chinna rajappa
-
పొలిటికల్ కారిడార్ : పెద్దాపురంలో చినరాజప్పకు ఊహించని షాక్
-
చిన్నిరాజు గారి కోటలో సామంతుల వేట
ఆయన హోం శాఖా మంత్రి ... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సింది పోయి తన ఇంటినే చక్కబెట్టే పనిని విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశ పెట్టినా ఆ పథకం తన నియోజవర్గానికి అన్వయించేస్తూ పర్సంటేజీల వాటాలతో అక్రమాల విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. మంత్రి పదవిని ఆసరా చేసుకొని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లుగా కోట్ల రూపాయలను కొల్లగొట్టారనే వాదనలు గుప్పుమంటున్నాయి. పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టను గుల్ల చేసి అధికార పార్టీ నేతలు రూ.100 కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే కొండలు నేడు కనిపించని విధంగా 200 ఎకరాల వరకు చదును చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సాక్షి టాస్క్‌ఫోర్స్: మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఆయన పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా కోట్లు కొల్లగొట్టారనే వాదనలు గుప్పుమంటున్నాయి. ఈ విషయాలు ‘సాక్షి టాస్క్‌ఫోర్స్’ ద్వారా వెల్లడయ్యాయి. ఎన్నికల్లో ఉపయోగపడేలా నియోజకవర్గంలో కార్యకర్తలకు మంత్రి అండగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనే పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టను గుల్ల చేసి అధికార పార్టీ నేతలు రూ.100 కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే కొండలు నేడు కనిపించని విధంగా 200 ఎకరాల వరకు చదును చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. కొండల తవ్వకాలను నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన చేసినా టీడీపీ నేతలు మంత్రి సిఫార్సులతో అధికారుల సమక్షంలో కొండలను గుల్ల చేసి రూ.కోట్లు ఆర్జించారు. నాలుగేళ్లుగా కొండలను తవ్వడం ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ కొండపై ఆధారపడి ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవించే వారు. అయితే అధికార పార్టీ పెద్దల అండతో మైనింగ్ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించి దళితుల బతుకులతో ఆటలాడుకుంటోంది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని దళితుల అనుమతులు ఉన్నాయంటూ తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొండల మీదుగా 33 కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయగా వాటి చుట్టు కూడా గ్రావెల్ తవ్వకాలు చేశారు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరం మెట్టపై ఉన్న భూములను 800 ఎకరాల వరకు పేద దళితులకు పంపిణీ చేశారు. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరో 530 ఎకరాల భూమిని ఒక్కొక్క కుటుంబానికి ఎకరం 35 సెంట్లు చోప్పున పంపిణీ చేశారు. రాజశేఖరరెడ్డి హయాంలో బోర్లు ఏర్పాటు.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇందిరా క్రాంతి, ఇందిరా జల ప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా పంట పొలాలకు పైపులైన్లు ఏర్పాటు చేయించారు. దాంతో మెట్టపై జీడి మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. దాంతో ఎకరానికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చే దని రైతులు తెలియజేశారు. విద్యుత్ సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న మెట్టను ఏ విధంగా తవ్వకాలకు అధికారులు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండ దండలతో తప్పుడు రికార్డులతో మాఫియా రంగంలోకి దిగి క్వారీ తవ్వకాలు చేస్తోంది. మెట్టపై భూములు ఉన్న వారిని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారనే ఆరోపణలూ జోరుగానే ఉన్నాయి. మెట్టపైన తవ్వకాల ద్వారా వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సొంత భూమిలో గ్రావెల్ తవ్వకానికి అనేక మంది అధికారుల అనుమతి ఉండాలి. ఎటువంటి అనుమతి లేకుండా ఏడీబీ రోడ్డును చేర్చిన ఉన్న ప్రభుత్వ కొండను తవ్వకాలు చేస్తూ ఉన్నా అధికారులు మౌనం వహించడంపై అధికార పార్టీ అండ ఉన్నదనే వాదనలకు బలం చేకూరుతుంది. దాదాపు 10 ప్రొక్లెయిన్లతో 24 గంటల పాటు నిరంతరాయంగా తవ్వకాలు జరుగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎకరం భూమిలో సుమారు 10 వేల లారీల వరకు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. లారీ మట్టి ఖరీదు రూ. వెయ్యి చోప్పున చూసినా ఎంత వస్తుందో అర్థమవుతుంది. అభివృద్ధి పేరుతో అవినీతి మయం.. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ది చేశామనే ప్రకటనలో అవినీతి భాగం ఎక్కువగా ఉన్నదనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో రూ.1200 కోట్ల వరకు అభివృద్ధి జరిగినట్టు ఉప ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని, దానిలో 50 శాతం వరకు అవినీతి చోటు చేసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం సమయంలోనే గోతులతో నిండిపోయింది. దానిలో 50 శాతం వరకు అవినీతి ఉన్నదనే గతంలోనే తోట సుబ్బారావు నాయుడు ఆరోపించారు. ఈ అవినీతిపై అన్ని పార్టీల నాయకులు ప్రశ్నల వర్షం కురిపించినా మౌనం వహించడం విశేషం. ఇక రూ. కోటితో పెద్దాపురం బస్సు కాంప్లెక్స్ నిర్మాణంలోను భారీ అవినీతి ఉన్నదనే వాదనలు ఉన్నాయి. రేకులతో నిర్మాణం చేసి రూ.50 లక్షల వరకు నిధులు స్వాహా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. సంత మార్కెట్‌ను మార్పు చేసి ప్రారంభంలో మూడు వారాల పాటు టెంట్లు ఏర్పాటు చేసి రూ.లక్షల బిల్లు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పాండవుల మెట్టపై శతాబ్ది పార్కు నిర్మాణంలో మున్సిపాలిటీ జనరల్ నిధులు రూ.రెండు కోట్ల వరకు కేటాయించడం ఎంత వరకు సమంజసమనే వాదనలు ఉన్నాయి. పార్కు పనుల్లో రూ.కోటి వరకు అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. కార్యకర్తలకు ఒక వరం నీరు–చెట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తల కోసం నీరుచెట్టు పథకం ప్రవేశ పెట్టినట్టు ఉంది. ఈ పథకం ప్రకారం చెరువులో మట్టి తీసిన సమయంలో ఆ మట్టిని గట్లు పటిష్టం చేయడానికి, రివిట్ మెంటుకు ఉపయోగించాలి. ఆయా గ్రామాల్లో ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాలు పల్లంగా ఉంటే వాటిని ఎత్తు చేయడానికి ఉపయోగించాలి. అయితే చెరువుల్లో మట్టిని బయట విక్రయించి కార్యకర్తలు రూ.లక్షలు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి మంత్రి అండ ఉన్నదనే వాదనలు ఉన్నాయి. దీని కారణంగానే అధికారులు గమనించి కూడా మౌనం వహించారనే విమర్శలు ఉన్నాయి. వేట్లపాలెం వెంకటపతిరాజు చెరువు, నీరు చెట్లు పనుల పేరుతో రూ.10 కోట్ల వరకు సంపాదించారనే వాదనలు ఉన్నాయి. ఆస్పత్రి అభివృద్ధిలోనూ అవినీతే.. సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రహారీతో పాటు 10 పడకలు రూ.60 లక్షలతో నిర్మించగా (ప్రహరీకి రూ.50 లక్షలు ఖర్చుగా అంచనా వేశారు) మరో 30 పడకలకు రూ.2.86 కోట్లు కేటాయించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనులకు సంబంధించి అంచనాలు ఎక్కువగా తయారు చేయించి దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందరికీ ఇళ్ల పథకంలో జి ప్లస్ 3 పేరుతో ప్రతి ఫ్లాటుకు రూ. 6.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు కేటాయించి కాంట్రాక్టరుకు లబ్ధిగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి లబ్ధిదారునిపై రూ.మూడు లక్షలు అప్పు చెల్లించాల్సి ఉంది. గతంలో రాజశేఖరరెడ్డి కాలంలో నిర్మించిన ఫ్లాట్లు కేవలం రూ.1.95 లక్షలతో జీ ప్లస్ 2లో అందజేయడం జరిగిందనే వాదనలు ఉన్నాయి. దీనిలో లబ్ధిదారుడు బ్యాంకు వాటా రూ.20 వేలుగానే ఉండటం గమన్హారం. హౌసింగ్ రుణాల మంజూరుకు పార్టీ నేతలకు చేతులు తడపాల్సి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.1.5 లక్షలకు గ్రామాల్లో రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డు వెంబడి ఉన్న చెట్లను తెలుగుదేశం నాయకులు మాయం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో ఆర్అండ్బీ అధికారులు చెట్లు తొలగించాల్సి ఉంది. అటువంటి సమయంలో చెట్లకు బహిరంగ వేలం నిర్వహించవలసి ఉంది. అయితే అటు వంటి ప్రక్రియ లేకుండానే చెట్లను పార్టీ నేతలు మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డు వెంబడి ఉన్న చెట్లను తెలుగు తమ్ముళ్లు మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయాన్ని విడిచి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. కార్యాలయాలకు చెందిన కలప మాయం వేలం నిర్వహించకుండానే మాయం చేశారనే విమర్శలు ఉన్నాయి. కోట్లమ్మ.. నీలమ్మ చెరువు అభివృద్ధి పనులు ఎక్కడ? నాలుగేళ్లుగా కోట్లమ్మ, నీలమ్మ చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటనలు తప్ప ఆచరణ జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నీలమ్మ చెరువు అభివృద్ధికి రూ.కోటి కేటాయిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. అయితే నిధులు విడుదల కాక పోవడంతో పనులు ప్రారంభించలేదని అధికారులు తప్పించుకొంటున్నారు. నీరు చెట్టు పనుల పేరుతో చెరువులో పూడిక తీసి గట్లును పటిష్టం చేశారు. అయితే రివిట్మెంట్, పార్కు, వాకింగ్ ట్రాక్ పనులు చేయవలసి ఉంది. పార్కులు, రివిటింగ్ పనులకు సాధారణ నిధులు కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. ఇక కోట్లమ్మ చెరువు అభివృద్ధి పనులు శిలాఫలకానికే పరిమితం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేకుల షెల్టర్లకు రూ.ఐదు లక్షలా! ఐదు నుంచి 10 మంది ప్రయాణికులు వేచి ఉండడానికి రేకులతో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక్కొక్క షేల్టర్కు రూ.ఐదు లక్షలు ఖర్చు చేసిన్నట్టు ప్రకటించడంపై ప్రజలు ముక్కున వేలువేసు కొంటున్నారు. రూ.లక్ష కూడా ఖర్చు కాని ఈ షెల్టర్‌కు రూ. ఐదు లక్షలా అనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి షెల్టర్లు పెద్దాపురంలో మూడు నిర్మించి భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతీ అభివృద్ధి పనిలోను అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అనధికార లే అవుట్ల జోరు.. నియోజకవర్గ పరిధిలో ప్రతీ గ్రామంలోను అనధికార లే అవుట్లు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గమనించి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. లే అవుట్ల సమయంలో సమీపంలో ఉన్న భూములు స్వాహా చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. అనధికార లే అవుట్ల విక్రయాలు చేసిన సమయంలో కొనుగోలు దారులు నష్టపోతున్నారు. వారికి ఇళ్ల నిర్మాణానికి ప్లాన్లు మంజూరు కావడం లేదు. దాంతో అపరాధ రుసం చెల్లించాల్సిన పరిస్థితి కొనుగోలుదారులపై భారంగా ఉంటుంది. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు అభివృద్ధిలో పార్టీ పక్షపాత వైఖరి ఎక్కువగా ఉన్నదనే విమర్శలు ఉన్నాయి. సామర్లకోట మఠంసెంటర్లోను, పెద్దాపురం దర్గా సెంటర్లోను అధికార పార్టీ నేతలకు చెందిన షాపులు ఉండడం వల్ల వాటికి చెందిన రోడ్డుపై ఉన్న మెట్లు కూడా ముటుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికార పార్టీ అండతో వాట్స్ఆప్, ఫేస్బుక్లలోను హల్చల్ చేశాయి. అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు గాలి వదలి వేశారు. కలుషితం అవుతున్న గోదావరి జలాలే ప్రజలకు తాగునీరుగా ఉంది. నియోజకవర్గ పరిధిలో కొండలను పిండి చేసి కోట్లు సంపాదించుకొన్నారు. నియోజకవర్గంలో మొక్కల పేరుతో నిధులు స్వాహా చేశారు. ఎక్కడా మొక్కలు వేయలేదు. నీరు–చెట్టు పేరుతో అధికారుల అండతో అవినీతి జరిగింది. మంత్రి అండతో కార్యకర్తల దోపిడీ పెరిగిపోయింది. ప్రతీ అభివృద్ధి పనిలోను అవినీతి చోటు చేసుకుంది. పనులు నాసి రకంగా జరుగుతున్నాయి. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు వెడల్పు పనులను ప్రజలు గమనిస్తున్నారు. పిఠాపురం రోడ్డులో ఇరుకు వంతెన మంత్రి గారికి కనిపించడం లేదా? గోదావరి కాలువలో కాలుష్య జలాలు కలుస్తున్నా చర్యలు తీసుకొవడం లేదు. రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలి.– దవులూరి దొరబాబు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం నియోజకవర్గం అవినీతిలో నిండిపోయింది.. నియోజకవర్గ పరిధిలో మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని బారీ ఎత్తున అవినీతి మయంగా మారి పోయింది. కొండలను తవ్వి చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. కొండలను బంధువులకు అప్ప గించారు. ఏడీబీ రోడ్డు మిగులు భూములు కార్యకర్తలు స్వాహా చేస్తున్నారు. దానికి మంత్రి అండ ఉంది. టీడీపీ నాయకులు బినామీ కాంట్రాక్టర్ల పేరుతో సింగిల్ టెండర్లతో పనులు చేస్తున్నారు. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు విస్తరణలో పక్షపాత వైఖరి అవలంబించారు. పేదలకు అన్యాయం చేశారు. రోడ్డు పనుల్లో నాణ్యత లోపం ఉంది. జన్మభూమి కమిటీలు కార్పొరేషన్ రుణాల్లో అవకతవకలు జరిగాయి. సామర్లకోట టౌన్ ప్లానింగ్ పూర్తిగా విఫలమైంది. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ.60వేలతో నిర్మించే బస్ షెల్టర్‌కు రూ.ఐదు లక్షల ఖర్చు చూపడం అవినీతి కాదా. – నేతల హరిబాబు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, సామర్లకోట -
