మాజీ భర్తే నిందితుడు | Ex-husband arrested | Sakshi
Sakshi News home page

మాజీ భర్తే నిందితుడు

Published Sun, Jul 13 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

మాజీ భర్తే నిందితుడు

మాజీ భర్తే నిందితుడు

 ప్రేమించి వివాహమాడాడు.. ఆపై నీతో నాకు కుదరదంటూ విడాకులిచ్చాడు.. అనంతరం మరో యువతిని  పెళ్లి చేసుకున్నాడు..నీకు అన్యాయం చేశానంటూ మళ్లీ మాజీ భార్య జీవతంలోకి ప్రవేశించాడు.. నిన్నే
 ఇప్పటికీ ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు...ఆపై కుటుంబంలో గొడవలొస్తున్నాయని దారుణంగా హత
 మార్చాడు.. ఇదీ ఓ యువతి మృగాడి చేతిలో బలై‘పోయిన’ ఉదంతం.    - భువనగిరి
 
 బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన గొర్రెంకల జ్యోతి(22) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాజీభర్తే జ్యోతిని దారుణంగా హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు అనుమానితులైన పాండు, అతడి తండ్రి పెంట య్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు భువనగిరి రూరల్ సీఐ జువ్వాజీ నరేందర్‌గౌడ్ తెలిపారు. అరె స్ట్ చేసిన నిందితులను భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు సీఐ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు, హత్యజరిగిన తీరుతెన్నులను వివరించారు.
 
 నాడు ప్రేమ ఒలకబోసి..
 బీబీనగర్ మండలం గూడూరుకు చెందిన జ్యోతి, అదే గ్రామానికి చెందిన చింతల పాండు గ్రామ శివారులోని అట్టల కంపెనీలో పనిచేస్తుండగా పరిచయమయ్యారు. ఒకే గ్రామం, కులం, ఇద్దరివీ ఒకే దగ్గర ని వాసాలు కావడంతో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. 2008 వివాహం చేసుకున్నారు. కొద్ది కాలనికే వారి సంసారంలో కలతలు ఏర్పడ్డాయి. పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి నా వారిది కలహాల కాపురమే అయ్యింది. దీంతో వారు విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. 2012లో భువనగిరి కోర్టు వారికి విడాకులు మంజూరు చేయగా అప్పటి నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు.
 
 మళ్లీ మాటలు కలిపి..
 జ్యోతి నుంచి విడాకులు తీసుకున్న తరువా త 2013లో రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట గ్రా మానికి చెందిన స్రవంతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే పాండు నీకు అన్యాయం చేశానంటూ జ్యోతితో మాటలు కలిపాడు. ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఆ మాటలకు ఉ ప్పొంగిన జ్యోతి అతడితో సఖ్యతగా ఉండటమే కొంపముంచింది.
 
 పాండు కుటుంబంలో కలతలు..
 పాండు, జ్యోతిలు సఖ్యతగా మెలుగుతుండడంతో అతడి కుటుంబలో కలతలు ఏర్పడ్డా యి. దీంతో పాండు తండ్రి పెంటయ్య రం గంలోకి దిగాడు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా వారి ప్రవర్తనలో మార్పు రాలే దు. దీంతో జ్యోతిని దూరం చేసుకోవాలని, లేకుంటే చంపేయాలని అతడిపై ఒత్తిడి చేశాడు. దీనికి తోడు పాండు వ్యవహారశైలి తో అతడి భార్య స్రవంతి కూడా ఇంటి నుం చి వెళ్లిపోయింది.
 
 ‘జ్యోతి’ని ఆర్పేశాడు ఇలా..
 తండ్రి ఒత్తిడి, భార్య స్రవంతి ‘ఛీ’దరింపు లు పాండుని మృగాడిగా మార్చాయి. ఎలాగైనా జ్యోతిని అంతమొందించి తన కాపురా న్ని చక్కదిద్దుకోవాలని పన్నాగం పన్నాడు. ఈ నెల 7వ తేదీన రాత్రి జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉండగా పాండు మోటా ర్ సైకిల్‌పై వెళ్లి హారన్‌కొట్టాడు. అతడి కుట్ర తెలి యక బయటికి వచ్చిన జ్యోతిని అదే బైక్‌పై తన వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో జ్యోతితో గొడవపడి చేయిచేసుకున్నాడు. అనంతరం కిందపడేసి ఇనుపరాడ్‌తో గొంతుపై నొక్కడంతో జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిందో లేదో అన్న అనుమానంతో బోరు పంప్‌క్లాంప్‌తో తలపై బలంగా కొట్టాడు. ఆపై యూరియా సంచిలో శవాన్ని పెట్టి గూడూరు దయాకర్‌రెడ్డి బావిలో పడవేసి వెళ్లిపోయాడు. జ్యోతి కనిపించకుండా పోయిందని అమె తమ్ము డు 8వ తేదీన బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు వెం టనే అక్కడి ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. 9వ తేదీ ఉదయం ఆమెశవం వ్యవసాయ బావిలో కన్పించి ందని వివరించారు. సమావేశంలో బీబీనగర్ ఎస్‌ఐ నర్సింహారావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement