శోకాన్ని దిగమింగుకొని భర్త అంత్యక్రియలకు.. | Twitter Salutes Army Officer Carrying Her Newborn at Husbands Funeral | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 24 2018 1:16 PM | Last Updated on Sat, Feb 24 2018 7:32 PM

Twitter Salutes Army Officer Carrying Her Newborn at Husbands Funeral - Sakshi

అంత్యక్రియలకు హాజరైన మేజర్‌ కుముద్‌ దొగ్రా, పసిపాప(సర్కిల్‌లో)

న్యూఢిల్లీ : ఓ మహిళా ఆర్మీ అధికారి శోకాన్ని దిగమింగుకొని తన ఐదు రోజుల పసి బిడ్డతో భర్త అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఆర్మీ అధికారికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. మేజర్‌ కుముద్‌ దోగ్రా భర్త, భారత ఏయిర్‌ఫోర్స్‌ అధికారి, వింగ్‌ కమాండర్‌ డీవాట్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్రాష్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.  ఫిబ్రవరి 15న అస్సాం మజులీ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన మరణించిన రెండు రోజులకే కుముద్‌ దోగ్రా ఓ పాపకు జన్మనిచ్చింది. గత బుధవారం డీవాట్స్‌ అంతక్రియలు జరగగా ఆమె తన ఐదు రోజుల పాపతో హజరయ్యారు. 

కుముద్‌ దోగ్రాకు సెల్యూట్‌ అంటూ ట్విటర్‌లో ఈ ఫొటోను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. దేశం కోసం భారత్‌ సైన్యం ఎలాంటి త్యాగం చేస్తుందో అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని ఒకరు, ఆర్మీని విమర్శించే వారంత ఈ ఘటనను చూసి బుద్దితెచ్చుకోవాని ఇంకొకరు ఆమెకు మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement