపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
గ్రామ పంచాయతీలో నిర్బంధం
హత్య చేసిన అనంతరం శ్రీశైలం రోడ్డుపైనే ఉండడంతో గ్రామస్తులు అతన్ని పట్టుకుని గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనస్థలానికి చేరుకుని హంతకుడిని అదుసులోకి తీసుకునాకనరు. అతడి వద్ద ఉన్న గొడ్డలిని స్వాధీనం చేసుకుని బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మృతదేహాన్ని పరిశీలించిన డీసీపీ
హత్య విషయం తెలుసుకున్న రాచకొండ డీసీపీ యాదగిరి భువనగిరి ఏరియా ఆస్పత్రి మర్చూరీలో ఉంచిన నర్సింహ్మ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం హత్య జరిగిన సమయంలో సంఘటన స్థలంలో ఉన్న ప్రత్యేక సాక్షులైన కాశపాక కృష్ణ, యంజాల మోహన్ నుంచి వివరాల అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అర్జునయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి దారుణ హత్య
Published Tue, Dec 27 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
Advertisement