మహిళా సంఘాల పనితీరుపై అధ్యయనం
మహిళా సంఘాల పనితీరుపై అధ్యయనం
Published Fri, Aug 26 2016 7:40 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
బీబీనగర్: మహిళా సంఘాల పనితీరుపై అధ్యయనం చేయడానికి శుక్రవారం వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ గ్రామీణ అభివృద్ధి బృందం సభ్యులు శుక్రవారం బీబీనగర్‌లోని మహిళా సంఘాలతో సమావేశమై సంఘాల నిర్వహణ, పనితీరుపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కెన్యా, సౌతాఫ్రికా, శ్రీలంక, ఘనా, భూటాన్, టువాలీ, మ్యాన్‌మార్, ఇండోనేషియా, డిజిబోటీ దేశాలకు చెందిన 13 మంది సభ్యులు సంఘం సభ్యులతో చర్చించారు. సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, తీసుకున్న రుణాల ద్వారా ఎలా ఉపాధి పొందుతున్నారు, తిరిగి ఏ పద్ధతిలో వాటిని చెల్లిస్తున్నారు అనే అంశాలపై చర్చించారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ ఇతర దేశాల్లో మహిళలు స్వశక్తితో ఎదిగేలా సంఘాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇక్కడ సంఘాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బృందం సభ్యులు స్టాన్‌లస్, సబుహీ యూసీఫ్, ప్రెసికిల్లా లెగనోలోచిడీ, జనత్ చమ్‌రా, పడివాలా, సతీశ్‌కుమార్, రన్‌జాన్, బస్తే, సెమీసీ, ఆలీ సదీ, వెలుగు ఏపీయం మల్లేశం, సీసీలు మల్లేశం పాల్గొన్నారు.
Advertisement