సాక్షి, కడప : చంద్రబాబునాయుడుకు వయసు మీద పడిందని, ఆయన రాజకీయాల నుంచి వైదొలగడమే ఉత్తమమని ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ చేష్టలను భరించలేకనే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో చంద్రబాబు ఎన్నో అవినీతి పనులకు పాల్పడ్డారని, తొందర్లోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా తన అవినీతిలో భాగస్వామ్యులుగా ఉన్న ఎంపీలను బీజేపీలో చేర్పించారనేది జగమెరిగిన సత్యమని ఎద్దేవా చేశారు. కాగా టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్,టీజీ వెంకటేశ్‌లు నిన్న ఉపరాష్ట్రపతిని కలిసి తమను బీజేపీలో విలీనం చేయాలని కోరిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలి
Published Fri, Jun 21 2019 1:28 PM | Last Updated on Fri, Jun 21 2019 1:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment