వైఎస్ఆర్ జిల్లా: సాగునీటి సంఘాల ఎన్నికలను పోలీసుల్ని అడ్డుపెట్టుకుని నిర్వహించడం కూటమి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శమని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విమర్శించారు. సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలపై అవినాష్‌రెడ్డి మండిపడ్డారు.
‘బీటెక్ రవి మాటలు సినిమాను తలపిస్తున్నాయి. సినిమా డైరెక్టర్ నిర్మాత, ప్రేక్షకుడు అన్నీ ఆయనే, ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అప్రజాస్వామికంగా సాగునీటి ఎన్నికలు జరిగాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికలు చేయడం చేతకానితనం. ఎన్నికల్లో రైతులు పోటీ చేయాలంటే, నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎన్నికలు కోరుకునే వారైతే.. ప్రతి రైతుకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేది.
వీఆర్‌ఓలను అందుబాటులో పెట్టకుండా అందరిని ఎమ్మార్వో కార్యాలయంలో దాచారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే బీటెక్ రవి చొక్కా విప్పేవారు రైతులు. ఖైదీలను బంధించినట్లు వీఆర్‌ఓలను ఎమ్మార్వో కార్యాలయంలో ఎందుకు బంధించారు. రైతులు మీకు ఎందుకు ఓటేస్తారు?, ఈ క్రాఫ్ విధానం రద్దు చేస్తామన్నారు మరి ఎందుకు రద్దు చేయలేదు?, రైతులకు నో డ్యూస్ ఇవ్వకుండా అడ్డుకున్న దద్దమ్మవి నీవు. జమ్మలమడుగులో వీఆర్‌ఓలను దేవగుడిలో బంధించినది వాస్తవం కాదా?.’అని విమర్శల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment