
ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పురాలేదు'
ఎన్కౌంటర్ చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప స్పష్టం చేశారు.
కాకినాడ: శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప స్పష్టం చేశారు. శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మాట్లాడుతూ... గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరికలు చేస్తునే ఉన్నామన్నారు. విధిలేని పరిస్థితిలో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
గతంలో గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని రాజప్ప ఈ సందర్భంగా గుర్తు చేశారు. 20 ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ నేపథ్యంలో అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సంక్షోభాన్ని నివారించే చర్యలు చేపడతామన్నారు ఇరు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా స్నేహ సంబంధాలను పునరుద్ధరిస్తామని రాజప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.