గండేపల్లి: గండేపల్లి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. జరిగిన ప్రమాదంపై ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యం కమిటీతో విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అధికారులను కూడా బాధ్యులను చేస్తామని హోంమంత్రి చినరాజప్ప ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ఆయన అన్నారు.