
జర్నలిస్టులపై దాడి చేసే వారిని ఉపేక్షించేది లేదు
అమరావతి: జర్నలిస్టులపై దాడి చేసే వారిని ఉపేక్షించేది లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన హైపవర్ కమిటీసమావేశంలో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాలో జర్నలిస్టులపై జరిగే దాడుల నివారణకు కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీరాలలో జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై జరిగిన దాడిపై విచారణ జరిపి నివేదిక అందించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని చినరాజప్ప ఆదేశించారు. తుని ఘటనలో కెమెరాల ధ్వంసానికి సంబంధించి కెమెరామెన్లకు కొత్తవాటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఆరు మాసాలకొకసారి హైపవర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.