
పుష్కర ఏర్పాట్లపై హోం మంత్రి సంతృప్తి
గుంటూరు : కృష్ణా పుష్కర ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి ఎన్ చినరాజప్ప సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు జిల్లా అమరావతిలోని జ్ఞానబుద్ధ ఘాట్లో ఆయన పుష్కర స్నానం ఆచరించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమరావతిలో భక్తులు పోటెత్తారు.
అమరలింగేశ్వరస్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తులతో పుష్కర ఘాట్లు నిండిపోయాయి. కృష్ణమ్మకు సారె పెట్టిద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.