అట్టుడికిన మన్యం
సాక్షి విశాఖపట్నం/ పాడేరు రూరల్/అరుకులోయ/డుంబ్రిగుడ/ఎంవీపీకాలనీ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చడంతో అరకులోయ అట్టుడికిపోయింది. వారి అభిమానులు, అనుచరులు, కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. ఎమ్మెల్యే కార్యక్రమ వివరాలు శనివారం సాయంత్రం డుంబ్రిగుడ పోలీసులకు తెలియజేసినప్పటికీ ఆదివారం కిడారికి పోలీసులు రక్షణ కల్పించలేదని.. ఇది అదునుగా చూసి మావోలు వారిని చంపేశారని పోలీసులపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సీఐ వెంకునాయుడితో వాగ్వాదానికి దిగారు. రక్షణ కల్పించాలని సమాచారం ఇచ్చినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. మూడు రోజులుగా మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిసినా తమ నేతలకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ ఎస్ఐ ఆమనరావును ఇక్కడకు తీసుకురావాలని, జరిగిన హత్యలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. మృతదేహాలను విశాఖ తరలించనివ్వం.. లివిటిపుట్టు నుంచి మృతదేహాలను తరలించేందుకు పోలీసులు రాకపోవడంతో నేతల అనుచరులు వారి వాహనాల్లోనే అరకుకు తరలించారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారు పోలీస్ స్టే్టషన్ సమీపానికి చేరుకోగానే అరకు సీఐ వచ్చి.. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని, అక్కడే పోస్టుమార్టం చేస్తారని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. మృత దేహాలను విశాఖకు తరలించడానికి అంగీకరించబోమని మృతదేహాలతో తీసుకుని రోడ్డుపై గంటకుపైగా బైఠాయించారు. ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే వరకు మృతదేహాలను కదలనిచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. బందోబస్తును పట్టించుకోని పోలీసులు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన తరువాత ఎమ్మెల్యే కిడారి ఏజెన్సీకి రావడం తగ్గించేశారు. అరకు నియోజకవర్గంలో కూడా పెద్దగా తిరగడం లేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ గ్రామదర్శిని, గ్రామ వికాస్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడంతో కొద్ది రోజులుగా అరకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మావోల ముప్పు ముందు నుంచి ఊహిస్తున్న కిడారి... బందోబస్తు కోసం శనివారం రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ఆయన పీఏ అప్పారావు చెప్పారు. తనతో ఎస్ఐ అమ్మనరావుకు ఫోన్ చేయించారని, అయినా సరే పోలీసులు ఆదివారం నాటి పర్యటనకు బందోబస్తు కల్పించలేదని వివరించారు. పోలీసులురూట్ వాచ్ కూడా చేయలేదన్నారు.రూరల్ ఏస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అరకులోయలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో టీడీపీ నేతలకు, ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరికలతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నేడు హోంమంత్రి రాక.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మృతదేహాలను ఆదివారం రాత్రి అరకులోయలోని వారి క్యాంపు కార్యాలయాలకు తరలించారు. ఏపీ సీఎం అమెరికా పర్యటనలో ఉండటంతో హోంమంత్రి చినరాజప్ప సోమవారం ఉదయం అరకులోయకు చేరుకుంటారు. మంత్రి సమక్షంలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తర్వాత ఎమ్మెల్యే కిడారి మృతదేహాన్ని పాడేరుకు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన మాదెల పంచాయతీ బట్టివలస గ్రామానికి తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతితో విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీస్ స్టేషన్లకు నిప్పు.. పోలీసులతో వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే రెండు మృతదేహాలను స్టేషన్ల వద్దకు తీసుకువచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టారు. కంప్యూటర్లు, ఇతర రికార్డులు, మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు. దీంతో వాహనాలు, స్టేషన్ రికార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన బ్యాగులు, తుపాకులను బయటకు తీసుకెళ్లడంతో అవి మంటలబారిన పడలేదు. -
మహిళా యాక్షన్ టీం పనేనా?
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చింది మావోయిస్టు మహిళా యాక్షన్ టీం పనేనని అనుమానిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం తొట్టంగి వద్ద వారిని అటకాయించిన మావోల్లో 30 మందికిపైగా మహిళలే ఉన్నారని, వీరిలో సాయుధులైన మహిళా మావోయిస్టులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మావోయిస్టుల్లో మహిళా యాక్షన్ టీం సభ్యులు నిబద్ధతతో, చురుగ్గా ఉంటారని పేరు. వీరు ఎన్కౌంటర్లలో గాని, సాయుధ దాడుల్లో గాని వెనకడుగు వేయరని, అందుకే వీరికి దళంలో అధిక ప్రాధాన్యం ఉంటుందని చెబుతారు. ఈ మహిళా యాక్షన్ టీంలో ఏపీకంటే ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన వారే అధికంగా ఉంటారని తెలుస్తోంది. కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా యాక్షన్ టీమ్ సభ్యులు పాల్గొని ఉంటారని పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. విలీన వారోత్సవాల ఆరంభంలోనే! సీపీఐ ఎంఎల్ పీపుల్స్‌వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ)లు విలీనమై 2004 సెప్టెంబర్ 21న సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించాయి. అప్పట్నుంచి ఏటా సెప్టెంబర్ 21 నుంచి వారం రోజులపాటు మావోయిస్టులు విలీన వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏటా జూలై 28 నుంచి వారం పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కూడా జరుపుతుం టారు. అలాగే డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల సమయంలో తమ ఉనికిని చాటుకోవడానికి విధ్వంసాలకు పాల్పడటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇన్ఫార్మర్లను హతమార్చడం వంటి దుశ్చర్యలకు దిగుతుంటారు. అందువల్ల ఆయా సమయాల్లో పోలీసులు అప్రమత్తమవుతారు. ప్రజాప్రతినిధులను మన్యంలోకి వెళ్లవద్దని సూచిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ దళాలతో కూంబింగ్, గాలింపు చర్యలు వంటివి ఉధృతం చేస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న విలీన వారోత్సవాలను పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఇదే అదనుగా మవోలు వారిని చంపగలిగారని చెబుతున్నారు. ఏవోబీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ప్రజా కోర్టు పెట్టి కాల్చివేత లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి కిడారి సర్వేశ్వరరావు, సోమలతో పాటు వెళ్లిన అరకు మాజీ సర్పంచ్ చటారి వెంకటరాజు కళ్ల ముందే.. మావోయిస్టులు హతమార్చారు. మావోలను చూసి లివిటిపుట్టులోని ఓ ఇంటిలోకి వెంకటరాజు పరుగులు తీశారు. ఆయన్ని పట్టుకుని మావోయిస్టులు రోడ్డు మీదకు తీసుకువచ్చారు. దీంతో అతను విలవిల్లాడిపోయి తనను ఏమీ చేయొద్దని మావోలను శరణువేడాడు. కొద్ది నిమిషాలు ప్రజా కోర్టు పెట్టి ఆయన ఎదురుగా ఒకరి తరువాత ఒకరిని కాల్చి చంపారు. కిడారికి పలుమార్లు హెచ్చరికలు ఎమ్మెల్యే కిడారి కొంతకాలంగా ఏజెన్సీలో మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. హుకుంపేట మండలం గూడలో నల్లరాయి క్వారీని ఎమ్మెల్యే తన అనుచరుల చేత నడుపుతున్నారు. ఇక అనంతగిరి మండలంలోని నిమ్మల పాడు క్వారీలో ఆయనకు వాటాలున్నట్లు సమాచారం. గూడ క్వారీలోని పేలుళ్లతో తమ గ్రామానికి ప్రమాదం ఉందని, ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గత 3 నెలల నుంచి గూడ గిరిజనులు ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వారీ మూసివేయాలనే డిమాండ్‌తో ఉద్యమం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్వారీ వ్యాపారాన్ని మానుకోవాలని మావోయిస్టులు గత కొంతకాలంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. గ్రామదర్శినికి వెళ్లవద్దన్నా కిడారి వినలేదు విశాఖ క్రైం/సామర్లకోట(పెద్దాపురం): తమ ఉనికి కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, సోమను మావోయిస్టులు హత్య చేశారని ఏపీ హోం మంత్రి చిన్నరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలున్న ప్పటికీ.. ఏపీలో మాత్రం ఇప్పటివరకూ లేవన్నారు. రాష్ట్రంలో కూడా ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ హత్యలు చేశారన్నారు. ఈ దాడిలో 50 మంది మావోలు పాల్గొన్నారని చెప్పారు. విస్తృతంగా కూంబింగ్ నిర్వ హిస్తున్నట్టు తెలిపారు. మావోల వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. గ్రామదర్శినికి వెళ్లవద్దని పోలీసులు సూచించినా వినకుండా ఆయన వెళ్లారన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేశ్వరరావు, సోమ మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం సోమవారం అరకులోయలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చినరాజప్ప తెలిపారు. అక్కడే స్థూపం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
హరికృష్ణ మృతిపట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
అమరావతి: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి, నందమూరి హరికృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీ, రాజకీయ జీవితంలో హరికృష్ణ ప్రత్యేక ముద్రవేశారని చెప్పారు. వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..నందమూరి హరికృష్ణ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి కళా వెంకట్రావు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిపారు. హరికృష్ణ మృతి తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని, హరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రోజు జనసేన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. -
గంటా అలకపాన్పు ..రంగంలోకి టీడీపీ
-
మెత్తబడిన గంటా.. అయిష్టంగానే అంగీకారం!
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధినాయకత్వం తీరుతో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావును ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాయబారంతో కాస్తా మెత్తబడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటనకు వస్తుండటం.. తన నియోజకవర్గం భీమిలి పరిధిలో పలు కార్యక్రమాలు పాల్గొంటుండటంతో.. సీఎం కార్యక్రమాలకు వెళ్లాలని గంటా శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి గంటాను చినరాజప్ప స్వయంగా దగ్గరుండి ప్రస్తుతం ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబుతో విభేదాలు, విశాఖ భూకుంభకోణానికి సంబంధించి తనకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిల్లో టీడీపీ పాత్ర ఉండటంతో మంత్రి గంటా అలకపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ అనుకూల మీడియాలో తనకు వ్యతిరేకంగా సర్వే పేరిట కథనాలు ప్రచురించడం.. ఆయనలో అసంతృప్తికి మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా.. మంగళవారం సాయంత్రం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి సైతం దూరంగా ఉండి.. తన అసమ్మతిని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంటాను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం.. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను రంగంలోకి దింపింది. గురువారం ఉదయం గంటా నివాసానికి చేరుకున్న చిన రాజప్ప.. ఆయనతో సమావేశమై మంతనాలు జరిపారు. ముఖ్యంగా భీమిలిలో చంద్రబాబు పర్యటనకు హాజరుకావాలని, ఆయన నిర్వహించే సభలో పాల్గొనాలని చిన రాజప్ప గంటాను బుజ్జగించినట్టు తెలుస్తోంది. మొత్తానికి తాత్కాలికంగా చినరాజప్ప రాయబారం పనిచేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి సీఎం కార్యక్రమాలకు హాజరుకావాలని గంటా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో విభేదాలు, భూకుంభకోణం వ్యవహారంలో టీడీపీ నేతల పిల్, భీమిలిలో తనకు వ్యతిరేకంగా సర్వే వంటి అంశాలు పరిష్కారం కాకున్నా.. వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టి అయిష్టంగానే గంటా సీఎం కార్యక్రమాలకు హాజరవుతున్నారని అంటున్నారు. అవసరమొచ్చినప్పుడు నోరు విప్పుతా! భీమిలిలో తన పనితీరుపై వచ్చిన సర్వేతో గంటా మనస్తాపానికి గురయ్యారని, దీనిపై చర్చించామని ఈ సందర్భంగా చినరాజప్ప అన్నారు. సీఎం కార్యక్రమాలలో పాల్గొంటానని గంటా తెలిపారు. అవసరం వచ్చినప్పుడు నోరు విప్పుతానని ఆయన స్పష్టం చేశారు. -
మీతో శత్రుత్వమే మాకు సంతోషం
-
ఉప ముఖ్యమంత్రిని అడ్డుకున్న మహిళలు
కరప(కాకినాడ): నాయకులు వస్తున్నారు, పోతున్నారే కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను మహిళలు నిలదీశారు. మండల పర్యటనలో భాగంగా గురువారం గొర్రిపూడి, పాతర్లగడ్డ, జి.భావారం, కరప గ్రామాల్లో చిన రాజప్ప పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. కరపలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించి రైతులకు రాయితీపై వచ్చిన ఆయిల్ ఇంజన్లు, టార్పాలిన్లు, పవర్ టిల్లర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన కారు ఎక్కబోతుంటే మహిళలు చుట్టుముట్టి రోడ్డు లేక నడవలేకపోతున్నామని, ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. మంచినీటి కుళాయి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ఎంతో దూరం వెళ్లి బిందెలతో తెచ్చుకోలేకపోతున్నా.. మా బాధలు మీకు పట్టవా అని కొత్తపేట సామిల్లు సమీపంలోని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కల్పించుకుని సద్దిచెప్తున్నా మంత్రి సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు. సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, ఇతర నాయకులు ఒక్కొక్క పని చేసుకొస్తున్నామని చెప్పారు. మీ వీధి రోడ్డు, కుళాయి వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇలా గొడవ చెయ్యడం మంచి పద్ధతి కాదని సద్దిచెప్పడంతో మహిళలు వెనుతిరిగారు. -
జర్నలిస్టులపై దాడి చేసే వారిని ఉపేక్షించేది లేదు
అమరావతి: జర్నలిస్టులపై దాడి చేసే వారిని ఉపేక్షించేది లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన హైపవర్ కమిటీసమావేశంలో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాలో జర్నలిస్టులపై జరిగే దాడుల నివారణకు కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీరాలలో జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై జరిగిన దాడిపై విచారణ జరిపి నివేదిక అందించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని చినరాజప్ప ఆదేశించారు. తుని ఘటనలో కెమెరాల ధ్వంసానికి సంబంధించి కెమెరామెన్లకు కొత్తవాటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఆరు మాసాలకొకసారి హైపవర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. -
గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో రాష్ట్రం
పరిశ్రమ అభివృద్ధి వల్లే చౌకగా గుడ్లు, మాంసం లభ్యం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఘనంగా ప్రపంచ గుడ్డు దినోత్సవం అనపర్తి(బిక్కవోలు) : రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే గుడ్ల ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. దీన్ని మొదటి స్థానంలోకి తెచ్చేందుకు వివిధ రాయితీలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా అనపర్తి ఏరియా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వేడుకలు బిక్కవోలు మండలం బలభద్రపురం ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అనపర్తి జీబీఆర్ కాలేజీ నుంచి సుమారు వెయ్యి మందితో 2కే రన్‌ను ఎమ్మెల్యే ఎన్.రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. రన్లో నెక్ రైతులతో పాటు విద్యార్థులు పాల్గొని గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం బలభద్రపురం ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో చినరాజప్ప మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే సామాన్యుడికి గుడ్డు, కోడి మాంసం అతి చౌకగా లభిస్తున్నాయన్నారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కోళ్ళ రైతులకు ఏడు శాతం సబ్సిడీతో ఏడాదికి రూ.50 కోట్ల వరకూ రుణాలు అందిస్తుందన్నారు. పౌల్ట్రీ రంగ పితామహుడు డాక్టర్ బి.వి.రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కల్తీకి ఆస్కారం లేని ఆహారం కోడిగుడ్డు అన్నారు. గుడ్డులో పోషకాలను గుర్తించిన ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు చొప్పున అందిస్తుందన్నారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మన్మోçßæన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ 11.02 శాతం అభివృద్ధి సాధించి రూ.10 వేల కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నామన్నారు. జిల్లా నెక్ చైర్మన్ పడాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోడిగుడ్డు పూర్తిగా శాఖాహారమని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చన్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, శ్రీనివాసా హేచరీస్ జేఎండీ కె.సోమిరెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం ‘కోడిగుడ్డుతో పలు రకాల వంటకాలు’ పుస్తకాన్ని మంత్రి సుజాత, గుడ్డు శాఖాహారం వాల్‌పోస్టర్‌ను మంత్రి చినరాజప్ప ఆవిష్కరించారు. కేర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ బి.సరళా రాజ్యలక్ష్మి, కేపీఆర్ సంస్థల చైర్మన్ కొవ్వూరి పాపారెడ్డిలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, తేతలి ఉపేంద్రరెడ్డి, అనపర్తి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, బిక్కవోలు, అనపర్తి ఎంపీపీలు బేరా వేణమ్మ, ఉమామహేశ్వరి, నెక్ ఆడ్వయిజర్ కె.బాలాస్వామి, శ్రీనివాసా హేచరీస్ వైస్ చైర్మన్ సురేష్‌రాయ్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ముద్రగడపై చినరాజప్ప ఫైర్
విజయవాడ : కాపు సామాజిక వర్గం నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప నిప్పులు చెరిగారు. మంగళవారం విజయవాడలో చినరాజప్ప మాట్లాడుతూ... ముద్రగడతో కాపు జాతికి తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పదవి ఉంటే ఒకలా... లేకుంటే మరోలా మాట్లాడటం ముద్రగడ నైజం అని ఆయన ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చినరాజప్ప మరోసారి స్పష్టం చేశారు. -
పుష్కర ఏర్పాట్లపై హోం మంత్రి సంతృప్తి
గుంటూరు : కృష్ణా పుష్కర ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి ఎన్ చినరాజప్ప సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు జిల్లా అమరావతిలోని జ్ఞానబుద్ధ ఘాట్‌లో ఆయన పుష్కర స్నానం ఆచరించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమరావతిలో భక్తులు పోటెత్తారు. అమరలింగేశ్వరస్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తులతో పుష్కర ఘాట్లు నిండిపోయాయి. కృష్ణమ్మకు సారె పెట్టిద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. -
సీఎం ఏది చెబితే అదే తుది నిర్ణయం : చినరాజప్ప
విజయవాడ : సీఎం చంద్రబాబు ఏది చెబితే అదే తుది నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. మీరు చెప్పినంత మాత్రాన బీజేపీతో పొత్తు ఉపసంహరించుకునే పరిస్థితి తేలదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. నేరాలకు పాల్పడే వారు సినిమాలు చూసి ఆ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ట్రైనింగ్‌లో శిక్షణ కల్పిస్తామని చినరాజప్ప చెప్పారు. -
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(SDMA), రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF)ను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చిన రాజప్ప వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఏర్పాటుకు ప్రపంచ బ్యాంక్ తొలి విడతగా రూ.23.58 కోట్ల సాయం అందిస్తుందన్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనేందుకు 600 మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అందించిన సాయంతో మిషనరీ, వాహనాలు, శిక్షణ, టెక్నాలజీ అంశాల ఏర్పాటు కోసం ఖర్చు చేస్తామన్నారు. వీటి కోసం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామని చిన రాజప్ప తెలిపారు. -
ప్రమాదంపై సుబ్రహ్మణ్యం కమిటీతో విచారణ
-
ప్రమాదంపై సుబ్రహ్మణ్యం కమిటీతో విచారణ
గండేపల్లి: గండేపల్లి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. జరిగిన ప్రమాదంపై ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యం కమిటీతో విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అధికారులను కూడా బాధ్యులను చేస్తామని హోంమంత్రి చినరాజప్ప ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ఆయన అన్నారు. -
వారంతా ఎక్కడ ?
-
ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పురాలేదు'
కాకినాడ: శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప స్పష్టం చేశారు. శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మాట్లాడుతూ... గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరికలు చేస్తునే ఉన్నామన్నారు. విధిలేని పరిస్థితిలో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని రాజప్ప ఈ సందర్భంగా గుర్తు చేశారు. 20 ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ నేపథ్యంలో అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సంక్షోభాన్ని నివారించే చర్యలు చేపడతామన్నారు ఇరు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా స్నేహ సంబంధాలను పునరుద్ధరిస్తామని రాజప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. -
'ఫ్యాక్షన్ వదిలితేనే అభివృద్ధి'
కర్నూలు: జిల్లా అభివృద్ది చెందాలంటే ఫ్యాక్షన్ వదిలి శాంతియుతంగా ఉండాలని ఏపీ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప కర్నూలు జిల్లా వాసులకు సూచించారు. ఆదివారం కర్నూలులో టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆర్థిక మంత్రి యనమలతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... రాయలసీమ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గిపోయిందని చినరాజప్ప వెల్లడించారు. -
జార్ఖండ్ హోం మంత్రితో మాట్లాడిన రాజప్ప
హైదరాబాద్: జార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగు వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రిని ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఎన్.చినరాజప్ప కోరారు. జార్ఖండ్ హోం మంత్రికి చినరాజప్ప శనివారం హైదరాబాద్ నుంచి పోన్ చేశారు. ప్రమాదానికి గల కారణాలను చినరాజప్ప జార్ఖండ్ మంత్రిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాద ఘటనలో మృతి చెందిన మూడు మృతదేహాలను స్వస్థలానికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చినరాజప్ప విజ్ఞప్తిపై జార్ఖండ్ హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందిస్తామని... మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటామని చినరాజప్పకు జార్ఖండ్ హోం మంత్రి వివరించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది. శనివారం ఉదయం అయ్యప్ప భక్తులతో వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టాలని రాజప్ప .... జార్ఖండ్ హోం మంత్రికి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. -
'రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది'
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిందని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్.చినరాజప్ప అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో చినరాజప్ప విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మావోయిస్టులు ఉనికి కోసమే పాకులాడుతున్నార విమర్శించారు. తీర ప్రాంతాలలో భద్రతను మరింత పటిష్టపరుస్తామని చెప్పారు. బీసీ సంక్షేమానికి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. -
ఉత్తమ సేవా పురస్కారాలు
కాకినాడ సిటీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 646 మంది అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉత్తమ సేవా పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్సలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఎస్పీ రవిప్రకాష్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న వారు వీరే.. జిల్లా అధికారులు : ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎ.సిరి, డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ డి.సెల్వరాజ్, ఏపీఎంఐపీ పీడీ బి.పద్మావతమ్మ, ఆత్మ పీడీ కె.సీతారామరాజు, రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు. రెవెన్యూ శాఖ : కలెక్టరేట్ : ఎస్ఏలు ఎన్.ఎస్.రాజ్‌కుమారి, సీహెచ్ ఇంద్రాణి, కె.నాయమీ, డి.సాయిరామ్, ఎం.సుబ్బారావు, జీఎం రామ్‌కుమార్, జేఏలు పి.జనార్దనరావు, కె.లక్ష్మణసురేష్కుమార్, వీపీ అలగ్జాండర్, కె.తులసి, ఆఫీస్ సబార్డినేట్లు వై.వీర్రాజు, ఎండీ అజమతుల్లాఖాన్, కె.లక్ష్మి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.సత్యనారాయణ. కాకినాడ డివిజన్ : యు.కొత్తపల్లి తహశీల్దార్ పి.సత్యనారాయణ, డీటీ బీవీ భాస్కర్, ఎస్ఏకేకే వర్మ, ఎంఆర్ఐ జి.శ్రీనివాస్, ఎలక్షన్ డీటీ మురార్జీ, జేఏ విశ్వనాథ్, హెచ్‌హెచ్‌పీ వి.దుర్గాప్రసాద్, వీఆర్వోలు టి.శేషుకుమార్, పీవీవీ శ్రీనివాస్, ఎల్.శ్రీనివాస్, డ్రైవర్ కె.మరిడయ్య, ఓఎస్ బి.సుబ్బారావు, టి.సత్యనారాయణ, వీఆర్ఏ టి.శ్రీనుబాబు. రాజమండ్రి డివిజన్ : అర్బన్ తహశీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ, డీటీ పీవీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఎంఆర్ఐ జీడీ మల్లేశ్వరి, జేఏలు సంధ్య, అనంతలక్ష్మి, వీఆర్వోలు కె.మోహన్‌రావు, ఆర్.శేషు, ఓఎస్‌లు డి.సత్యనారాయణ, వి.పీటర్. అమలాపురం డివిజన్ : తహశీల్దార్ ఎన్.చిట్టిబాబు, టీడీ ఎ.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ కుమారిదేవి, ఎంఆర్ఐ భాస్కరరావు, జేఏ ఎం.కార్తీక్, ఓఎస్ ఎండీ బాషా, టైపిస్టు సర్వేశ్వరరావు, చైన్‌మెన్ సాంబశివరావు, వీఆర్వోలు గంగాధరరావు, రమణ, వీఆర్ఏలు వెంకటేష్, రమేష్. రామచంద్రపురం డివిజన్ : తహశీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, టీడీ ఎంజే బాషా, ఎంఎస్ఓ ఎన్.గోవిందరావు, ఎంఆర్ఐ రవీంద్రకృష్ణ, ఎస్ఏ యామిని, జేఏ గౌతమి, ఓఎస్ ఎం.సూర్యనారాయణాచార్యులు, వీఆర్వోలు పీఎంవీ ప్రసాద్‌శర్మ, బి.బాలాజీ, వీఆర్ఏలు వీరభద్రరావు, డీఎస్ఏ రాజు. పెద్దాపురం డివిజన్ : తహశీల్దార్ బి.రామారావు, డీటీ బి.సూర్యనారాయణ, ఎలక్షన్ టీడీ టీఏ కృష్ణారావు, ఎస్ఏ ఎన్.దొరకయ్య, ఆర్ఐ జీఆర్కేవీ ప్రసాద్, జేఏ వి.వీరాస్వామి, సర్వేయర్ ఎంపీ దేవుడు, వీఆర్వోలు వీరభద్రరావు, తిరుమలరావు, ఓఎస్‌లు సీహెచ్ భద్రరావు, ఎన్వీవీ సత్యనారాయణ, వీఆర్ఏలు ఆర్.శ్రీనివాస్, ఎ.చంద్రరావు. రంపచోడవరం డివిజన్ : తహశీల్దార్ టీవీ రాజు, డీటీ సీఎస్ రాజు, ఎలక్షన్ డీటీ జి.శ్రీనివాస్, ఆర్ఐ ఎస్.నాగబాబు, ఎస్ఏ పి.వెంకటేశ్వరరావు, జేఏ కె.భానుప్రకాష్, ఓఎస్‌లు బాబురావు, ఎన్వీ రాఘవులు, వీఆర్వోలు జి.అప్పారావు, సీహెచ్ నిర్మలాకుమారి. వ్యవసాయ శాఖ : ఏడీలు ఎంపీ ఆదరణకుమార్, కె.నాగేశ్వరరావు. ఎంఏఓలు విజయ్‌కుమార్, మణిదీప్, సూపరింటెండెంట్ ఎంవీ శేషగిరిరావు, ఎస్ఏలు ఎన్వీఎస్కె రాజు, ఏబీ సరోజిని, జేఏలు హిమబిందు, అబ్బాయి, ఏఈఓలు డీవీవీ మాధవరావు, జి.జానకిదేవి, డ్రైవర్ శ్రీనివాసరావు, ఓఎస్ ఆదినారాయణ. హార్టికల్చర్ : హెచ్ఓ శ్రీనివాసరావు, సబ్-అసిస్టెంట్ పి.శ్రీనివాసరావు, డీఈఓ ఎస్.రాంబాబు. పశు సంవర్థక శాఖ : డీడీ ఎస్కే అహ్మద్షరీఫ్, డాక్టర్లు పీవీ వరప్రసాద్, కె.శ్రీధర్, వీఎల్ఎస్ ఆఫీసర్ వెంకట్రావు, జేవీఓలు వీర్రాజు, భగవాన్‌దాస్, ఎల్ఎస్ఏలు శ్రీనివాసరాజు, సుజాత, వీఏలు వెంకటేశ్వరరావు, విజయబాబు, విజయకుమార్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఓఎస్ రాజ్‌కుమార్, జయలక్ష్మి, జేఏ ఎంఎస్వీ రమణ. విద్యుత్ శాఖ : డీఈ చలపతిరావు, ఏడీఈలు నారాయణ అప్పారావు, విజయనాథ్, పీఓ పీవీ శ్రీనివాసరావు, ఏఏఈ జీవీ సత్యనారాయణ, ఏఈలు కె.వి.నాగేశ్వరరావు, డీఎస్డీ ప్రసాద్, ఏఏఓ కె.శ్రీనివాస్, జేఏఓ ఎం.శంకరరావు, సబ్ ఇంజనీర్ ఎల్.ప్రసాదరావు, ఎస్ఏలు పి.మూర్తి, జీఆర్ కుమార్, లైన్ ఎల్.ధర్మసింగ్, ఎల్ఎం పి.ఏసురత్నం, ఏఎల్ఎం ఎల్వీ మాధవరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ విభాగం ఏఈలు కె.వెంకటరాజు, పి.రామారావు, ఎస్.రామ్మోహన్, జేఏ కామేశ్వరరావు, ఏపీ ఎంఐపీ విభాగంలో ఓఎస్ సీహెచ్ శ్రీనివాస్, ఎంఐ ఇంజనీర్ కె.ఎన్.సత్యవాణి. ఆత్మ : డీపీడీ ఎస్.ఏజెంలి, బీటీఎం పి.రాంబాబు. బ్యాంక్స్ (లీడ్‌బ్యాంక్) : ఎల్డీఎం ఎస్.జగన్నాథస్వామి, ఏజీఎం ఎ.సురేష్‌కుమార్, సీఈఓ ఎ.హేమసుందర్, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ శతపథి. బీసీ వెల్ఫేర్ శాఖ : సూపరింటెండెంట్ ఆర్.యుగంధర్, ఎస్ఏ బి.చిట్టిబాబు, ఏపీసీడబ్ల్యూఓ సత్యరమేష్, హెచ్‌డబ్ల్యూఓలు వై.అప్పారావు, నారాయణపాల్, కుక్‌లు జి.పాల్, డి.కుమారి. స్కౌట్స్ అండ్ గైడ్స్ : ఏఎల్టీ కె.జగన్నాథరావు, హెచ్ఎం జేఎస్ మహాలక్ష్మి, స్కౌట్ మాస్టర్ సాంబశివరావు. పౌర సరఫరాల శాఖ : ఏఎస్ఓ బీఎస్ వీవీ కృష్ణప్రసాద్, ఏఏఎం వి.మోహన్‌రావు, డీటీ ఎస్.రామ్మోహన్, గ్రేడ్-2 అసిస్టెంట్ కె.యమున, గ్రేడ్-3 టెక్నికల్ అసిస్టెంట్ టీవీ కుమారి. కమర్షియల్ ట్యాక్స్ : సీటీఓ పి.సూర్యనారాయణరాజు, డీసీటీఓ బీపీ నాయుడు, ఏసీటీఓ శ్రీవిద్య, ఎస్ఏ ఎ.రాంబాబు, డ్రైవర్ ఎ.సత్యనారాయణ, ఓఎస్ డి.మోహన్. సమాచార శాఖ : పబ్లిసిటీ అసిస్టెంట్ హెచ్వీ రమేష్, ఓఎస్‌లు ఎస్.సత్యనారాయణ, వి.త్యాగరాజు. కో-ఆపరేటివ్ శాఖ : డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ ఏడీవీ ప్రసాద్, సూపరింటెండెంట్ డి.రాజారత్నం, ఎస్ఐలు ఎన్.సరస్వతి, సీహెచ్ స్వరూపారాణి, ఏఆర్ ఎన్.రాఘవేంద్ర, జేఏ ఐఎస్‌వీ కుమార్, ఆఫీస్ సబార్డినేట్ ఎ.మహ్మద్. కో-ఆపరేటివ్ బ్యాంక్ ఈడీ ఎ.వీరభద్రం, అసిస్టెంట్ మేనేజర్ జి.గోపీనాధ్. ప్రణాళిక శాఖ : డిప్యూటీ డెరైక్టర్ ఎ.కూర్మారావు, డిప్యూటీ ఎస్ఓ ఎస్.భీమరాజు,. సూపరింటెండెంట్ వి.ఎస్.ఆర్.రాంబాబు, ఏఎస్ఓలు ప్రభాకరరావు, మాధురి. పంచాయతీ : డీపీఓ జి.శ్రీరాములు, ఎస్ఏ ఎంఎస్ఆర్ ఆంజనేయులు, జేఏలు సూర్యనారాయణమూర్తి, సీహెచ్ దొరబాబు, ఎన్.సాయిరామ్, జి.సత్యనారాయణ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కె.వెంకటేశ్వరరావు, కార్యదర్శులు సీహెచ్‌ఎన్‌ఎం ప్రకాష్, బి.గోవిందరాజులు, ఎం.రాజేశ్వరరావు, పీఎస్డీకే మణికుమార్, పీవీఎల్ ప్రసాద్, బి.శ్రీహరి, జేవీ రమణ, జీవీవీ సత్యనారాయణ, బిల్లు కలెక్టర్లు జి.కృష్ణమూర్తి, ఎన్.నాగశ్రీనివాస్, కె.సూర్యకళ, ఆఫీస్సబార్డినేట్లు ఎస్.ఉష, బి.శేషాచార్యులు. డీఆర్డీఏ ఐకేపీ : ఎస్ఏబీఎస్ఎస్బీ పురుషోత్తమరావు, డీపీఎం బి.విశాలాక్షి, ఏరియా కో-ఆర్డినేటర్ డి.భాస్కరం, డీఆర్పీ ఐటీ అనంతశాస్త్రి, ఏపీఎంలు డీవీ బాబు, ఎంఎస్ఎస్బీ దేవి, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ఆర్ఎండీ గంగాధర్, ఎన్.బుల్లియ్య, పారాలీగల్ ఎస్పీ నాయుడు, డీఎంజీ తిలక్, సీడీడబ్ల్యూ అప్పలకొండ, బీమా మిత్ర కేఎం కుమారి, కమ్యూనిటీ యాక్టివిస్ట్ జి.సుభాషిణి. డ్వామా : ఎఫ్ఎం కేఎస్ ప్రసాద్‌మూర్తి, ఏపీడీ సీహెచ్ సోమేశ్వరరావు, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, ఏపీఓలు కొండలరావు, వెంకటేశ్వర్లు, ఈసీ నారాయణసాగర్, జేఈ సివిల్ మంగా లక్ష్మి, టీఏలు కాజా మొహిద్దీన్, వి.వెంకటేష్, జీఓలు వీర్రాజు, శ్రీలక్ష్మి. ఎఫ్‌ఏలు వెంకటసురేష్, సత్తిబాబు. విద్యా శాఖ : డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవాని, ఎంఈఓలు సత్యనారాయణ, సోమిరెడ్డి, వీరభద్రరావు, స్కూల్ అసిస్టెంట్ కేవీఎస్ఎస్ ప్రసాద్, ఎస్ఏ బి.శ్రీనివాసరావు, జేఏ రాజ్‌కుమారి, నాగలక్ష్మి, రికార్డు అసిస్టెంట్ వి.మస్కర్రావు, ఆఫీస్ సబార్డినేట్ ఎండీ ప్రవీణ్, నైట్ వాచ్మెన్ ఎన్.శ్రీనివాసరావు. సర్వశిక్షా అభియాన్ : డీఈఈ అచ్యుతరామారెడ్డి, ఏఎస్ఓ శ్రీనివాస్, ఎస్ఏ బాబురావుదొర, స్కూల్ అసిస్టెంట్ రామానుజస్వామి, సీఆర్పీ డీజే డానియేలు, ఆర్జేడీ ఎడ్యుకేషన్ డీడీ జీవీఎస్పీ పూర్ణానందరావు, సూపరింటెండెంట్ కె.వాసుదేవరావు, జేఏ వరప్రసాద్, ఓఎస్ పాదుకాంబ. దేవాదాయ శాఖ : సూపరింటెండెంట్ ఎల్.సత్యవతి, ఎస్ఏ అపర్ణ, జేఏ కిరణ్, టైపిస్ట్ సతీష్‌కుమార్, ఆర్ఏ గంగరాజు, అటెండర్ ఎస్తేరురాణి. ఆర్జేవై ఐఓ వెంకటేశ్వరరావు, జేఏ శ్రీనివాస్, స్టోర్‌కీపర్ అమృతవల్లి. అగ్నిమాపక శాఖ : ఎల్‌ఎఫ్‌లు బాలకృష్ణ, రాజ్‌కుమార్, ఎఫ్ఎంలు రాధాకృష్ణ, వీరబాబు, రమణ, సీహెచ్ రాంబాబు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వెంకన్న, రామచంద్రరావు, ఎస్.రాంబాబు, డీఓపీలు ఎస్.గణపతి, టి.సముద్రరాజు. అటవీ శాఖ : ఫారెస్ట్ ఆఫీసర్లు టి.రాజా, ఎన్.శివశంకర్, ఎస్.సత్తిబాబు, జేఏ ఆర్ఎస్ఆర్ హరీష్. వైద్య, ఆరోగ్య శాఖ : డీపీఎం ఎం.మల్లికార్జున్, ఎస్పీహెచ్ఓలు వి.వెంకట్రావు, డి.మహేశ్వరరావు, ఎంఓలు శ్రీనివాస్, సుమలత, సీహెచ్‌ఓలు సంజీవరావు, సత్యనారాయణ, పీఎంఓఓలు యోగేశ్వరి, పి.వెంకట్రావు, డీపీఎంఓ కేఎస్‌ఆర్‌సీ మూర్తి, ఏపీఎంఓ ఆర్.ఈశ్వరరావు, డీఐఎస్ బుజ్జిబాబు, హెల్త్ ఎడ్యుకేటర్లు సుధాకర్, ప్రభాకరరెడ్డి, ఎంపీహెచ్‌ఈవోలు నాగబాబు, ఏలియా, పీహెచ్ఎన్ మీనాక్షి, స్టాఫ్‌నర్సులు మహాలక్ష్మి, శైలజ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు ప్రభాకరరావు, చంద్రకుమార్, ఫార్మసిస్ట్ జగదీశ్వరరావు. జీజీహెచ్ కాకినాడ : డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెఎస్ సత్యవేణి, హెడ్‌నర్సు సత్యశ్రీ, స్టాఫ్ నర్సు ఎం.పద్మ, ఎస్ఏలు ఎస్ఏవీ రమణ, బీవీవీ సత్యనారాయణ, ఫార్మసిస్ట్ బీవీ ప్రసాద్, జేఏ బీఎస్ఎల్ఎన్ మూర్తి, రికార్డు అసిస్టెంట్ వీరబాబు, ఎంఎన్ఓలు కెఎస్ఎన్ పాత్రుడు, వి.సత్యనారాయణ, ఆఫీస్ సబార్డినేట్లు బాల రమణమూర్తి, చిన్నబ్బాయి, తోటి బి.లక్ష్మి, సీహెచ్ ఆదిలక్ష్మి. హోమియో మెడికల్ కళాశాల : అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీఎస్ సాయిప్రసాద్, వీటి వెంకటేశ్వరరావు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ : సీడీపీఓలు సత్యకల్యాణి, సీహెచ్ ఇందిర, సూపర్వైజర్లు పి.అరుణ, ఎ.జ్యోతి, ఎస్ఏ ఏజే దొర, జేఏ రమణమూర్తి, ఆఫీస్ సబార్డినేట్ మరిడి, అంగన్వాడీ వర్కర్లు ఎన్.సత్యవతి, వీరవేణి. ఇరిగేషన్ శాఖ : డీఈఈ ఎన్. మన్మధరావు, ఏటీఓ రమేష్‌కుమార్, ఏఈఈ ఆనందకిషోర్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, ఈఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఈ నాగేంద్రకుమార్, ఏఈఈ ఎంవీవీ కిషోర్, ఏఈ కేవీ మంగేశ్వరరావు, ఐటీడీఏ ఈఈ పి.కె.నాగేశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, పీఓ సీహెచ్ శ్రీనివాసులు, ఏడీ మల్లికార్జునరావు, ఎస్ఓ చినబాబు, ఎస్ఏ ఇమ్మానుయేలు, పీజీటీ కేటీవీఎస్ఎన్ మూర్తి, ఏఈఈ కె.వేణుగోపాల్. జైళ్ల శాఖ : ఏఓ బీడీ తిరుమలరావు, జైలర్ శివకుమార్, ఎస్ఏ నూకరాజు, డిప్యూటీ జైలర్లు శ్రీనివాసరావు, మధు, జేఏలు వైవీఎస్పీ రాయల్, వినోద్‌కుమార్, హెడ్‌వార్డర్ బి.రాంబాబు, చీఫ్ హెడ్‌వార్డర్ సుబ్రహ్మణ్యం. వార్డర్లు శ్రీనివాసరావు, సత్యస్వామి, శేఖర్‌బాబు, సబ్‌జైలు సూపరింటెండెంట్ జనార్దన్. కార్మిక శాఖ : ఏఎల్ఓ జి.రాజు, ఎస్ఏ ఎస్.గోవిందు, జేఏ టీడీ ప్రసన్న, ఆఫీస్ సబార్డినేట్ గంగరాజు. గ్రంథాలయ శాఖ : గ్రేడ్-1 లైబ్రేరియన్ పి.పాపారావు, గ్రేడ్-2 లైబ్రేరియన్ స్వర్ణకుమారి. మార్కెటింగ్ శాఖ : అసిస్టెంట్ మార్కెట్ సూపర్వైజర్ వెంకటశ్రీధర్, సూపర్వైజర్లు గిరిబాబు, విజయ్‌కుమార్. పురపాలక శాఖ : కాకినాడ కార్పొరేషన్ : ఆర్ఓ ఎ.శామ్యూల్, ఏఈ టి.రామారావు, ఎస్ఏ దుర్గారావు, జేఏరవిశంకర్, ఫైర్‌మెన్ వెంకటేశ్వరరావు, వాటర్ సప్లయి హెల్పర్ హుస్సేన్, టైం కీపర్ అప్పారావు, శానిటరీ మేస్త్రి దుర్గారావు, అటెండర్ యాకోబ్, శానిటరీ వర్కర్ బి.గణేష్. మండపేట : డీఈఈ శ్రీనివాసప్రసాద్, ఆర్వో ఎంవీ సూర్యనారాయణమూర్తి, ఎస్ఏ వి.రవికుమార్. రామచంద్రపురం : ఏఈ నాగేశ్వరరావు, ఎస్ఏ కె.ఈశ్వరరావు, సీనియర్ అకౌంటెంట్ కె.రామకృష్ణ. తుని : డీఈఈ కనకారావు, ఎస్ఏ పీఏ కుమార్, హెల్త్ అసిస్టెంట్ జీవీఆర్ శేఖర్. పిఠాపురం : కమిషనర్ డి.రాము. పంచాయతీరాజ్ శాఖ : డీఈఈలు ఎ.రవి, ఏఈలు ఆర్వీ పద్మావతి, సీహెచ్ అబ్బాయిదొర, ఏఈఈలు బీవీ చలం, వి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ టీవీఎస్ కృష్ణ, ఎస్ఏలు మల్లికార్జునరావు, ఎస్.త్రినాథ్. జిల్లా పరిషత్ : ఎంపీడీవోలు పి.నారాయణమూర్తి, జేఏ ఝాన్సీ, సూపరింటెండెంట్లు చక్రధరరావు, రమణరావు, ఎస్ఏలు ఎం.గోవిందు, పి.జయంతి, జేఏలు జి.రామకృష్ణ, కేఎస్వీ రాజేష్, ఆఫీస్ సబార్డినేట్లు పీసీహెచ్ అప్పారావు, వి.నాగేశ్వరరావు, ట్రెజరీ శాఖ ఏడీ టీఎస్ సూర్యప్రకాశరావు, సీనియర్ అకౌంటెంట్లు వి.శ్రీనివాస్, భీమేశ్వరరావు. రవాణా శాఖ : ఎంవీఐలు వైవీఎన్ మూర్తి, జీవీ నరసింహరావు, ఏఎంవీఐ బి.లక్ష్మీకిరణ్, ఎస్ఏ ఎం.సత్తిబాబు, కానిస్టేబుల్ పి.రామకృష్ణ, ఆఫీసర్ సబార్డినేట్ డీవీ రమణ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ : సీఐలు టి.గోపాలకృష్ణ, బి.వెంకటేశ్వరరావు, ఎస్సైలు డి.రామారావు, ఎల్.చిరంజీవి, కానిస్టేబుల్స్ వి.శ్రీనివాస్, వై.సత్యనారాయణమూర్తి, వై.సత్యనారాయణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఆర్సీ చిట్టిబాబు, డి.సుధ, ఎస్ఏలు జీవీవీఎస్ శ్రీనివాసరావు, ఇందిరాకుమారి, జేఏ పి.రాంబాబు, అబ్కారీ ఇన్స్పెక్టర్లు జి.గంగాధర్, ఎస్.శ్రీధర్, ఎస్సై వీరభద్రం, సూర్యారావు, హెడ్ కానిస్టేబుల్స్ నరసింహరావు, సత్యనారాయణ, కానిస్టేబుళ్లు ఏడుకొండలు, నాగేశ్వరరావు, ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుళ్లు వెంకటగిరిబాబు, త్రిమూర్తులు, ఏవీఎస్ రామరాజు, జేఏ పి.మనోరమ, డిస్టిలరీస్ సూపరింటెండెంట్ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, సీఐలు రాజశేఖర్, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్స్ ఎం.శ్రీనివాసరావు, జి.వెంకటేశ్వరరావు. ఎస్ఏ డి.వెంకట్రావు, జేఏ కె.పార్వతి. ఆర్అండ్బీ : ఈఈ ఎ.రామచంద్రరావు, డీఈఈలు జి.ఏడుకొండలు, బీవీ మధుసూదనరావు, ఏఈఈలు పి.అశ్రిత, రాజేంద్రప్రసాద్, ఏటీఓలు ఎస్.వీరభద్రరావు, ఎస్.జయన్న, సూపరింటెండెంట్ వై.శ్రీనివాస్, టీఓ పుత్రయ్య, డబ్ల్యూఐ ఆర్.రామకృష్ణ, ఆర్.శ్రీనివాసరావు. ఆర్డబ్ల్యూఎస్ : డీఈఈలు ఎస్ఆర్ కుమారి, కేకేఎన్ కుమార్, ఏఈఈవీ గనిరాజు, ఏఈ రాజశేఖర్, సూపరింటెండెంట్ ఎం.నరసింహారావు, ఎస్ఏఎంవీ సత్యనారాయణ. సోషల్ వెల్ఫేర్ : ఎస్ఏ పీటీ దొర, జేఏ కె.ఆనందరావు, ఏఎస్‌డబ్ల్యూఓలు యు.చిన్నయ్య, ఎం.వెంకట్రావు, వార్డెన్లు ఎంవీఎస్ మూర్తి, వీజీ మణి, కుక్‌లు సుజాతరాణి, సూరమ్మ, కమాటి సత్యనారాయణ, అప్పలరాజు, పోలీసు శాఖ : ఎస్పీ కాకినాడ : డీఎస్పీలు పి.రవీంద్రనాధ్, ఎం.వీరారెడ్డి, సీఐలు ఎన్.మధుసూధనరావు, పి.సోమశేఖర్, ఆర్ఐ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సైలు కేవీవీఎస్ ప్రసాద్, కె.రాజేష్, కామేశ్వరరావు, ఎస్సైలు బి.సంపత్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, కె.వంశీధర్, కె.పల్లంరాజు, ఏఎస్సై నాగేశ్వరరావు,. ఏఆర్ఎస్సై బి.అనసూర్యారావు, హెచ్‌సీలు ఎ.వెంకన్న, ఎస్.సూర్యప్రకాశరావు, సీహెచ్ కృష్ణ, సీహెచ్ఎస్ ప్రకాశరావు, కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ బి.రవీంద్రకృష్ణ, ఎండీకే మొహిద్దీన్, ఆర్.కిషోర్, అహ్మద్ఆలీఖాన్, పి.వెంకటేశ్వర్లు, కె.గణేష్‌బాబు, టీవీఎస్ నారాయణ, బి.నరసింహరావు, ఆర్వీ రమణ, రాంప్రసాద్, పి.శ్రీనుబాబు, ఎ.సత్తిరాజు, ఇ.రాజు, జి.శ్రీనివాస్, టి.బాలశివాజీ, శివరామకృష్ణ. ఎస్పీ రాజమండ్రి : సీఐ ఎ.నాగమురళి, ఎస్సైలు వి.రామకోటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వరరావు, ఎంవీఎస్ మల్లేశ్వరరావు, ఏఎస్సైలు మావుళ్ళు, హెచ్‌సీ నాగస్వర్ణలత, కానిస్టేబుళ్లు సత్యానందం, ఎస్కె మహ్మద్, వి.కృష్ణ, కె.వెంకటేశ్వరరావు, కె.సురేష్, పి.వెంకటేశ్వరరావు, ఎం.కేశవరావు, కేజీవీ ప్రసాద్. -
పంద్రాగష్టు.. లేదు ఇంట్రస్టు!
సాక్షి, కాకినాడ : పంద్రాగష్టుపై అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి జిల్లా కేంద్రం కాకినాడ పోలీసు పెరేడ్ గ్రౌండ్సలో శుక్రవారం జరిగిన 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలే నిదర్శనం. పదేళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ నాయకులు జాతీయ పండగపై ఉదాసీనంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాకినాడ పోలీసు పెరేడ్ గ్రౌండ్సలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ర్ట ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తొలిసారిగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు. అందరికీ ఆహ్వానాలు పంపినా... ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు అందాయి. అయితే జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మినహా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులెవ్వరూ హాజరు కాలేదు. జిల్లాకు చెందిన మరో సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడుతో సహా జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు, 12మంది ఎమ్మెల్యేలు ఇటీవలే టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్సీలతో ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వీరిలో చాలామంది జిల్లాలోనే ఉన్నా, ఇటు వైపు కన్నెత్తయినా చూడలేదు. ఏ హోదాలో కూర్చున్నారో... మరో పక్క నామినేటెడ్ పదవులన్నీ రద్దు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించినా, జిల్లా గ్రంథాలయ సంస్థ పదవిలో కొనసాగుతున్న జై సమైక్యాంధ్ర జిల్లా అధ్యక్షుడు అల్లు బాబి హోంమంత్రి పక్కనే కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఇంకా ‘దేశం’ తీర్థం పుచ్చుకోలేని బాబిని ఏ హోదాలో వేదికపైకి ఆహ్వానించారంటూ అధికార పార్టీ నేతల నుంచే విమర్శలు విన్సిస్తున్నాయి. మంజూరయ్యాయో లేదో! చినరాజప్ప ్రపసంగంలో జిల్లాకు ఏర్పాటు చేయతలపెట్టిన పెట్రో యూనివర్శిటీ, హార్డ్‌వేర్ హబ్ ఊసే లేదు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు జిల్లాకు మంజూరయ్యాయో! లేవోననే అనుమానాలు తలెత్తాయి. అలాగే కేఎస్ఈజెడ్ల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పుకుంటున్న టీడీపీ సర్కార్ ఎక్కడా ఆ ప్రస్తావన చేయకపోవడం.. పోర్టులతో పాటు అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు రాజప్ప ప్రసంగంలో చేర్చకపోవడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. -
సమ్యక్ దృష్టితో.. సమగ్ర వికాసం
సాక్షి, కాకినాడ : తమ ప్రభుత్వం అన్నిరంగాలనూ అభివృద్ధి పథంలో పయనింప చేసేందుకు అవసరమైన దృక్పథంతో ముందుకు వెళుతోందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని పిలుపు నిచ్చారు. అర్ధశతాబ్దికి పైగా కలిసికట్టుగా సాగిన తెలుగు జాతి అనుకోని పరిస్థితుల్లో విడిపోయినా.. ఉమ్మడి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన రీతిలోనే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించుకునేందుకు స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహనీయులను స్ఫూర్తితో పయనించాలని పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాలను స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించిన చినరాజప్ప జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్, ఏపీఎస్పీ, ఎన్సీసీ, హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు చోడిశెట్టి హనుమంతరావును ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 4 లక్షల మంది రైతులకు రూ.4 వేల కోట్ల రుణమాఫీ కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా అమలు చేస్తున్న రుణమాఫీ వల్ల జిల్లాలో 4 లక్షల మంది రైతులకు రూ.4 వేల కోట్ల మేర రుణాలు మాఫీ కానున్నాయని రాజప్ప చెప్పారు. 80 వేల డ్వాక్రా సంఘాలకు రూ.800 కోట్ల మేర లబ్ధి చేకూరనుందన్నారు. ఈ ఏడాది 2.50 లక్షల మంది కౌలురైతులకు రుణఅర్హత కార్డులు జారీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1.10 లక్షలమందిని గుర్తించామని, త్వరలో కార్డులు అందజేస్తామని చెప్పారు. రానున్న వంద రోజుల్లో 1,314 హెక్టార్లలో బిందుసేద్యం విస్తరణకు సంకల్పించామన్నారు. హెలెన్ బాధిత రైతులకు రూ.124 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ గతేడాది హెలెన్ తుపాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు రూ.124 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయనున్నట్టు రాజప్ప చెప్పారు. రూ.14 కోట్ల విలువైన ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందజేయనున్నట్టు చెప్పారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 1.45 లక్షల ఎకరాలకు, ముసురుమిల్లి ద్వారా 22 వేల ఎకరాలకు, భూపతిపాలెం ద్వారా 11,526 ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్‌లో నీరందిస్తున్నామన్నారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏడున్నరలక్షల ఎకరాలకు నీరందించేలక్ష్యంతో తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించామని, ఎడమకాలువ పనులు 57 శాతం పూర్తయ్యాయని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను అక్టోబర్ 2 నుంచి రూ.1000 నుంచి రూ.1500ల మేర పెంచనున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 602 ఆవాస ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి అక్టోబర్ 2 నుంచి రూ.2లకే 20 లీటర్లు అందించనున్నామన్నారు. పదో తరగతిలో 96.26 శాతం ఉత్తీర్ణతతో గతేడాది అగ్రస్థానంలో నిలిచిన జిల్లా రానున్న ఏడాది కూడా ఇదే స్థానాన్ని పదిలపర్చుకునేందుకు కృషి చేయాలన్నారు. మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా రూ.64 కోట్లతో 111 అదనపు తరగతి గదులు, రూ.6 కోట్లతో 765 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఆధార్ నంబర్ జారీలో, ఆధార్ సీడింగ్‌లో జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ పథకాలనూ ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. సీఎస్ఆర్ నిధులతో కాకినాడ జీజీహెచ్‌కు హంగులు రూ.6.70 కోట్ల కార్పొరేట్ సంస్థలిచ్చే సీఎస్ఆర్ నిధులతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు రూ.1.40 కోట్లతో పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు రాజప్ప చెప్పారు. హోం మంత్రిగా జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నానని, ఇందుకోసం 34 పోలీస్ స్టేషన్లలో 119 టోల్‌ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. పెద్దాపురంలో రూ.10 కోట్లతో రాష్ర్ట విపత్తుల నిర్వహణా సంస్థ (ఎస్డీఆర్ఎఫ్) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.7.50 కోట్లతో టెంపుల్ టూరిజం ప్రాజెక్టు జిల్లాలో రూ.7.50 కోట్లతో పిఠాపురం, సర్పవరం, ద్రాక్షారామ, సామర్లకోటల మధ్య చేపట్టనున్న టెంపుల్ టూరిజం ప్రాజెక్టు పనులకు వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని రాజప్ప తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ ఇటీవల రాజమండ్రిలో సమావేశమైందని, పుష్కరాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందిస్తు న్నారని చెప్పారు. జిల్లాలో 21 మండలాల్లో రూ.5.23 కోట్లతో చేపట్టిన పైకా భవనాలు పూర్తి కావచ్చాయని, నియోజక వర్గానికొకటి చొప్పున రూ.2.10 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలు నిర్మిస్తున్నామని చెప్పారు. అధికారులకు, సిబ్బందికి సేవా పురస్కారాలు ఏడుగురు జిల్లా అధికారులు, 12 మంది బ్యాంకు అధికారులతో కలిసి వివిధ శాఖలకు సంబంధించి 646 మంది అధికారులు, సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలను రాజప్ప అందజేశారు. వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా రూ.2.82 లక్షల విలువైన ఉపకరణాలను 62 మంది లబ్ధిదారులకు అందజేశారు. డీఆర్డీఏ ద్వారా రూ.89 కోట్లు, మెప్మా ద్వారా రూ.14 కోట్ల బ్యాంకు లింకేజ్‌ను స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. వివిధ శాఖలు తమ ప్రగతిని ప్రతిబింబించేలా నిర్వహించిన శకటాల ప్రదర్శనలతో పాటు ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, ఎస్పీ ఎం.రవిప్రకాష్, అడ్మిన్ ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ప్రకాష్ జాదవ్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లు బాబి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కోరుకున్న చోటు..అరకోటి రేటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :వారం, పది రోజుల్లో తమ శాఖలో జరిగే బదిలీలపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పోలీసు బదిలీలనగానే.. కొందరు నేతలు తమకు నచ్చిన వారిని తెచ్చుకోవాలనుకుంటారు. మరి కొందరు నేతలు, బ్రోకర్లు లక్షలు దండుకోవడానికి ఇదే మంచి అవకాశమనుకుంటారు. అలాంటి వారి పంట పండిస్తూ కొన్ని సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం ఇద్దరికంటే ఎక్కువ మంది పోటీ పడుతూ లక్షలు కుమ్మరించేందుకు సైతం వెనుకాడటం లేదు. రాజమండ్రి అర్బన్ జిల్లా మినహాయిస్తే జిల్లాలో ప్రధానంగా కాకినాడ, పెద్దాపురం, అమలాపురం పోలీసు సబ్డివిజన్లలో, సర్కిళ్లలో సీఐ పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆయా సర్కిళ్లలో తెరచాటు వ్యవహారాలు, ప్రైవేటు సెటిల్మెంట్లతో లక్షలు చేతులు మారడమే ఇందుకు కారణమంటున్నారు. కీలక సర్కిళ్లలో పోస్టింగ్ కోసం కొందరు సీఐలు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ముట్టచెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు పైరవీలకు తెరతీశారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పది ఈ జిల్లాయే కావడంతో పైరవీల జోరు కాస్త అధికంగానే ఉంటోంది. మంత్రి సైతం ఎమ్మెల్యేలు అభీష్టానికి భిన్నంగా సిఫార్సులు చేసే పరిస్థితి ఉండదంటున్నారు. దీంతో నియోజకవర్గ నేతలు, వారి అనుచరగణం భారీగానే సిఫార్సు లేఖలతో క్యూ కడుతున్నారు. కాకినాడలో ఓ వ్యాపారి,టీడీపీ నేతలే సూత్రధారులు జిల్లాలో నాలుగు డీఎస్పీ, 56 సర్కిల్ ఇన్స్పెక్టర్, 144 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. కాకినాడ పోలీసు సబ్‌డివిజన్‌లో కాకినాడ వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, పోర్టు, సర్పవరం పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్-సీఐ) స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి. నగరంలోని సెంట్రల్‌క్రైం స్టేషన్‌తో పాటు కాకినాడ రూరల్ సర్కిల్, సర్పవరం, వన్‌టౌన్, టూటౌన్, పోర్టు స్టేషన్లలో సీఐ పోస్టుల కోసం గట్టి పోటీ నెలకొంది. కాకినాడ నగర పరిధిలో పోస్టింగ్‌ల కోసం క్యూలో ఉన్న పోలీసు అధికారులతో నగరంలో అధికారపార్టీకి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త, పార్టీ నాయకుడు బేరసారాలు జరుపుతున్నారు. సిటీ నియోజకవర్గానికి చెందిన నేత తన వద్దకు పోస్టింగ్‌ల కోసం వచ్చే వారిని అన్ని విషయాలూ ఆ వ్యాపారవేత్తతో మాట్లాడాలని సూచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వన్‌టౌన్ ఎస్హెచ్ఓగా ఉన్న అద్దంకి శ్రీనివాసరావు టూటౌన్, త్రీటౌన్, పోర్టు పోలీసు స్టేషన్లకు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన ఇక్కడకు వచ్చి ఎనిమిది నెలలవుతోంది. ఈ సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు ప్రారంభమయ్యాయి. వన్‌టౌన్ సర్కిల్ పరిధి విస్తృతం కావడంతో ఈ పోస్టుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానిస్టేబుళ్లు కూడా ఈ స్టేషన్లో పోస్టింగ్ కోసం పోటీ పడుతున్నారంటే ఇక ఇన్స్పెక్టర్ స్థాయికి పోటీ ఎలా ఉంటుందో చెప్పనక్కర లేదు. ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ బంగ్లా వంటి వీఐపీ ఏరియా టూ టౌన్ పరిధిలోనే ఉండటంతో అక్కడి సీఐ పోస్టింగ్‌కు కూడా అంతే డిమాండ్ ఉంది. ప్రముఖ ఫ్యాక్టరీలు, ఆయిల్ కంపెనీలు, పోర్టు వంటి వ్యాపార, వాణిజ్య సంస్థలు సర్పవరం స్టేషన్ పరిధిలో ఉండడంతో ఇక్కడి ఎస్హెచ్ఓ పోస్టు కోసం నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. పోర్టు, టూటౌన్ పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం ఒకపక్క సిటీ నేత, మరోపక్క కాకినాడ పార్లమెంటు స్థాయి నాయకుడొకరు సిఫార్సు లేఖలతో సిద్ధమవడంతో ఈ పోస్టింగ్‌లపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అక్కడ పోస్టు రేటు రూ.25 లక్షలు రామచంద్రపురం పోలీసు సబ్ డివిజన్లో రామచంద్రపురం, మండపేట రూరల్, మండపేట టౌన్, అనపర్తి సర్కిళ్లలో పోస్టింగ్‌లకు కూడా మంచి గిరాకీ ఉంది. వీటిలో మండపేట, అనపర్తి సర్కిళ్లలో పోస్టు పాతిక లక్షలు పలుకుతోంది. పెద్దాపురం డివిజన్లో పెద్దాపురం, జగ్గంపేట, తుని సర్కిళ్లలో ఇన్స్పెక్టర్ల పోస్టులకు గట్టి పోటీయే కనిపిస్తోంది. అమలాపురం డివిజన్లో అమలాపురం టౌన్, రాజోలు, రావులపాలెం సర్కిళ్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. రావులపాలెం, అమలాపురం టౌన్ కోసం ఎక్కువ మంది పోటీపడుతున్నారు. హోం మంత్రి చినరాజప్ప సొంత నియోజకవర్గం కావడం, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు కూడా ఇదే నియోజకవర్గంలో ఉండటంతో ఇక్కడ పోస్టింగ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏజెన్సీలో కనిపిస్తోంది. ఏజెన్సీకి ఎవరూ వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో రంపచోడవరం డివిజన్లోని సీఐ పోస్టులకు పోటీయే లేదు. కాగా, ఎన్నికల ముందు కృష్ణా జిల్లాకు బదిలీపై వెళ్లిన రవికాంత్, వైఆర్కే శ్రీనివాస్, దేవకుమార్ వంటి సీఐలు జిల్లాకు తిరిగొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. డీఎస్పీ పోస్టులకూ పైరవీలే.. సీఐ పోస్టింగ్‌లతో పాటు డీఎస్పీల పోస్టింగ్‌ల కోసమూ పైరవీలు ప్రారంభమయ్యాయి. అమలాపురం డీఎస్సీ వీరారెడ్డి మినహా కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం డీఎస్పీలకు బదిలీలు తప్పవు. కాకినాడ కోసం అరిటాకుల శ్రీనివాస్, పెద్దాపురం కోసం రత్నకుమార్ గట్టిప్రయత్నాల్లో ఉన్నారు. రామచంద్రపురం డీఎస్పీ వచ్చి ఏడాదిన్నర పూర్తికాకుండానే రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులతో వెళ్లిపోయేందుకు మొగ్గు చూపుతున్నారని పోలీసు వర్గాల సమాచారం. ఆ పోస్టులో తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. -
ఆవురావురుమంటున్న తెలుగుతమ్ముళ్లు..
జనం స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టి రెండునెలలైంది. అయినాఇప్పటికీ తెలుగుదేశం.. జెడ్పీ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలి, వైస్ చైర్మన్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలి అన్న విషయాలపై తల పట్టుకుంటూనే ఉంది. పదేళ్లు అధికార వియోగంతో ఆవురావురుమంటున్న తెలుగుతమ్ముళ్లు.. రాకరాక వచ్చిన అవకాశాన్ని దక్కించుకోవడానికి కుమ్ములాడుకోవడమే ఇందుకు కారణం. పదవి కోసం వేగిపోతున్న వారిని ఎలా చల్లార్చాలో; సమస్యను సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించాలో తెలియని జిల్లా నాయకులు ఆ తలపోటును అధినేతకే విడిచిపెట్టారు. సాక్షి, కాకినాడ : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కోసం తెలుగుదేశం పార్టీలో మొదలైన లొల్లి తారాస్థాయికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో జెడ్పీ పాలకవర్గం కొలువుదీరనున్న తరుణంలో తెలుగుతమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఇందుకు వేదిక కావడం, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే కుమ్ములాట జరగడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్య పదవులకు అభ్యర్థిత్వాల్ని ఖరారు చేసేందుకు బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాజప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. గంటకు పైగా తర్జనభర్జనలు పడ్డా నేతలు ఎటూ తేల్చుకోలేకపోయారు. ఎన్నికల ముందు నుంచి ఈ పీఠంపై పార్టీ సీనియర్ నేత, పి.గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడు నామన రాంబాబు ఆశలు పెట్టుకోగా, ఎన్నికల అనంతరం ఐ.పోలవరం, రంగంపేట జెడ్పీటీసీ సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, పెండ్యాల నళీనీకాంత్ ఆ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నిక జరిగి రెండునెలలైనా చైర్మన్ అభ్యర్థిత్వంపై పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేక నాన్చివేస్తూ వచ్చింది. మరో రెండు రోజుల్లో జెడ్పీ పాలకవర్గం కొలువుదీరనున్న వేళ బుధవారం జరిగిన అంతర్గత సమావేశం వేడివేడిగాసాగినట్టు తెలిసింది. చైర్మన్ గిరీ కాపు సామాజికవర్గానికి చెందిన వారికి కేటాయించాలని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినందున నామన రాంబాబు లేదా పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థిత్వాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందంటున్నారు. ఇద్దరూ కోనసీమకే చెందిన వారైనా కోనసీమకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల్లో కొందరు రాంబాబుకు, మరికొందరు రాజశేఖర్‌కు మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల్లో మెట్టలో పార్టీ ఉనికి దెబ్బ తిన్నందున కీలకమైన జెడ్పీ చైర్మన్ పీఠాన్ని మెట్టకు ఇవ్వాలని ఆ ప్రాంత ముఖ్యనేతలు పట్టుబట్టినట్టు తెలిసింది. జెడ్పీ పీఠం కూడా కోనసీమకే కట్టబెట్టడమేమిటని నిలదీసినట్టు చెబుతున్నారు. దీంతో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన జిల్లా నాయకత్వం నిర్ణయాన్ని పార్టీ అధినేతకు వదిలేసింది. బీసీలకు ఇవ్వకుంటే సహించం.. చైర్మన్ పీఠాన్ని ఆశించి జెడ్పీ ఎన్నికల్లో దండిగా ఖర్చు చేసిన రంగంపేట జెడ్పీటీసీ పెండ్యాల నళినీకాంత్‌కు కనీసం వైఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని నళినీకాంత్‌కు ఇస్తే ఊరుకోబోమని సామర్లకోట జెడ్పీటీసీ గుమ్మళ్ల విజయలక్ష్మి వర్గీయులు తెగేసి చెప్పారు. సమావేశం అనంతరం ఈ రెండువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, హోం మంత్రి చినరాజప్ప, ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలోనే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. వాగ్వాదం రాజుకుని తోపులాటలకు దారి తీసింది. వారిని శాంతింపచేయడానికి రాజప్పకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. చివరికి ఇద్దరినీ లోపలికి తీసుకెళ్లి బుజ్జగించారు. మెజారిటీగా ఉన్న బీసీలను కాదని వైస్ చైర్మన్ పదవి కమ్మవారికి కట్టబెడితే ఆ వర్గీయుల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని సమావేశంలో నేతలు అభిప్రాయ పడినట్టు చెబుతున్నారు. చెర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థిత్వాల ఖరారు బాధ్యతను చంద్రబాబుకు అప్పగించినట్టు సమావేశం అనంతరం చినరాజప్ప విలేకరులకు తెలిపారు. సమావేశంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
తూర్పునకు పెద్దపీట
మొదటిసారి దక్కిన ‘హోం’ పీఠం ‘తొలి’ హ్యాట్రిక్ సాధించిన చినరాజప్ప ఆర్థికశాఖ పగ్గాలు మరోసారి యనమలకే అదనంగా వాణిజ్య పన్నులు, సభా వ్యవహారాలు సాక్షి, కాకినాడ : కొత్త రాష్ర్టపు తొలి ప్రభుత్వంలో జిల్లాకు గతంలో ఎన్నడూ లేని ప్రాధాన్యం దక్కింది. ఇప్పటికే జిల్లా నుంచి తొలిసారి ఉప ముఖ్యమంత్రిగా ఎంపికైన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు హోం శాఖను కేటాయించారు. జిల్లా ప్రజా ప్రతినిధికి ఈ శాఖ దక్కడమూ ఇదే మొదటిసారి. బుధవారం జరిగిన మంత్రివర్గ కూర్పులో చినరాజప్పకు హోంశాఖను ఇవ్వడంతో పాటు శాసనమండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడికి మరోసారి ఆర్థిక శాఖను కేటాయించారు. యనమలకు దాంతో పాటు వాణిజ్యపన్నులు, శాసనసభా వ్యవహారాల శాఖలనూ అప్పగించారు. కోనసీమకు చెందిన చినరాజప్పకు చివరి నిమిషంలో పెద్దాపురం టికెట్ ఇవ్వగా, కనీసం వారం రోజులు కూడా ప్రచారం చేయని ఆయన అనూహ్యమైన రీతిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలవగానే.. ఆయన జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా పదవులను పొందిన తొలినేతగా చరిత్ర పుటలకెక్కడం విశేషం.తుని నుంచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు 2009లో ఓటమి పాలైన అనంతరం రాజ్యసభ సభ్యునిగా యత్నించి విఫలమయ్యారు. గతేడాదిలో శాసనమండలి సభ్యుడైన యనమల ఇప్పుడు అదే కోటాలో చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకోవడమే కాక మరోసారి ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. యనమల గతంలో చంద్రబాబు కేబినెట్లో 1999 నుంచి 2003 వరకు ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. ఆశతో నిరీక్షిస్తున్న సీనియర్లు కాగా కేబినెట్ విస్తరణలో తమకు అవకాశాలు దక్కకపోతాయా అని సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తోట త్రిమూర్తులు ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు మత్స్యకార కోటాలో వనమాడి వెంకటేశ్వరరావు, శెట్టిబలిజ కోటాలో పిల్లి అనంతలక్ష్మి కూడా తీవ్రంగా యత్నిస్తున్నారు. వీరంతా ఇప్పటికే తమ లాబీయింగ్‌ను మొదలు పెట్టారు. ఇక రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును డిప్యూటీ స్పీకర్ పదవి వరించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.