
భర్త.. ఆ వెంటనే భార్య మృతి
గన్నేరువరం(కరీంనగర్ జిల్లా): భర్త మృతిచెందాడన్న మనోవేదనతో భార్య కూడా మృతిచెందిన సంఘటన కరీంనగర్‌జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో జరిగింది. గుంటుక వీరయ్య(80), అతని భార్య రాజవ్వ(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వీరయ్యకు కొద్దిరోజులుగా జ్వరం కూడా వస్తోంది.
మంగళవారం రాత్రి వీరయ్య మృతిచెందగా బుధవారం ఉదయం దహన సంస్కారాలు పూర్తిచేశారు. బంధువులు ఇంటికి వచ్చేసరికి వీరయ్య భార్య కూడా మృతిచెందింది. ఒకేసారి వృద్ధ దంపతులు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.