కాపురానికి అడ్డొస్తుందనే.. | woman died in Bibinagar | Sakshi
Sakshi News home page

కాపురానికి అడ్డొస్తుందనే..

Jul 11 2014 12:31 AM | Updated on Sep 2 2017 10:06 AM

కాపురానికి అడ్డొస్తుందనే..

కాపురానికి అడ్డొస్తుందనే..

ఎంతగానో ఇష్టమని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాది గడవక ముందే విడాకులు ఇచ్చాడు. తిరిగి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఓవైపు భార్యతో కాపురం

 గూడూరు (బీబీనగర్) : ఎంతగానో ఇష్టమని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాది గడవక ముందే విడాకులు ఇచ్చాడు. తిరిగి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఓవైపు భార్యతో కాపురం చేస్తూనే మరో వైపు విడాకులు ఇచ్చిన మాజీ భార్యతో సఖ్యతగా ఉంటున్నాడు. విషయం భార్యకు తెలియడంతో ఆమె, తన కుటుంబ సభ్యులు కలసి ప్రియుడితోనే ప్రియురాలిని హత్య చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన గొరెంకల జ్యోతి(22) హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల దర్యాప్తులో మాజీ భర్త కుటుంబ సభ్యులే జ్యోతిని అంతమొంచారని వెల్లడైనట్లు తెలిసింది.
 
 అత్తా, మామ ఒత్తిడితోనే..
 విడాకులు తీసుకున్నా గ్రామంలో పక్క,పక్కనే నివసిస్తున్న పాండు, జ్యోతిలు సఖ్యతగా ఉంటున్నారు. దీంతో కూతురి కాపురం సజావుగా కొనసాగాలంటే జ్యోతి ప్రాణాలతో ఉండకూడదని పాండు అత్త మామ భావించారు.ఎలాగైనా జ్యోతిని చంపాలని పాండుపై ఒత్తిడి చేశారు. చంపకపోతే నిన్ను చంపుతామంటూ పాండును బెదిరించినట్లు సమాచారం. దీంతో పాండు జ్యోతిని పథకం ప్రకారం హత్య చేసి సంచిలో మూటగట్టి పాడుపడిన బావిలో వేసినట్లు తెలిసింది.
 
 పోలీసుల దర్యాప్తు వేగవంతం
 జ్యోతి హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానితులైన పాండు కు టుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ట్లు తెలిసింది. కాగా జ్యోతిని హత్య చేయడానికి పాం డుకు ఎవరెవరూ సహకరించారు? ఏవిధంగా హత్య చేశారనే విషయాలపై పాండు, అతడి భార్య, అత్తమా మ, తండ్రి పెంటయ్యను విచారిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement