సీఎం జగన్‌ నిర్ణయంపై జర్నలిస్టుల హర్షం | AP Journalists Are Happy About The Decision Of House Sites | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ నిర్ణయంపై జర్నలిస్టుల హర్షం

Published Sat, Nov 4 2023 11:40 AM | Last Updated on Sat, Nov 4 2023 12:33 PM

AP Journalists Are Happy About The Decision Of House Sites - Sakshi

వెఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభికం చేస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు, జర్నలిస్టులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వర్కింగ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం  జరిగిన మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపిన విషయం విదితమే. సీఎం జగన్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి ఆమోదం తెలపడం చరిత్రాత్మకమైన నిర్ణయమని పలు జర్నలిస్టు సంఘాలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఉమ్మడి ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన దివంగత సీఎం వైఎస్సార్‌ తనయుడుగా.. నేడు రాష్ట్రంలోని వేలాది మందికి మేలు చేసే నిర్ణయం తీసుకోవడం హర్షణీ­యమని తెలిపారు.  నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఇండియా) మాజీ  జాతీయ కార్యదర్శి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయ­బాబు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీ­ఆర్‌ కృష్ణంరాజు మరో ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

మీడియాలోని ఒక వర్గం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నప్పటికీ  ఏమా­త్రం పట్టించుకోకుండా మీడియా సంస్థల్లో పనిచేసే నిరుపేద పాత్రికేయుల చిరకాల స్వప్నాన్ని సీఎం నెరవేర్చబోతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ విశాల దృక్పథంతో అందజేయనున్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులు సది్వనియోగం చేసుకోవాలని సి.రాఘవాచారి ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేసిన ప్రకటనలో కోరారు. అమరావతి అక్రిడేటెడ్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ చైర్మన్‌ బి.వి.రాఘవరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఎం.విశ్వనాథ రెడ్డి, సెక్రటరీ పి. నాగశ్రీనివాసరావు విడుదల చేసి న ప్రకటనలో జర్నలిస్టుల ఆశలను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంకు మంత్రుల ధన్యవాదాలు..
రాష్ట్రంలోని  అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు  మూడు సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలను కేటాయించాలనే సీఎం జగన్‌ నిర్ణయం హర్షణీయమని పలువురు మంత్రులు ప్రశంసించారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, కే నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు, అంజాద్‌ బాషా, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కేవీ ఉషశ్రీచరణ్, ఆదిమూలపు సురే‹Ù, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌ జర్నలిస్టుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం..   
జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించడంపై ఏలూరు జిల్లా నూజివీడులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద నూజివీడు ప్రెస్‌క్లబ్‌ అండ్‌ జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కేడీసీసీబీ చైర్‌పర్సన్‌ తాతినేని పద్మావతి, ఏపీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ చైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
చదవండి: సంపూర్ణ సాధికారత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement